ప్రేమ వ్యవహారం!...(సీరియల్) PART-7
"రేఖా మ్యాడం, మిమ్మల్ని చూడటానికి ఎవరో వచ్చారు"
‘మనకోసం
ఎవరు వచ్చుంటారు?’ అని మనసులో అనుకుంటూ “ఎవరు?” అని అడిగింది.
“తెలియదు...ముందు
గదిలో ఉన్నారు”
రేఖా
ఆ గది దగ్గరకు వెళ్ళింది.
లోపల
ఉన్నది ఎవరనేది తెలియలేదు. తలుపు తెరిచినప్పుడు అక్కడ పుస్తకం తిరగేస్తున్నాడు విశ్వం.
లేచి నిలబడి, “రేఖా...” అన్నాడు.
“నేనే” అన్నది.
‘ఇతనెలా
ఇక్కడికి వచ్చాడు? ఎందుకు వచ్చాడు?’
“నా
పేరు విశ్వం” అంటూ
షేక్ హ్యాండ్ ఇవ్వటానికి చెయ్యి జాపాడు. అతని మొహంలో కొంచం కూడా కోపం లేదు.
“కూర్చోండి!
నన్ను చూడటానికా వచ్చారు?”
“అవును...”
“ఏమిటి
విషయం?”
“మీరు మాధవి
యొక్క రూమ్ మేటే కదా?”
“ఇప్పుడు
కాదు. ఒకే ఒక రోజు ఆమెకు రూమ్ స్నేహితురాలిగా ఉన్నాను. ఎందుకు అడుగుతున్నారు?”
విశ్వం
కొంచం తటపటాయిస్తూ “నిన్న
రాత్రి మాధవి మీ గురించి చెప్పింది. మీకు నా మీద ఏదైనా కోపమా?”
“ఎందుకు
అలా అడుగుతున్నారు?”
“మేము
ప్రేమించుకోవటం మీకు ఇష్టం లేదు. మమ్మల్ని వేరు చేయటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు
చేస్తున్నారట. ఇది నిజమా?”
సమాధానం
చెప్పటానికి రేఖా ఆలొచించింది. ఆ తరువాత ఒక ధైర్యం వచ్చింది.
‘తప్పు
చేసిన ఇతని ముందు నేనేందుకు భయపడాలి? నిజం చెబితే ఏం జరుగుతుంది?’ కొంచం నిదానంగా ఆలొచించి, మాటలు కూడ్చుకుని “మిస్టర్ . విశ్వం అవీ ఇవీ మాట్లాడ కుండా తిన్నగా
విషయానికి వస్తాను. మీకు మథులత జ్ఞాపకం ఉందా?” అన్నది.
అలా
అడిగిన వెంటనే అతను ఆశ్చర్యపోతాడని ఎదురు చూసింది. అతనో చాలా కూల్ గా “జ్ఞాపకం ఉంది” అని చెప్పి “అమెను ఏ రోజూ నేను మరిచిపోలేను. మీకెలా మథులత
తెలుసు?” అడిగాడు.
“ఏమండీ
ఆమెను మర్చిపోలేనూ అని చెబుతూనే మాధవిని ప్రేమిస్తున్నారా? ఇలా చెప్పటానికి మీకు సిగ్గుగా లేదూ?”
“ఛఛ.
నేను మర్చిపోలేనని చెప్పింది ఆ అర్ధంతో కాదు!” అర్జెంటు పడుతూ నిరాకరించాడు.
“అయితే
దానికి అర్ధమేమిటి?”
“మథులతని
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మాట నిజమే! కానీ, ఇప్పుడు ఆమె నా మనసులో లేదు. మాధవి మాత్రమే
ఉంది”
“అదే
ఎందుకు అని అడుగుతున్నా? మథులతని వదిలేసింది ఎందుకు?”
“తప్పుగా
చెబుతున్నారు! వదిలేసింది నేను కాదు...ఆమే”
“ఇదేమిటి
కొత్త నాటకం?”
“మీకు మథులతని
పర్సనల్ గా తెలియదు అని నేను అనుకుంటున్నాను. ఒక వేల తెలిసుంటే కూడా, ఆమె యొక్క ఒక మొహాన్నే మీరు చూసుంటారు. ఆమెకు రెండు మొహాలున్నాయి.
బయటకు
కనబడే మొహం చూసే నేను ఆమెను ఇష్టపడ్డాను. కొంచం సన్నిహితంగా స్నేహం చేసినప్పుడే
ఆమెకున్న రెండో మొహం కనబడింది. అదే వెర్రి తనం”
“వెర్రి
తనమా?”
“ఆమె
మామూలు ఆడదే కాదండి. తనని సన్నిహితంగా స్నేహం చేసే వారిని తన కాలు కింద నొక్కిపెట్టుకుని
శాసించాలనే రకం”
అన్నాడు విశ్వం.
“……………”
“ఆమెకు...తాను
అనుకున్నట్టు ప్రపంచం జరగాలి. కాదంటే విపరీతమైన కోపం వస్తుంది. పిచ్చి పిచ్చిగా
తిడుతుంది. కొడుతుంది. చాలా దెబ్బలు తిన్నాను ఆమె దగ్గర...అందులోనూ పలువురి ముందు!”
రేఖా
నమ్మలేక చూస్తూ ఉండిపోయింది! ‘ఇతను చెప్పేది నిజమా? లేక గుట్టు బయట పడిపోయిందే నన్న భావనతో ఏదేదో చెబుతున్నాడా?’
“మథులత
యొక్క ఆ రెండో ముఖాన్ని నేనూ ఒక విధంగా ఆరాధించాను. ఆమె కోసం నన్ను నేను
మార్చుకుందామని చూశాను. ధైర్యంగా చెప్పాలంటే భార్యా బానిసుడిగా, ప్రేమ దాసుడిగా తిరిగాను”
“……………….”
“ఎందుకనో, అది కూడా మథులతకి చాలలేదు. ఆమె నన్ను ఒక
ఆడుకునే బొమ్మలాగా, బాక్సింగ్ వీరులు మట్టి మూటలు గుద్దుతారే, ఆ మట్టి మూటలాగానే నన్ను ఉపయోగించుకుంది. మళ్ళీ
మళ్ళీ పలు రకాలుగా అవమానపరచింది. అన్నిటినీ ఓర్చుకున్నాను. కానీ ఒక రోజు ‘ఇక మీదట నన్ను చూడటానికి రాకు’ అని చెప్పింది. అది కూడా ఏ కారణమూ లేకుండా!”
“………………..”
“మొదట
సరాదాకోసం చెప్పిందెమో ననుకున్నా. కానీ, మరుసటి రోజే ఆత్మహత్యకు పూనుకున్నదని తెలిసింది. వెంటనే
ఆసుపత్రికి పరిగెత్తేను. ఆమెను చూడలేకపోయాను. మంచి కాలం చావు తప్పించుకుందని
తెలుసుకుని సంతోషపడ్డాను”
“అదే
నేను ఆమెను చివరిసారిగా చూసింది. ఆ తరువాత చాలాసార్లు ఆమె ఆఫీసుకూ, హాస్టల్ కూ వెళ్ళాను. నన్ను చూడనని, చూడటం ఇష్టం లేదని చెప్పేసింది!”
రేఖా
నిటారుగా కూర్చుంది.
“మిస్టర్. విశ్వం మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను.
ఏ కారణమూ లేకుండా అన్ని రోజుల తరువాత మథులత మిమ్మల్ని నిరాకరించిందని చెబుతున్నారా?”
“అవునండీ...అదే
నిజం. దాని వలనే నేనూ నిరాశపడ్డాను. ఏదైనా కారణం ఉండుంటే, నేను చేసిన తప్పుకు శిక్ష అనుకోవచ్చు. కారణమే
లేకుండా ఇలా చేస్తే ఏమిటి అర్ధం?”
“అలాంటప్పుడు
ఆమె ఎందుకు ఆత్మహత్యకు పాల్పడింది?”
“తెలియదండీ!
ఒకవేల అలా చేసి నాకు పెద్ద శిక్ష వేయాలని
అనుకుందేమో? ఎవరైనా
డిటెక్టివ్ నిపుణుడిని అపాయింట్ చేసి తెలుసుకుంటేనే తెలుస్తుంది”
“అలాగైతే....
మథులతకి పిచ్చి -- పిచ్చి పట్టిన మనసు అంటున్నారా?”
“ఛఛ...అలా
కాదండీ. అధికారభావం, అహంభావం అయ్యుండొచ్చు. దానికి ఆత్మహత్య
చేసుకోవాలా? కానీ, ఎందుకు అలా చేసింది అనేది నాకు తెలియదు అని ఇందాకే
చెప్పాను. ఆ వయసులో నేనూ చిన్న పిల్లాడ్నే కదా? ఈ వినోదమైన ప్రేమ ఓటమి నన్ను బాగా కృంగదీసింది. నేను కూడా
ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాను. కానీ, దానికి ధైర్యం చాల లేదు”
“ఆత్మహత్యకు
ధైర్యం కావాలని చెప్పకండి. అది చేతకాని తనం” అన్న రేఖా, "ఇప్పుడు మీరు మథులత గురించి ఇలా చెబుతున్నది నాకు
ఆశ్చర్యంగానూ, షాక్
గానూ ఉన్నది. ఆమె మీ గురించి వేరే విధంగా చెప్పిందే!”
“మథులత
మీ ఫ్రెండా?”
“బాగా
డియరెస్ట్ ఫ్రెండ్. ఆమె ఆత్మహత్యకు పాల్పడినప్పుడు నేను ఆమెకు ఫ్రెండుగానే
ఉన్నాను. నా సన్నిహిత స్నేహంతో ‘ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డావు. చెప్పు’ అని గట్టిగా అడిగాను. నువ్వు మోసం చేసేవని, అంతకంటే తనని ఏమీ అడగవద్దని చెప్పింది. అదే
నేను కూడా ఆమెను చివరగా చూసింది. నాకు వేరే ఉద్యోగం రావటంతో నేను ఆ హాస్టల్ విడిచి
వేరే చోటుకు వెళ్లాను. ఆ తరువాత ఆమెను కలిసింది పది రోజుల క్రితమే. అది కూడా మీ
గురించే. అప్పుడు చెప్పింది మిమ్మల్ని ఆమె వదిలేయటానికి కారణం"
“నా
గురించి ఏం చెప్పింది” ఆత్రుతతో
అడిగాడు విశ్వం.
రేఖా
కొంచం తటపటాయించి “మీరు
ఆమెను వాడుకుని...వదిలేసేరని చెప్పింది”
“పచ్చి
అబద్దం” గట్టిగా అరిచి చెప్పిన అతను షాకై “మళ్ళీ చెబుతున్నాను...వదిలేసింది నేను కాదు.
ఆమే!”
“నేను
ఇది నమ్మలేకపోతున్నాను”
“మీరు
ఆమె పుట్టిన రోజును వైజాగ్ లోని మీ స్నేహితుని ఇంట్లో జరుపుకుందామని ఆమెను వైజాగ్
తీసుకువెళ్లారా?”
“నా
పుట్టిన రోజును వెరైటీగా జరుపుకోవాలని మథులత నా దగ్గర చెప్పినప్పుడు, వైజాగ్ బీచ్ లో జరుపుకుందాం. వైజాగ్ లో నాకొక
స్నేహితుడున్నాడు అతను మనకు కావలసిన సహాయం చేస్తాడు అని చెప్పాను...కానీ మేము ఏ
రోజూ వైజాగ్ వెళ్లలేదు. ఆమె పుట్టిన రోజుకు ముందే ఆమె నన్ను వదిలంచుకుందే”
“మీరు
చెప్పేది ఇంకా నేను నమ్మలేకపోతున్నాను”
“అది
మీ ఇష్టం"”అంటూ
లేచి నిలబడ్డ విశ్వం ‘మథులతని
విడిపోయిన తరువాత, ఇక ఆడపిల్లలనే నమ్మకూడదని నిశ్చయించుకున్నాను. కొన్ని
సంవత్సరాల తరువాత మాధవితో పరిచయం ఏర్పడింది. స్నేహితుడిగానే నడుచుకున్నాను. కానీ, మాధవినే నాపై తన ప్రేమను తెలిపింది. నేను
అవుననటానికి నాకు ఆరు నెలలు పట్టింది. ఆ ఆలశ్యమే మాధవికి నామీద ఎనలేని నమ్మకాన్ని
కలిగించింది.
ప్రేమించుకోవటం
మొదలుపెట్టాము. ఇదే నిజం. నేను ఎవరినీ మోసం చేయలేదు! ఒకసారి ప్రేమించి ఓడిపోయిన
వాడికి మళ్ళీ ప్రేమ పుట్టకూడదా? అదేమైనా పెద్ద తప్పా?” అన్నాడు.
“మిస్టర్. విశ్వం నేను ఓపెన్ గానే చెబుతున్నాను. ఒక వేల
మీరు చెప్పింది నిజమే అయినా, దాని వల్ల ఇప్పుడు ఏదీ మారబోయేది లేదు. నేను మాధవి దగ్గర మీ
గురించి, మథులత గురించి చెప్పటానికి ప్రయత్నించాను. ఆమె
వినలేదు...ఇక మీదట వినదు కూడా”
“అందుకని”
“ఇక
ఇది మీ జీవితం. నా ట్రబుల్ మీకు ఉండదు. మీరు మంచి వారుగా ఉంటే మాధవినే పెళ్ళి
చేసుకుని సంతోషంగా జీవించండి. అబద్దమైన మనిషిగా ఉంటే...నా మాటలు వినని తప్పుకు మాధవి
శిక్ష అనుభవిస్తుంది” అని చెప్పి గాజు తలుపును తోసి “ఇక మీరు బయలుదేర వచ్చు” అన్నది.
“చాలా
థ్యాంక్స్”
“మీరు
థ్యాంక్స్ చెప్పేటంత పని నేనేమీ చెయ్యలేదు. ఇంకా మథులతనే నమ్ముతున్నాను”
“పరవాలేదండీ...మీరు
చెప్పేటట్టు, ఏ రోజుకైనా
నిజం తెలియకండా ఉంటుందా? నేను వస్తాను”
అదే
సమయం, వాళ్ళను దాటి వెడుతున్న ఒక అమ్మాయి, తటపటాయిస్తూ నిలబడింది. విశ్వం ను చూసి ఆగింది. ‘ఇతను మన మాధవి యొక్క ప్రేమికుడు కదా?’ అని తనలో తాను గొణుక్కుంటోంది. ‘ఎందుకు ఇక్కడ రేఖాతో మాట్లాడుతున్నాడు?’
ఆమె
దానితో ఆపుండచ్చు. మనసులో ఏదో సంచలనం. వాళ్ళిద్దరూ వెడుతుంటే తన మొబైల్లో ఫోటో
తీసింది. ఆ ఫోటోను మాధవికి పంపించింది. ‘ఏయ్, నీ ప్రేమికుడు వచ్చి మా ఆఫీసులో ఏం చేస్తున్నాడు?’ అనే మెసేజీతో!
Continued...PART-8
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి