2, నవంబర్ 2021, మంగళవారం

నిద్రలేని రాత్రులు...(సీరియల్)...PART-2

 

                                                                        నిద్రలేని రాత్రులు...(సీరియల్)                                                                                                                                                                    PART-2

సౌందర్య--- పుట్టిన వెంటనే ఆమె మొహంలోని తేజస్సు చూసి కన్నవాళ్ళు ఆమెకు పెట్టిన కారణ పేరు.

తండ్రి పంచాయతీ ప్రెశిడెంట్ కాబట్టి, ఊరికే ముద్దు బిడ్డగా చెలామణి అయ్యింది. ఆమె తోటి వయసున్న ఆడపిల్లలు, ఆమెతో స్నేహంగా ఉండటానికి గర్వపడ్డారు.

గ్రామంలోని కుర్రకారు, ఆమె పెద్దింటి అమ్మాయికావటంతో అనవసరమైన గొడవలు వద్దనుకుని మర్యాదగా నడుచుకుంటారు.

నగర నాగరికత ఎక్కువగా తొంగి చూడని గ్రామం అది. తన తండ్రికి సొంతమైన సినిమా హాలులో సినిమా చూడటం మాత్రమే ఆమె ఆటవిడుపు.

కానీ, అందరి అమ్మాయల లాగానే ఆమె దగ్గర యుక్త వయసు తన పని చేయటం మొదలుపెట్టింది. సినిమాలలో వచ్చే హీరోలలాగానే తనకీ ఒకడు భర్తగా రావాలనే భావన ఆమెలో పుట్టి బలపడింది. తన కలలో, అతని మొహాన్ని వెతకటం మొదలు పెట్టింది.

అప్పుడు మోహన్ వచ్చి నిలబడటంతో, ఈజీగా అతని దగ్గర మనసు పొగొట్టుకుంది.

ఇతను పదో క్లాసు వరకు, ఆమె సహ విద్యార్ధిగానే ఉన్నాడు. అంతకంటే పై చదువులు చదవటానికి అతని దగ్గర వసతి లేకపోవటంతో అక్కడితో చదువు ఆపేశాడు. తన బంధువుల సహాయంతో హైదరాబాద్ వెళ్ళి పనిలో జేరినట్లు సౌందర్య తెలుసుకుంది.

అప్పుడంతా అతను ఎలాంటి బెడదా ఏర్పరచింది లేదు. కానీ, మధ్య మధ్య గ్రామానికి వచ్చి వెళ్ళేటప్పుడే ఆమె ఉనికిలోకి రావడం మొదలుపెట్టాడు.

కళ్ళకు వేసిన కూలింగ్ గ్లాసులు, అతని చుట్టూ పొర్లుతున్న ఒక విధమైన వస పరుచుకునే సెంటు వాసన, అతను వేసుకునే విధ విధమైన రంగుల దుస్తులు, కాళ్ళకు వేసుకునే కొత్త రకం చెప్పులు, షూలు., అంటూ గ్రామానికి తెలియని ఒక్కొక్కటీ అతన్ని ఒక హీరోలాగా ఆమెకు ఎత్తి చూపినై.

అతని మొత్త నడక-డ్రస్సింగ్-స్టయిలూ నగర నాగరికతను ప్రతిఫలింపటంతో...గ్రామమే ఆశ్చర్యంతో తిరిగి చూసింది.

అంతవరకు చదువు మీద శ్రద్దను చూపిన సౌందర్య, తరువాత చదువు వైపు నుండి వాడిపై శ్రద్దను చూపటం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. ఎందుకంటే, తన యొక్క కలల కధా నాయకుడు అతనిలాగానే ఉండటంతో, ప్రేమ జ్వాల ఆమెను బలంగా అంటుకుంది.

ప్రేమకు కళ్ళు లేవు అంటారు. అందులోనూ చూసిన వెంటనే ప్రేమ’ (లఫ్ అట్ ఫస్ట్ సైట్) అంటే అడగనే అక్కర్లేదు. కన్నవాళ్ళు, తెలిసినవాళ్ళు, బంధువులు అంటూ ఎవరి గురించి పట్టించుకోదు. జాతి, మతం, కులం, భాష అని దేనినీ చూడదు.

ప్రేమ విజయవంత మవుతుందా, ప్రేమ వెనుక లాజిక్కు, ప్రేమ తరువాత ఉన్న జీవితం గురించి ఆలొచించదు.

సౌందర్య కూడా ఏదీ ఆలొచించలేదు. కలత చెందలేదు. ఆమె దగ్గర గుడ్డితనమైన ప్రేమ మాత్రమే పైకెదిగి నిలబడ్డది.

ప్రేమను మోహన్ దగ్గర చెప్పినప్పుడు అతని వలన అది నమ్మసఖ్యం కాలేదు. ఈమె నన్ను ఆటపట్టించి గొడవకు లాగుతోందిఅనే అనుకున్నాడు. కానీ, ఆమె తన ప్రేమలో ఖచ్చితంగా ఉన్నది అని గ్రహించినప్పుడు తడబడకుండా అంగీకరించాడు.

ఊరే ఆమెను మర్యాదతో చూస్తున్నప్పుడు, ఆమే  తనని ప్రేమిస్తోంది అని తెలుసుకున్నప్పుడు అతని మనసులో కాకరపువొత్తులు, చెరుకును చూసినంతగా నోరు ఊరినప్పుడు, చెరుకే ఇష్టపడి వచ్చి విందు పెడితే చేదుగా ఉంటుందా ఏమిటి?

జాతి, అంతస్తు దాటి ప్రేమ జయిస్తుందా అని అతను కూడా కలత చెందలేదు. మధ్య మాటి మాటికీ గ్రామానికి వచ్చి వెడుతున్నాడు. ఎక్కువ ఉత్సాహంతో కనబడుతున్నాడు.

సౌందర్యతో అతన్ని చాలామంది చాలా చోట్లలో చూసారు. ఎక్కువగా వాళ్ళను సందేహించలేదు. సందేహించిన కొంతమంది మనకెందుకు పెద్దింటి గొడవఅని చూసీ చూడనట్టు ఉండిపోయారు.

ప్లస్ టూ తరువాత కాలేజీ చదువు చదవాలని ఇష్టపడింది సౌందర్య. బయట ఊరంతా  వెళ్ళి పెద్ద చదువులు చదవక్కర్లేదుఅని తండ్రి ఖచ్చితంగా చెప్పాడు.

దేనికి భయపడి ఆయన ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారో, అది ఇప్పుడే, ఇక్కడే, తన గ్రామంలోనే జరుగుతున్నదని పాపం ఆయనకు తెలియదు.

ఇంట్లో ఆమె వివాహం గురించి మాటలు మొదలు పెట్టిన విషయం సౌందర్య తెలుసుకుంది. పరీక్షల తరువాత మోహన్ ను కలుసుకోవటమే కష్టమవుతుందో?’ అని భయపడింది.

తన ప్రేమ గురించి తల్లి-తండ్రి దగ్గర మాట్లాడటానికీ ధైర్యం లేదు. అందులోనూ మోహన్  తో అంటే, జాతిని చూపి ఖచ్చితంగా కుదరనే కుదరదు అంటారు.

ఏం చేయాలి అని ఆలొచిస్తున్నప్పుడు, హైదరబాదుకు పారిపోదామని, కన్నవాళ్ళ కోపం తగ్గిన తరువాత గ్రామానికి రావచ్చని సలహా చెప్పాడు ప్రేమికుడు.  తాను చేతి నిండుగా సంపాదిస్తున్నట్టు, బాగా చూసుకుంటూ కాపాడతానని వాగ్ధానం చేశాడు. ఇంకో దారి కనిపించకపోవటంతోనూ, ప్రేమ మత్తులోనూ సౌందర్య కూడా దానికి సరేనంది.

ఒక రోజు తెల్లవారు జామున, ప్రేమ పక్షులు రెండూ హైదరాబాద్ వైపుకు ఎగిరిపోయినై అని గ్రామం అర్ధం చేసుకున్నప్పుడు షాక్ తో మునిగిపోయింది.

ఇలాగూ జరుగుతుందా?’ అని ప్రజలు ఆశ్చర్యపోయారు.

కొంచం కొంచంగా ఊరు సౌందర్య ఇంటి ముందు కూడింది. ఏడ్చి, ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది తల్లి. తుండుతో నోటిని మూసుకుని కోపంతోనూ, దుఃఖంతోనూ నీరసంగా కూర్చుండిపోయాడు తండ్రి. ఆయనకు ఏం చెప్పి సమాధాన పరచాలో తెలియక చాలామంది దూరంగానే నిలబడ్డారు.

బంధువులలోని కొంత మంది మహిళలు సౌందర్య తల్లి దగ్గర కూర్చుని సమాధన  పరిచారు. కాలం చెడిపోయిందనిఅందరూ గొణుకున్నారు.

కుటుంబాన్ని ఇష్టపడని వారో, మనసులో ఆనందపడ్డారు. అది తెలియకుండా కృర తృప్తి చెందారు.

కొందరు మోహన్ తల్లి-తండ్రులను కొట్టడానికి తయారైయ్యారు. వాళ్ళను ఊరి నుండే వెలివేయాలని ఆవేశపడ్డారు.

కొందరు సమకాలికులు 'గౌరవ హత్య ' గురించి గుసగుసలాడు కున్నారు.

కొంత సమయం తరువాత సౌందర్య తండ్రి ఒక తీర్మానానికి రావడంతో చెప్పాడు:

ఇది నాకూతురు చేసిన తప్పు. ఆమెను ముద్దు చేసి పెంచి మేము తప్పు చేశాము. దీనికి వేరే ఎవరూ కారణం కాదు. మోహన్ వాళ్ళ తల్లి-తండ్రులను కొట్టటమో, దండిచడమో న్యాయం కాదు. దయచేసి మమ్మల్ని ఏకాంతంగా ఉండనివ్వండి -- అని వణుకుతున్న స్వరంతో అందర్నీ చూసి చెబుతూ నమస్కరించాడు.

విపరీతమైన ఆవేశంలోనూ, పంచాయతీ ప్రెశిడెంటు తీర్పు న్యాయంగా ఉన్నదని అక్కడి ప్రజలు శాంతించి, ఆయన మాటకు కట్టుబడిన వారిలాగా గుంపు గుంపుగా అక్కడ చేరిన వారు అక్కడ్నుంచి కదిలేరు.

వేదన మాత్రం...ఇక నేను ఇక్కడే పర్మనెంటుగా ఉండబోతానుఅంటూ ఇంట్లో చతికిలపడి కూర్చుంది.

                                                                                                                 Continued...PART-3

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి