ప్రేమ వ్యవహారం!...(సీరియల్) PART-3
“మథులతనే
తిన్నగా వచ్చి మాధవి దగ్గర మాట్లాడితే...అప్పుడు విశ్వం రంగు వెలిసి పోతుంది కదా?”
“ఖచ్చితంగా!
నీ దగ్గర మథులత ‘ఫోన్
నెంబర్’ ఉందా?”
“లేదే!
ఎక్కడో నోట్ చేసి పెట్టుకున్నాను...ఎక్కడ అనేది గుర్తుకు రావటం లేదు. నా ఫోనులో
లేదు. ఎందుకంటే ఆ తరువాత నేను రెండు ఫోనులు మార్చాను”
“అలాగైతే
మథులతని ఎలా కనుక్కునేది?”
“పాత
హాస్టల్ కు వెళ్ళి విచారిస్తాను”
“మథులత
ఇప్పుడూ అక్కడే ఉంటుందని నమ్ముతున్నావా?”
“ఆమె
లేకపోయినా ఆమె ఇంటి అడ్రస్సు ఉంటుంది కదా? ఒక వేల ఆమె ఇంకా అదే హాస్టల్లొ ఉండచ్చు కదా”
“ఊహూ...దానికి
ఛాన్స్ తక్కువ. ఈ ఊర్లో ఏ అమ్మాయి ఒకే హాస్టల్లో పలు సంవత్సరాలు ఉండగలదు?”
“ఒక
ప్రయత్నం చేసి చూద్దాం! నా మీద మాధవికి ఎంత కోపం ఉన్నా కానీ, ఇది నేను చేసే తీరాలి. తెలిసి, తెలిసి ఒక అమాయకురాలి జీవితం పాడవుతోందంటే
చూస్తూ ఎలా వూరుకోను. అది న్యాయం కూడా కాదు. నిజం తెలిసిన తరువాత ఆమే నన్ను అర్ధం
చేసుకుంటుంది”
“సరే, ప్రయత్నం చేసి చూడు. బెస్ట్ ఆఫ్ లక్” అని రేఖా భుజాల మీద తట్టి బయలుదేరబోయింది కుసుమ.
“ఆగవే...కొంచం
ఆలొచిద్దాం”
“నాకు
కొంచం బయట పని ఉందే. అర్జెంటుగా వెళ్ళాలి. వస్తాను”
కుసుమ
వెళ్ళిన తరువాత... రేఖా ఆలొచనలతో తన రూముకు వెళ్ళినప్పుడు, అక్కడ మాధవి తన సూట్ కేసులో బట్టలు సర్దు కుంటోంది.
మొహంలో అదే చిటపట.
“ఏమైంది...రూము
మారబోతావా?”
“లేదు...హాస్టలే
మారుస్తున్నాను. పక్కింట్లో ఏమి జరుగుతోందో కిటికీలో నుండి తొంగి చూసే నాగరీకం
లేనివాళ్లతో నేను ఉండలేను”
స్పీడుగా సూట్ కేసు మూత వేసి మూసింది.
************************
ఇన్ని
సంవత్సరాలైనా ఆ హాస్టల్ కొంచం కూడా మార లేదు. అలాగే ఉన్నది. తుప్పు పట్టిన అదే ‘నేమ్ బోర్డ్’. వాకిలి గుమ్మం మీద ఉన్న మసి కూడా మారలేదు అని అనిపించింది రేఖాకు.
వాకిలి
దగ్గరున్న 'వాచ్
మ్యాన్’ ఈమెను స్నేహంగా చూసి, “హాస్టల్లో చేరటానికి వచ్చారా?” అని అడిగాడు.
“లేదు...” అని చెప్పటానికి వచ్చిన రేఖా గబుక్కున అది
మార్చి “అవునండి” అన్నది.
సకల
మర్యాదలతో ఆమెను లోపలకు తీసుకు వెళ్ళాడు. అలవాటైన ఆఫీసు గది వైపుకు నడుస్తున్న రేఖాకు
ఒక సందేహం. ‘ఇప్పుడు
కూడా అదే వార్డనే ఉంటుందా? ఒక వేల ఇంకెవరైనా ఉంటే ఏం చెప్పాలి?...ఎలా అడగాలి?’
మంచి
కాలం. వార్డన్ మారలేదు. రేఖాను చూసిన వెంటనే లేచి నిలబడి “రామ్మా” అని స్వాగతించింది.
“నమస్తే
మ్యాడం...”
“కూర్చో...ఏం
కావాలి?”
“నేను
జ్ఞాపకం లేనా?” అంటూ
నవ్వింది రేఖా.
“జ్ఞాపకం
లేవే...”
“కొద్ది
రోజుల ముందు వరకు ఈ హాస్టల్లోనే ఉండేదాన్ని. నా పేరు రేఖా”
మొహం
ముడుచుకుని కళ్లజోడు సరిచేసుకుని ఆమెను చూసింది. “అరె...అవును! రేఖా...క్షమించమ్మాయ్...గబుక్కున
జ్ఞాపకం రాలేదు. కూర్చో రేఖా. బాగున్నావా?”
“బాగున్నా”
“ఇప్పుడు
ఎక్కడుంటున్నావు? ఎక్కడ పని? పెళ్ళి అయ్యిందా? ఎంతమంది పిల్లలు? అమ్మా-నాన్నలు బాగున్నారా?” అని ఆమె గబగబా మాట్లాడగా రేఖా నవ్వింది.
“మీరు
మారనే లేదండి! కొంచం నిదానంగా మాట్లాడుకుందాం. ఎందుకంత తొందర?”
“అదీ
నిజమే” అంటూ ఆమె ఒక గంట కొట్టింది...వెనుక రూము నుండి
ఒక కుర్రాడు తొంగి చూసాడు. “రెండు కాఫీలు” అన్నది వాడి దగ్గర.....కొద్ది నిమిషాలలో కాఫీ
వచ్చింది.....అది తాగుతూ ఇద్దరూ పాత కథలు చెప్పుకున్నారు.
“మీకు మథులత
జ్ఞాపకం ఉందా?”
“ఎందుకు
లేదు...నీకు బాగా సన్నిహిత స్నేహితురాలుగా ఉండేదే! ఆమె ఎలా ఉంది?”
రేఖా
కొంచం నిరాశపడింది. “నన్ను
అడుగుతున్నారేమిటి...ఆమె ఇప్పుడు ఇక్కడ లేదా?” అన్నది.
“నువ్వెళ్ళిన
కొన్ని రోజులకే ఆమె వెళ్ళిపోయింది”
“........................”
“అంటే
ఎక్కడుందో నీకు తెలియదా?”
“ఆమెను
వెతుక్కుంటునే వచ్చాను!”
“అలాగా...ఏమిటి
విషయం?”
“మా
ఆఫీసులో ఒక మంచి ఉద్యోగం ఖాలీగా ఉంది. దానికి తగ్గ మనిషిగా మథులత ఉంటుందని నా
నమ్మకం. వెతికి పట్టుకుని స్నేహాన్ని పునరుద్ధరించు కుందామని అనుకున్నాను”
“మంచి
విషయమే! కానీ, ఆమెను
ఎలా కనుక్కోబోతావు?”
“ఆమె
పాత వివరాలు ఇవ్వండి. ప్రయత్నిస్తాను” అన్నది రేఖా.
“ఖచ్చితంగా
ఇస్తాను” అంటూ పక్కనున్న చెక్క అలమరాను తెరిచింది.
అందులో ఉన్న ఫైల్లల్లో నుండి వెతికి ఒక ఫైలును తీసింది.
కొద్ది
నిమిషాలు ఆ ఫైలును వెతికిన తరువాత మథులత యొక్క పేరు, అడ్రస్సు కనబడింది.
“ఆమె
గ్రామం అడ్రస్సు, ఫోన్ నెంబరు కూడా ఉంది”
“ఇవ్వండి.
అది చాలా వరకు మారుండే అవకాశమే లేదు!”
ఒక
చిన్న పేపర్ ముక్కపై మథులత హైదరబాద్ ఫోన్ నెంబర్, సొంత ఊరి అడ్రస్స్ -- ఇంటి ఫోన్ నెంబరూ రాసి
ఇచ్చింది. ఆమెకు థ్యాంక్స్ చెప్పి బయలుదేరింది రేఖా.
“నీకు
తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇటువైపు హాస్టల్ కోసం వెతుకుతుంటే మన హాస్టల్ ను రెకమండ్
చెయ్యి రేఖా. మరిచిపోకు”
అన్నది వార్డన్.
“ఖచ్చితంగా!
నేను బయలుదేరుతాను”
వార్డన్ దగ్గర సెలవుతీసుకుని బయటకు వచ్చింది.
బస్సు
స్టాపింగుకు వచ్చి, అక్కడ నిలబడి మథులత మొబైల్ నెంబర్ కు ఫోను చేసింది.
‘ఈ
నెంబర్ ఉపయోగంలో లేదు’ అని
సమాధానం వచ్చింది.
తరువాత
గ్రామం ఇంటి నెంబర్ కు ఫోన్ చేసింది.
“హలో...మాధవ్
డిపార్ట్ మెంట్ స్టోర్స్!”
రేఖా
ఆశ్చర్యపోతూ, “అక్కడ
మథులత అని...”
“మథులతనా? అలాంటి పేరుగల వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరే!”
నీరసించిపోయింది.
‘చేతిలో
ఉన్న రెండు నెంబర్లూ తప్పు. ఇక ఇంతపెద్ద హైదరాబాద్ నగరంలో ఎక్కడని వెతకను?’
'ఆమె
ఇప్పుడు ఇక్కడ ఉంటుందనేది కూడా ఖచ్చితం కాదు. ఉద్యోగం కోసం వేరే ఊరికి వెళ్ళి
ఉండొచ్చు. పెళ్ళి చేసుకోనుండొచ్చు. బయటి దేశాలకు వెళ్ళుండచ్చు’
‘మథులత
లేకుండా మాధవి దగ్గర ఏదీ నిరూపించలేము. ఏం చేయాలి? కుందేలు బొమ్మ మోసపోతే పోనీ అనుకుని
వదిలేయటమేనా?’
అలా
ఆలొచిస్తున్నప్పుడు రేఖాకు నిరుశ్చాహాంగా ఉంది.
‘ఆమె
ఎంత కోపం చూపించినా, అందులో ఒక న్యాయం ఉంది. ప్రేమ విషయంలో కలుగచేసుకుంటే
ఎవరికైనా కోపం వస్తుంది. 'నువ్వు
వాడ్ని ప్రేమిస్తున్నావా?' అని అడిగినందుకే కోపగించుకుంది. అలాంటిది 'నీ ప్రేమికుడు ఒక స్త్రీ లోలుడు’ అని చెబితే ఏం చేస్తుందో?’
‘ఒకవేల
నాకే సక్రమంగా మాట్లాడటం చేతకాలేదా? కొంచం నిదానంగా చెప్పుంటే ఆమె వినేదేమో?’
తరువాత
వచ్చిన బస్సులో ఎక్కింది రేఖా గందరగోళంతో ...సీటులోకి వెళ్ళి కూర్చుంది. ‘మథులతకీ, నాకూ ఎవరైనా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారా...వాళ్ళ దగ్గర ఆమె
యొక్క కొత్త ఫోన్ నెంబర్ అడుగుదామా?’ అని ఆలోచించటం మొదలుపెట్టింది.
కొద్ది
నిమిషాల తరువాత ఆమెకు ఒక ఫోను వచ్చింది. ఆలొచిస్తూనే ఫోన్ తీసింది.
“హలో!”
“మేము
మాధవ్ డిపార్ట్ మెంట్ స్టోర్స్ నుండి మాట్లాడుతున్నాము. కొద్దిసేపటి క్రితం మీరు
ఫోన్ చేశేరే?”
“అవునండి!
అలాంటి పేరుతో ఎవరూ లేరని చెపారే!”
“ఇక్కడ
మథులత అని ఎవరూ పనిచేయటం లేదండి. అందువలనే అలా చెప్పాము. తరువాత జ్ఞాపకం వచ్చింది.
ఇక్కడే పక్కింట్లో మథులత అని ఒక అమ్మాయి ఉంది. ఇప్పుడు హైదరాబాదులో ఉంటోంది. అంతకు
ముందు వాళ్ళింట్లో ఫోను లేకపోవటం వలన ఈ నెంబర్ను తెలిసిన వాళ్ళకు ఇచ్చారు”
“అదే మథులత
యేనండి...” సంతోషంలో
మాటలు తడబడ్డాయి.
“........................”
“వాళ్ళింటి
ఫోన్ నెంబర్ దొరుకుతుందా?”
ఆమె
ప్రశ్నను వినకుండా అవతల సైడు అతను మాట్లాడుతూనే ఉన్నాడు.
“మీరు మథులత
స్నేహితురాలా?”
“అవునండి!
కొంచం అర్జెంటుగా మాట్లాడాలి. ఆమె నెంబర్ ఇస్తారా?”
“ఆ
అమ్మాయి ఇప్పుడు హైదరబాదులో లేదు. లీవు పెట్టి ఊరికి వచ్చింది. రేపు ఆ అమ్మాయిని
చూసుకోవటానికి పెళ్ళివారు వస్తున్నారు. వాళ్ళు ఏం హడావిడిలో ఉన్నారో ఏమో...మీ
నెంబరు, పేరు ఇవ్వండి మేము వాళ్ళింట్లో ఇచ్చి మీతో
మాట్లాడమని చెబుతాము"
Continued...PART-4
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి