25, మార్చి 2022, శుక్రవారం

వస్తువులను రాళ్ళుగా మార్చే బావి…(మిస్టరీ)

 

                                                     వస్తువులను రాళ్ళుగా మార్చే బావి                                                                                                                       (మిస్టరీ)

ఇంగ్లాండ్ దేశంలోని నార్త్ యార్క్ షైర్లోని నారెస్ బరో పట్టణంలోని నిద్ నదీతీర సమీపాన ఉన్నది బావి. బావి నీరు వస్తువులను రాళ్ళుగా మారుస్తుందట. బావిలోని నీటిని వస్తువు తాకినా ఆకులు, కర్రలు, చనిపోయిన పక్షులు...ఇలా ఏది బావి నీటిని తాకినా అది కొన్ని నెలలో సహజ రాయిగా మారిపోతుందట! 

అనేక శతాబ్దాలుగా అక్కడ నివసించే స్థానికులు బావి దయ్యం చేత శపించబడిన బావిగా నమ్ముతున్నారు. బావిలోని ఒకవైపు గోడ బ్రహ్మాండమైన ఒక మనిషి కపాలము రూపంలో ఉంటుంది.

కొంతమంది రోజువారీ వాడుకునే వస్తువులను నీటిలో పడేసి అవి కొన్ని రోజులకి రాళ్ళుగా రూపాంతరం చెందటాన్ని కళ్ళారా చూశారట. అలా రాళ్ళుగా  మారిన కొన్ని 1800 శతాబ్దపు వస్తువులను...టోపి, ఆడవారి పర్సులు, చెప్పులు అవే రూపంలో రాళ్ళుగా మారి ఉండటం ఇప్పుడు కూడా చూడవచ్చు. మధ్య కొంతమంది బావిలోకి బొమ్మలు, కెటిల్స్, ఒక సైకిల్ పడేశారు. ఇవి కూడా రాళ్ళుగా మారి ఉండటాన్ని చూడవచ్చు.

చరిత్ర మాత్రం బావి గురించి వేరే విధంగా చెబుతోంది. బావి గురించిన మొట్టమొదటి ప్రస్తావనలలో పురాతత్వవేత్త హెన్రీ-VIII(Henry-VIII) 1853 లో తాను రాసిన పుస్తకంలో " బావిలోని నీరు అధ్బుతమైన ఔషధ గుణాలు, రోగులకు స్వస్థత చేకూర్చే, వైద్య లక్షణాలు కలిగి ఉన్నదని అక్కడి స్థానికులు నమ్మేవారు. చాలామంది రోగులు బావి నీటితో స్నానం చేశారు. ఆరొగ్యవంతులయ్యారు. 1600 సంవత్సరంలో ఒక వైద్యుడు బావి నీటిని పరిశోధించి నీటిలో ఎటువంటి రోగాన్ని అయినా తగ్గించే విశేష శక్తి ఉన్నదని" తెలిపినట్లు ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారు. కానీ బావిలో పడుతున్న వస్తువులు మెల్లమెల్లగా రాళ్ళుగా మారటం గమనించిన స్థానికులు, విషయాన్ని ప్రచారం చేయటంతో బావి తన గొప్పతనాన్ని కోల్పోయింది. స్నానం చేయడానికి వచ్చేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది.

1630లో రాజ్యపాలనలో ఉన్న ప్రదేశాన్ని అప్పటి రాజు King Charles బావి ఉన్న ప్రదేశాన్ని Sir Charles Slingsby అనే అతనికి అమ్మేసాడు. అప్పటికి బావి ఒక పవిత్రమైన చోటుగానూ, బావి నీరు అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న నీరుగానూ ప్రసిద్ది చెంది ఉండటంతో, బావిని చూడటానికి వచ్చేవారి దగ్గర, బావిలో స్నానం చేయాలనుకునే వారి దగ్గర డబ్బు వసూలు చేశాడు. అనుకోకుండా ప్రదేశం(బావి) ఇంగ్లాండ్ దేశంలోనే మొదటి పర్యాటక ప్రదేశమయ్యింది.

చివరికి ఆధునిక శాస్త్రవేత్తలు బావి గురించిన మిస్టరీ అసత్యమని నిరూపించటానికి బావినీటిని పరిశోధించి, నీటిలో రసాయనమొకటి ఎక్కువగా ఉన్నది, రసాయనమే బావినీటిలో పడిన వస్తువులపై పూతలాగా చేరుతోందని, దీర్ఘకాలం వస్తువులు రసాయనంలో ఉండటం వలన వస్తువులు గట్టి ఖనిజ గుల్లలాగా అవుతున్నాయని తెలిపారు. బావి నీటిని తాగకూడదని నిషేదించారు.

ఇప్పుడు బావిని చూడటానికి వెళ్ళే పర్యాటకులు బావిలో ఇదివరకే రాళ్ళుగా మారిన వస్తువులను చూసి వస్తున్నారు. స్థానికులు, పొరుగు నగరం నుండి వచ్చే వ్యాపార పర్యాటకులు తమతో కొన్ని వస్తువులను తీసుకువచ్చి బావినీటిలో ఉంచి, అవి రాళ్ళుగా మారిన తరువాత వాటిని బయటకు తీసి జ్ఞాపకార్ధ వస్తువుగా అమ్ముతున్నారు.

ఆధునిక శాస్త్రవేత్తలు బావి నీటిలో రసాయనం ఎక్కువ ఉన్నదని చెబుతున్నారు గానీ, అది రసాయనమో చెప్పటం లేదు. ఒకవేల అదే నిజమనుకున్నా అలాంటి నీరు ప్రపంచంలో మరెక్కడా లేకుండా ఇక్కడ ఉండటం ఒక మిస్టరీ కాదా?....అంటున్నారు చాలామంది.

Images Credit: To those who took the original photos.

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి