ప్రేమ వ్యవహారం!...(సీరియల్) PART-1
నవీన వసతులతో కూడిన ఒక హాస్టల్లో మాధవి అనే ఒకమ్మాయి కొత్తగా చేరుతుంది. చేరిన రోజు సాయంత్రమే మాధవి హాస్టల్ కు కొంత దూరంలో విశ్వం అనే యువకుడితో చాలా సన్నిహితంగా ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది ఆమె రూమ్ మేట్ రేఖా. ఎందుకంటే అతను ఒక మోసగాడు. ఇదివరకే రేఖా స్నేహితురాలు మథులతను అతను ప్రేమించి మొసం చేసుంటాడు. ఈ విషయం మాధవికి చెప్పి ఆమెను అలెర్ట్ చేద్దామనుకుని మాధవికి, విశ్వం గురించి చెప్పాలనుకుంటుంది రేఖా. కానీ, మాధవి చెప్ప నివ్వదు. రేఖా ఎలాగైనా విశ్వం గురించి చెప్పి తన రూమ్ మేట్ మాధవిని అతని మాయలోనుండి కాపాడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ రేఖ ప్రయత్నాలు వృధా అవుతాయి.
రేఖా చేసిన ప్రయత్నాలు ఏమిటి? అవెందుకు విజయం కాలేదు? మాధవి, విశ్వం ప్రేమ వ్యవహారం ఎటు పయనించింది? చివరికి ఏం జరిగింది?...మాధవి, విశ్వం దగ్గర నుండి తప్పించుకుందా, లేదా? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మీరు ఊహించలేని కథా అంశంతో మిమ్మల్ని అలరించే ఈ సీరియల్ ను చదవండి.
ఈ సీరియల్ ను ఒకేసారి నవలగా చదవాలనుకుంటే ఈ కింది లింకుపై క్లిక్ చేయండి:
ప్రేమ వ్యవహారం!...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2
****************************************************************************************************
“ఎంతైంది?”
-- ఆటోలో నుండి దిగిన గిరిధర్
అడిగాడు.
“మీటరు
నూట ఎనభై రూపాయలు చూపిస్తోంది సార్. దానికిపైన ఇంకో ఇరవై ఇచ్చి పుణ్యం కట్టుకోండి
సార్!”
“నూట
ఎనభయ్యే ఎక్కువ. దానికిపైన ఇంకో ఇరవై అడుగుతున్నావా?” అంటూ
కరెక్టుగా లెక్కపెట్టి చిల్లరగా ఇచ్చాడు.
“అన్నయ్యా, ఇక్కడ కూడా గొడవేనా?”
విసుక్కుంది
అతని చెల్లెలు మాధవి.
“ఎవరి దగ్గరా
మోసపోకూడదమ్మా...”
“సరి, సరి...త్వరగా డబ్బులిచ్చేసి రా!”
“అయిందమ్మా”--అంటూ తిరిగాడు.
సూట్
కేసు తీసుకుంటూ “ఎన్నో
మేడకు వెళ్ళాలి?” అని అడిగాడు.
“మొదట
రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత డబ్బులు కట్టాలి!” అంటూ ఇంకో సంచీ తీసుకుంది మాధవి.
ఇద్దరూ
లోపలకు వెళ్ళారు.
ఆఫీసు
గదిలో ఒక మధ్య వయస్కురాలు కూర్చోనుంది. పేపర్ చదువుతోంది. వీళ్ళను చూసిన వెంటనే
పేపర్ను పక్కన పెట్టి, లేచి నిలబడి “ఎవరు మీరు...మీకు ఏం కావాలి?” అని సాగదీసింది.
“నమస్తే
నండి...నా పేరు మాధవి!”
గబుక్కున
ఆమె మొహం విప్పారింది. “అరెరే...రామ్మా” అన్నది.
“సూట్
కేసు, సంచీ పక్కగా పెట్టు” అని చెప్పినావిడ గిరిధర్ ను చూసి “ఈయన ఎవరు...మీ అన్నయ్యా?” అని అడిగింది.
“అవునండి...మా
అన్నాయ్యే!”
“సరే
కూర్చోమ్మా...మీరూ కూర్చోండి సార్”
ఇద్దరూ
కుర్చీలలో కూర్చున్నారు. టేబుల్ మీద ఉన్న పుస్తకాన్ని తిరగేస్తూ ఆ అమ్మాయి “నీ రూము 203” అన్నది.
“చాలా థ్యాంక్స్ అండీ...దాని తాళం చెవులు...?”
“అదంతా అవసరం లేదమ్మా! అన్ని గదులూ ఎప్పుడూ
తెరిచే ఉంటాయి”
గిరిధర్
ఆశ్చర్యపోతూ “ఏమిటండీ
అలా చెబుతున్నారు?” అన్నాడు.
“....................”
“తాళమూ
- తాళం చెవి ఏదీ లేదా?”
“అవన్నీ ఉన్నాయండి. కానీ, వాటి అవసరం ఉండదని చెబుతున్నా” అని నవ్విన ఆవిడ ఇక్కడ ‘బద్రత’ చాలా పక్కాగా ఉంటుంది. గదిలో ఉన్న అమ్మాయలు ఆఫీసులకు
వెళ్ళేటప్పుడు గదికి తాళం వేసే అవసరం ఉండదు”---అన్నది.
“అటూ, ఇటూ ఉన్నదంతా మంచి చోటే కదా?” అతను
అడిగినప్పుడు,
“మీరే
వెళ్ళి ఒక సారి చూసి రండి. చుట్టు పక్కలంతా చాలా డీసెంట్ ఫ్యామిలీలు ఉన్న చోటు.
అందువలనే ఈ చోటును సెలెక్ట్ చేసి హాస్టల్ మొదలు పెట్టాము. ఇన్ని సంవత్సరాలలో ఒక్క
సమస్య కూడా రాలేదు” అంటూ
రసీదు పుస్తకం ఒకటి అతని ముందుకు జాపింది. డబ్బు తీసుకుంది. మళ్ళీ మొదలుపెట్టింది.
“మిగితా
చిల్లర కరెక్టుగా ఉందేమో లెక్కపెట్టుకోండి” అన్న ఆమె మాధవిని చూసి “నువ్వెక్కడ పనిచేస్తున్నానని చెప్పావు?”
ప్రసిద్ద
‘కంప్యూటర్ సాఫ్ట్ వేర్’ కంపనీ పేరు చెప్పింది.
“అక్కడ
పనిచేసే చాలా మంది లోపల ‘స్టే’ చేస్తున్నారు. ఆఫీసు బస్సులోనే కదా వెడతావు?”
“అవును!”
“రోజూ
వాళ్ళతోనే నువ్వూ బయలుదేరి వెళ్ళొచ్చు” అంటూ గిరిధర్ సంతకంపెట్టిన రసీదు పుస్తకం తీసుకుని, హాస్టల్ రూల్స్ వివరించింది.
“ప్రొద్దున
ఆరున్నర నుండి టిఫిన్ దొరుకుతుంది. టిఫిన్ చేసేసి కాఫీతాగి, బస్సు పట్టుకోవటానికి నీకు టైము సరిగ్గా
సరిపోతుంది”
అన్నది మాధవితో.
“థ్యాంక్స్
అండీ” అంటూ సూట్ కేసు తీసుకుని “నా రూమ్ మేట్ సహోదరి ఎవరు...” అని అడిగింది.
“రేఖా
అని పేరు. ఆమె కూడా నీలాగానే కంప్యూటర్ కంపెనీలో పనిచేస్తోంది. చాలా మంచి పిల్ల.
నీకు ఖచ్చితంగా ఆమె నచ్చుతుంది”
గిరిధర్
లేచి నిలబడి “జాగ్రత్తగా
చూసుకోండి”
అన్నాడు సంప్రదాయంగా.
“మీకు ఎటువంటి
భయం వద్దు సార్. మేము జాగ్రత్తగా చూసుకుంటాం. అవును మీరు ఎక్కడుంటారు?”
“పక్కనే...” అన్నతను, తన ఊరు పేరు చెబుతూ “అయితే, దీన్ని ఆ రూములో ఉంచేసి బయలుదేరతాను” అని చెప్పి బయలుదేరటానికి లేచాడు.
“క్షమించాలి...ఏ
కారణానికైనా సరే మగవాళ్ళను లోపలకు అనుమతించం”
“.......................”
“సూట్
కేసులను నేను
పైకి పంపిస్తాను. మీరు మీ చెల్లెలుతో చెప్పి బయలుదేరండి”
ఆమె
దగ్గర ‘థ్యాంక్స్’ చెప్పి, చెల్లి వైపు చూసి అడిగాడు “ఇంకేదైనా కావాలా మాధవీ?”
“వదన్నయ్యా!
నువ్వు బయలుదేరు. ఇప్పుడే బయలుదేరితేనే టైముకు ఇంటికి చేరుకోగలవు. నేను జాగ్రత్తగా
ఉంటాను. భయపడొద్దని అమ్మకీ-నాన్నకీ చెప్పు”
అది
విని, రెసెప్షన్లో ఉన్న ఆమె మాధవిని పిలిచింది.
“హాస్టల్లో
‘స్టే’ చేయటం ఇదే మొదటి సారా?”
“లేదండీ...చదువుకునేటప్పుడు
‘స్టే’ చేశాను. అయినా కానీ కన్నవాళ్ళకు ఎప్పుడూ భయమే. ధైర్యం
చెబుతేనే వాళ్ళు కొంచం ప్రశాంతంగా ఉంటారు”
“అర్ధమవుతోంది...నువ్వు
నీ గదికి వెళ్ళు. సూట్ కేసులు -- పరుపు అన్నీ తరువాత పంపుతాను”
“పాత
హాస్టల్ కంటే ఇది కొంచం ఆధునికంగా ఉంది. చూడటానికి కూడా బాగుంది కదా...!” గిరిధర్ చెప్పాడు.
“ఏది
ఆధునికమని చెబుతున్నావో అర్ధమైయ్యింది. ‘సైటు’ కొట్టకుండా త్వరగా బయలుదేరు. ఉరికి వెళ్ళిన వెంటనే ఫోన్
చెయ్యి” అన్నది నవ్వుతూ.
అన్నయ్య
వెళ్ళిన తరువాత, మెట్లెక్కి
రెండో అంతస్తుకు వచ్చింది. తనకు అలాట్ చేసిన రూము దగ్గరకు వచ్చింది. రూము తలుపులు
మూసినట్టు దగ్గరకు వేసున్నాయి. మెల్లగా తలుపు మీద కొట్టింది.
“ఎవరూ?” అనే స్వరం వినబడింది.
“నేను
కొత్తగా వచ్చాను”
“తలుపు
తెరిచే ఉంది. రండి”
........
లోపలకు
వెళ్ళింది. “నమస్తే...నా
పేరు మాధవి. నాకు ఈ రూము అలాట్ చేశారు”
“అలాగా...సంతోషం.
రండి...రండి...” అని
నవ్వుతూ స్వాగతించి, “నా పేరు రేఖా. ఇప్పటి నుండి మీ ‘రూమ్ మేట్’ ను!"
“నన్నూ
రండి...పొండి అనక్కర్లేదు. మామూలుగా రా...పో...అని పిలవండి. నేనూ మీ వయసు దానినే”
“నాకూ
చెప్పి మీరు ‘అండీ’ అనొచ్చా?” అంటూ రేఖా నవ్వింది. మాధవి నాలిక కొరుక్కుంది.
“సరి, సరి...మిమ్మల్ని కలుసుకోవటంలో నాకు చాలా సంతోషం” అంటూ చెయ్యి జాపింది. ఆమె అది పుచ్చుకుని షేక్
హ్యాండ్ ఇచ్చింది.
పరిచయ
కార్యక్రమం ముగిసిన తరువాత మెల్లగా రూమంతా ఒకసారి చూసింది. రెండు వైపులా మంచాలు.
వాటికి పైన అలమరాలు. మనిషంత ఎత్తుకు ఒక అద్దం. ఒక ఫ్యానూ, ఇంకో పక్క కిటికీ, గోడమీద ప్రశిద్ద నటుడు మొహమంతా నవ్వుతోనూ, కళ్ళంతా ప్రేమతోనూ ఒక నటిని కౌగలించుకో
నున్నాడు.
“నిలబడే
చూడాలా? కూర్చోండి” అంటూ కుర్చీని లాగి ఆమె దగ్గర వేసింది రేఖా.
అప్పుడు
మాధవి యొక్క సూట్ కేసు, పరుపు తీసుకు వచ్చి వేశాడు సెక్యూరిటీ గార్డు ఒకతను.
“అదే
మీ అలమరా...మీ వస్తువులను దాంట్లో పెట్టుకోండి. పెట్టటానికి నేను హెల్ప్ చేయనా?”
“వద్దు...నేను
తరువాత చూసుకుంటాను. థ్యాంక్స్” అన్నది మాధవి.
మంచం
చివరన కూర్చుంటూ రేఖాను చూసింది.
‘మంచి
ఎత్తు, చామన ఛాయ రంగు. వసపరచుకునే అందం. కాటన్ చుఢీదార్, మెడలో సన్నటి గొలుసు ఒకటి. దానికి మ్యాచింగుగా
చెవులకు పోగులు. పెదాల మీద ఎప్పుడూ నవ్వు అద్దెకు ఉన్నట్టు అనిపిస్తోందీ’
అదే
సమయం రేఖా కూడా మాధవిని జాగ్రత్తగా గమనించింది.
‘తెలుపు
రంగు దేహం. దానికి మ్యాచింగ్ చొక్కా- జీన్స్ ప్యాంటు. స్నేహాన్ని కోరే కళ్ళు. బుస
బుస మని ఊరిన బుగ్గలు. బాగా...కుందేలు బొమ్మలాగా అందంగా ఉందీ’ అని తనలో తానే అనుకుంది.
కొంచం
సేపు తరువాత రేఖా బయలుదేరింది.
“ఈ
రోజు నాకు ‘డ్రాయింగ్’ క్లాసు ఉంది. ఏడింటి తరువాతే వస్తాను” అని చెప్పింది.
“అరే...మీరు
ఆర్టిస్టా?”
“లేదు...ఇప్పుడే
నేర్చుకుంటున్నాను. టైమైంది...మిగిలినవి తిరిగి వచ్చిన తరువాతమాట్లాడు కుందాం” -- గబగబ మంటూ నడిచింది.
డ్రాయింగ్
క్లాసు నుండి రేఖా తిరిగి వచ్చినప్పుడు, బీరువాలో బట్టలు అందంగా సర్ది పెట్టబడున్నాయి. అందానికి
మెరిగులు దిద్దే వస్తువులు కొన్ని కొత్తగా వచ్చినై. కానీ మాధవి కనిపించ లేదు!
పక్క రూములో
విచారించింది.
“కుందేలు
బొమ్మను చూశారటే?”
“ఎవరే
అది?”
“అదేనే
నా రూముకు కొత్తగా వచ్చిన చిన్న అమ్మాయేనే?"
తెలిసినట్టు
కన్ను కొట్టి నవ్వింది ఆమె.
“కుందేలు
బొమ్మ, చిన్న పిల్ల అని నువ్వు అనుకుంటున్నావు...కానీ
అది అక్కడ రోడ్డు మీద ముమ్మరంగా మాట్లాడుతోంది.”
“అరే...” అంటూ ఆశ్చర్యపోయింది రేఖా.
హాస్టల్లో
చదివే పిల్లలు కొందరు సాయంత్రం సమయంలో ప్రేమికుడితో తిరగటం, రోడ్డు మీద నిలబడి బాతాకానీ కొట్టటం సహజమే!
“కానీ, వచ్చిన మొదటి రోజే ఆమెకు ప్రేమికుడా? ఎలా సాధ్యం? అందులోనూ అమాయకపు మొహంతో నిలబడ్డ ఆ మాధవీ నా?”
“ఆమేనే...అనుమానంగా
ఉంటే నువ్వే వచ్చి చూడు” అంటూ
రేఖాని మేడ మీదకు తీసుకు వెళ్ళి రోడ్డు వైపు చూపించింది.
“ఇప్పుడంతా
అమ్మాయలు ఊర్ల నుండి వచ్చేటప్పుడే జోడీగానే వస్తున్నారు. ఈ అమ్మాయి రెండు
సంవత్సరాలుగా ఇదే ఊర్లో ఇంకో హాస్టల్లో ఉండేదట. అక్కడున్నప్పుడు ఏర్పడిన ప్రేమే అనుకుంటా
ఇది”
“వదిలేయ్...ఇవన్నీ
వాళ్ళ వాళ్ళ పర్సనల్ విషయాలు.”
“మరి...నేనేమన్నా
పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని కొట్టుకుపోతానా ఏమిటి?” --- అని చెప్పేసి ఆమె వెళ్ళిపోవటంతో, రేఖా ఆదుర్దాతో వాళ్లను చూసింది...కుందేలు
బొమ్మ యొక్క ప్రేమికుడ్ని కళ్ళతోనే ఫోటో తీయాలనే ఆశతో!
రోడ్డు
చివర, చీకట్లో వాళ్ళు సరిగ్గా కనిపించలేదు.
కానీ, అతను...ఆమె భుజం మీద చేయి వేసుండటం కనబడింది.
మాట్లాడుతూనే అతను కాంతి వైపు తిరిగాడు. రోడ్డు లైటు వెలుతురులో అతని మొహం కనబడింది...అదిరిపడ్డది
రేఖా.
‘అరే...ఇతనా?’
మళ్ళీ
ఒకసారి క్షుణ్ణంగా చూసింది. అతని మొహం అప్పుడు బాగా కనబడింది.
‘సందేహమే
లేదు...అదే చీటింగ్ ఫెలోనే! కుందేలు బొమ్మ మాధవీ...ప్రేమించటానికి నీకు వేరే మగాడే
దొరకలేదా?’ పెద్దగా నిట్టూర్పు విడిచింది.
Continued...PART-2
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి