25, మార్చి 2022, శుక్రవారం

ప్రేమకు సహాయం...(సీరియల్)...PART-1

 

                                                                            ప్రేమకు సహాయం...(సీరియల్)                                                                                                                                                                PART-1

"యుక్త వయస్సులో, ఉడుకు రక్తం పొగరుతోనూ - మోహంతోనూ, మాక్సిమం పదిహేనేళ్ళ వయసు నుండి ముప్పై ఏళ్ల వయసు లోపల వచ్చి వెళ్ళే ప్రత్యేక కామమే ప్రేమ!

ఒక మగవాడికి ఏర్పడి, అదే లాగా ఒక ఆడదానికీ ఏర్పడేటప్పుడే ఇద్దరూ ఆకర్షితులై దగ్గరవుతారు. అలా ఆకర్షితులైన వారికి తల్లి-తండ్రులు, ఊరు, ప్రపంచం, తోబుట్టువులు, బంధువులూ అందరూ దూళి లాగా మారిపోతారు.

ప్రేమ అనేది ఎంతపెద్ద ప్రమాదమైన విషయమో అప్పుడే నాకు అర్ధమయ్యింది.

జీవితంలోకి దిగి జీవించటం ప్రారంభించినప్పుడే రంగు అంతా వెలిసిపోవటం మొదలవుతుంది!  అందంగా మేకప్ చేసుకుని, పరస్పరం ఏమార్చుకున్నది పగిలి ముక్కలై,

అందవికారాన్ని కలుసుకున్నప్పుడే యధార్ధం అర్ధమవుతొంది. ఇప్పడు భారానికి చేయూత నివ్వడానికి చుట్టూ ఎవరూ లేరు. చుట్టు పక్కల ఉన్నవాళ్ళు కూడా ప్రేమికులను ద్రొహులుగానే చూసే ఒక పరిస్థితి.

ప్రేమనేది పెళ్ళి తరువాత భార్య దగ్గరే జరగాలి.

పెళ్ళికి ముందు ఒకరికి ఏర్పడితే...అది పాపం తోనే చేరుతుంది!  పెళ్ళి తరువాత ప్రేమ వస్తే అది తేనె. పెళ్ళికి ముందు వస్తే అది సందేహం  లేదు...విషం. ప్రేమించ కుండా ఉండటమే తెలివిగలతనం"

అంటూ తన కూతురి స్కూల్ టీచర్ కు హితబోద చేసిన నవల హీరో, చివరకు టీచర్ ప్రేమ విజయం చెందటానికి సహాయం చేస్తాడు.........అతను చేసిన పనికి టీచర్ ఆశ్చర్యపోతుంది. ఎవరూ ఊహించని పని హీరో చేసి టీచర్ను ఆమె ప్రేమికుడితో కలుపుతాడు.

హీరో చేసిన పనేమిటి? ఎలా టీచర్ కు సహాయపడ్డాడు? ప్రేమను వ్యతిరేకించిన హీరో ఎందుకు ఆమె ప్రేమకు సహాయం చేశాడు?... సీరియల్ చదివి తెలుసుకోండి:

ఈ సీరియల్ ను పూర్తి నవలగా ఒకేసారి చదవాలనుకుంటే ఈ కింది లింకుపై క్లిక్ చేయండి:

ప్రేమకు సహాయం...(నవల)@ కథా కాలక్షేపం-2

                                                                            PART-1

దర్షిణి స్కూలుకు బయలుదేరటానికి రెడీ అయ్యింది. ఐదేళ్ళ వయసుతో ఒక పూల మొక్కకు కాళ్ళూ, చేతులూ పెరిగినట్లు ఉన్నది. తనకు తెలిసినట్లు దానికి తల దువ్వి, మొహానికి పౌడర్ అద్ది, ఎర్రటి తిలకం దిద్ది, తరువాత స్కూల్ యూనీఫారం వేసి రెండడుగులు వెనక్కు వెళ్ళి నిలబడి కూతురి అందం చూశాడు ముకుంద రావ్.

చాలు డాడీ, రోజూ నన్ను చూస్తూనే ఉన్నావు కదా అంటూ ముద్దుగా వెక్కిరించింది దర్షిణి.

బొట్టు సరిగ్గా ఉందా నని చూసానమ్మా. తరువాత తల పాపిడి నేరుగా ఉందా నని చూశాను...

నువ్వు చూసి చూసి జాగ్రత్తగా తల దువ్వినా, నీకు వంకరగానే వస్తుంది...అంటూ ఒకలాగా చెయ్యి ఆడించి ఆమె చెప్పినప్పుడు, అది అతనికి చాలా ఇష్టంగా ఉన్నది.

ఎందుకమ్మా అలా?”

నువ్వు మగాడివి. అందుకని అలాగే వస్తుంది...మా క్లాస్ టీచర్ చెప్పింది...

అబ్బో! అవును, నువ్వు నీ టీచర్ దగ్గర, నేను తలంతా దువ్వుతున్నానని చెప్తావా ఏమిటి?”

అవును. ఎందుకు నీ తల పాపిడి మాత్రం వంకరగా ఉంది? బొట్టు నుదుటి మీద ఎక్కడో ఉంది?’ అని టీచర్ అడిగినప్పుడు, నేను చెప్పకుండా ఏం చేయను?”

దర్షిణి మళ్ళీ ఒకలాగా చెయ్యి ఊపుతూ అడిగేటప్పటికి, అతనికి దాన్ని ఎంజాయ్ చేయాలనే ఉన్నది. అదే సమయం రెండు కళ్ళూ నీటితో తడిసాయి. బయట ఆటో అతను వచ్చి నిలబడి శబ్ధం చేస్తున్నాడు.

డాడీ...టాటా అని వీపుకు పుస్తకాల మూటను ఎక్కించుకుని పరిగెత్తింది దర్షిణి.

ఆటోలో ఇంతకు ముందే ఐదారుగురు పిల్లలు. దాంటోకి తోసుకుంటూ లోపలకు దూరింది.

దృశ్యం ముకుంద రావ్ ను చికాకు పరిచింది.

రేపట్నుంచి మనమే దర్షిణిని స్కూలుకు తీసుకు వెళ్ళి వదిలిపెట్టి రావాలిఅనే ఒక ఆలొచన అతి వేగంగా అతని లోపల లేచింది. 

జాగ్రత్తయ్యా...మెళ్ళగా వెళ్ళు. అందులోనూ అందరూ పిల్లలు... అతను చెప్ప చెప్ప, ఆటో వెళ్ళిపోయింది.

చూసుకుంటూ వచ్చింది మీనాక్షి.

ఆమె ముకుంద రావ్ ఇంటి వంట మనిషి. ప్రొద్దున తొమ్మిదింటికి వచ్చి, వంట చేసి పెట్టి, ఇంటిని శుభ్రపరిచి, పెన్నెండు గంటల సమయంలో ఇంటికి తాళం వేసి,  తాళం చెవి తీసుకు వెళ్ళిపోతుంది. ఆఫీసుకు వెళ్ళే ముకుంద రావ్ ఒంటి గంట సమయంలో ఇంటికి వచ్చి భోజనం చేసి, రెండింటికి తిరిగి ఆఫీసుకు వెళ్ళిపోతాడు.

సాయంత్రం ఆరుగంటలకు అతను మళ్ళీ ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఇంటి వాకిట్లో కూర్చుని హోమ్ వర్క్ చేస్తూ కూర్చోనుంటుంది దర్షిణి. తండ్రిని చూసిన వెంటనే పరిగెత్తుకుని వచ్చి అతని గొంతుకను చుట్టుకుని కావలించుకుంటుంది.

ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అది చూసి ఒక నిట్టూర్పు వచ్చి ఆగిపోతుంది. మీనాక్షి కి మాత్రం నిట్టూర్పు ఒక తుఫాన గాలిలా వీస్తుంది.

ఏం తమ్ముడూ...ఎందుకింత పట్టుదల? మీకేమన్నా వయసైపోయిందా. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకుంటే దర్షిణికి అమ్మ దొరికినట్లు అవుతుంది, నా వంట నుండి మీకు విముక్తి కలుగుతుంది?” అని చాలాసార్లు అడిగింది.

రోజూ అదే ప్రశ్నను కళ్ళల్లో వేసుకుంటూ అతన్ని చూసింది. అతనికా తెలియదు...?

ఆమె చూపులను తప్పించుకున్న వాడిలాగా ఇంటిలోపలకు వెళ్లాడు. ఆఫీసుకు వెళ్లడానికి తయారవటం మొదలుపెట్టాడు.

మగవారి ప్రతి రోజు అవస్త, గడ్డం గీసుకోవడం. స్వయంగా చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆమె ఫ్రిజ్ తెరిచి కూరగాయలను తీసి కడిగి - తరగటం ప్రారంభించింది. మధ్య మధ్య అతన్ని గమనించింది. అలాగే గోడకు ఫోటోలాగా వేలాడుతున్న సంధ్యని చూసింది.

సంధ్య ఫోటోకి  'ప్లాస్టిక్' పూలమాల వేయబడి ఉంది. చిన్న బల్బు ఒకటి ఆగకుండా వెలుగుతూనే ఉంది. చాలా రోజులుగానే మీనాక్షికి సంధ్య ఎలా చనిపోయిందో అనేది తెలుసుకోవాలని ఆశ.

రోజు అడిగేయాలనే నిర్ణయానికి వచ్చి, అడిగేసింది. అతనూ గడ్డం గీసుకోవటం పూర్తి చేసుకున్నాడు.

టవల్ తో మొహాన్ని తుడుచుకుంటూనే మీనాక్షి ఎదురుగా డైనింగ్ టేబుల్ కుర్చీని కొంచం లాగి వేసుకుని కూర్చున్నాడు. అతనేదో పెద్దగా చెప్పబోతాడని ఆమె దగ్గర ఒక ఆరాటం ఏర్పడింది.

జాండీస్...అదే పచ్చ కామెర్లు వచ్చింది మీనాక్షక్కా. సంధ్యను కాపాడలేక పోయాము. అప్పుడు దర్షిణికి రెండేళ్ళు అని క్లుప్తంగా చెప్పాడు.

కామెర్లు అనేది సీరియస్ అయిన వ్యాధే. కానీ, వ్యాధి నుండి కాపాడటానికి ఇప్పుడు ఎన్నో రకాల మందులు వచ్చాయే తమ్ముడూ

కథ ముగియాలని విధి ఉంటే....ఎన్ని రకాల మందులు వాడినా ప్రయోజనం లేదు. సంధ్య విషయంలోనూ అంతే. కామెర్లకు వేసిన టీకా మారిపోయింది. ఎక్కడ చెప్పుకుని ఏడవను? ఏడ్చినా వెళ్ళిపోయింది తిరిగి వస్తుందా ఏమిటి...?”   

అరె భగవంతుడా...సరే తమ్ముడూ మీ నాన్నా-అమ్మ, ఆవిడ నాన్నా-అమ్మ ఎవరూ లేరా? ఎందుకు ఇలా ఒంటరిగా పిల్లతో కష్టపడుతూ...?”

నేను ప్రేమ వివాహం చేసుకున్నానక్కా. పెద్దవాళ్ళను ఎదిరించి పెళ్ళిచేసుకున్నాం

అనుకున్నా...అలాగే ఉంటుందని. పోనివ్వండి. దర్షిణిని చూస్తే ఎటువంటి కోతి మనసు ఉన్న వాళ్ళ పోకడ కూడా మారుతుందే...మీ అమ్మా-నాన్నా మాత్రం మారలేదా?”

ప్రశ్నకు చిన్న నవ్వును సమాధానంగా ఉంచేసి ఇంతవరకు మారలేదు. ఇక మారుతారా తెలియదు. సరి. నేను స్నానం చేసి బయలుదేరతాను. మీరు వంట ముగించుకుని వెళ్ళండి. వెళ్ళే దారిలో మర్చిపోకుండా దర్షిణికి లంచ్ బాక్స్ ఇచ్చేసి వెళ్ళండి అన్నాడు.

తరువాతి పది నిమిషాలలో గబగబ స్నానం చేసి, డ్రస్సుమార్చుకుని...గొంతుకు ఒక టైతగిలించుకుని, ఒక బ్రీఫ్ కేసుతో అతను బయలుదేరిన విధం ఆమెను ఆశ్చర్యపరిచింది.

వయసుకు వయసు, సంపదకు సంపద. జీవితాన్ని దాని దారిలొనే అంగీకరించే పురుషత్వం

అమ్మాయికి ఇలాంటి ఒకడ్ని ఇష్టం లేకుండా పోతుంది.

తమ్ముడూ... అని పిలిచింది. తిరిగాడు.

ఆశగా పెళ్ళి చేసుకున్నది అర్ధాయుస్సు తో వెళ్ళిపోతే ఏం తమ్ముడూ! మంచి అమ్మాయిని చూసి మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చే?”

ఎందుకు... జీవితంలో నాకేం కష్టం?”

కష్టం మీకు లేకుండా ఉండొచ్చు. దర్షిణికి ఒక అమ్మ ఉంటే ఇంకా చాలా బాగుంటుందే!

దాని గురించి దర్షిణినే బాధ పడటం లేదు మీనాక్షక్కా. పెళ్ళాం చచ్చిపోతే...కొత్త పెళ్ళి కొడుకుఅనే సామెతను మార్చాలనుకుంటున్నాను. నా సంధ్య శరీరకంగా నాతో లేదు. కానీ, ఆమె గాలిగా నన్నే చుట్టి చుట్టి వస్తోంది. నా కూతురుకీ అండగా ఉంది. అది చాలు. దయచేసి ఇకమీదట దీని గురించి మాట్లాడకండి. మాట్లాడేటట్లైతే ఇక పనిలోకి రాకండిఅని కొంచం కఠువుగా చెప్పేసి, ఉద్యోగానికి బయలుదేరి వెళ్లాడు.

మీనాక్షికి అతని మీద గౌరవం ఎక్కువయ్యింది!

                                                                                                                     Continued...PART-2

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి