చంద్రుని మీద అన్యులున్నారా? (మిస్టరీ)
పురాతన రహస్య ఏలియన్ స్థావరం చంద్రునిపై కనుగొనబడింది.
చంద్ర గ్రహానికి మనుషులను పంపే మిషన్ ను విజయవంతం చేయడానికి చైనా చేసే ప్రయత్నాలలో చైనా అంతరిక్ష సంస్థతో కలిసి పనిచేస్తున్న డాక్టర్ మైఖేల్ సల్లా 'చంద్రునిపై అన్య గ్రహ స్థావరం ఎప్పటి నుంచో ఉన్నది’ అనే వాదనను ప్రపంచం ముందు ఉంచారు. చంద్ర గ్రహానికి మనుషులను పంపే చైనా వారి మిషన్/ప్రాజక్ట్ విజయవంతమైతే, 1972 లో నాసా యొక్క అపోలో 17 తరువాత, ఇదే మనుషులు కలిగిన మొదటి ల్యాండింగ్ అవుతుంది.
'ఈ స్థావరం అన్య గ్రహ వాసుల సైనిక పారిశ్రామిక సముదాయం' అని సల్లా చెప్పారు. అటువంటి వాటి ఉనికిని కప్పిపుచ్చడానికి, అటువంటి స్థావరాలతో పాటు "పురాతన కళాఖండాలు మరియు సౌకర్యాలు" పై నాసా బాంబు దాడి చేస్తున్నట్లు ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత విపరీతమైనవి.
అంతేకాకుండా, చంద్ర గ్రహంపై రహస్య మైనింగ్ మిషన్లను "రహస్య ప్రపంచ ప్రభుత్వం" నిర్వహిస్తోందని, దీనికొసం అక్కడున్న గుర్తు తెలియని గ్రహాంతర జాతితో రహస్య ఒప్పందం కుదుర్చుకుంది అని కూడా ఆయన చెప్పారు.
లూనా 13 ఛాయాచిత్రాలు
పైన చూస్తున్న అద్భుతమైన ఛాయాచిత్రంలో, చంద్రుని ఉపరితలంపై వదిలివేయబడిన ఒక ఇరుసు మరియు చక్రాలను చూపించేలా కనిపిస్తుంది. 1966 డిసెంబర్ 24 న సోవియట్ యూనియన్ యొక్క లూనా 13 అంతరిక్ష నౌక విజయవంతంగా చంద్రుడుపై దిగిన తరువాత లూనా 13 అంతరిక్ష నౌక తీసిన ఛాయాచిత్రం ఇది.
ఇది సోవియట్ యూనియన్ సాధించిన రెండవ ‘సాఫ్ట్ ల్యాండింగ్’, కానీ ఈ ఫోటో సముద్రంలా మేఘాలు కమ్ముకున్నప్పుడు తీసిన మొదటిది. కాబట్టి చంద్రుని ఉపరితలంపై వదిలివేయబడిన వింత వస్తువు ఏమిటి? అది ఎక్కడ నుండి వచ్చింది? ఎవరు అక్కడ వదిలిపెట్టారు?
లూనా 13 ల్యాండింగ్కు ముందు మరో రెండు సోవియట్ వ్యోమనౌకలు, లూనా 2 మరియు లూనా 5, చంద్రునిపై మేఘాల సముద్రం వలన
క్రాష్ అయినై. లూనా 13 తీసిన పై చిత్రంలో ఉన్న‘ఇరుసు మరియు చక్రాలు’ ఈ క్రాఫ్ట్‌లలో ఒకదానికి చెందినవని ఊహాగానాలు . కానీ ఈ ఊహాగానాలతో సమస్య ఉంది.
లూనా 2 చంద్రునిపై క్రాష్ అయిన చోటు వేరు. లూనా 5 యొక్క క్రాష్ సైట్ యొక్క ఖచ్చితమైన వివరాలు తెలియవు.
మూన్బేస్: చంద్రుడిపై గ్రహాంతరవాసులు ఉన్నారా?
చంద్రునిపై నడిచిన మొట్టమొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ప్రకారం, జూలై 1969 లో అతను మరియు అపోలో 11 లూనార్ మాడ్యూల్ చంద్రుని ఉపరితలంపై దిగినప్పుడు అతనిని పలకరించడానికి రెండు భారీ గ్రహాంతర వ్యోమనౌకలు అక్కడ వేచి ఉన్నాయి.
ఆర్మ్స్ట్రాంగ్, భూమి పై ఉన్న మిషన్ కంట్రోల్ మరియు పేరు తెలుపని ప్రొఫెసర్‌ల మధ్య జరిగిన సంభాషణలు... 1973 లో అపోలో మూన్ ల్యాండింగ్ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న యుఎస్ ప్రభుత్వం షాక్ నిర్ణయం వెనుక గల కారణాలను కూడా వెల్లడిస్తున్నాయి.
ఇది గ్రహాంతర వ్యోమనౌకలలో ఉన్నవారు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ కు చేసిన హెచ్చరికకు ప్రతిస్పందనగా ఉంది అని అనుకుంటున్నారు.
గత 45 సంవత్సరాలకు పైన ఈ పుకారు చక్రంలా తిరుగుతోంది. దేని గురించి? నీల్ ఆర్మ స్ట్రాంగ్ వాస్తవానికి చెప్పిన దాని గురించి కాదు. ‘మనిషికి ఒక చిన్న అడుగు, మానవాళికి ఒక పెద్ద ఎత్తు’ అనే మాటలే నీల్ ఆర్మ స్ట్రాంగ్ చంద్రునిపై కాలు మోపిన వెంటనే నాసా ఆఫీసు కెంద్రంలో ఉన్న మిషన్ కంట్రోల్ తో మాట్లాడిన మొదటి మాట. ఆ తరువాత నీల్ ఆర్మ స్ట్రాంగ్ మిషన్ కంట్రోల్ తో మాట్లాడిన మాటలే అత్యంత ముఖ్యమైనవి. అయితే ఆ మాటలు సరిగ్గా వినబడలేదని మిషన్ కంట్రోల్ అధికారులు చెప్పటమే వాస్తవానికీ, పుకారుకూ కారణం అయ్యింది.
కానీ, అపొలో 11 తో కలిసి రేడియో ట్రాన్స్ మిషన్ లో పనిచేసిన ఓటో బిండర్ నీల్ ఆర్మ స్ట్రాంగ్ మిషన్ కంట్రోల్ తో మాట్లాడిన ఇతర మాటలలో 'చంద్రునిపై రెండు అతిపెద్ద వ్యోమ నౌకలతో గ్రహాంతర వాసులు మనల్ని చూస్తున్నారూ అని చెప్పినట్లు తెలిపారు.
మాజీ నాసా ఉద్యోగి,సాంకేతికనిపుణుడు మౌరైస్ చటేలియన్ కూడా దీని దృవీకరిస్తూ '1979 లో నాసాలో అందరూ మాట్లాడుకున్నది ఇదే విషయం' అని చెప్పారు. కానీ, ఇప్పటి వరకు దాని గురించి ఎవరూ నోరు తెరవలేదు. అదే సమయం 1972 తరువాత నాసా చంద్ర గ్రహానికి వ్యొమనౌకలను పంపటం ఎందుకు ఆపేసింది అనేదానికి సరైన జవాబు లేదని చెబుతున్నారు.
ఏది నిజం, ఏది పుకారు...మిస్టరీగానే మిగిలిపోయింది.
Images Credit: To those who took the original photos.
***********************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి