25, ఆగస్టు 2021, బుధవారం

అతడు కాలంలో ప్రయాణించాడా?... (మిస్టరీ)R

 

                                                                అతడు కాలంలో ప్రయాణించాడా?                                                                                                                                                          (మిస్టరీ)

చరిత్రలో మేధావులు, శాస్త్రవేత్తలూ అదృశ్యమైన సంఘటనలు ఏన్నో ఉన్నాయి. వీరంతా ఎలా అదృశ్యమైపోయారో తెలియక చనిపోయిన వారి లెక్కలో వేసేసుకుంటున్నారు. అలాంటి ఒక విచిత్రమైన సంఘటన గురించే మనం తెలుసుకోబోతున్నాము.

శాస్త్రవేత్త ఎటొరే మజోరనా 1906 సంవత్సరం ఇటిలీలో జన్మించారు. ఇటలీ దేశంలోని పలెరెమో నగరం నుండి అమెరికాలోని ఫ్లోరిడా నగరానికి ఓడలో ప్రయాణం చేసిన శాస్త్రవేత్త ఓడలో నుండి హఠాత్తుగా మాయమయ్యాడు. అతని కోసం గాలించిన ప్రయత్నాలు విఫలమవడంతో 1938 మార్చి నెల 27 అతను చనిపోయినట్లు ప్రకటించారు. అప్పుడు అతని వయసు 32 సంవత్సరాలు.

ఎటోరే మజోరనా ఒక ఇంజనీర్. గణిత శాస్త్రజ్ఞుడు మరియు సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఇతను Neutrino కణాల ముద్దల గురించి పరిశోధనలు చేశాడు.(న్యూట్రినో అనేది పరమాణువులో ఎలాంటి విద్యుదావేశం లేని కణం. న్యూట్రినో ఎలాంటి వస్తువు గుండా అయినా ప్రయాణించగలదు. న్యూట్రినోలు రేడియో ధార్మికత, పరమాణు ప్రతిచర్య ద్వారా రూపొందుతాయి. అందువలన ఇవి సూర్యుని ఉపరితలం మీద, కాస్మిక్ కిరణాలు అణువును తాకినప్పుడు ఉద్భవిస్తాయి). అందువలన కొన్ని గణితశాస్త్ర సమీకరణాలకు మరియు భౌతిక కణాలకు శాస్త్రవేత్త పేరుపెట్టారు. (The Majorana equation and Majorana fermions). సైద్ధాంతిక భౌతిక రంగంలో నూతన ఆవిష్కరణ చేసిన వారికి 2006 నుండి శాస్త్రవేత్త పేరుతో బహుమతి అందజేయడం మొదలుపెట్టారు.

కానీ ఇతను కనబడకుండా పోయిన ఇరవై సంవత్సరాల తరువాత 1958లో అర్జెంటీనా దేశంలో ఇతని ఫోటో ఒకటి ప్రచురితమైంది. ఫోటోలో అతని రూపం 1938లో అతను కనబడకుండా పోయినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉంది.

రెండవ ప్రపంచ యుద్దం తరువాత అర్జెంటీనా రాజధాని Buenos Aires లో శాస్త్రవేత్త ఎటోరే మజోరనా తనకు ఎన్నో విషయాలు చెబుతూ 20 సంవత్సరాలలో తాను ఆవిష్కరణ చేసిన శాస్త్రీయ సిద్దాంతాల గురించి తనకు వివరించాడని, అప్పుడు తాము తీసుకున్న ఒక ఫోటోను, అతను తెలిపిన కొన్ని గణిత, సైద్దాంతిక భౌతిక సిద్దాంతాలతో జతపరచి న్యూస్ పేపర్ కు పంపించాడు గుర్తు తెలియని ఒక వ్యక్తి.

మొదట్లో ఎవరూ దీని గురించి పట్టించుకోలేదు. ఇదొక కుట్ర అని కొట్టిపారాశారు. ఎందుకంటే ఫోటోలో శాస్త్రవేత్త ఎటోరే మజోరనాతో ఉన్న వ్యక్తి పేరు, అతనెవరో అనేది తెలుపలేదు కనుక.

అయితే తమ దేశస్తుడు, అత్యంత మేధావి, శాస్త్రవేత్త, సైద్దాంతిక భౌతిక సిద్దాంతాల పితామహుడు అయిన శాస్త్రవేత్త ఎటోరే మజోరనా కనబడకపోవటం వెనుక ఉన్న మర్మమేమిటో తెలుసుకునేందుకు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన ఇటలీ దేశం 1958లో వెలువడిన శాస్త్రవేత్త ఎటోరే మజోరనా ఫోటో గురించి పరిశోధనలు నిర్వహిస్తూనే ఉన్నది.

మార్చి 2011లో రోమ్ నగర అటార్నీ జెనరల్ ఒక ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. Carabinieri's RIS విశ్లేషణలో 1958లో వెలువడిన శాస్త్రవేత్త ఫోటో నిజమైనదని, అందులో ఉన్న ఫోటో శాస్త్రవేత్త ఎటోరే మజోరనా ఫోటోనే అది. ఆయన యొక్క పాత ఫోటోలతో పోలిస్తే 100 శాతం సరిపోయిందని ప్రకటించారు.

ప్రకటనతో అన్ని దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అంతవరకు మర్చిపోయిన సైంటిస్ట్ గురించి చర్చలు, పరిశోధనలు మొదలయ్యాయి.

ఆయన తెలియపరచిన సిద్దాంతాలు నిజమైనవని తెలుసుకున్నారు. దీనితో ఆయన మరింత ప్రసిద్ది, గౌరవం సంపాదించుకున్నాడు. ఆయన కనిపెట్టిన సిద్దాంతాలలో ముఖ్యమైనది విశ్వంలోని విరుద్ధ పదార్ధం.

1937లో శాస్త్రవేత్త ఎటోరే మజోరనా విశ్వంలోని విరుద్ధ పదార్ధం  కణాలతో విశ్వంలో ఎక్కడికైనా వెళ్ల వచ్చునని తెలియజేశారు. అంతేకాకుండా విరుద్ధ పదార్ధం, విశ్వంలో మత్తెర్ తో కలిసినప్పుడు మాయమైపోవచ్చునని తెలియజేశారు. ఇలా మాయమైపోవడం, మళ్లీ తిరిగి కనిపించడం అనే విషయాల గురించి తెలుసుకోగలిగాడని, మాయమైపోవడం, మళ్లీ తిరిగి కనిపించడం గురించిన ప్రయోగంలో తనని తానే ఉపయోగించుకున్నాడని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

తన ప్రయోగం విజయవంతమైనదనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయటానికే అతను ఓడ ప్రయాణంలో కనిపించకుండా పోయి, తిరిగి 20 సంవత్సరాల తరువాత అర్జెంటీనా దేశంలో కనిపించాడని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

" ప్రయోగాన్ని మానవులు తప్పుగా ఉపయోగించుకునే అవకాశం ఉన్నందున ప్రయోగ ఫలితాలను తెలుపలేదు. శాస్త్రవేత్త ఎటోరే మజోరనా చాలా తెలివిగల మేధావి. ఆయన మాయమవ్వాలనుకుంటే అతన్ని ఎవరూ కనుక్కోలేరు. ఎప్పటికీ కనుక్కోలేరు" అని నోబుల్ బహుమతి గ్రహీత ఎన్రికో ఫెర్మీ తెలిపారు.

అదే నిజమైతే శాస్త్రవేత్త మజోరనా మొట్టమొదటి కాల ప్రయాణీకుడు...ఇది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉన్నది.

Images Credits: To those who took the original photos.

***********************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి