నిజమైన నాయకుడు అంటే ఇలా ఉంటాడు (న్యూస్)
ఉక్రెయిన్ అధ్యక్షుడు
వోలోడిమిర్ జెలెన్స్కీ.
అతడు యూదుడు.
అతని తాత
రెండవ ప్రపంచ
యుద్దంలో నాజీలతో
పోరాడాడు. హోలోకాస్ట్లో
అతని బంధువులు
చాలా మంది
చనిపోయారు. 48 గంటల క్రితం
అతను తన
సైనికులతో కలిసి
రష్యా సైనికుల
తోపోరాడటానికి సైనిక
యూనిఫాం ధరించి
ఉక్రెయిన్ వీధుల్లోకి
స్వయంగా దిగాడు.
"మీరు
మాపై దాడి
చేసినప్పుడు, మీరు
మా ముఖాలను
చూస్తారు, మా
వెనుకవైపు కాదు" --అని
రష్యా అధ్యక్షుడు
పుతిన్ కు
ఒక మెసేజ్
పంపాడు.
దూసుకొస్తున్న
రష్యా సైనికులను
ఎలాగైనా అడ్డుకోవాలన్న
తపనతో యుక్రెయిన్
ప్రభుత్వం యుక్రెయిన్
ప్రజలు ఇంట్లోనే
పెట్రోల్ బాంబులు
తయారు చేసి
రష్యా సైన్యంపై
విరుచుకుపడాలి
అని పిలుపును
ఇచ్చింది.
వారి చేతిలో
ఆయుధాలు లేవు..
పోరాడటానికి యుద్ధ
ట్యాంక్‌లు, ఫైటర్
జెట్లు లేవు…
శత్రువును తమ
వాకిట్లోకి రానివ్వద్దన్న
ఒక్క పంతం
తప్ప. ప్రస్తుతం
యుక్రెయిన్ వాసుల
గుండెలు అగ్ని
గుండాల్లా మారుతున్నాయి..
దూసుకొస్తున్న
రష్యా సైనికులను
ఎలాగైనా అడ్డుకోవాలన్న
తపన వారి
కళ్లల్లో కనిపిస్తోంది..
అదే వారిని
నడిపిస్తోంది.. కదనరంగంలోకి
దూకి పోరాడాలన్న
స్ఫూర్తిని రగిలిస్తోంది.
కానీ పూర్తి
సన్నద్ధంగా ఉన్న
శత్రువును అడ్డుకోవడం
ఎలా? మెషిన్
గన్, యుద్ధ
ట్యాంకుల నుంచి
క్షిపణుల వరకు
సర్వసన్నద్ధంగా
శత్రువును నిలువరించడం
ఎలా? దీనికి
యుక్రెయిన్ వాసులు
చెబుతున్న సమాధానం
మోలటోవ్ మాక్‌టేల్.
ఇదేదే కిక్
ఇచ్చే కాక్‌టెయిల్
కాదు.. ప్రాణాలు
తీసే మాక్టెయిల్.
దీనితో రష్యా
దండయాత్ర కీవ్
నగర సరిహద్దుల
వరకు ఒక
లెక్క.. నగరంలోపల
మరోలెక్క అన్నట్టుగా
తయారైంది పరిస్థితి.
ప్రజలు చేసే
ఈ దాడులతో
రష్యా సైన్యం
వేగం తగ్గుతోంది.
ఎప్పుడు ఏ
అపార్ట్‌మెంట్
నుంచి ఏ
మాక్‌టెయిల్
బాంబు దూసుకొస్తుందో
అని టెన్షన్
పడుతున్నారు. మరోవైపు
ఆయుధాలు ధరించిన
ఉక్రెయిన్ పౌరులు
ఇప్పుడు కీవ్
నగరంలో గస్తీ
కాస్తూ కనిపిస్తున్నారు.
తమ దేశాన్ని
రక్షించుకోవడం
తమ బాధ్యతని..
ఇలా యుద్ధం
చేయడం తమకు
ఏమాత్రం ఇష్టం
లేదని.. కానీ
రష్యానే తమకు
ఇలాంటి పరిస్థితి
తీసుకొచ్చిందంటూ
ఆగ్రహం వ్యక్తం
చేస్తున్నారు. ఓవైపు
ఆయుధాలతో యువత, ఆయుధాలు
లేని వారి
చేతుల్లో మాక్‌టెయిల్
మొత్తంగా చూస్తే
రష్యన్లకు చుక్కలు
కనిపిస్తున్నాయి.
పుతిన్కు
ఊహించని షాక్.
ఉక్రయిన్ అధ్యక్షుడు
వోలోడిమిర్ జెలెన్స్కీ
ఆయుధాలు పట్టుకుని
తమ నేలను
రక్షించుకోవాలని
దేశ ప్రజలకు
పిలుపునిచ్చారు.
దీంతో కొంతమంది
పౌరులు, నాయకులు
కూడా ఆయుధాలు
చేపట్టారు.
ఆ దేశ
మహిళా ఎంపీ
కిరా రుదిక్
ఓ ఫోటోను
సోషల్ మీడియాలో
షేర్ చేశారు.
అందులో ఆమె
అత్యాధునిక రైఫిల్ను
పట్టుకుని నిలబడి
ఉన్నారు.
దేశాన్ని కాపాడుకునేందుకు జరిగే పోరాటంలో
దేశ పౌరులందరూ ముందుకు రావాలని యుక్రెయిన్ అధ్యక్షుడు ప్రజలను కోరటంతో శత్రువుల
కార్యకలాపాల్ని అదుపులో పెట్టేందుకు ఉక్రయిన్ దేశ ప్రజలు వీధుల్లోకి వచ్చి గస్తీ
నిర్వహిస్తున్నారు.
Images Credit: To those who took the
original photos.
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి