నిద్రలేని రాత్రులు…(సీరియల్) PART-9
గదిలోకి వచ్చిన
అనిల్
కు, వరున్
కు
అక్కడ
ఒక
షాక్.
అనిల్ తల్లి, తండ్రీ
గది
మధ్యలో
కోపంగా
కూర్చోనున్నారు.
ఒక మూలగా
కూర్చుని
సౌందర్య
ఏడుస్తోంది.
స్వప్నా బెదిరిపోయి
వాళ్ళను
మార్చి
మార్చి
చూసింది.
అనిల్ ను
చూసిన
వెంటనే
తండ్రి
అరిచాడు.
“రారా కొత్త
పెళ్ళికొడుకా.
దొర
ఎక్కడెక్కడ
తిరిగొస్తున్నారు?”
ఆ డైరెక్ట్
అటాక్
తో
తడబడ్డాడు
అనిల్.
ఆయన ఇంతవరకు
ఇంత
కోపంగా
మాట్లాడిందే
లేదు.
అలా
మాట్లాడేటట్టు
అనిల్
ఎప్పుడూ
నడుచుకోలేదు.
వరున్ ఆయన్ని
సమాధానపరచటానికి
ఎంతో
ప్రయత్నించాడు.
అతని
వల్ల
కుదరలేదు.
ఆయనేమో
కోపాన్ని
ఎక్కువ
చేసుకుని
మళ్ళీ
మళ్ళీ
అరిచాడు.
ఒక స్టేజ్
లో
వరున్
కు
ఓర్పు
నసించటంతో
అతనూ
అరిచాడు.
“స్కూల్
కాలం
నుండే
అనిల్
నాకు
ఫ్రెండు.
కానీ
వాడు
మీకు
కొడుకు...మీరు
కన్న
కొడుకు.
ఏరోజైనా
మీ
ఇష్టానికి
విరుద్దంగా
నడుచుకున్నాడా? వీడి
మీద
మీకు
ఎందుకు
నమ్మకం
లేదు? కనీసం
వాడు
ఏం
చెబుతాడో
వినకూడదా? ఏ
తప్పూ
చేయనప్పుడు
అతన్నీ, ఈ
అమ్మాయినీ, సంబంధపరచి
మాట్లాడే
మాటలు
వాళ్లను
ఎక్కువగా
బాధపెడుతుంది...ఇది
మీకు
తెలియదా?”
ఈ ఆవేశమైన
మాటలను
అనిల్
తండ్రి
ఎదురు
చూడలేదు.
తన
కోపాన్ని
తగ్గించుకుని...‘మిగతాది
వాళ్ళే
మాట్లాడనీ’ అనే
విధంగా
కూర్చున్నారు.
ఆయన దగ్గరకు
వచ్చిన
వరున్
నిదానమైన
స్వరంతో
“అంకుల్...మిమ్మల్ని
ఎదిరించి
మాట్లాడినందుకు
నన్ను
క్షమించండి.
పాపం
అనిల్...రెండు
మూడు
రోజులుగా
భరించలేని
కష్టాలను
అనుభవిస్తున్నాడు.
అతని
కష్టాలను
ఒకసారి
వినండి”
కోపంగా కొడుకును
చూశాడు
ఆయన.
అనిల్
వచ్చి
ఆయన
కాళ్ళ
దగ్గర
కూర్చున్నాడు.
సౌందర్య
ను కాపాడిన దగ్గర
నుండి, ఈ
నిమిషం
వరకు
తాను
అనుభవిస్తున్న
కష్టాలని
క్లియర్
గా
చెప్పాడు.
అతని తల్లి
కూడా
అతను
చెప్పేది
మిక్కిలి
శ్రద్దతో
వింటున్నది.
అనిల్ మాట్లాడి
ముగించిన
తరువాత
వరున్
అడిగాడు...”ఇప్పుడు
చెప్పండి
అంకుల్... రైలు క్రింద
పడి
చావబోయిన
అమ్మాయిని
అనిల్
కాపాడింది
తప్పా? ఆమె
ఎవరి
యొక్క
ఆదరణ
లేకుండా
ఉన్న
ఒక
అనాధ
అని
తెలిసిన
తరువాత
ఆదరించటం
తప్పా? ఆమెకు
బద్రంగా
ఉండే
జీవితం
ఏర్పాటు
చేసి
ఇవ్వాలనుకున్నాడే
అది
తప్పా? ఇందులో
ఏది
తప్పో
చెప్పండి.
ఈమెను
వెంటనే
పంపించేద్దాం”
తన కొడుకుపైన, ఆ
అమ్మాయిపైన
అనవసరంగా
అపవాదు
వేశామే
నని
బాధపడ్డాడు
ఆయన.
“నేను చాలా
తొందర
పడ్డాను
వరున్.
తప్పు
చేశేశాను.
కవిత
అనే
ఒక
అమ్మాయి
నాకు
ఫోన్
చేసింది”
ఆశ్చర్యంతో ఒకర్ని
ఒకరు
చూసుకున్నారు
అనిల్
మరియు
వరున్.
అనిల్ తండ్రి
మళ్ళీ
మాట్లాడాడు
“మీకు
తెలియకుండా
మీ
కొడుకు
ఒక
అమ్మాయితో
కాపురం
చేస్తున్నాడని, వాళ్ళకు
ఒక
బిడ్డ
కూడా
ఉందని.
మీకు
నమ్మకం
లేకపోతే
వెంటనే
అతని
గదికి
వెళ్ళి
చూడండి” అని చెప్పింది.
“అది విని
భయపడిపోయి
ఇక్కడికి
వచ్చి
చూస్తే
ఈ
అమ్మాయి
ఒక
బిడ్డతో
ఉన్నది.
మేము
ఎవరో
నని
చెప్పిన
తరువాతే
తలుపులు
తీసింది.
ఏదడిగినా
జవాబు
చెప్పకుండా
కూర్చుని
ఏడుస్తోంది.
అందువలన
కవిత అనే ఆ
అమ్మాయి
చెప్పిందంతా
నిజమని
నమ్మాశాను.
అనుచుకోలేని
కోపంతో
తొందరపడ్డాను.
నన్ను
క్షమించండి
అబ్బాయిలూ” అన్నారు అనిల్
ను
ప్రేమగా
చూస్తూ.
“పెద్ద మాటలు
మాట్లాడకండి
అంకుల్.
మా
పరిస్థితిని
మీకు
అర్ధం
అయ్యేటట్టు
చెప్పటానికే
ఎక్కువగా
మాట్లాడాను.
ఒకటి
రెండు
రోజుల్లో
ఈ
అమ్మాయిని
బద్రమైన
ఒక
చోట
చేర్చేద్దామని
అనుకున్నాము.
అందువలనే
విషయాన్ని
మీతో
చెప్పలేదు.
కానీ
సమస్య
మీద
సమస్య
వచ్చి
మమ్మల్ని
నానా
కష్టాలూ
పెడుతోంది” అన్నాడు వరున్.
“ఇప్పుడు ఈ
సమస్య
మీకు
తెలిసినందువలన
మాకు
చాలా
మంచే
జరిగింది.
ఇక
మీదట
వచ్చే
కష్టాలను...మీ
సహాయంతో
- కొత్త ధైర్యంతో
ఎదుర్కొంటాము” అన్నాడు అనిల్.
“మిమ్మల్ని చూస్తే
నాకు
చాలా
గర్వంగా
ఉంది.
గ్రామంలో
మీకు
రామ-లక్ష్మణులు
అనే
పేరు
ఉన్నది.
నిజంగానే
మీరు
అలాంటి
వారే.
మీ
రిద్దరూ
ఎప్పుడూ
హాయిగా
ఉంటారు” అని అభినందించాడు.
“మేము మీ
పిల్లలం
అంకుల్.
ఏ
రోజూ
తప్పే
చెయ్యం.
మేమిద్దరం
విడిపోయే
ప్రసక్తే
లేదు” ఆవేశంగా అన్నాడు
వరున్.
సమస్య పైన సమస్య
వచ్చినా, వాటిని
ఒక్కొక్కటిగా
తీర్చుకుంటూ
రావడం
చూసి
అతనితో
పాటూ, వరున్
కూడా
కొంత
ప్రశాంతత
చెందాడు.
సౌందర్య
కూడా!
అనిల్ కొనిచ్చిన
మధ్యాహ్న
భోజనాన్ని
అందరూ
తిన్నారు.
కొంత
సేపు
విశ్రాంతి
తీసుకున్న
తరువాత
ఇద్దరూ
మళ్ళీ
పంజాగుట్ట
బయలుదేరారు.
వాళ్ళు
ఎదురు
చూడని
విధంగా
అనిల్
తండ్రి
వాళ్ళతో
బయలుదేరారు.
మధ్య దారిలో
అనిల్
బ్యాంకు
ఏ.టి.ఏం
లో
అవసరమైన
డబ్బు
తీసుకున్నాడు.
కారణం
పెద్దాయన
అడ్వాన్స్
డబ్బును
క్యాష్
గానే
అడిగారు.
ఆ ఇల్లు
చేరిన
తరువాత
తండ్రిని
వాళ్లకు
పరిచయం
చేసాడు
అనిల్.
కల్లా
కపటం
లేని
ఆయన
గ్రామం
భాషతో
నమ్మకం
తెచ్చుకున్న
ఇంటి
ఓనర్, పూర్తి
సంతోషంతో
ఇంటిని
అద్దెకు
ఇచ్చాడు.
అద్దె
పత్రాలు
సంతకాలు
చేయబడ్డాయి.
అడ్వాన్స్
డబ్బులిచ్చి, ఇంటి
తాళం
చేవులు
తీసుకున్నాడు
అనిల్.
అద్దే డబ్బును
నెలనెలా
పెద్దాయన
బ్యాంకు
ఖాతాలో
వేస్తానని
చెప్పి, బ్యాంకు
వివరాలు
తీసుకుని
బయటకు
వచ్చారు.
‘ఇక
ఇంటి
యజమాని
బాధ
ఉండదు’ అనే
హాయి
స్నేహితులకు
దొరికింది.
తిరిగి వెడుతున్నప్పుడు
హైటెక్
సిటి
దగ్గరున్న
అపార్ట్మెంటుకు
వెళ్ళి
ఇల్లు
చూశారు.
కొత్తగా
కట్టి
ముగించిన
అపార్ట్మెంట్.
మొదటి
అంతస్తులోనో
ఇల్లు.
రెండు
బెడ్
రూములూ, మిగిలిన
వసతులూ
చేయబడి
ఉన్నాయి.
“ఈ అమ్మాయిని
పంపించాకా
మీకు
ఎందుకు
ఇంత
పెద్ద
ఇల్లు?” -- సందేహంతో
అడిగారు
అనిల్
తండ్రి.
సమాధానం చెప్పలేక
తడబడ్డాడు
వరున్.
అనిల్ చెప్పాడు, “నాన్నా!
ఇప్పుడు
మేముంటున్న
గదికి
వంట
గది
లేదు.
హోటల్
భోజనం
చేసి
చేసి
అవస్తపడుతున్నాము.
ఇక్కడ
అన్ని
వసతులూ
కలిగిన
వంట
గది
ఉంది.
ఇక
మేమే
వంట
చేసుకోవచ్చు”
అలా సమాధానం
చెప్పేడే
తప్ప
దాని
గురించంతా
అతను
అంత
వరకు
ఆలొచించ
లేదు.
ఆలొచించటానికి
టైము
లేదు.
“ఇది కూడా
బాగానే
ఉంది.
రేపే
నీకూ, గౌరికి
పెళ్ళి
జరిగిన
తరువాత
మీకు
పూర్తి
ఇల్లు
కావలసిందే
కదా.
అప్పుడు ఇల్లు వెతుక్కునే అవసరం ఉండదు” అని చెప్పాడు
అనిల్
తండ్రి.
అది విని
అనిల్
ను
చూసి
కన్ను
గీటాడు
వరున్.
ఒక
చిన్న
నవ్వుతో
ఆ
మాటలకు
ఒక
పులుస్టాప్
పెట్టాడు
అనిల్.
అనిల్ తల్లి-తండ్రులు
కూడా
వాళ్లతో
ఉన్నందువలన
మరుసటి
రోజు
ప్రొద్దున్నే
కొత్త
ఇంట్లో
పాలు
కాచి
అక్కడికి
మారటానికి
నిర్ణయించుకున్నారు.
దానికి
కావలసిన
వస్తువులు
కొన్నాడు
అనిల్.
వస్తువులన్నిటినీ
మూటలుగా
కట్టారు. అందులో చాలా
వరకు
పుస్తకాలే!
తెల్లవారు జామునే
లేవాలి
కాబట్టి, మూడో
రాత్రి
కూడా
వాళ్ళకు
నిద్రలేని
రాత్రిగా
అయిపోయింది.
వేకువ
జామున మూడు గంటల
కల్లా
లేచిన
వాళ్ళు, అనిల్
యొక్క
వస్తువులతో
హైటెక్
సిటీ
దగ్గరున్న
అపార్ట్మెంట్
ఇంటికి
వెళ్ళి
చేరారు.
తల్లి పాలు
కాచగా, అందరి
మొహాల్లోనూ
సంతోష్
రేఖలు
మెరిసినై.
కానీ, సౌందర్య
మాత్రం...తాను ఏ
సమయంలోనైనా
ఈ
ఇల్లు
వదిలి
బయటకు
వెళ్లాల్సినదానినే
అనేది
తెలుసు
కాబట్టి, ఎందులోనూ
కలిపించుకోకుండా
ఉండిపోయింది.
అనిల్ తల్లి
అన్ని
పనులు
ఆమే
చేయటంతో, సౌందర్య
పూర్తిగా
దూరంగానే
ఉన్నది.
వరుసగా సెలవులు
తీసుకోలేరు
కాబట్టి
ఆ
రోజు
అనిల్, వరున్
ఉద్యోగాలకు
వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.
కొడుకు
ఉద్యోగానికి
వెల్తాడు
కాబట్టి
తల్లి-తండ్రులు
గ్రామానికి
వెనుతిరిగారు.
సౌందర్య తప్ప
మిగిలిన
నలుగురూ
ఇంటి
బయటకు
వచ్చారు.
అప్పుడు అనిల్
తండ్రి
ఖచ్చితంగా
చెప్పాడు...”ఇంతవరకు
ఆ
అమ్మాయికి
మీరు
సహాయం
చేసినదంతా
కరెక్టే.
కానీ, ఆమెను
త్వరగా
ఇంటి
నుండి
పంపించేయాలి.
ఆ
అమ్మాయి
ఎక్కువ
రోజులు
మీతో
ఉండిపోకూడదు"
Continued...PART-10
***********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి