30, మార్చి 2022, బుధవారం

ప్రేమకు సహాయం...(సీరియల్)...PART-4

 

                                                                         ప్రేమకు సహాయం...(సీరియల్)                                                                                                                                                                  PART-4

తన గంభీరమైన బైకులో ఇంటి వాకిటికి వచ్చాడు ముకుంద రావ్. వాకిట్లో ఆడుకుంటున్న దర్షిణి వెనక్కి తిరిగి చూసింది.

బైకుశబ్ధం ఆమె వరకు సంగీతం. పరిగెత్తుకు వచ్చి కావలించుకుంది. అలాగే, “నాన్నా! అక్కడ చూడండి. ఎవరో మిమ్మల్ని చూడటానికి వచ్చారు... అంటూ చై చూపించింది.

ఆమె చూపించిన దిక్కులో మేనమామ పరమేశం. అతనికే ఆయన్ని చూడంగానే ఆశ్చర్యమూ, షాకూ తగిలినట్టు అయ్యింది.

మావయ్యా.... అన్నాడు పరవసంతో.

ముకుందం...

రండి మామయ్యా...ఎప్పుడు వచ్చారు?”

నేనొచ్చి చాలా సేపు అయ్యింది. నీ ఇల్లు కనుక్కోవటం పెద్ద కష్టం అనిపించలేదు. వీధిలో నీ పేరు చెప్పిన మరు క్షణం ఇల్లు చూపించారు...

ఆయన చెబుతున్నప్పుడే తాళం వేసున్న తలుపులను తెరిచాడు ముకుంద రావ్. పుస్తకాల సంచితో ఉర్...ఉర్.. అంటూ నోటితో బైకునడుపుకుంటూ ఇంటిలోపలకు వచ్చింది దర్షిణి.

రండి మావయ్యా కూర్చోండి -- అతను సోఫాను చూపించాడు. ఆయనా కూర్చున్నాడు. కూర్చునే ముందు ఇంటినో లుక్కు వేశాడు.

ముఖ్యంగా ఫోటోలో తెలుస్తున్న ముకుంద రావ్ ప్రేమ భార్య ముఖాన్ని చూశారు. ఒక నిట్టూర్పు విడిచారు.

ఉండండి మావయ్యా! కాఫీ వేసి తీసుకు వస్తాను అని లోపలకు వెళ్లాడు. టై విప్పి టేబుల్ మీద పడేశాడు.

డాడీ! నాకు పాలు అంటూనే టీ.వీ పెట్టి అందులో మునగడం మొదలుపెట్టింది దర్షిణి.

ష్యూర్ డార్లింగ్...అన్నాడు.

పరమేశానికి కూడా కూర్చోవటం ఇష్టంలేక, లేచి వంట గదిలోకి అతని వెనుకే వెళ్ళాడు.

ఏమిటి మావయ్యా! కూర్చోండి... వచ్చేస్తాను

ఉండనీరా ముకుందం! అవును, ఇంట్లో వంటంతా నువ్వేనా?”

అవును మావయ్యా.ప్రొద్దున మాత్రం మీనాక్షి అని ఒకామె వచ్చి, వంట చేసిపెట్టి వెళ్ళిపోతుంది...

ఏమిట్రా కర్మ? ఎందుకురా నీకు కష్టాలన్నీ?”

కష్టమా?”--స్టవ్ మీద వేడి నీళ్ళు పెడుతూ వెనక్కి తిరిగి అడిగాడు.

కాదా మరి...! నీ కూతురు అనాధలాగా ఇంటి అరుగు మీద కూర్చోనుంది. నువ్వేమో పని పూర్తి అయితే గాని రాలేవు...కదా?”

వదిలేయండి మావయ్యా! ఇదే నా జీవితమని అయిపోయింది. కానివ్వండి. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా...?” ముకుంద రావ్ ఆయన్ని రెచ్చగొట్టాడు.

తెలుసయ్యా. ఇన్ని సంవత్సరాలు రాని నేను, ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చాను అనే కదా?”

లేదు మావయ్యా... అతను వేగంగా కాదన్నాడు.

లేదా?”

అవును. నేను నా తల్లి-తండ్రులు ఎలా ఉన్నారని అడిగేందుకే అలా ఒక ప్రశ్న వేశాను

! వాళ్ళ గురించి అడుగుతున్నావా? ...బాగున్నారు ముకుందం

నా మీద ఇంకా అదే కోపంతో ఉన్నారా?”

అవున్రా. అది మాత్రం తగ్గలేదు

మీరు కూడా వాళ్ళతో కలిసి నా మీద కోపంగానే ఉండేవారు. ఇప్పుడెందుకు మావయ్యా సడన్ గా మీ మనసు మారింది?”

మరుగుతున్న వేడి నీళ్ళల్లో కాఫీపొడి వేసి, ఫిల్టర్ లో పోస్తూ ఆయన్ని చూసి అతను అడిగినప్పుడు, ఆయన ముఖంలో ఒక చలనం వ్యాప్తి చెందటం మొదలుపెట్టింది.

సారీ మావయ్యా! మిమ్మల్ని బాధ పెట్టాలని నేను అలా అడగలా...

లేదు ముకుందం! నువ్వు అలా అడిగినదాంట్లో తప్పు లేదు. నీ ప్రేమ వ్యవహారానికి మేమందరం శత్రువులమే కదా

ఇప్పుడు మారిపోయారా? అదే నా ప్రశ్న

మారుండకపోతే వచ్చుండే వాడినా?”

సంతోషం మావయ్యా! అవును....మీరొక్కరే వచ్చారు? మీతొ పాటూ అత్తయ్యా, ఉమ వాళ్ళు రాలేదే...?”

ముకుంద రావ్ వాళ్ళిద్దరి పేర్లు చెప్పిన వెంటనే, ఆయన మొహంలో వేగమైన మార్పులు.

ఏమిటి మావయ్యా మౌనంగా ఉన్నారు? అత్తయ్యా, ఉమ బాగున్నారు కదా?”

అది...

ఏమిటి మావయ్యా?”

ఉమకి పెళ్లైంది నీకు తెలుసు కదా?”

ఏమిటీ... ఉమకి పెళ్ళి అయ్యిందా...ఎప్పుడు మావయ్యా? నాకు తెలియదే

అరె దేవుడా! నీకు తెలుసని మేము అనుకుంటున్నాము. దొంగతనంగా మీ అత్తయ్య నీకు పెళ్ళి పత్రిక పంపించానని చెప్పింది

అయితే అది నా గుంటూరు అడ్రస్సుకు అయ్యుంటుంది. నేను అక్కడ్నుంచి ట్రాన్స్ ఫర్ అయ్యి, ఇక్కడకొచ్చి రెండు సంవత్సరాలు అయ్యింది మావయ్యా. అది సరే పోనివ్వండి. ఉమకి ఎప్పుడు పెళ్ళి జరిగింది?”

అదొక ఆరు నెలలు అయ్యుంటుంది...

...ఇప్పుడేనా! అల్లుడు ఏం చేస్తున్నారు?”

ముకుంద రావ్ ఉత్సాహంగానే అడిగాడు. కానీ, పరమేశం కళ్ళల్లో నీళ్ళు పొంగుకు రావటం ప్రారంభమయ్యింది. అది ముకుంద రావ్ ను ఆశ్చర్యంలో ముంచింది.

మావయ్యా! ఎందుకు ఏడుస్తున్నారు? నేనేదైనా తప్పుగా అడిగానా?”

అదంతా ఏమీ లేదు ముకుందం! నువ్వు అల్లుడు అనగానే, ఉమను ఒంటరి దానిని చేసి వెళ్ళిపోయిన ఆయన గుర్తుకు వచ్చారు...

ఎక్కడి మావయ్యా వెళ్ళారు? ఆమె నచ్చక ఎక్కడికైనా వెళ్ళిపోయారో?”

అయ్యో ముకుందం! అలా వెళ్ళుంటే నేను ఆయన  ప్రపంచంలో మూలలో ఉన్నా పట్టుకుని లాకొచ్చే వాడినే! కానీ, లోకం నుండే వెళ్ళిపోయిన ఆయన్ని నేను ఎలా లాక్కు రాగలను?”

మావయ్య ఏడుపు ఎక్కువయ్యింది. ముకుంద రావ్ కూ షాక్ తగిలినట్లు అయ్యింది.  మావయ్య ఏడుపు తగ్గలేదు. గదిలోనే కూర్చోనున్న దర్షిణి కూడా ఆయన ఏడవటం చూసి ఆశ్చర్యపోయింది.

సారీ మావయ్యా! ఇలాంటి శోకం, ఉమ జీవితంలో ఉంటుందని నేను ఎదురుచూడలేదు

శోకమే ముకుందం, నీ శోకాన్ని నాకు అర్ధమయ్యేటట్టు చేసింది. అదే మీ తల్లి-తండ్రులతో కలిసి నీ ప్రేమనూ, నీ పెళ్ళినీ ఎదిరించిన నన్ను మార్చింది

ఆయన కన్నీరును తుడుచుకున్నాడు. అతను పాలలో డికాషన్కలిపి కాఫీ ఆయన ముందుంచాడు.

ఆయన అది తీసుకుని తాగారు. దర్షిణి పాలను ఉత్సాహంగా తాగింది.

హాలులోని సోఫాలో ఎదురెదురుగా కూర్చున్నారు.

మావయ్య కాఫీ తాగి ముగించి...డ్రస్సు మార్చుకురా ముకుందం. నిన్ను ఇలా చూస్తుంటే నువ్వు ఆఫీసులో ఉన్నట్టే ఉంది...

ఉండనీ మావయ్యా! అమ్మా-నాన్నా ఇప్పుడు బాగున్నారు కదా?”

ఎలా బాగుండగలరు. నువ్వు ఇక్కడ కష్టపడుతుంటే, వాళ్ళు అక్కడ ఎలా బాగుండ గలరు?”

వాళ్ళే కదా మావయ్యా నన్ను కత్తిరించి వేసారు... తరువాత ఎందుకు నా గురించి బాధపడటం

ముకుందం! కన్నవారు -- పిల్లలూ మధ్యా ఉన్న బంధుత్వాన్ని ఎవరైనా కత్తిరించగలుగుతారా?”

నేనెక్కడ మావయ్యా తుంచుకున్నాను? సంధ్యని పెళ్ళి చేసుకుని వచ్చినప్పుడు...మా మాట వినని నువ్వు, మా అబ్బాయివే కాదుఅని వాళ్ళే కదా చెప్పారు

అది కోపంతో చెప్పింది ముకుందం...నువ్వు చేసింది మాత్రం కరెక్టా చెప్పు?”

వద్దు మావయ్యా! నన్ను ప్రశ్న అడిగి, నన్ను మీతో గొడవ పడేటట్టు చేయకండి. ఎందుకంటే, చాలా రోజుల తరువాత మీరు వచ్చారు

నేను చాలా రోజుల తరువాతే వచ్చుండచ్చు. కానీ, మంచి నిర్ణయంతో వచ్చాను...

అదేంటి మావయ్యా మంచి నిర్ణయం?”

నువ్వు ఎన్ని రోజులు ఇలాగే ఉంటావు?”

ఇదేం ప్రశ్న మావయ్యా! ఇప్పుడు నాకేం తక్కువ?”

ఏం తక్కువా అని అడుగుతున్నావా...సరిపోయింది! పగలు ఆఫీసులో ఆఫీసర్, రాత్రి ఇంట్లో వంటవాడివి. ఇదేం కర్మ ముకుందం?”

మావయ్యా! మీరేం చెప్పొస్తున్నారు...?”

నీకేం వయసైందయ్యా! నువ్వు ఎందుకు ఇంకో పెళ్ళి చేసుకోకూడదు?”

! ఇదేనా మీ ప్రశ్న? నా ఆఫీసులో నా చుట్టూ ఉన్నవారు, వీధిలో ఉన్నవారు, అంతెందుకు - ఇంట్లోని పని మనిషి కూడా ప్రశ్నను నన్ను అడిగాసారు. బంధువులలో ఎవరూ అడగలేదేమిటని ఒక భావం ఉండేది. అది మీరోచ్చి తీర్చేసారు

ఇంతమంది అడిగినా, నువ్వెందుకు ఇలాగే ఉన్నావు?”

ఆయన అడిగిన వెంటనే, అతని చూపు...ఇంట్లో ఉన్న సంధ్య ఫోటో వైపుకు వెళ్ళింది.

ఆమెతో ఒక రోజు సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు ఏర్పడిన సంభవం ఒకటి మనసులో అలలాగా తగలటం మొదలయ్యింది.

                                                                                                  Continued...PART-5

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి