నిద్రలేని రాత్రులు...(సీరియల్) PART-5
‘జరిగే ప్రతిదానికీ
భగవంతుడే
కారణం’ అని
అనుకునే
వాడు
అనిల్.
ఈ మధ్యకాలం
వరకు
సౌందర్య
కి కూడా దేవుడి
మీద
అపరిమితమైన
నమ్మకం
ఉండేది.
కానీ తనకు
విధి
సరిలేదు.
అందుకనే
కష్టానికి
పైన
కష్టం
వస్తోందని
నమ్ముతోంది.
దేవుడి
మీద
ఉన్న
నమ్మకం
పూర్తిగా
పోయింది.
దేవుడో
లేక
విధియో...ఇక
జరుగబోయేవన్నీ
కష్టాలుగానే
ఉంటాయని
అప్పుడు
వాళ్ళు
అనుకోలేదు.
“లేచిరా వెళదాం” అని అనిల్
చెప్పిన
వెంటనే
‘ఎక్కడికీ?’ అనేలాగ
చూసింది
సౌందర్య.
దఢ-ఆశ్చర్యం-భయం
కలిసిన
భావ
కలియుక
ఆమె
ముఖంలో
కనబడింది.
అతను
తనని
అక్కడే, అలాగే
విడిచిపెట్టి
వెళ్ళిపోతాడు
అనే
ఎదురు
చూసింది.
‘లేచిరా, వెళదాం’ అనగానే
షాక్
తో
చూసింది.
‘ఇతను ఎవరు? ఇతన్ని
నమ్మి, ఇతనితో
వెళ్దామా?
లేకపోతే ఇంకెక్కడికి
వెళ్లేది?
ఆత్మహత్య చేసుకుందామా?’
ఇప్పుడు అది
కూడా
ఆమె
వల్ల
కాదు.
మరణం
యొక్క
వాకిటి
వరకు
వెళ్ళి
తిరిగి
వచ్చిన
ఆమెకు
మరణ
భయం
అతుక్కుపోయింది.
మళ్ళీ
ఆత్మహత్యకు
ప్రయత్నించే
ధైర్యం
లేదు.
అనిల్ చెప్పాడు.
“నన్ను
నమ్మండి.
నా
వల్ల
మీకు
ఏ
కష్టమూ
ఏర్పడదు”
తన ఆలొచన
పరుగును
అతను
సరిగ్గా
అర్ధం
చేసుకోవటాన్ని
గ్రహించిన
ఆమె, “క్షమించండి.
నా
పరిస్థితి
పలు
రకాలుగా
ఆలొచింప
చేస్తోంది.
నన్ను
అలాగే
వదిలేసుంటే...ఈ
పాటికి
సమస్య
ముగిసేది.
నేనింకా
ఏమేమి
కష్టాలను
కలుసుకోవాలొ?” -- అని
చెప్పి
ఏడ్చింది.
“దాని గురించి
తరువాత
మాట్లాడుకుందాం.
మొదట
లేవండి
వెళదాం”
“ఎక్కడికి?” అన్నది
కన్
ఫ్యూజన్
తీరకపోవటంతో!
“మొదట మనం
ఈ
చోటును
విడిచి
వెళ్దాం.
అందరూ
మనల్ని
వేడుక
చూస్తున్నారు”
మెల్లగా లేచి
తడబడుతున్న
నడకతో
అతన్ని
ఫాలో
చేసింది.
రైల్వే స్టేషన్
నుండి
బయటకు
వచ్చిన
వెంటనే
హోటల్లో
ఆమెకు
భోజనం
కొనిచ్చాడు.
బిడ్డకు
కావలసినవి
కొనిచ్చాడు.
మౌనంగానే ఉన్న
ఆమె
దగ్గర
అడిగాడు, “మీ
గురించిన
వివరాలు
చెబితే, తరువాత
ఏం
చేయాలనేది
నిర్ణయించటానికి
వసతిగా
ఉంటుంది”
సంశయించి, సంశయించి
-- తాను ఇంతవరకు
జీవించిన
జీవితం
గురించి
చెప్పింది.
ఊరు
పేరు, తల్లి-తండ్రుల
పేర్లను
చెప్పకుండా
దాచింది.
అనిల్ అడిగాడు, “మోహన్
దగ్గరకు
ఇక
వెళ్ళొద్దు.
కానీ, కన్న
వాళ్ళ
దగ్గరకు
మీరు
వెళ్ళోచ్చు
కదా?”
హడావిడిగానూ, ఖచ్చితంగానూ
వెళ్ళనన్నది.
“అలా వెళ్ళాలనుకొనుంటే
పోలీస్
స్టేషన్
నుండే
మా
ఊరికి
తిన్నగా
వెళ్ళుండేదాన్ని.
తల్లి-తండ్రీ
నన్ను
అల్లారు
ముద్దుగా
పెంచారు.
ఈ
పరిస్థితిలో
వాళ్ళ
దగ్గరకు
వెళ్ళి
చేరటానికి
నాకు
ఇష్టం
లేదు.
అలా
వెడితే
వాళ్లకు
పైపైన
కష్టాలనూ, అవమానం
నూ
ఇస్తుంది.
అది
నాకు
ఇష్టం
లేదు.
నా
విధి
నాతోనే
ముగియనివ్వండి” -- ఖచ్చితంగా చెప్పింది.
“ఈమెను ఏం
చేయాలి?” --- ఆందోళన
పడ్డాడు.
రాత్రి సమయం
ఎనిమిది.
ఈ
సమయంలో
ఎక్కడ
ఉంచాలి
అనే
కన్
ఫ్యూజన్
అతన్ని
బాధపెడుతోంది.
రకరకాలుగా ఆలొచించి, చివరగా
చెప్పాడు, “రండి.
నా
గదికి
వెళదాం”
“మీ గదికా?” ఆశ్చర్యంగా
అడిగింది.
“ఏం?...భయంగా
ఉందా? నా
మీద
మీకు
నమ్మకం
రాలేదా?”
“ఇప్పుడు మీ
పైన
ఏ
భయమూ
లేదు.
నన్ను
చావనివ్వకుండా
అడ్డుకున్న
విధి, ఇంకా
నాకు
ఎన్ని
కష్టాలను
ఇవ్వబోతోందో
తెలియదు. కానీ, మీ
గదికి
నన్ను
తీసుకు
వెడితే
మీకు
అనవసరమైన
సమస్య
ఏదీ
రాదా?”
“రావచ్చు...ఆది
ఏ
సమస్యగా
ఉంటుందో
ఆలొచించే
సమయం
ఇది
కాదు.
ఇప్పుడు
మీ
బద్రతే
ముఖ్యం.
మొదట
నా
గదికి
వెడదాం.
ఆ
తరువాత
వచ్చే
సమస్యల
గురించి
ఆలొచిద్దాం”
ఇద్దరూ నడిచారు.
రూము
దగ్గరకు
వెళ్ళేలొపు
పలు
కళ్ళు
వాళ్ళను
అనుమానంతో
చూసినై.
మొదటి
సమస్య
ఇంటి
యజమాని
దగ్గర
నుండే
వచ్చింది.
గేటు తెరిచి
లోపలకు
వెళ్లంగానే, ‘ఆమె
ఎవరు?’ అనేది
తెలుసుకోవటానికి
అతన్ని
అడ్డగించాడు.
“నా బంధువుల
అమ్మాయి.
ఇంట్లో
కోపగించుకుని
వచ్చేసింది.
రేప్రొద్దున
సమాధానపరిచి
పంపించేయాలి”
ఇంత వరకు
ఇంత
ఈజీగా
అనిల్
అబద్దం
చెప్పింది
లేదు.
‘నమ్మాలా...నమ్మకూడదా?’ అనే
అనుమానంతో
వాళ్ళకు
దారి
వదిలేడు
ఇంటి
ఓనర్.
గదిలోకి వచ్చినందువలన...’ఇక
రాబోవు
సమస్యలు
రేపే
వస్తాయి’ అని
కొంచం
ప్రశాంతత
చెందాడు
అనిల్.
డ్రస్సు మార్చుకున్న
అతను, చాపా/
పరుపు
తీసుకుని
సౌందర్య
దగ్గరకు
వచ్చాడు.
“గది తలుపులు
గొళ్లెం
పెట్టుకుని...మంచం
మీద
పడుకుని
హాయిగా
నిద్రపొండి. తరువాత
ఏం
చేయాలనేదాని
గురించి
రేప్రొద్దున
ఆలొచిద్దాం”
గది బయట
మేడ
మీద
పరుపు
పరుచుకుని
పడుకున్నాడు.
ఆ రోజు
జరిగిన
వాటిని
మనసు
కదిలించినప్పుడు
బ్రమలాగా
ఉన్నది.
తన
జీవితంలో
ఇలా
ఒక
హఠాత్తు
పరిణామం
జరుగుతుందని
ఏ
రోజూ
అతను
కలలో
కూడా
ఊహించలేదు.
బిడ్డను హత్తుకుని
పడుకోనున్న
సౌందర్య
కూడా
నిద్ర
పోలేదు.
జరిగినవన్నీ
గుర్తుచేసుకున్నప్పుడు
భయంతో
వొళ్ళు
కంపించింది.
కళ్ళు మూసుకుంటే, భయపెట్టే
దృశ్యాలు
వచ్చి
భయపెడుతున్నాయి.
అనిల్ కూడా
నిద్ర
పోలేకపోయాడు. ‘రేపు
ఏం
చెయ్యబోతాం?’ అనే
ప్రశ్న
అతన్ని
చిత్రవధకు
గురిచేస్తోంది.
‘భర్త దగ్గరకూ
వెళ్ళలేదు.
కన్నవాళ్ళ
దగ్గరకూ
వెళ్ళలేదు.
తానూ
తన
గదిలో
ఉంచుకునే
అవకాశమే
లేదు.
అలాగైతే
ఈమెకు
ఏ
విధంగా
బద్రత
కలిపించేది?’
బద్రత ఇవ్వటాని
కూడా
దారి
లేదు.
బయటకు
పంపటానికీ
మనసు
రావటం
లేదు.
‘కళ్ళు కట్టేసి
అడవిలో
వదిలి
పెట్టినట్టు
ఉన్నదే? ఎవరి
దగ్గరకు
వెళ్ళి
ఏం
సహాయం
అడగుదాం?’ అని
ఎంత
ఆలొచించినా
ఏ
దోవా
కనబడలేదు.
‘భగవంతుడా! నేనేం
చేయను?’ -- మనసులోనే
గింజుకున్నాడు.
అప్పుడు అనిల్
సెల్
ఫోన్
మోగింది.
తీసి
చూశాడు... ‘వరున్’ అనే
పేరు
స్క్రీన్
మీద
వచ్చింది.
తాను కొలిచే
దైవం
తనని
విడిచిపెట్టలేదు
అనేది
అర్ధం
చేసుకున్న
అనిల్, “వరున్!
చాలా
అవసరం.
వెంటనే
రా.
మిగతాది
నేరుగా
మాట్లాడదాం” --అని చెప్పి
సెల్
ఫోన్
కట్
చేశాడు.
అతని దగ్గర
నుండి
‘హమ్మయ్య’ అనే
నిట్టూర్పు
వచ్చింది.
వరున్ వస్తే
తనకొక
దారి
దొరుకుతుంది.
అతని
సహాయంతో
సమస్యకు
పరిష్కారం
తెలుసుకోవచ్చని
నమ్మాడు.
అందువలన
అతని
రాకకై
ఆత్రుతతో
ఎదురు
చూశాడు.
Continued...PART-6
***********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి