29, మార్చి 2022, మంగళవారం

బుల్లెట్ మోటర్ సైకిళ్ ఆలయం...(ఆసక్తి)

 

                                                                     బుల్లెట్ మోటర్ సైకిళ్ ఆలయం                                                                                                                                                                    (ఆసక్తి)


బుల్లెట్ మోటర్ సైకిళ్ ఏంటి ? ఆలయం ఏంటి అనుకుంటున్నారా? అవును పై ఫోటోలో చూస్తున్న బుల్లెట్ మోటర్ సైకిళ్ అంటే అక్కడ చాలా పవర్ ఫుల్ దేవుడు. కష్టం వచ్చినా, మాత్రం బాధగా ఉన్నా... అక్కడి ప్రజలు బుల్లెట్ మోటర్ సైకిళ్ ముందు మొరపెట్టుకుంటారు. పూలహారాలు, దారాలు, నైవేద్యాలు సమర్పించి మొర ఆలకించమని వేడుకుంటారు.

భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, విభిన్న సంస్కృతులువేల సాంప్రదాయాలు. అలాగే మన దేశంలో పూజించే దేవతలు, బాబాల సంఖ్య కూడా ఎక్కువే. అయితే ఇప్పుడు మనము తెలుసుకోబోయేది విలక్షణ టెంపుల్. అందులో పూజలందుకుంటున్న బుల్లెట్ మోటర్ సైకిళ్  గురించి తెలుసుకోబోతున్నాం.

రాజస్థాన్లోని పాలీ దగ్గర 350 సీసీ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ని అక్కడి ప్రజలు దైవంగా భావిస్తారు. వినడానికి కాస్త ఆశ్చర్యం కలిగించినా..ఇది పూర్తి వాస్తవం.

జోద్పూర్కు 47 కిమీల దూరంలో ఉన్న పాలి జాతీయ రహదారి పక్కన ఆలయం ఉంది. 350 సీసీ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటుంది. రహదారి మీదుగా వెళ్లేవారు తప్పకుండా ఆలయంలోని బుల్లెట్ను దర్శించుకుని వెళ్లాలని, లేకపోతే ప్రమాదాలకు గురవ్వుతారనేది స్థానికుల విశ్వాసం.

ఇక్కడ బుల్లెట్ను పూజించడం వెనుక పెద్ద కథే ఉంది. ఓమ్ సింగ్ రాథోడ్ అలియాస్ ఓమ్ బన్నా అనే వ్యక్తి 1988 డిసెంబర్ 2 రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్పై వెళ్తూ ప్రమాదానికి గురై మృతి చెందాడు.

దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బుల్లెట్ బైక్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే తెల్లారేసరికి బైక్ పోలీసులకు కనిపించలేదు. దానికోసం వెతుకులాట ప్రారంభించగా..సరిగ్గా యాక్సిడెంట్ జరిగిన ప్రదేశంలోనే కనిపించింది. పోలీసులు బైక్ను మళ్లీ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి ఎన్ని జాగ్రత్తలు చేసినా, తెల్లారేసరికి  బైకు ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే ఉండేది. ఇలా పోలీసులు బైక్ను స్టేషన్లో ఉంచడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో, పోలీసులు బుల్లెట్ను అక్కడే వదిలేశారు. అయితే, స్థానికులు.. ఓమ్ బన్నా ఆత్మే ఇదంతా చేసిందని, ఆయన దైవంతో సమానమని భావించిన స్థానికులు.. అక్కడే ఆలయం కట్టి బైకుకు పూజలు చేయడం ప్రారంభించారు. దీనికి పూజలు చేసేందుకు ప్రత్యేకంగా అర్చకుడిని కూడా నియమించారు.

స్థానికులు కూడా తమకు ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు బైక్ని పూజించడం మొదలు పెట్టారు. చిన్న స్టేజ్ను ఏర్పాటు చేసి దానిపై బైక్ ని ఉంచి నిత్య పూజలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రాంతం ఒక దైవ ప్రదేశంలా మారింది.

ఎండా, వానల నుంచి రక్షణ కలిగించటానికి బైక్ చుట్టూ అద్దాలు ఏర్పాటు చేశారు. ఓమ్ బన్నా పేరు మీదగా ప్రదేశానికి ఓమ్ బన్నా టెంపుల్ అని పేరొచ్చింది. ప్రమాదాల బారిన పడకుండా చూడాలంటూ బండి పక్కనే ఉన్న చెట్టుకి వాహనదారులు దారాలు కడుతుంటారు. ఓమ్ బన్నా విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు.

Images Credit: To those who took the original photos.

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి