3, ఆగస్టు 2021, మంగళవారం

భారతదేశంలో ఎరుపు రంగు వర్షం!...(మిస్టరీ)R

 

                                                                   భారతదేశంలో ఎరుపు రంగు వర్షం!                                                                                                                                                               (మిస్టరీ)

ఎరుపురంగు వర్షం సంఘటన భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో 2001, జూలై నెల 23 నుండి సెప్టెంబర్ నెల 25 వరకు అప్పుడప్పుడు కురుస్తూ, ఒక్కొక్కసారి భారీ ధారాపాతంగా కురిసింది. వర్షంలో తడిసిన గుడ్డలు లేత ఎరుపురంగుగా మారాయి. పసుపు, ఆకుపచ్చ మరియు నలుపు రంగు వర్షాలు పడినట్లు కూడా తెలియజేసారు. 1896లో చాలాసార్లు మరియూ మధ్య 2012 జూన్ నెలలో కూడ ఎరుపురంగు వర్షం కురిసినట్లు రికార్డు అయ్యింది.

ఎరుపురంగు వర్షం నీటిని ఇంగ్లాండ్ లోని రెండు ప్రముఖ ప్రయోగశాలలొ ఖగోళవేత్త చంద్రవిక్రం షింగే, కార్దిఫ్ విశ్వవిద్యాలయ సూక్ష్మ క్రిమి శాస్త్ర నిపుణులతో కలిసి తీవ్రంగా విశ్లేషించిన తరువాత ఎరుపు రంగు వర్షం నీటిలో సూక్ష్మ క్రిముల కణాలు ఉన్నాయని, అవి అతిశయమైన, అసాధారణ జీవ సంబంధ కణాలుగా గుర్తించారు. 2001లో పడిన ఎరుపురంగు వర్షం నీటిలో ఉన్న సూక్ష్మ క్రిముల కణాల తీవ్రమైన వేడిలొ (ఊష్ణోగ్రతలో) వాటికవే సంఖ్యలో వృద్దియగుతున్నాయని మరియూ కణాలలొ అనువంశిక పధార్ధమే (డి.ఎన్.)లేదని తెలిపారు.

2001లో అనేకమంది శాస్త్రవేత్తలు కేరళాలో రెండు నెలలు ఉండి అక్కడ కురిసిన ఎరుపురంగు వర్షాన్ని గమనించారు. అందులో కొచ్చిన్ సైన్స్ మరియూ టెక్నాలజీ విశ్వవిద్యాలయానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త 'గాడ్ ఫ్రే లూయిస్ ఒకరు. ఎరుపురంగు వర్ష అద్భుతాన్ని కుతూహలంగా చూసిన ఆయన, వర్షం ఎరుపురంగుగా ఎందుకు కురుస్తోందో తెలుసుకోవటానికి( బహుశా వర్షం నీరు కలుషితం అవటానికి దూరంలో ఉన్న ఎడారిలోని మట్టి మరియు దుమ్ము కారణం అయ్యుంటుందని అనిపించినా) వర్షం నీటిని అనేక నమూనాలుగా సేకరించి, తాను అనుకున్నదే నిజమని నిరూపించటానికి తన పరిశోధనా కేంద్రానికి తీసుకు వెళ్ళారు

తన పరిశోధనా కేంద్రంలో నీటిని సూక్ష్మ దర్షిని మూలంగా చూసినప్పుడు ఆయనకు నీటిలో మట్టిగానీ లేక దుమ్ముగానీ కనిపించలేదు సరికదా నీరు మొత్తం ఎర్ర కణాలతో నిండి ఉండటం గమనించారు. ఎర్ర కణాలు సాధారణంగా భూమి మీద ఉండే క్రిములలో ఉండే ఎర్ర కణాలలాగానే కనబడ్డాయి. విచిత్రమేమిటంటే కణాలలో అనువంశిక పదార్ధమే కనబడలేదు. అనువంశిక పదార్ధమే ఎర్రకణాలు జీవసంబంధ క్రిమికి సంబంధించినవో తెలియజేస్తాయి. ఎర్ర రక్తకణాలను బట్టి క్రిములు జీవసంబంధితమైనవో  తెలుసుకోవడానికి ఒక అవకాశం ఉన్నా, వర్షం నీరు వాటిని త్వరగా నాశనం చేయగలదు. ఇక్కడ అది గూడా జరగలేదు.

లూయస్ 2006లో తన పరిశోధనా ఫలితాలను ఖగోళ భౌతిక శాస్త్రము మరియు అంతరిక్షము పీర్ సమీక్ష (పీర్ సమీక్ష అంటే ఒకే విషయాన్ని ఒకరి కంటే ఎక్కువమంది పరిశోధన చేయటం) పత్రికలో ప్రచురించారు. తన తాత్కాలిక సూచనగా నీటిలో కనిపించే ఎర్ర కణాలు భూలోకేతర గ్రహాంతరానికి చెందినవని, బహుశ ఎగువ వాతావరణంలో పతనమైపోయిన తొకచుక్కలో నుండి క్రిందకు పడిపోతూ, మధ్యలో ఉండే వర్షం మబ్బుల లోకి దూరి అక్కడ నుండి వాన నీటిలో కలిసి భూమిమీద పడుంటాయని తెలిపారు. ఎర్రరంగు వర్షం కురిసేటప్పుడు చెవులు చిల్లులుపడే శబ్ధం వినబడిందని, శబ్ధం మామూలు శబ్ధం కాదని, ఎగువ వాతావరణంలో ఏదో ఒక వస్తువు పతనమైపోయిన శబ్ధమని సూచించారు.

ఆనాటి నుండే గాడ్ ఫ్రే లూయస్ అంతర్జాతీయ నిపుణలతో కలిసి (వారిలో కార్డిఫ్ విశ్వవిద్యాలయ సూక్ష్మక్రిమి శాస్త్ర నిపుణుడు, ఖగోళ శాస్త్రవేత్త చంద్ర విక్రం షింగే ఒకరు) ఎర్ర కణాల పరిశోధనలో నిమగ్నులయ్యారు. అంతే కాకుండా రోజు నుండి 20 శతాబ్ధ ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఫ్రెడ్ హోయలే తో కలిసి పాన్స్ పెర్మియా అంటే విశ్వము అంతటా జీవము ఉన్నదని, (తొకచుక్క, నక్షత్ర గ్రహాలు, కుజగ్రహం మరియు గురు గ్రుహములాంటి ఇతర గ్రహాలు) వాదమును ప్రతిపాదించిన ప్రముఖ ప్రతిపాదకులలో ఒకరుగా పేరు తెచ్చుకున్నారు.

విశ్వం అంతా జీవం ఉన్నదని, భూమిమీద జీవం ఉండటానికి విశ్వంలో ఉండే సౌర గ్రహాలలో కొన్ని గ్రహాలు కారణమని చెప్పే సిద్దాంతాన్ని నమ్మడానికి కొంతకాలం పట్టవచ్చు. ఇది నిజమని నాసా వారు చేపట్టిన ఒక పరిశోధనలో తెలిసినట్లు తెలిపారు. వారు అది త్వరలో ఒక పత్రికలో ప్రచురించబోతునట్టు కూడా తెలిపారు.

అయితే ఇంతవరకు ప్రచురించలేదు. అంతవరకు కేరళ రాష్ట్రంలో కురిసిన ఎర్ర రంగు వర్షం ఒక మిస్టరీగానే ఉంటుంది.

Images Credit: To those who took the original photo.

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి