విజయ్ మాల్య నిర్మించిన వైట్ హౌస్ (ఆసక్తి)
భారత నగరమైన బెంగళూరు అత్యంత విలాసవంతమైన, అత్యుత్తమ లగ్జరీ భవనాలు కలిగిన ఒక నగరం. ఇక్కడ కొన్ని భవనాలు, ప్రపంచంలోని విలాసవంతమైన, లగ్జరీ భవనాలుకు సాటిగా ఉంటాయి - ఈ నగరంలోని ఒక ఆకాశహర్మ్యం పైన నిర్మించిన ఒక భవనం అమెరికా దేశంలోని వైట్ హౌస్ యొక్క ప్రతిరూపం అని చెప్పొచ్చు.
ప్రజలు ఖండించినా ఆయన తాను కలలు కన్న ఇంటిని నిర్మించకుండా ఉండలేకపోయాడు. 2016 నాటికి, బెంగళూరు నగరం నడిబొడ్డున ఉన్న 32 అంతస్తుల కింగ్ఫిషర్ టవర్ పైన, అతని కలల భవనం నిర్మాణంలోకి వచ్చింది. దురదృష్టవశాత్తు, ఆ సమయానికి అతని ఆర్థిక దుఃఖాలు భారతదేశంలొ ఒక చర్చగా మారింది. ఆ తరువాత అతను భారత దేశం విడిచి పారిపోవడంతో తన కలల ఇంటిని అసంపూర్తిగా వదిలివేసాడు.
కింగ్ఫిషర్ టవర్ యొక్క 33 వ మరియు 34 వ అంతస్తులలో ఉన్న మాల్యా యొక్క “స్కై మాన్షన్” 40,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. అందులో వైన్ సెల్లార్, ఇండోర్ హీటెడ్ పూల్, అవుట్డోర్ ఇన్ఫినిటీ పూల్, జిమ్,
సెలూన్ మరియు స్పా, పైకప్పు హెలిప్యాడ్, ఇతర సౌకర్యాలతో పాటు, వాస్తవానికి ఎన్ని పూర్తయ్యాయో అస్పష్టంగా ఉంది. దూరం నుండి చూస్తే భవనం పూర్తయినట్లు కనిపిస్తోంది, కాని నిశితంగా పరిశీలిస్తే తుది వివరాలు లేవని తెలుస్తుంది.
యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ వ్యవస్థాపకుడు విట్టల్ మల్లె కుమారుడు విజయ్ మాల్యా, 2016 మార్చిలో భారతదేశం నుండి పారిపోయారు. రుణదాతలు మరియు దర్యాప్తు సంస్థలు అతన్ని వెంబడించాయి. అతను పెద్ద మొత్తంలో అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేదు. అతను అప్పటి నుండి తనపై వచ్చిన ఆరోపణలపై వివాదం చేస్తున్నాడు. భారతదేశం అతన్ని ఇంగ్లాడ్ నుండి రప్పించడానికి చట్టపరంగా ప్రయత్నిస్తోంది. విజయ్ మాల్యా తన 'స్కై మాన్షన్లో' ఎప్పుడూ నివసించలేదు. మనీలాండరింగ్ చట్టం ప్రకారం అతను దోషిగా తేలితే, ఆ భవనాన్ని జప్తు చేసి అప్పులు తిరిగి కట్టించుకోవటానికి అమ్మవచ్చు.
"మనీలాండరింగ్ చట్టం ప్రకారం,దోపిడీ గా గుర్తిస్తరు" అని రుణదాతల కన్సార్టియం కొరకు హాజరైన సీనియర్ న్యాయవాది ఎస్.ఎస్.నాగానంద్ లైవ్ మింట్కు చెప్పారు. "మనీలాండరింగ్ నిరూపించబడకపోతే, తీసుకున్న డబ్బు అప్పుగా మిగిలిపోతుంది. అప్పుడు ఈ భవనాన్ని బ్యాంక్ వారు తీసుకుని తమ దగ్గర తీసుకున్న రుణానికి బాకీగా తిరిగి పొందటానికి ప్రయత్నిస్తారు. ఆ భవనాన్ని అమ్మి తమకు జమకట్టాల్సిన బాకీ క్రింద కేటాయించుకుంటారు. దీని తరువాత ఏదైనా మిగిలి ఉంటే, దాన్ని ఆయనకు తిరిగి ఇస్తారు.
ప్రెస్టీజ్ ఎస్టేట్స్ చేత అభివృద్ధి చేయబడిన, ఈ స్కై మాన్షన్ విజయ్ మాల్యతో చేసుకున్న ఒప్పందం ప్రకారం పూర్తయింది. దీని అర్థం ప్రాథమికంగా మనం చిత్రాలలో చూసే బాహ్య షెల్. లోపలి భాగం మరింత క్లిష్టంగా ఉంది, ఎందుకంటే విజయ్ మాల్య కు చట్టపరమైన సమస్యలు రావడం ప్రారంభించిన తర్వాత, ఈ భవనం యొక్క హక్కుదారు ఎవరో నిర్ణయించడంలో సమస్య వచ్చింది .
దీన్ని వీడియోలో చూడాలనుకుంటే ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
"పెంట్ హౌస్ యొక్క బాహ్య నిర్మాణం మాత్రమే నిర్మించబడుతోంది. హక్కుదారు ఎవరు అనే దానిపై స్పష్టత లేనందున ఇంటీరియర్స్ పెండింగ్లో ఉంటాయి” అని అభివృద్ధికి దగ్గరగా ఉన్న ఒక మూలం తెలిపింది.
విజయ్ మాల్యా తన స్కై మాన్షన్లో నివసిస్తారా, లేదా ఆయన ఎప్పుడైనా భారతదేశానికి తిరిగి వస్తారా అనేది అస్పష్టంగా ఉంది. కానీ చాలా సంవత్సరాలుగా వదిలివేయబడినప్పటికీ, విలాసవంతమైన ఈ భవనం ఇప్పటికీ ముఖ్యాంశాలు చేస్తూ ఆన్లైన్లో దృష్టిని ఆకర్షిస్తోంది.
***********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి