అపార్ట్‌మెంట్‌లో కూడా సరిపోయే ఇండోర్ న్యూక్లియర్ షెల్టర్ (సమాచారం)
ప్రకృతి వైపరీత్యాలు,రేడియేషన్ మరియు క్షిపణి దాడుల నుండి రక్షణ కోసం ఒక జపనీస్ కంపెనీ అపార్ట్‌మెంట్‌లు
మరియు చిన్న ఇళ్లలో అమర్చుకోగలిగే మెటాలిక్ షెల్టర్‌లను విక్రయిస్తోంది.
మిలియనీర్లు ప్రళయకాలములో మరియు డూమ్స్‌డే
మనుగడ కోసం సిద్ధం అవుతున్నవారు, వారి
సొంత ఖర్చుతో వారి స్వంత విలాసవంతమైన భూగర్భ బంకర్‌లను నిర్మించుకోవడం గురించి
మీరు బహుశా వినే ఉంటారు. కానీ ఒక జపనీస్ కంపెనీ వారు అణు అపోకలిప్స్, భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల నుండి
మరియు క్షిపణి దాడులు, రేడియేషన్ దాదుల వరకు దేనినుండైనా
తమని, తమ కుటుంబాన్నీ రక్షించుకోవటానికి ఇండోర్ షెల్టర్ లు
తయారుచేస్తున్నారు. దేనినైనా నిరోధించడానికి
కాంపాక్ట్ గా రూపొందించబడిన ప్రత్యేకత కలిగిన షెల్టర్‌లను తయారు చేసి
విక్రయిస్తోంది. డబుల్యూ.ఎన్.ఐ (WNI)షెల్టర్ అనే కంపనీ ఈ
ఇండోర్ షెల్టర్‌లను డిజైన్ చేసింది. ఈ ఇండోర్ షెల్టర్‌లు తమ స్వంత ఎయిర్
ఫిల్ట్రేషన్ సిస్టమ్‌తో వస్తాయి మరియు ఒకరి నుండి ఏడుగురు వ్యక్తుల వరకు ఎక్కడైనా
వసతి కల్పించడానికి వివిధ పరిమాణాలలో ఉంటుంది.
ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితి, అణుయుద్ధం యొక్క అవకాశాన్ని మరోసారి ప్రశ్నార్థకం చేసింది మరియు కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేయడానికి దీనిని ఒక సాకుగా ఉపయోగిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మరియు ఉత్తర కొరియా అభివృద్ధి చేసిన "జిగ్‌జాగ్" అని పిలవబడే అణు బాంబు క్షిపణులను సూచించడం ద్వారా ఇండోర్ మెటాలిక్ షెల్టర్‌లను ప్రచారం చేస్తోంది జపనీస్ షెల్టర్ తయారీదారు డబుల్యూ.ఎన్.ఐ షెల్టర్.
“ఉక్రెయిన్ దాడి గురించి ఆందోళన చెందుతున్న ప్రతి ఒక్కరూ! మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు ఏమి చేయవచ్చు! ” డబుల్యూ.ఎన్.ఐ షెల్టర్ వెబ్‌సైట్ చెబుతోంది. “ఉత్తర కొరియా నుండి సరికొత్త సూపర్‌సోనిక్ క్షిపణి! జిగ్‌జాగ్ ఫ్లైట్, అడ్డగించడం అసాధ్యం! అణు ఆశ్రయంతో అత్యవసర పరిస్థితికి మా ఇండోర్ న్యూక్లియర్ షెల్టర్ తో రక్షణకు సిద్ధం అవండి!.
డబుల్యూ.ఎన్.ఐ షెల్టర్ మెటాలిక్ షెల్టర్‌లు
స్పష్టంగా పేలుడు ప్రూఫ్, షాక్-రెసిస్టెంట్
మరియు రేడియేషన్ నుండి అలాగే జీవ మరియు రసాయన ఆయుధాల నుండి ఖచ్చితమైన ఇన్సులేషన్‌ను
అందించగలవు.
జపాన్ కంపెనీ తన షెల్టర్లు 1.07
atm వరకు సానుకూల వాయు పీడనాన్ని సాధించగలవని పేర్కొంది. 6.5 నుండి 17 సెకన్లలో, తద్వారా
రేడియోధార్మిక సమ్మేళనాలు మరియు ఇతర కలుషితాలు ప్రవేశించకుండా నిరోధించబడతాయి.
రెయిన్‌బో 72R ఫిల్ట్రేషన్ సిస్టమ్ బయటి గాలిలో ఉండే వివిధ
హానికరమైన పదార్థాలలో 99.995% బయట ఉంచుతుంది.
డబుల్యూ.ఎన్.ఐ షెల్టర్ యొక్క పరిష్కారాలు
5 ప్రధాన ముప్పుల నుండి రక్షణను అందిస్తాయి: వరదలు, పేలుళ్లు,
భూకంపాలు, రేడియోధార్మిక పదార్థాలు, అలాగే జీవ మరియు రసాయన ఆయుధాలు. మరియు ఇది మీ స్వంత ఇంటి సౌలభ్యంలో ఇన్‌స్టాల్
చేసుకోవచ్చ. కాబట్టి, మీరు దానిని ఉద్దేశించిన ప్రయోజనం కోసం
ఉపయోగించాల్సిన సమయం వచ్చేంత వరకు మీరు దానిని వ్యక్తిగత స్థలంగా ఉపయోగించవచ్చు.
Images Credit: To those who took the
original photo.
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి