14, నవంబర్ 2021, ఆదివారం

నిద్రలేని రాత్రులు...(సీరియల్)...PART-8

 

                                                                          నిద్రలేని రాత్రులు...(సీరియల్)                                                                                                                                                                  PART-8

సౌందర్య కి చోటు వెతకటం కొంచం ఆపేసి, ఇల్లు మారటం గురించి అనిల్, వరున్ లు మాట్లాడుకుంటున్నారు.

ఆమె కొంచం దూరంలో కూర్చుని, వాళ్ళు మాట్లాడుకునేది వింటోంది.

గదిని వెంటనే ఖాలీ చేయాలి. ఓనర్ సనుగుడు లేని ఇల్లు వెతుక్కోవాలి. అదే మనకు ఇప్పుడు మొదటి పని అన్నాడు వరున్.

అనిల్ కు కూడా అది కరెక్టే అనిపించింది.

సౌందర్య జరిగేది జరగనిఅనే లాగా నీరసంగా కూర్చొనుంది.  

స్నేహితులిద్దరూ వెంటనే పనిలోకి దిగారు. ఇంటర్ నెట్ లో దూరి అద్దె ఇళ్ళు వెతికారు. పేపర్లు కొని అందులో అద్దెకు ఇవ్వబడును కాలమ్ ను జల్లెడ వేసి  జల్లించారు.

హైటెక్ సిటీకి దగ్గరలోనే ఒక పది అంతస్తుల అపార్ట్ మెంటులో ఒకటి దొరికేటట్టు కనిపించింది. అపార్ట్మెంట్ ఓనర్ తో ఫోనులో మాట్లాడారు.

పంజాగుట్టలో తాను ఉంటున్న ఇంటికి మరుసటిరోజు ప్రొద్దున్నే వచ్చి కలవమన్నారు. అడ్రెస్స్ ఇచ్చారు.

వరున్ చెప్పాడు: ఇల్లు అర్జెంటుగా కావాలి. దాని కోసం ఒక అబద్దం చెప్పే తీరాలి. సౌందర్య నీ భార్య. నేను ఆమె అన్నయ్యను.  మీరు మౌలాలి లో ఉంటారు. నేను హైటెక్ సిటీ దగ్గర ఉంటాను. మనం అందరం కలిసి ఒకే ఇంట్లో ఉండాలని ఇల్లు వెతుకుతున్నాము. సరేనా...?” 

అనిల్ కొంచం తడబడ్డాడు ఇంత పెద్ద అబద్దం అవసరమా?” అన్నాడు.

అద్దెకు వచ్చే వాళ్ళు ఎవరు-ఎవరెవరు తెలుసుకోవటానికి ఇంటి ఓనర్లు చాలా జాగ్రత్తగా  ఉంటారు. ఎందుకు గది యజమాని అంతగా అరిచాడు? చెప్పే అబద్దం  అనుమానానికి చోటివ్వకుండా అనుకూలంగా చెప్పాలి

సౌందర్య ని కొద్ది రోజులలో మహిళా సంరక్షణ కేంద్రంలో చేర్పిద్దాం. అంత వరకే అబద్దంఅన్నాడు వరున్.

సరే అన్నాడు అనిల్. అతని మాటలో ఉత్సాహమే లేదు.

తిరిగి చూశాడు వరున్.

ఆమె కూడా తలవంచుకుంటూ సరేఅనేలాగా తల ఆడించింది.

ఇంటి ఓనర్ చాలా దూరంలో ఉన్నాడు కాబట్టి మన గురించి ఎక్కువగా తెలుసుకునే అవకాశం తక్కువఅన్నాడు వరున్.

ప్రణాళికతో రెండో నిద్రలేని రాత్రిని కలుసుకోవటానికి తయారయ్యారు.

                                                                       ***********************************

రెండో నిద్రలేని రాత్రి ముగిసి తెల్లారింది.

ఇద్దరూ ఇంకోరోజు సెలవు తీసుకున్నారు.

పంజాగుట్ట వెళ్ళారు. ఇంటి ఓనర్ ఇల్లును వెతికి పట్టుకున్నప్పుడు వృద్ద దంపతులు స్వాగతించారు.

నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగిని. నా భార్య బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యింది. ఇల్లు మేము రోజుల్లో లోను పెట్టి కట్టుకున్న ఇల్లు. హైటెక్ సిటీ దగ్గర ఉండే అపార్ట్మెంట్ ఇల్లు నా కొడుకుది. అతను తన కుటుంబంతో అమెరికాలో ఉన్నాడు. కూతురు...పెళ్ళై కెనడాలో ఉంది. మా కొడుకు మమ్మల్ని అమెరికా రమ్మంటున్నాడు. మాకు హైదరాబాద్ వదిలి వెళ్ళటానికి మనసు లేదు. అందువలనే ఇక్కడే ఉన్నాం అంటూ చాలా రోజుల నుండి పరిచయమున్న మనిషిలాగా బిడియం లేకుండా సాదారణంగా తన కుటుంబం గురించి చెప్పారు పెద్దాయన.

ఆయన చాలా మంచి వారు లాగా కనబడ్డారు. ఇలాంటి మనిషిని మోసం చేయబోతామే? అని ఇద్దరూ నొచ్చుకున్నారు.

కానీ, వాళ్ళకు ఇప్పుడు చాలా అర్జెంటుగా ఇల్లు కావాలే! ఎవరికీ అపకారం చెయ్యని అబద్దాన్ని అవసరానికి చెప్పటంలో తప్పు లేదు అని మనసును దృఢం చేసుకున్నారు. చెప్పాల్సింది పెద్దాయన నమ్మేటట్టు చెప్పి  ముగించారు.

రుజువుకు వాళ్ళిద్దరూ పనిచేసే కంపెనీల .డి కార్డులు చూపించారు. పెద్దాయన వాళ్ళను సులువుగా నమ్మారు.

ఆయన అడిగిన అద్దె, అడ్వాన్స్ డబ్బు న్యాయంగా ఉండటంతో బేరమాడకుండా ఒప్పుకున్నారు. రోజు సాయంత్రమే వచ్చి అడ్వాన్స్ డబ్బు ఇచ్చి, తాళం చెవి తీసుకుని వెళ్తామని చెప్పారు.

రోజున మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించటాన్ని తలచుకుని ప్రశాంతతో గదికి వెళ్లడానికి మెయిన్ రోడ్డుకు వచ్చారు. కానీ, వాళ్ళ ప్రశాంతతను చెడిపే విధంగా వాళ్ళకోసం ఇంకొక తుఫాన గదిలో కాచుకోనుంది.

                                                                                                                        Continued...PART-9

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి