దృశ్యం...(సీరియల్) PART-8
ప్రియంవద లోపలకు వెళ్ళి ఒక చల్లటి పానీయం తీసుకుని వెనక్కు తిరిగింది, కమల దగ్గరగా వచ్చింది.
“మేడం...ఒక్క నిమిషం”
“నన్నా? ఏం కావాలి?”
“మీతో నేను కొంచం మాట్లాడాలి”
“దేనికి?”
“మీరు పెళ్ళికూతురు కు స్నేహితులా?”
“లేదు...చెల్లిని!”
“అయితే ఖచ్చితంగా మీతోనే మాట్లాడాలి”
“ఏం మాట్లాడాలి?”
“ప్లీజ్...కొంచం పక్కకు రండి చెబుతాను!”
“ఉండండి...పెళ్ళి కొడుక్కు ఈ కూల్ డ్రింక్ ఇచ్చేసి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి”
కమల ఆ రూములో ఒక పక్కగా నిలబడింది.
ప్రియంవద వేదిక పైకి వెళ్ళి చక్రవర్తికి ఆ కూల్ డ్రింక్ ఇచ్చింది, అతని చూపులు ఎక్కడో ఉన్నాయి.
జనం ఎక్కువయ్యారు.
ప్రియంవద కమల ఉన్న చోటుకు వచ్చింది.
ప్రియంవదను పిలుచుకుని కమల కల్యాణ మండం బయటి గేటుదాకా వచ్చింది.
"ఏం కావాలి? చెప్పండి...ఎక్కడికి తీసుకువెడుతున్నారు నన్ను"
టక్కున ప్రియంవద చేయి వదిలి "సరేనండి! నాకు తెలిసిన ఒక నిజాన్ని నేను చెప్పే తీరాలి. పోలీసులకు చెబితే నా భవిష్యత్తు దెబ్బతింటుంది. మీడియా కళ్ళు నా మీద పడటం నాకు ఇష్టంలేదు"
"అర్ధంకాలేదే...!"
"ఈ మధ్య హత్య చేయబడ్డ కాంచన, నా రూం మేట్, నాతో పాటు వస్త్ర దుఖాణంలో పనిచేసేది...."..
ప్రియంవద ముఖంలో మార్పు!
“కాంచన అమ్మ, తమ్ముడు ఇద్దరూ కాంచన చావుతో గిలగిలా కొట్టుకుంటున్నారు. వాళ్ళిప్పుడు నాతోనే ఉన్నారు. పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ పెళ్ళి కొడుకు యొక్క బిల్డింగులోనే కాంచన హత్య చేయబడింది"
"పత్రికలలో వచ్చింది...చదివాను!"
"దాన్ని దాటి ఇంకొక నిజం...నేను చూసింది చెప్పాలి"
"భగవంతుడా...ఈమె కూడా చూసిందా? ఏం చూసింది?"
"చెప్పండి"
"పెళ్ళి కొడుకు ఈరోజు వూరేగింపుగా ఒక విదేశి కారులో వచ్చారే! అదే కారులో ఒక రోజు కాంచన వచ్చి దిగింది. సంధు చివర్లో దిగటం నేనే చూశాను" అంటూ తారీఖూ, టైము, వివరాలు కమల చెబుతుంటే ప్రియంవద నిశ్చేష్టురాలైంది.
"సరే"
"కాంచన హత్య చేయబడింది. పోస్ట్ మార్టం రిపోర్టులో ఆమె గర్భవతి అని చెప్పబడింది. ఆరేడు నెలలుగా ఆమెకు ఒక డబ్బుగలవాడితో సాన్నిహిత్యం ఏర్పడింది. నేను ఖండించినప్పుడు నాతో మాట్లాడటం మానేసింది. అదే కారు...వాళ్ళ సొంత బిల్డింగు...కాంచన గర్భవతి...హత్య....అన్నిటినీ జత చేస్తే, నాకు ఒకే ఒక సమాధనమే సుడిగుండంలా వస్తోంది"
"ఏమిటది" ప్రియంవద మాటల్లో వొణుకు.
“మీ అక్కయ్యను బలి ఇవ్వకండి. ఇంకా మెడకి తాళి ఎక్కలేదు. ఇంతకంటే చెప్పటం నా వల్ల అవటంలేదు. దీంట్లో నాకు ఎటువంటి సంబంధం లేదు. మీ అక్కయ్య కూడా ఒక అమ్మాయి. ఆమెను కాపాడటానికే నేను వచ్చాను. నన్ను ఈ గొడవలోకి దించకండి. నేను వస్తాను"
కమల, వేగంగా బయటకు వెళ్ళే దారి వైపు వెళ్ళింది.
ప్రియంవద షాక్ అయ్యి అలాగే నిలబడిపోయింది.
"కాంచన హత్యకు ఒకవేల ఇతనే కారణం అయ్యుంటాడనే అనుమానం మాత్రమే నీదగ్గరున్నది.. కానీ నా దగ్గర ఇతనే హంతకుడు అనే ఆధారమే ఉన్నది"........ప్రియ వెనక్కు తిరిగింది.
ఆమె మనసు ఆమెను వేధిస్తోంది.
"ఎవత్తో ఒకత్తి...ఇంకొక అమ్మాయి జీవితం పాడైపోకూడదని ఇంటరెస్టు చూపిస్తూ పనికట్టుకుని ఇక్కడిదాకా వచ్చి నీతో మాట్లాడి వెడుతోంది. నువ్వు సొంత చెల్లెలువి. ఆ ఇంటరెస్టు కూడా చూపించకపొతే ఎలా?"
ప్రియంవద మనసు ఆమెను ప్రశ్నించింది.
లోపలకు వచ్చింది.
సమయం తొమ్మిది అవుతోంది... జనం కొంచం కూడా తగ్గలేదు.
ఇప్పుడేమీ మాట్లాడొద్దు.
రేపు ప్రొద్దున 9 గంటలకే కదా ముహూర్తం?....దానిలోపు పెళ్ళి ఆపేద్దాం.
ఆవమానమే...కొన్ని లక్షలు నష్టమే!
అయినాగానీ, అక్కయ్యను పెద్ద ప్రమాదం నుండి రక్షించించాలి కదా.
ఈ షాక్ ను డాడీ తట్టుకోగలరా?
తట్టుకునితీరాలి. అల్లుడు ఒక హంతకుడు అనే నిజం బయటపడే ముందు ఏర్పడే షాక్ కంటే ఇది ఎంతో నయం.
ఎలా బయట పెట్టలి? ఎవరిదగ్గర బయటపెట్టాలి?
గందరగోళంతో వస్తుంటే...ముందు వరుసలో కూర్చోనున్న పోలీస్ కమీషనర్ ను,సాంబశివరావ్ గారు చేయి పుచ్చుకుని గౌరవంగా వేదిక పైకి తీసుకు వెళుతున్నారు. పోలీస్ కమీషనర్ కొత్త పెళ్ళికొడుకు దగ్గరగా వెళ్ళి తన గిఫ్టును ఇచ్చి, షేక్ హ్యాండ్ ఇస్తుంటే, చక్రవర్తి నవ్వాడు.
పోలీస్ కమీషనర్ జరిగి వెళ్ళిన తరువాత చక్రవర్తి తండ్రిని పిలిచాడు.
“సాధారణ వరుసలో...పిల్లర్ పక్కన ‘టీ షర్ట్- జీన్స్’ వేసుకుని ఒక గడ్డపతను నా దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను నా దగ్గరకు రాకుడదు. అతన్ని ఎలాగైనా తప్పించండి..."
"ఎలారా?"
"ఏదైనా చేయండి"
"కమీషనర్ తో చెప్పనా?"
"అది చాలా ప్రమాదం. వాడు పోలీసులకు చిక్క కూడదు. ఇంకేదైనా చేయండి"
"సరే...!" అని చెప్పి సాంబశివరావ్
గారు అక్కడ్నుంచి బయటకు వచ్చాడు. ఎవరికో ఫోన్ చేశాడు.
"వెంటనే వచ్చి నన్ను కలవండి" అర్జెంటుగా పిలిచాడు.
కొన్ని క్షణాలలో ఇద్దరు మనుషులు ఆయన దగ్గరకు వచ్చారు.
నాజూకుగా మనిషిని చూపించాడు.
"లేపేయండి!"
ఆలోపు ఆ గడ్డపతను వేదికకు దగ్గరగా నడుస్తున్నాడు.
ఒకతను అతని దగ్గరకు వెళ్ళి "కొంచం బయటకు రండి...ముఖ్యమైన విషయం మాట్లాడాలి"
"మీరెవరు? నాతో ఎందుకు మాట్లాడాలి?"
"ప్లీజ్ రండి....చాలా ముఖ్యం"
అతను క్యూ వదిలి బయటకు రావటం...అతన్ని పక్క గుమ్మం నుండి మెట్లమీదగా కల్యాణ మండపం వెనుకకు తీసుకు వెళ్ళారు.
"ఆ హత్య గురించిన ఒక క్లూ దొరికింది"
"అది పోలీసులకు చెప్పండి. నా దగ్గర ఎందుకు?"
"మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నదే పోలీసులు"
"పోలీసులా?"
మాట్లాడుతూ వస్తున్న అతన్ని ఒకతను గట్టిగా పుచ్చుకున్నాడు. ఇంకొకడు బలవంతంగా చేతిరుమాలతో అతని ముక్కును అదిమి గట్టిగా నొక్కాడు...గడ్డపు వాడు పక్కకు వొరిగాడు. వాడిని ఒక కారులోకి దూర్చారు. కారు వేగంగా బయలుదేరింది.
ఎవరినో సాగనంపి తిరిగి వస్తున్న గౌతం గడ్డపతన్ని బలవంతంగా కారులోకి తోయటం చూశాడు.
అధిరిపడ్డాడు.
"ఏం జరుగుతోంది ఇక్కడ?"
......లోపలకు వచ్చాడు. వేదికను సమీపిస్తుండగా...ప్రియంవద ఎదురు వచ్చింది.
" గౌతం నాతో రా"
"ఏమిటి?"
"మాట్లాడకుండా రా..."
తమ్ముడి చేయి పుచ్చుకుని లాక్కుంటూ ఒక గదిలోకి వచ్చింది. తలుపులు వేసింది.
"ఏమిటే సమస్య?"
“చాలా ఆశ్చర్యం గొలిపే సంగతే. ఇక దాచిపెట్టటం నావల్ల కాదురా"....ఓర్చుకోలేక ఏడ్చేసింది.
"ఏంటక్కా విషయం? నువ్వెందుకు ఏడుస్తున్నావు?"
తను చూసింది... వీడియో తీసింది...కమల చెప్పింది ఒక్కటి కూడా వదలకుండా గబగబ చెప్పింది ప్రియంవద. అంతే తమ్ముడు గౌతం అలాగే నేలపై కూర్చుండిపోయాడు.
"ఏంటక్కా ఇది?"....గౌతం మాటల్లో వణుకు.
"నావల్ల ఈ నిజాన్ని ఇక దాచిపెట్టలేను. నా గుండె పగిలిపోయేటట్టు ఉన్నది. మనకి అన్ని నిజాలు తెలిసుండి అక్క జీవితం నాశనం అవచ్చా?.
"అవకూడదక్కా! ఒక గడ్డపతను, పెళ్ళికి వచ్చాడు. నువ్వు చూశావా? "
“అవును...ఆ కమల పక్కన కూర్చోనున్నాడు….అతన్ని చూసి పెళ్ళి కొడుకు షాక్ అయ్యాడు. ఇప్పుడు అతని గురించి మనకెందుకు?”
“కొద్దిసేపటి క్రితం ఆ గడ్డపతన్ని ఇద్దరు మనుషులు స్ప్రుహ కోల్పోయిన పరిస్థితిలో, కార్లోకి ఎక్కించటం చూశాను”
“అతనేదో నిజం చెప్పటానికే వచ్చుంటాడు.. అందుకనే అతన్ని లేపేసినట్లున్నారు.”
"ఎవరు?"
"పెళ్ళికొడుకు తండ్రి అయ్యుండొచ్చు!”
“అలాగైతే కొడుకు చేసిన హత్య ఆయనకు తెలుసా?"
"ఖచ్చితంగా తెలిసుంటుంది గౌతం. వాళ్ళ బిల్డింగులోనే కదా హత్య చేయబడ్డది. ఆయనకు తెలియకుండా ఉంటుందా? వస్త్ర దుఖాణంలో పని చేస్తున్న కాంచనతో స్నేహం చేసి, అతని వలన ఆమె గర్భవతి అయ్యింది...పెళ్ళి చేసుకోమని అడిగుంటుంది. వీళ్ళు డబ్బుతో బేరం మాట్లాడుంటారు. వొప్పుకోనుండదు. చంపేసుంటారు”
"వాళ్ళ బిల్డింగులోనా?"
"వాళ్ళకు అదే రక్షణ. బాగా తెలిసున్న చోటు. సెక్యూరిటీ ఎప్పుడు టీ తాగడానికి వెల్తాడో దాక్కుని వేచి చూసి కాంచనను అప్పుడు పైకి తీసుకెళ్ళుంటాడు."
"మనం ఎలా అక్కా వీళ్ళ దగ్గర చిక్కుకున్నాం?”
"విధిరా! విధి….దీని ప్రభావం చాలా భయంకరంగా ఉంటుంది. అయినా కానీ మనం అక్కయ్యను కాపాడేతీరాలి. మనం నిజం చెప్పే తీరాల్సిన సమయం వచ్చేసింది. "
"ఎప్పుడు? ఎక్కడ?ఎలా?"
"మొదట అక్కయ్యతో, నాన్నతో, అమ్మతో ఈ రోజు రాత్రికే చెప్పాలి. కెమేరాలో ఉన్న వీడియోని నా లాప్ టాప్ కి మార్చి, ఇక్కడికి తీసుకురావాలి. ఆ వీడియోని ఇక్కడున్నవాళ్ళకు వేసి చూపించాలలి”.
“సరే”
"నువ్వూ,నేనూ ఇంకాసేపట్లో మనింటికి వెడదాం"
Continued...PART-9
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి