'రెయిన్ బాంబ్': బ్రిస్బేన్ నగరంలోని కొన్ని భాగాలను నీటి అడుగుకు తోసేసింది (ఫోటోలు)
ఆస్ట్రేలియాలోని మూడో అతిపెద్ద జనాభా నివాస ప్రాంతంలో వరదలు సంభవించాయి. భారీ వర్షాలతో ఇళ్లు, కాలనీలు, రోడ్లు జలమయం అయ్యాయి.
ఆస్ట్రేలియాలో జలప్రళయం విరుచుకుపడింది. ఎప్పుడూ ఊహించని విధంగా అత్యధిక వర్షపాతం నమోదవడంతో వందలాది మంది జలదిగ్భందంలో చిక్కుకుపోయారు. వేలాది ఇళ్లు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఆస్ట్రేలియాలోనే అత్యధిక జనాభా నివసించే నగరమైన బ్రిస్బేన్ లోని కొన్ని ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి.
ఇంతటి ప్రమాదకరమైన వర్షాలు, వరదలు రావడం ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. వరద ప్రవాహం తీవ్రతకు నగరంలోని కాలనీలు, ఇళ్లు, రోడ్లు పూర్తిగా జలమయం కావడంతో గజఈతగాళ్లతో పాటు డిజాస్టర్‌మేనేజ్‌మెంట్ టీమ్స్ కలిసి వరద బాధితుల్ని ఆదుకునేందుకు 24గంటలుగా నిరంతరం శ్రమిస్తున్నాయి. బ్రిస్బేన్ లాంటి సీల్డ్ సిటీ నీళ్లలో తేలుతున్న దృశ్యాలు భయాందోళనను కలిగిస్తున్నాయి. గడిచిన వందేళ్లలో ఇలాంటి వరద బీభత్సం, భారీ వర్షాలు చూడలేదని అభిప్రాయపడుతున్నారు.
Images Credit: To those who took the original photos.
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి