10, నవంబర్ 2021, బుధవారం

నిద్రలేని రాత్రులు...(సీరియల్)...PART-6

 

                                                                            నిద్రలేని రాత్రులు...(సీరియల్)                                                                                                                                                                  PART-6

పేరుకు తగినట్టు నిదానస్తుడు వరున్. కన్న తల్లి-తండ్రులను ప్రాణంగానూ, లోకంగానూ గౌరవించేవాడు. అనిల్ యొక్క ప్రాణ స్నేహితుడు. స్నేహానికి ఇద్దరూ గ్రంథం లాంటి వారు.

ఒకే ఊరిలో పుట్టి--ఒకటిగానే స్కూల్ చదువు ముగించి, పెద్ద చదువులకొసం వేరు వేరు కాలేజీలలో, వేరు వేరు నగరాలలో ఉన్నా వాళ్ల స్నేహం కొనసాగింది.

వరున్ అంత పెద్దగా చదువుకోలేక పోయినా ఎవరూ తక్కువా అనుకోలేని ఎం.ఏస్.సి -- పెద్ద చదువు డిగ్రీ పూర్తి చేశాడు. బంధువుల రెకమండేషన్ తో, హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఒక కంపెనీలో పనికి చేరాడు.

కఠిన శ్రమ, నిజాయతీ, తెలివితేటలతో అందరి మనసులను ఆకర్షించాడు. ఒక్కొక్క మెట్టుగా పైకెదిగి చిన్న వయసులోనే కంపెనీ అసిస్టంట్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

హైటెక్ సిటీ దగ్గరే ఒక గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ప్రతిరోజూ అనిల్ తో మాట్లాడాల్సిందే.

శని, ఆదివారాలు, మిగిలిన పండుగ సెలవు రోజులు చాలా వరకు ఇద్దరూ కలిసి గ్రామానికి వెళ్ళి కన్నవాళ్ళను చూసొస్తారు. ఊర్లోనూ వీళ్ల స్నేహం చూసి రామలక్ష్మణులుఅనే పిలిచేవారు.

గ్రామానికి వెళ్లటం లేదంటే, హైదరాబాద్ లోనే సమయాన్ని లాభకరంగా గడుపుతారు. ట్యాంక్ బండ్, బిర్లా మందిరం వీళ్ళకు విసుగు అనిపించదు. అక్కడ కూర్చుని మాట్లాడుకుంటుంటే ఇద్దరికీ గంటలు గడుస్తున్నదే తెలియదు.

హైదరాబాదులో వీళ్ళు వెళ్లని ముఖ్యమైన గుడులే లేవు. మంచి సంపాదన ఉన్నా, అనవసరంగానో, ఆడంబరంగానో ఖర్చు పెట్టకుండా...తెలివిగా డబ్బులు జేరుస్తూ, కన్న వాళ్లకు ఇస్తూ మంచిగా జీవించటానికి అలవాటు చేసుకున్నారు.

వరున్ రాక కోసమే ఆతృతతో ఎదురు చూస్తూ కాచుకోనున్నాడు అనిల్.

అతను మెట్లు ఎక్కి వస్తున్న శబ్ధం వినబడింది. అనిల్ అతన్ని స్వాగతించాడు.

ఏమిట్రా...అంత అర్జెంటు అవసరం ఏమొచ్చిందిరా? ఉన్నపలంగా రమ్మన్నావు?” --తిన్నగా విషయానికి వచ్చాడు వరున్.

జరిగినదంతా గడ గడ మని కక్కి ముగించాడు స్నేహితుడు.

శభాష్ రా! నువ్వు చేసిందంతా చాలా సూపర్’. నిన్ను నా స్నేహితుడివని చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను

అది విని అనిల్ కొంత ప్రశాంత చెందాడు.  

ఎక్కడ కవిత చెప్పిందే వరున్ కూడా చెప్పి బలవంతం చేస్తాడేమోనని భయపడుతున్న అనిల్ కు, మాటలు చాలా ఉరట కలిగించినై. 

నువ్వు ఇంత కష్టపడుతున్న సమయంలో నన్ను ఎందుకురా తలుచుకోలేదు?”--నిజమైన స్నేహంతో, అబద్దమైన కోపంతోనూ అడిగాడు వరున్. అతని మాటలు అనిల్ లో కొత్త ఉత్సాహాన్ని తెప్పించిందని గ్రహించాడు అనిల్.

తరువాత ఏం చేయాలి?’ అని ఇద్దరూ ఆలొచించటం మొదలు పెట్టారు. వెంటనే సౌందర్య ను మహిళా హోమ్ లోనో లేక మహిళా హాస్టల్లోనో చేర్చాలి... తరువాత ఆమెకు నిరంతర బద్రత ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.

దానికి ఆమె సమ్మతం తెలుసుకోవాలనుకున్నారు.

తలుపు తట్టాడు అనిల్. వెంటనే తెరిచింది. ఎందుకంటే ఆమె నిద్రే పోలేదే!

వరున్ ని పరిచయం చేశాడు. తల వంచుకునే నమస్కరించింది. ఇరవై ఏళ్ళ వయసు లోపే ఒక ఆడపిల్లకు జీవితంలో ఇన్ని పరీక్షలా?’ -- బాధపడ్డాడు వరున్.

ఉమన్స్ హోమ్ లోనో, మహిళా హాస్టల్లోనో చేరిస్తే ఉంటారా?”  అడిగాడు అనిల్.

ఏదైనా నిర్ణయం తీసుకునే పరిస్థితిలోనా ఉంది సౌందర్య? వాళ్ళు చెప్పేది అంగీకరిస్తునట్టు తల ఊపింది.

మరుసటి రోజు ఇద్దరూ ఆఫీసులకు సెలవు పెట్టి నగరంలో ఉన్న మహిళా గృహాలు, మహిళా హాస్టల్లలో చోటుకోసం వెతకాలని అనుకున్నారు.

తన దగ్గర వాళ్ళు చూపిస్తున్న దయ గురించి ఆలొచించి ఆశ్చర్యపోయింది సౌందర్య. జాలి  చూపే భావం ప్రపంచంలో ఇంకా పూర్తిగా ఎండిపోలేదు అనేది గ్రహించింది.  తప్పైన మనుషుల దగ్గర ఇది ఎదురు చూసినందు వలనే తనకి చాలా కష్టాలు ఏర్పడ్డాయని అనుకుని నొచ్చుకుంది. మనసు కొంచం ప్రశాంతత చెందటంతోనూ, అలసట వలననూ నిద్రలోకి జారుకుంది.

అనిల్ పక్కనే పడుకున్నాడు వరున్.

ఇద్దరూ ఆకాశం వైపే చూస్తున్నా, వాళ్ళ ఆలొచనలు ఒకే దిక్కులొ ఎగురుతున్నాయి.

మొత్తానికి నిద్ర పట్టక కష్టపడ్డారు.

ఇదేలాగా పలు నిద్రపోలేని రాత్రులను గడపబోతారని... రోజు రాత్రి దాని ప్రారంభ రాత్రని, పాపం...ఇప్పుడు వాళ్ళు తెలుసుకునే అవకాశం లేదు.

                                                                                                                  Continued...PART-7

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి