3, ఫిబ్రవరి 2022, గురువారం

దాగుడు మూతలు...(సరికొత్త పూర్తి నవల)

 

                                                                                    దాగుడు మూతలు                                                                                                                                                                          (పూర్తి నవల)

జీవితమే ఒక దాగుడుమూతల ఆట. 'ప్రేమ' కూడా ఆ ఆటలో ఒక భాగమే.

జీవితం యొక్క మొదటి దశ అయిన బాల్య ప్రాయములో మనం దాగుడుమూతల ఆట ఆడుంటాము… జీవితం యొక్క తరువాతి దశలలో, జీవితం మనతో పలు దాగుడుమూతలాట ఆడుతుంది. జీవితం మనతో ఆడుతున్న దాగుడుమూతలాట మనకు ఇష్టమున్నా లేకున్నాఆడుతూ పాడుతూ జీవించాల్సిందే…మనము ఆ ఆటలోని భాగమే.

విద్యార్థి దశలో, ఒక వ్యక్తి కోరిన చోట చదవలేకపోవడం, కోరిన వస్తువులను పొందలేకపోవడం, చెయ్యాలనుకున్న ఉద్యోగం చేయలేకపోవడం… జీవితం మనతో ఆడుతున్న దాగుడుమూత.

యవ్వనంలో వున్న వారు కోరిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే తరుణము.. ఒక దాగుడుముత ఆటే .

మధ్య వయస్కుడు తాను ఊహించిన  శైలిలో బ్రతకలేక పోవడం .. జీవితం మనతో ఆడే దాగుడుమూతే.

వయసు మల్లిన కాలములో, తన తరువాతి తరం వారికి అన్ని సమకూర్చాక…వారి మధ్య వుంటూ…మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ గడపగలగడం కూడా…జీవితం మనతో ఆడుకునే దాగుడుముత ఆటలోని భాగమే.

జీవితంలో దాగుడుమూతలు లేకుండా, అన్ని ఒక పద్దతిగా, ఏదో శాసనములో తెలిపిన విధముగా సాగితే, జీవితం నీరుగారి అంతే నిరుత్సాహంగా తయారవుతుంది. జీవితం మనతొ ఆడే ఈ ఆటను ద్వేషించక, ఆటలోని మెలుకువలు మరియు కిటుకులు తెలుసుకొని, పూర్వ అనుభావాల పాఠాలు గుర్తుంచుకొని, పెద్దలు చెప్పే అనుభావాలను చక్కగా అమలుపరిచి ఆడితే.. గెలుపు మనదే.

'ప్రేమ 'కూడా జీవితంలో ఒక భాగమే. కానీ 'ప్రేమ' మాత్రం జీవితం అడే దాగుడుమూతల ఆటను జయించి, కావలసిన వారిని చేరుకుంటుంది...ఏలా? ఈ పూర్తి నవలను చదివితే మీరే ఆశ్చర్యపోతారు.

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి: 

దాగుడు మూతలు...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2

ఈ నవలను డౌన్ లోడ్ చేసుకుని చదవాలనుకుంటే ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

https://drive.google.com/file/d/1_bWh5XRaGPYHiH82NAWSF52HKu1t9nuY/view?usp=sharing

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి