26, మార్చి 2022, శనివారం

ప్రేమకు సహాయం...(సీరియల్)...PART-2

 

                                                                              ప్రేమకు సహాయం...(సీరియల్)                                                                                                                                                                PART-2

క్లాసు మొదలైయ్యింది. పాఠం చెప్పటం ప్రారంభించింది నందిని.

పిల్లలను గమనించేటట్టు చేసి పాఠం చెప్పటం అంత సులభమైన పనికాదు. కానీ, నందినికి అది  చాలా ఈజీగా ఉన్నది. కొత్తగా వచ్చింది.

ముందు వరుసలోనే కూర్చోనుంది దర్షిణి. నందిని పాఠం చెప్పటాన్ని ఎక్కువగా  ఇష్టపడుతుంది. ఆమె అడిగే ప్రశ్నలన్నిటికీ టక్, టక్ మని జవాబిచ్చి, నందినిని ఆశ్చర్యపరిచింది.

దర్షిణి! నువ్వొక బ్రిల్లియంట్ స్టూడెంట్’. మొత్త హోమ్ వర్కునూ కరెక్టుగా చేస్తున్నావు. నీకు నేను రోజు బహుమతి ఇవ్వబోతున్నా... అని ఒక స్కెచ్ పెన్నును బహుమతిగా ఇచ్చింది. అలాగే దర్షిణి నుదుటి మీద ముద్దు పెట్టింది.

దర్షిణికి ఆమె ముద్దు  ఆనందానిచ్చింది.

దర్షిణి...వచ్చే పేరంట్స్ మీటింగ్అప్పుడు, మీ అమ్మ దగ్గర నీ గురించి ఒక రహస్యం చెప్పబోతాను అన్నది.

నాకు అమ్మ లేదు మిస్! నాన్న మాత్రమే... అన్నది దర్షిణి.

...వెరి సారీ అనూ...అవును మీ నాన్న ఏం చేస్తారు?”

మా నాన్న బ్యాంకులో ఆఫీసర్ గా ఉన్నారు మిస్

పేరంట్స్ మీటింగుకు ఆయన మాత్రమే వస్తారా? లేక నీ బామ్మ-తాత అంటూ ఎవరైనా వస్తారా?”

నాన్న మాత్రమే వస్తారు. బామ్మా-తాతయ్యలను నేను ఇంతవరకు చూడ లేదు

! అయితే ఇంట్లో ఎవరు వంట చేస్తారు?”

మీనాక్షి అని ఒక ఆంటీ

--- దర్షిణి చెప్పేటప్పుడే, ‘టిఫెన్ బాక్స్తో క్లాసు వాకిట్లోకి వచ్చి నిలబడింది మీనాక్షి.

అదిగో ఆంటీవచ్చేసింది... దర్షిణి చెయ్యి చూపించగా, నందిని కూడా చూసింది.

మీనాక్షి కూడా నవ్వుతూనే మిగల్చ కుండా తినేయాలి అని చెబుతూ టిఫెన్ బాక్స్ ను పెట్టి వెళ్ళిపోయింది. 

అవును, ఆంటీమీకు బంధువా?”

అదంతా నాకు తెలియదు. కానీ శని, ఆదివారాలలో పని లోకి రాదు

! అప్పుడైతే ఈమె వంటమనిషే అయ్యుంటుంది

---అంటూ దర్షిణి బుగ్గలపై ముద్దుగా కొట్టింది. లంచ్ బెల్లూ కొట్టింది.

గూడు తెరిచిన పక్షులలాగా, పిల్లలు కూర్చున్న చోటు నుండి పరిగెత్తటం మొదలుపెట్టారు. కానీ, దర్షిణి దగ్గర అలాంటి పరుగు లేదు. చాలా నిదానంగా, “మిస్! నేను లంచ్ కు వెళ్ళనా?” అని అడిగింది.

దర్షిణి వెళ్ళిన వెంటనే నందిని మనసు బాధతో ఒక విధమైన తిప్పలు పడ్డది. 

నందిని మ్యాడం...లంచ్ కు వెళ్ళలేదా?” అంటూ ఒక గొంతు వినబడింది. తిరిగి చూసింది. పక్క క్లాసు టీచర్ లయా నే అడిగింది.

నందిని తన లంచ్ కవరుతో లయా తో కలిసి వెళ్ళటం మొదలుపెట్టింది. అప్పుడు ఆమె దగ్గర లోతైన మౌనం.

ఏం నందిని...ఏమీ మాట్లాడ కుండా వస్తున్నారు?”

నా స్టూడెంట్ దర్షిణిని తలుచుకున్నాను. మనసుకు చాలా భారంగా ఉంది...

దర్షిణి నా! చాలా తెలివిగలదే పిల్ల...

నాకు రోజే తెలిసింది. తల్లి లేని పిల్ల అని. వెంటనే మనసులో ఏదో తెలియని ఆవేదన. వాళ్ళతో తాత-బామ్మా అని ఎవరూ లేరని చెప్పింది

అవును నందిని! దర్షిణి తండ్రి ప్రేమ వివాహం చేసుకున్నాడు. అందువలన వీళ్ళు ఇరు కుటుంబీకులూ పగవాళ్ళు అయిపోయారు. అందులో పచ్చ కామెర్లకు భార్య పోయినప్పుడు దర్షిణి చాలా చిన్న పిల్ల 

! వినటానికే చాలా కష్టంగా ఉంది. అవును దర్షిణి నాన్న వేరే పెళ్ళి చేసుకోలేదా?”

లేదు. ఎందుకనో నాకు తెలియదు. చేసుకోనుంటే అప్పుడే చేసుకోనుండాలి. ఇక మీదట చేసుకుంటారని నాకు అనిపంచటంలేదు. ఎందుకంటే మా ఆయనకు తెలిసిన వాళ్ళు అడిగితే తాను ఇక పెళ్ళే చేసుకోను అని చెప్పారట

ఇద్దరూ ఒకటిగా స్టాఫ్  డైనింగ్ రూములో భోజనం చేయడానికి రెడీ అయినప్పుడు దర్షిణి తండ్రి గురించే మాట్లాడింది నందిని.

రోజుల్లో కూడా ఇలాంటి మనుష్యులున్నారంటే నాకు ఆశ్చర్యంగా ఉన్నది లయా...

మాటలు పెరుగుతూ వెళ్తున్నప్పుడు, నందిని యొక్క సెల్ ఫోన్ మోగింది.

వెంటనే మొబైల్ తీసి చూసింది.

సునీల్అనే అక్షరాలు కనపడ్డాయ్. అక్షరాలను చూసిన వెంటనే ఆమె మొహంలో ఒక కాంతి.

సునీల్...

సునీల్ నే నందిని

ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నావు?”

మీ విజయవాడ నుంచే...

పాపాత్ముడా! నువ్వెప్పుడు విజయవాడ వచ్చావు?”

ప్రొద్దున్నే. విజయవాడ ఎక్స్ ప్రెస్ లో

ఏమయ్యా...విజయవాడలో ఏదైనా ఆఫీసు మీటింగా?”

ఆఫీసు మీటింగా? ఏం...నేను నిన్ను మీట్చేయటానికి వచ్చానంటే నమ్మవా?”

నిజంగానా?”

నమ్మవా! వాడు వాడు ప్రేమకొసం ఏమిటేమిటో చేస్తున్నాడు. నేను నిన్ను చూడటానికి విజయవాడ రాకూడదా?”

రాకూడదని చెప్పటానికి నేనెవరు? కానీ, నువ్వు తీవ్రమైన తల్లి జపం చేసేవాడివే. ఆమెను వదిలి పెట్టి ఎలా వచ్చావానని...!

తల్లి జపస్తుడుని అని నన్ను నువ్వు ఏద్దేవా చెయ్యకపోతే నీకు నిద్ర రాదా నందిని...? నేను తల్లి జపస్తుడిని మాత్రమే కాదు, నందిని యొక్క సునీల్ ని కూడా

ఏది ఏమైనా మదట అమ్మ జపస్తుడివే కదా?”

నందిని! నిన్ను చూడాలని ఆశగా వచ్చాను, ఫోన్ చేశాను, ఎందుకు ఇప్పుడు అమ్మ గురించి మాట్లాడి మూడ్ అవుట్ చేస్తావు?”

సారీరా...వెరి సారీ!

నీ సారీనూ, ‘దుప్పటానూ ఎవడికి కావాలి? నేను ఇప్పుడు నిన్ను కలుసుకోవాలి. ఎక్కడున్నవ్ నువ్వు? మొదట అది చెప్పు

నా స్కూల్లో భోజనం చేస్తూ నీతో మాట్లాడుతున్నాను

! నువ్వు టీచర్ ఉద్యోగంలో చేరిపోయావా?”

అవును. ఒక వారం అయ్యింది

నందిని, నేను నీ దగ్గర ఏం చెప్పానో...మర్చిపోయావా?”

నేను ఉద్యోగానికీ వెళ్ళకూడదనేది నీ ఆశ. కానీ, మనకు పెళ్ళి జరిగేంతవరకు ఉద్యోగానికి వెళ్ళటంలో తప్పులేదని నేను అనుకుంటున్నాను

పెళ్ళి జరిగేంతవరకు అని మాటలాగుతున్నావే నందిని....దానికేమన్నా, చాలా సంవత్సరాలు టైముందా ఏమిటి?”

అయితే తరువాతి ముహూర్తంలోనేనా మన పెళ్ళి?”

ఫోనులో నీతో యుద్దం చేయటానికి నాకు ఇష్టం లేదు. సరే, నువ్వు లీవు పెట్టేసి వెంటనే రా. మనం మధ్యాహన్నం మాట్నీ షోకి సినిమాకు వెడదాం. అలాగే రాత్రి హోటల్లో విందు చేద్దాం

సారీ సునీల్! ఇప్పుడే కదా నేను ఉద్యోగంలో చేరింది. లీవడిగితే కొడతారు

అయితే ఉద్యోగం వద్దు...వదిలేయ్

ఇది బాగుందే! నీతో ఊరు తిరగడానికి ఒక మంచి ఉద్యోగాన్ని వదిలేయమంటున్నావే...నువ్వు ఉత్త స్వార్ధ పరుడువి

వద్దు నందిని...నా నోరు కెలకకు! లోకంలో స్వార్ధం లేని ఒక మనిషిని కళ్ళకు చూపించు చూద్దాం

సునీల్! వూరికే డాబరికం కోసం మాట్లాడే మాటలన్నీ నా దగ్గర వద్దు. మనం ఊహించలేనంత విధంగా లోకంలో మనుషులు ఉన్నారు...

రకంగా?”

ఇదేం ప్రశ్న? అన్ని రకాలుగానూ సునీల్

నందిని! ఎందుకిప్పుడు నస పెడుతున్నావు! నేను నీకొసమే ఆఫీసుకు సెలవు పెట్టి, హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చాను. నా దగ్గర ప్రేమ భావన చూపకుండా, బాధ్యత  భావనను గుర్తు చేస్తునట్టు మాట్లాడు తున్నావు....ఇది న్యాయమా?” --- సునీల్ మాట మార్చాడు. నందిని కి కూడా పాపం అంపించింది.

సరే బాబూ, నాకు భయంకరమైన కడుపునొప్పి అని చెప్పి, లీవు పెట్టి వస్తాను. నువ్వు నా హాస్టల్ ఎదురుగా ఉన్న జ్యూస్ షాప్ వాకిట్లో వచ్చి నిలబడు. నేను ఒక అరగంటలో ఆటో వేసుకుని అక్కడికి వచ్చేస్తాను. అదే ఆటోలో వేగంగా నువ్వు ఎక్కేయాలి. నీతో కలిసి నేను తిరిగుతున్నది, నా స్కూలుకు చెందిన వారు ఎవరూ చూడకూడదు. జాగ్రత్త... అన్నది నందిని.

అమె మాటల్లో అంత హెచ్చరిక -- అంత భయం!

అతనికి అప్పటికే ఆకాశంలో ఎగురుతున్న ఫీలింగ్ కలిగింది.

                                                                                                                   Continued...PART-3

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి