8, ఫిబ్రవరి 2022, మంగళవారం

దృశ్యం...(సీరియల్)...PART-11

 

                                                                                దృశ్యం...(సీరియల్)                                                                                                                                                                         PART-11

ఇద్దరూ వెనక్కి, వెనక్కి తిరిగి చూసుకుంటూ కారులో ఎక్కారు. గౌతం కారు స్టార్ట్ చేశాడు.

"అక్కా! మనల్ని ఫాలో చేస్తూ వెనుక బైక్ వస్తోంది. మనం మండపానికే వెడుతున్నామా అని చూడటానికి"

“ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎందుకు వెంటనే వదలిపెట్టారు?' అర్ధం కావట్లేదే!"

"అవునక్కా...".

"ఫోన్ లో ఎవరో మాట్లాడారు. అది ఎవరు. ఎక్కడుంచి ఫోన్ చేశారు. దేనికీ మనం సంతోష పడకూడదు గౌతం. మన చుట్టూ ఆపద పొంచి ఉంది."

"తిన్నగా పోలీసుల దగ్గరకు వెళ్ళిపోదామా"

"ఏమిట్రా చెబుతున్నావు"

"మండపంలో మనకు ఆపద ఉంటే?"

"డాడీ, మమ్మీ, అక్కయ్యా ఉన్నారుగా…..వాళ్ళ మీద ఆపద దాడి చేయదా ? డాడీతో మాట్లాడి నిర్ణయం తీసుకుందాం. ఏం జరుగుతుందో అది జరగనీ. ఇక నిజాన్ని చెప్పేద్దాం"

పది నిమిషాలలో కారు మండపానికి చేరుకుంది.

మండపం బయట తండ్రి, తల్లి, అక్కయ్య, చక్రవర్తి....చక్రవర్తి తల్లితండ్రులు నిలబడున్నారు.

తల్లి, ప్రియంవదను కౌగలించుకుని ఏడ్చింది.

"వియ్యంకులవారికి చాలా ధ్యాంక్స్. మీరు తీసుకున్న చర్యల వలనే వీళ్ళు తిరిగి వచ్చారు" అంటూ "ఏం జరిగిందిరా?" అని కొడుకును అడిగాడు రామకృష్ణ గారు.

"కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళారు. బెదిరించారు...ఏదో ఒక ఫోన్ రావటంతో వదిలేశారు"

"పోలీసులకు ఇన్ ఫార్మ్ చేస్తానని వియ్యంకుడు చెప్పటంతో, వాళ్ళు భయపడి మిమ్మల్ని వదిలిపెట్టారు. మంచి కాలం"

సాంబశివరావ్  గారు దగ్గరకు వచ్చారు.

“సమయం అర్ధ రాత్రి ఒంటి గంట అయ్యింది. ఇక దీని గురించి మాట్లాడి సమయం వ్రుధా చేయకండి. ప్రొద్దున్నే ముహూర్తం. వెళ్ళి కాసేపు నిద్ర పొండి"

"అలాగే సాంబశివరావ్  గారు....చాలా ధ్యాంక్స్. పిల్లలను కాపాడారు"

వీళ్ళ ఐదుగురూ లోపలకు వచ్చారు. గది తలుపులకు గొళ్ళేం పెట్టారు.

"మీరిద్దరూ ఆ టైములో ఎందుకు ఇంటికి వెళ్ళారు? ఎవరు మిమ్మల్ని కిడ్నాప్ చేసింది.”

"తలుపులు సరిగ్గా వేశావా గౌతం.”

“డాడీ...పోలీసులకు చెప్పేస్తానని బెదిరించి ఎవరూ మమ్మల్ని విడిపించలేదు"

"ఏమిటే చెబుతున్నావు?"

"నాకే విషయాలన్నీ ఇప్పుడే అర్ధమవుతున్నాయి డాడీ. మేము ఇంటికివెళ్ళటాన్ని మనుషుల్ని పంపించి ఫాలో చేయించారు వియ్యంకులు. మమ్మల్ని కిడ్నాప్ చేయించింది ఆయనే. ఫోన్ చేసి మమ్మల్ని విడిచిపెట్టమని చెప్పిందీ ఆయనే."

"ఏమిటే వాగుతున్నావ్?"

"వాగటం లేదు”

 "వియ్యంకుడా మనుషులను పంపి కిడ్నాప్ చేశాడు? ఎందుకు ఆయన మీద అంత నింద వేస్తున్నావ్?"

"మా గురించి మీరు పోలీసుల దగ్గరకు వెళ్ళుంటే...అది కొన్ని విపరీతాలకు దారి తీస్తుంది. అందుకనే మీ వియ్యంకుడు భయపడ్డాడు"

"అర్ధం కాలేదు ప్రియా" అన్నది తల్లి రాజేశ్వరి.....

"అమ్మా! మేము ఇంటికి వెళ్ళటానికి ఒక ముఖ్య కారణం ఉన్నది. వాళ్ళ దగ్గర చిక్కుకుని, వాళ్ళే మమ్మల్ని వదిలిపెట్టారంటే దాన్ని ఏమంటారు? వాళ్ళ తలరాత అంటారు"

"ఏమిటే అది?"

"ఆక్కయకు మంచి టైము"

"అర్ధమయ్యేటట్టు చెప్పవే ప్రియా"

"అక్కా...బ్యాటరీ లేకుండా ఏమీ చెయ్యలేము. ప్రొద్దున షాపులు తెరిచేలోపు ముహూర్త సమయం వచ్చేస్తుంది. ఏం చేద్దాం?"...గౌతం అడిగాడు.

"బ్యాటరీ దేనికి ? ఎందుకు?"

"కెమేరాలో వేసే బ్యాటరీ ఉన్నదా?"

"నా దగ్గరున్నది. వస్తువులన్నీ ప్యాకింగ్  సంచీలో వేస్తుంటే, ఇంట్లో ఉన్న ఈ బ్యాటరీని కూడా వేశాను"

తల్లి రాజేశ్వరి బ్యాటరీ ఇవ్వటంతో...ప్రియంవద ముఖం వికసించింది.

"అమ్మా! ఈ బ్యాటరీ గనక ఇప్పుడు దొరికుండకపోతే...అక్క జీవితమే ప్రశ్నార్ధకమయ్యేది"

"ఏమిటా మర్మం?"

ప్రియ కెమేరాను బయటకు తీసి, కెమేరా వెనుక బ్యాటరీ అమర్చింది.

"గౌతం! లాప్ టాప్ యు.ఎస్.బి కేబుల్ ఇవ్వు.  డైరెక్టుగా వేసి చూద్దాం"

గౌతం ఆ కేబుల్ ఇచ్చాడు.

కెమేరా లో తీసిన వీడియోను రీవైండ్ చేసి అధిరిపడ్డది ప్రియంవద.

అందులో వీడియో లేదు.  మళ్ళీ మళ్ళీ వెతికింది.

తాను తీసిన వీడియో లేదు.

ప్రియంవద క్రుంగి పోయింది.

"గౌతం...ఇదొకసారి చూడు"

గౌతం చూశాడు...మొత్తం వెతికేడు.

"ఏమీ లేదే అక్కా"

"అవును మీరేం వెతుకుతున్నారు?".....రామకృష్ణ గారు పిల్లల్ని అడిగాడు.

"ఆ కాంచనని హత్య చేయడాన్ని ప్రియ వీడియో తీసింది. ఆ ఆధారం అక్క దగ్గరున్నది"

"ఏమిట్రా చెబుతున్నావ్? ఎవరు చేసింది? వియ్యంకుడిని పిలుస్తాను, వాళ్ళు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. ఇప్పుడే అయనతో చెప్పేద్దాం"

"వద్దు డాడీ...హత్య చేసిందే వాళ్ళు!"

గౌతం నొటిని గబుక్కున మూసింది ప్రియంవద.......

"ఏంటక్కా?"

"వద్దురా! ఆధారం ఇప్పుడు మన చేతిలో లేదు. ఎలా డిలేట్ అయ్యిందో ఇప్పుడు కూడ నాకు అర్ధంకావటంలేదు. ఇది లేకుండా మనం మాట్లాడితే ఎవరూ నమ్మరు. మన మీద కోపం ఎక్కువౌతుంది. ఏం మాట్లాడొద్దు...వదిలేయ్"

విసుగుతో పైకి లేచింది ప్రియ.

"నా దగ్గర చెప్పవే"

"లేదమ్మా....."

"సరె...వియ్యంకుడి దగ్గర...?"

"వద్దు. ఆధారం లేకుండా ఎవరి దగ్గర మాట్లాడలేం"

గది తలుపులు తెరుచుకుని బయటకు వచ్చింది ప్రియ.. వెనుకే గౌతం వచ్చాడు.

"దాన్ని డిలేట్ చేసింది ఎవరై ఉంటారక్కా?"

“ఇక ఎవరికి చెప్పినా లాభంలేదు.ఎవరు నమ్మరు. జరిగేది జరగనీ"

“అయ్యో అక్కా...రేపు ఈ పెళ్ళి జరిగితే అక్కయ్య జీవితం పాడైపోతుందే?"

"ఫిర్యాదు చేయటానికి మన దగ్గర ఏముంది?"

"కమలని మాట్లాడిద్దాం" 

“అది సరిపోదు! ఆ తరువాత ఆమెను ప్రాణాలతో ఉంచరు. వీడియో మన దగ్గర ఉండుంటే, ఎంత పలుకుబడి ఉన్నా చెల్లుబాటుకాదు. ఇప్పుడు మనకు ఏ చాన్సూ లేదు. వదిలేయ్. ఆ కుటుంబానికే మనం పగవాళ్ళం అయిపోతాం"

అక్కా తమ్ముడ్లు కొన్ని గంటలు చరించుకున్నారు. అలాగే నిద్రపోయారు.

తెల్లవారుజామున మూడు గంటలకు ప్రియంవదను ఎవరొ ముట్టున్నారు. గబుక్కున లేచి కూర్చింది. పక్కన దీపిక.

"ఏంటక్కా...తెల్లారిందా?"

"నాతో పాటు రా. గౌతం ని పిలు"

ముగ్గురూ కల్యాణ మండపం లోని నాలుగవ అంతస్తు కు వెళ్ళారు. అది టెర్రస్. ఓపన్ ఏరియా.... అక్కడ చక్రవర్తి నిలబడున్నాడు.

ప్రియ, గౌతం లకు షాక్!

"అక్కా...ఏమిటిది?"

"మీ ఇద్దరి దగ్గర నిజం చెప్పటానికే ఇక్కడికి పిలుచుకువచ్చాము"

"ఏమిటా నిజం?"

"కాంచనని గొంతు పిసికి ఈయన చంపటం నువ్వు వీడియో తీశావని నాకు తెలుసు"

"అక్కయ్యా....!"..అదిరిపడ్డది.

"ఇంటికి వచ్చి కెమేరాను బీరువలో పెట్టిన దగ్గర నుంచి నీమొఖం బాగలేదు. ఏదో జరిగింది...నువ్వు నిద్ర పోతున్నప్పుడు అది తీసి ఆ వీడియోను చూశాను. షాక్ కు గురి అయ్యాను. ప్రియా!"

"అక్కా...నువ్వేమి  చెబుతున్నావ్?"  

“మరుసటిరోజు ప్రొద్దున గుడికి వెళ్ళొస్తానని చెప్పి ఆరు గంటలకే బయటకు వెళ్ళిపోయాను. ఫోన్ చేసి ఈయన్ను రమ్మన్నాను. గుడిలోనే ఈయనకు వీడియోను చూపించాను"

ప్రియంవద, గౌతం బెదిరిపోయి చక్రవర్తిని చూశారు.

"ఇప్పుడు నేను చెబుతా దీపిక.....చెప్పటానికే సిగ్గుగా ఉన్నది ప్రియా. ఈ కాంచనకి ఎక్కువ డబ్బు ఎరగావేసి  వసపరుచుకుని తన వ్యాపారానికి కాయగా ఉపయోగించుకున్నాడు ఒక కోటీశ్వరడు. తన వ్యాపారాన్ని పెంచుకోవటానికి ఒకళ్ళిద్దరికి ఈ కాయను కానుకగా పంపించారు. ఆమె కూడా డబ్బుకోసం వెళ్ళిపోయింది. అందులో గర్భవతి అయ్యింది. తన గర్భానికి ఎవరు కారణం అనేది తెలుసుకోలేకపోయింది. కానీ, దానిని సాకుగా పెట్టుకుని ఆ కోటీశ్వరున్ని డబ్బుకోసం బెదిరించింది.  ఆ కోటీశ్వరడు ఆ అమ్మాయిని వదిలించుకోవాలని ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తానన్నాడు. ఆ డబ్బు చాలదని, తనకు పది కోట్లు ఇవ్వాలని, ఇవ్వకపోతే తన గర్భానికి కారణం మీరే నని అందరికీ చెప్పటమే కాకుండా కోర్టుకు వెల్తానని బెదిరించింది. ఈ విషయంలో ఆ అమ్మాయికి కొందరు సహాయపడ్డారు. ఆ కాంచన మంచిది కాదు. ఆమెను ఉపయోగించుకుని డబ్బు సంపాదించుకోవాలనుకున్న ఆ కోటీశ్వరడు ఆమె దగ్గర చిక్కుకున్నాడు. ఆధారాలను పెట్టుకుని పది కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది. ఆమె దగ్గర చిక్కుకున్న ఆ కోటీశ్వరడు మా నాన్నే"  

"అరె భగవంతుడా"

“దాచలేనని తెలుసుకున్నప్పుడు విషయాన్ని నా దగ్గర చెప్పేశారు. ఏడ్చారు. డబ్బు మీద ఆశతో నేను చేసిన తప్పుకు ...మన కుటుంబమే బలికాబోతొందని చెప్పి ఆత్మహత్య చేసుకోబోయారు...ఆయన్ని ఆపి కాంచనతో మాట్లాడి ఆమెకు ఒక పెద్ద అమౌంట్ ఇచ్చి సెటిల్ చేద్దాం. ఇవన్నీ నేను చూసుకుంటాను మీరు ప్రశాంతంగా ఉండడి అని నాన్నకు చెప్పాను"

"తరువాత"

స్నేహితుడు  సుభాష్ ని మధ్యవర్తిగా పెట్టుకుని కాంచనతో మాట్లాడాను. రెండు కోట్లు ఇస్తానని చెప్పాను. ఆమె ఒప్పుకోలేదు. చివరికి ఆరుకోట్లకు ఒప్పుకుంది"

"తండ్రి చేసింది తప్పే. కానీ తండ్రిని కాపాడవలసిన బాధ్యత కొడుకుగా నాకున్నది. తన దగ్గరున్న అన్ని అధారాలనూ తీసుకుని మా బిల్డింగుకు రమ్మని ఆయన చేతే కాంచనకు ఫోన్ చేయించాను. ఆరు కోట్ల రూపాయలు  తీసుకుని నేనూ నా స్నేహితుడు సుభాష్ ఇద్దరం మా బిల్డింగుకు వెళ్ళాము.  కాంచన మా బిల్డింగుకు వచ్చింది.  సెక్యూరిటీ టీ తాగడానికి వెళ్ళినప్పుడు నేను, నా స్నేహితుడు ఆమెను తీసుకుని టెర్రస్సుకు వెళ్ళాము. ఒక పెట్టె నిండుగా డబ్బును ఆమెకు చూపించి, ఆమె దగ్గరున్న అన్ని అధారాలను ఇమ్మన్నాను"  

"తరువాత...?"

                                                                                    Continued...PART-12(LAST)

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి