దృశ్యం...(సీరియల్) PART-12
"ఆమె వేనక్కి
తిరిగి వెడుతున్నప్పుడు నా స్నేహితుడు హఠాత్తుగా కాంచనను పట్టుకుని గొంతుపిసికి
చంపబోయేడు. నా బలమంతా ఉపయోగించి వాడిని పక్కకు లాగాను. "రేయ్ చక్రవర్తీ ఒక
మంచి అమ్మాయినో, ఒక
మంచి మినిషినో నేను చంపటానికి ప్రయత్నించలేదు. ఒక చెడ్డ మనిషిని,
డబ్బుకు ఆశపడే ఆడపిల్ల నే నేను చంపాలనుకున్నది. ఇది గనుక
ప్రాణాలతో ఉంటే ఈ డబ్బుతో సరిపెట్టుకుంటుంది అనుకుంటున్నావా?
మళ్ళీ, మళ్ళీ మీ నాన్నను మానసికంగా కష్టపెడుతుంది.మీ నాన్న చేసింది
నేరమే. కానీ, నిన్ను,నన్నూ పెంచి, పెద్ద చేసి చదువులు చెప్పించి మనల్ని ఈ స్థితికి
తీసుకువచ్చిన మీ నాన్నను కాపాడటానికి నాకు వేరి దారి లేదు. నన్ను వదులు అంటూ నన్ను
ఒక్క తోపుతోసి మళ్ళీ కాంచన గొంతు పట్టుకుని నొక్కాడు. వాడ్ని విడిపించటానికి నాకు
పది నిమిషాలు పట్టింది. అప్పటి వరకు బాగానే ఉన్న కాంచన ఒక్కసారిగా గోడకు
ఒరిగిపోయింది. అప్పుడు నేను ఆమెను నా చేతులతొ పట్టుకుని గొంతుకకు మసాజ్ చేశాను.
లాభం లేకపోయింది. ఆమె చనిపోయింది. నేను కాంచన గొంతుకను మసాజ్ చేస్తున్నప్పుడే
నువ్వు వీడియో తీశావు"
దీపిక మాట్లాడింది.
"ఒక హత్యను
అంగీకరించ లేక పోయాను. కానీ ఈయన చంపలేదు. ఈయన స్నేహితుడు చంపాడు. తన తండ్రి చనిపోకూడదని,
తన కుటుంబ గౌరవాన్ని మంటగలపకూడదని ఈయన ప్రయత్నించారు. అది
నాకు తప్పు అనిపించలేదు. అలాంటి మనిషిని పట్టించే అధారం ఉండకూడదని అప్పుడే,
ఆయనకు ముందే ఆ వీడియోను డిలేట్ చేశాను. ఆయన్నూ,
ఆయన మనొభావాలనూ పూర్తిగా
అర్ధం చేసుకున్న కారణం చేత , ఆయన్ని పెళ్ళి చేసుకోవటానికి మనస్పూర్తిగా
అంగీకరించాను"
"అక్కయ్యా!
పోలీసుల విచారణ కొనసాగుతోంది, హంతకుడి కోసం వాళ్ళు తీవ్రంగా గాలిస్తున్నారు...వాళ్ళ
విచారణలో విషయం బయటకు వస్తే...?
ఈ విషయం పోలీసులకు
తెలుసు. ఆ రొజే మేము కమీషనర్ గారి దగ్గరకు వెళ్ళి విషయాలన్నీ చెప్పాము...పెళ్ళి
తరువాత,
అంటే నా మెడలో తాలిబొట్టు కట్టిన తరువాత ఆయన్నీ అరెస్ట్ చేసుకోమని
ప్రాధెయపడ్డాను"
"ఇది నేను
జీర్ణించుకోలేకపోతున్నాను"
“ఇలా చూడు ప్రియా.
ఒక మరణం సంభవించటానికి హత్యే కారణమని చెప్పి, అది చేసిన వాళ్ళను నేరాస్తులు అని చెప్పి ఒక సరాసరి
తీర్పును నేను ఇవ్వలేను. ఆడది తన మానాన్ని
కాపాడుకోవటనికి ఒకతన్ని చంపేసి, దాన్ని దాచటానికి ఆమె తండ్రి పెద్ద పోరాటం చేసి పోలీసుల మీద
గెలిచాడు. ఆ కధని ఈ ప్రపంచమంతా వొప్పుకుంది.
కానీ ఇక్కడ హత్య
చేయబడింది ఒక తప్పైన ఆడ మనిషి. నీ వీడియో
బయటపడితే, ఏ పాపమూ ఎరుగని ఈయన భవిష్యత్తు, కట్టి కాపాడుతున్న సామ్రాజ్యం అంతా కూలిపోతుంది. కుటుంబ
గౌరవం కపాడటానికి, తనని పెంచి పెద్ద చేసిన తండ్రిని కాపాడుకోవటం కోసం ఈయన చేసిన పనిని ఎవరు
అంగీకరిస్తారో లేదో నేను అంగీకరిస్తున్నాను.
ఒక వేల ఈయనను చట్టం
దండిస్తే...అప్పుడు కూడా ఈయనకు, ఈయన కుటుంబానికీ నేను తోడుగా ఉంటాను. అంతవరకు ఎటువంటి
గిల్ట్ ఫీలవకుండా ఈయనతో కాపురం చేస్తాను. ఒక మంచి కొడుకు...ఒక మంచి భర్త గా కూడా ఉంటారని
నేను నమ్ముతున్నాను"
తెల తెల వారుతోంది.
భాజా బజంత్రీలు,
మేళాలు మోగుతున్నాయి.
కల్యాణ మండపం జనంతో
కళ కళ లాడుతోంది.
దీపిక,
చక్రవర్తిని ను తీసుకుని వెళ్ళిపోయింది.
ప్రియంవద మాత్రం
అంగీకరించలేకపోయింది.
తల్లి పిలుపు విని
తమ్ముడ్ని తీసుకుని క్రిందకు వెళ్ళింది ప్రియంవద.
సమయం ప్రొద్దున ఆరు
గంటలు.
కల్యాణమండపం జనంతో
కిటకిటలాడుతూ, చాలా
సందడిగా ఉన్నది. ప్రముఖ వ్యక్తుల రాక, ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాల హారన్ మోతలు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీసుల బందోబస్తు
ఆ ప్రదేశాన్నే ఒక పండుగ వాతావరణంతో నింపేసింది.
పెళ్ళి పీటల మీద
నూతన వధూవరులు దీపిక-చక్రవర్తి ఎంతో ఆనందంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ తమ
కార్యక్రమాలను జరుపుతున్నారు. రామకృష్ణ గారు-సాంబశివరావ్ గారు తమకు తెలిసినవారితో,
తమ బంధువులతో మాట్లాడుతూ వారిని ఆనందంగా ఆహ్వానిస్తూ
హడావిడిపడుతున్నారు. రాజేశ్వరి-అనుసూయ పెళ్ళి వేదికపైన తమ అల్లుడిని,
కోడల్నూ చూసుకుని మురిసిపోతున్నారు.
కానీ,
ప్రియంవద ఒక పక్క, గౌతం ఒక పక్క ఎవరితోనూ మాట్లాడలేక,
అంటి అంటనట్టు ఉంటూ, అంత గుంపులోనూ ఒంటరిగా ఉన్నట్లు ఫీలవుతున్నారు.
వాళ్ళిద్దరికీ తమ
అక్క దీపిక చేసిన, చేస్తున్న పని నచ్చక-ఏమీ చేయలేక చేతులు నలుపుకుంటున్నారు.
మూహూర్త బజంత్రీలో
మోతతో పెళ్ళీకొడుకు చక్రవర్తి పెళ్ళి కూతురు దీపిక మెడలో తాళి కట్టాడు. అందరూ
పూవులు,అక్షింతలతో నూతన వధూవరులను ఆశీర్వదించారు.
పోలీస్ సైరన్ మోతలతో
ఒక పోలీస్ జీపు, ఒక
వ్యాను కల్యాణమండపంలోకి వచ్చినై. ఆ సైరన్ మోత ఎందుకో అక్కడి జనంలో అలజలడి రేపింది.
అందరి కళ్ళూ...అంటే సాంబశివరావ్ గారు, రామకృష్ణ గారు, రాజేశ్వరి, అనుసూయ, గౌతం, ప్రియంవద, పెళ్ళికూతురు దీపిక, పెళ్ళికొడుకు చక్రవర్తి తో సహా ప్రతి ఒక్కరి కళ్ళూ ఒక్కసారిగా
ఆ సైరన్ మోత వచ్చిన వైపుకు తిరిగినై.
సైరన్ మోత ఆగింది.
జీపులో నుండి ఒక పోలీస్ ఆఫీసర్ దిగాడు. ఆయనతో పాటూ మరికొంతమంది జూనియర్ పోలీస్
ఆఫీసర్లు దిగారు. జీపులో నుండి దిగిన పోలీస్ ఆఫీసర్ వ్యాను వైపు తిరిగి చెయి
ఊపటంతో వ్యానులో నుండి పది పదిహేను మంది పోలీసులు దిగారు. కొందరి చేతుల్లో
తుపాకులు ఉన్నాయి.
"ఫాలోమీ"
అని చెప్పి ఆ జీపులో నుండి దిగిన పోలీసు ఆఫీసర్ తన సిబ్బందితో పెళ్ళి వేదిక
దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళను చూసి సాంబశివరావ్ "ఏమిటాఫీసర్?"
అంటూ ముందుకు రాబోయాడు.
"ఆగండి"
అని ఆయనకు చేతులతో చెప్పి వేదికపై కూర్చోనున్న చక్రవర్తి వైపు తిరిగి
"మిస్టర్ చక్రవర్తి" అన్నాడు.
పెళ్ళి పీటల మీద
కూర్చున్న చక్రవర్తి నవ్వుతూ పైకి లేచి మెడలో ఉన్న పూలమాలను తీశాడు. పెళ్ళికూతురు
దీపిక కూడా తన మెడలో ఉన్న పూలమాలను తీశేశింది.
"రండి "
"వాట్ నాన్
సెన్స్ యు వార్ టాకింగ్ డి.ఎస్.పి….నా కొడుకేమిటి? మీతో రావడమేమిటి?...ఇక్కడ జరుగుతున్నది అతని పెళ్ళి" పెళ్ళి కొడుకు తండ్రి
సాంబశివరావ్ కోపంగా అరిచాడు.
"ఐయాం నాట్
టాకింగ్ నాన్ సెన్స్...ఐయాం టాకింగ్ సెన్స్… కాంచన హత్యకేసులో మీ అబ్బాయిని ఖైదు
చేస్తున్నాం”. నిదానంగా చెప్పాడు డి.ఎస్. పి.
"ఏమిటి అధారాలు?"
కూతురి మెడలో తాళి కట్టి పది క్షణాలు కూడా అవలేదు అప్పుడే
అల్లుడ్ని అరెస్ట్ అంటున్నారనే బాధతో అడిగాడు రామకృష్ణ గారు.
"అవేమిటో నేను
పబ్లిక్ గా చెప్పకూడదు" డి.ఎస్.పి.
అప్పుడు చక్రవర్తి
తండ్రి తన పక్కనే ఉన్న పోలీస్ కమీషనర్ ను చూసి "ఏమిటి సార్ ఇది?"
అని ఆడిగాడు.
"అదే హత్య
కేసులో మిమ్మల్ని కూడా అరెస్టు చేస్తున్నాం?"
నలుగురు పోలీసులు
సాంబశివరావ్ గారిని చుట్టుముట్టారు.
అందరూ
ఆశ్చర్యపోయారు.
"డి.ఎస్.పి.
సార్...మా అమ్మాయి మెడలో తాళి కట్టి ఇంకా పదినిమిషాలు కూడా అవలేదు. పెళ్ళి
కార్యక్రమాలు ముగించుకుని అతనే మీ దగ్గరకు వస్తాడు" ప్రాధేయపడ్డాడు రామకృష్ణ
గారు.
"సారీ
సార్...అరెస్ట్ వారంట్ ఇష్యూ చేసిన వెంటనే మేము మా పని చెయ్యాలి. ఇక బైలు
తీసుకుంటేనే బయటి ప్రపంచంలో ఉండగలడు"
"ఎన్ని
గ్యారంటీలైనా, ఎంత
సెక్యూరిటీ కావాలన్నా తీసుకోండి. సాయంత్రం వచ్చి మీ ముందు హాజరవుతాడు"
"సారీ సార్...పోలీస్
స్టేషన్ లో బైలు ఇవ్వలేము. ఇది నాన్ బైలబుల్ అరెస్ట్ వారంట్. కోర్టుకు వెళ్ళి బైలు
తీసుకోవాలి”
మామగారు రామకృష్ణ గారు పక్కనే నిలబడ్డ పోలీస్
కమీషనర్ చెతులు పుచ్చుకుని ఏదో
మాట్లాడుతున్నారు.
“ఇన్స్ పెక్టర్ టేక్
హిం ఇన్ టు కస్టడీ " అంటూ జూనియర్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చి పెళ్ళికూతురు
దగ్గరకు వెళ్ళాడు డి.ఎస్.పి.
"సారీ మాడం...మేము ఇంకొంచం ముందు
వచ్చుండాలి. వచ్చుంటే మీపెళ్ళి ఆపగలిగే వాళ్లం. ఈ హంతకుడి దగ్గర నుండి మిమ్మల్ని
కాపాడేవాళ్ళం" అని చెప్పి, చక్రవర్తి వైపు తిరిగి "నడవండి" అని చెప్పి
చక్రవర్తిని పోలీసు వ్యాను ఎక్కించి, తాను జీపు ఎక్కాడు.
పోలీసు వాహనాలు బయటి
గేటు వైపుకు వెళ్ళాయి.
కల్యాణ మండపంలో
నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది.
కొందరు బయటకు
వెడుతున్నారు. కొంతమంది ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారు.
రామకృష్ణ గారు,
రాజేశ్వరి ఇద్దరూ కూతురు దీపిక దగ్గరకు పరిగెత్తారు.
వేదికకు దగ్గరే ఉన్న
ప్రియంవద వేగంగా వేదిక పైకి వెళ్ళి
అక్కయ్య చేతిని పట్టుకుంది.
ఆ క్షణం
పెళ్ళికూతురు దీపిక నవ్వుతూ కనిపించడం అక్కడున్న అందరినీ ఆశ్చర్య పరిచింది.
********************
చక్రవర్తి
స్నేహితుడు సుభాష్ కు ఏడేళ్ళు శిక్ష పడింది.
చక్రవర్తికి
రెండేళ్ళూ శిక్ష పడింది.
రెండేళ్ళ జైలు శిక్చ
తరువాత ఆ రోజు బయటప్రపంచానికి వచ్చాడు చక్రవర్తి.
అతనికోసం
ఎదురుచూస్తున్న దీపిక ఆనందం పట్టలేక పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని కౌగలించుకుంది.
ఇద్దరూ కలిసి
తల్లితండ్రులకు నమస్కరించారు.
అందరూ కలిసి అక్కడున్న గుడికి బయలుదేరారు.
************************************************సమాప్తం*********************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి