ప్రేమ వ్యవహారం!...(సీరియల్) PART-9
ఆ
రోజు రాత్రి విశ్వం మళ్ళీ ఫోనులో మాట్లాడాడు. రేఖా అతనితో ఏమీ చెప్పలేదు.
ఎప్పుడూలాగానే
అతను మాట్లాడుతూనే ఉన్నాడు.
“మాధవి
వాళ్ళ అన్నయ్యను పిలిచి విచారిద్దాం అనిపిస్తోంది. అతను నాకు మంచి స్నేహితుడు.
కానీ, ఈ టైములో ఏది మాట్లాడినా తప్పు అయిపోతుందేమోనని
ఆలొచిస్తున్నా”
“నేనే గిరిధర్
గారితో మాట్లాడతాను”
అన్నది రేఖా.
“మీకు
ఆయన్ని తెలుసా?”
“ఒకసారి
ఆయనతో మాట్లాడాను. విచారించి చెబుతాను” అని ఫోను పెట్టేసింది.
అప్పుడు
ఆమెకు ఒక విషయం ఆలొచనకు వచ్చింది. ఇంతవరకు విశ్వమే ఆమెను పిలుస్తున్నాడు. ఆమెగా
ఒక్క రోజు కూడా అతన్ని పిలిచి మాట్లాడింది లేదు.
మాట్లాడ
కూడదు అని కాదు! ఈ విషయంలో ఖచ్చితంగా ఆమె ఏమీ చెయ్యలేని పరిస్థితి, అతనితో మాట్లాడటానికి సంకోచం-నేర భావన.
రోజు
రోజుకూ విశ్వం స్వరంలో బాధ, ఆవేదన ఎక్కువ అవటం గ్రహించింది. ‘ఇతను చెడ్డ వాడు కాదు’ అని అనిపించింది.
అందువలన
రేఖాకు మాధవి మీద కోపం ఎక్కువ అయ్యింది.
‘ఏం
ఆడది అది? ఎవరు మాట్లాడినా వినకూడదని పట్టుదల పడితే ఏమిటి
అర్ధం? తానుగా ఏదైనా తీర్మానించుకోవటం...తరువాత అదే
నిజమంటూ ఒంటి కాలు మీద నిలబడటం! దీని వలన నష్టం ఎవరికీ?’
ఆమె
ఇప్పుడు ఊరు వదిలి వెళ్ళిపోతుందనేదే ఎదురు చూడలేదు. అర్జెంటు పెళ్ళికి ఒప్పుకోవటం
ఇంకా ఆశ్చర్యంగా ఉంది!
‘గిరిధర్
గారితో మాట్లాడి ఆ వరుడి ఫోన్ నెంబర్ తీసుకుంటే ఏం? మాధవితో ఆయన మాట్లాడితే ఒక వేల ఆమె మనసు
మారుతుందేమో?’
రేఖా
తల పట్టుకుని కూర్చుండిపోయింది. కొంచం నిదానం తెచ్చుకుని సెల్ ఫోన్ తీసుకుంది. గిరిధర్
గారి నెంబర్ వెతికి పట్టుకుంది. ఫోన్ చేసింది.
“నమస్తే”
“మీరు... హైమా కదూ? బాగున్నారా?”
మొదట
ఆశ్చర్యపోయిన ఆమె తిరిగి మామూలు స్థితికి వచ్చింది “అవునండి, బాగున్నాను” అన్నది.
“బాగున్నాను...మా
మాధవి బాగుందా?” తిరిగి
అడిగాడు గిరిధర్.
‘సరిపోయింది!
ఆమె హాస్టల్ మారింది కూడా అన్నయ్యతో చెప్పలేదా?’ ఆశ్చర్యపోతూ ఏదో ఆలొచిస్తూ ఉన్నది.
“ఏమిటండీ
ఏదీ మాట్లాడటం లేదు?” అడిగాడు గిరిధర్.
“మాధవి
బాగుందండి” అన్న రేఖా
“వచ్చేవారం ఊరికి వెడుతున్నానని చెప్పింది”
“అవునండీ...ఆమెకు
పెళ్ళి నిశ్చయం అయ్యింది. మీ దగ్గర చెప్పుంటుందే?”
“చెప్పిందండీ...ఏర్పాట్లన్నీ
బాగా జరుగుతున్నాయా?”
“తాంబూళాల
ఫంక్షన్ చాలా సింపుల్ గా ఉండాలని అనుకున్నాము. అలాగే చేస్తున్నాము. పెళ్ళి పత్రిక
పంపిస్తాను, తప్పక
రావాలి”
“ఖచ్చితంగా
వస్తాను! మాధవి ఎప్పుడు అక్కడికి వస్తోంది?”
“ఏదో
పనుందట. అదంతా పూర్తిచేసుకుని రేపు మధ్యాహ్నం రైలులో బయలుదేరి వస్తానని చెప్పింది”
“సరే
నండి...మీరు హడావిడిగా ఉండుంటారు. తరువాత మాట్లాడతాను” అని ఫోను పెట్టేసింది.
‘కనుక.
మాధవి ఏదో మాటవరసకు చెప్పలేదు. నిజంగానే ఆమెకు నిశ్చయతార్ధం జరగబోతోంది. ఇది విశ్వంతో
తో చెప్పేయటమే మంచిందీ’
‘గిరిధర్
కు, విశ్వం సన్నిహిత స్నేహితుడు అని మాధవి
చెప్పిందే... మాధవి నిశ్చయతార్ధానికి విశ్వం ను గిరిధర్ పిలవడా?’
‘అతను పిలవాలనుకున్నా...ఆమె
అంగీకరించాలే’
రేఖా
కొన్ని నిమిషాలు ఆలొచించింది. విశ్వం ను పిలిచి మాట్లాడటానికి మనసు రాలేదు. కానీ, అతనితో విషయం చెప్పాలే.
ఆ
తరువాతి అరగంట ఒకే విషయాన్ని పలురకాలుగా రాసి రాసి చూసుకుంది రేఖా. దాన్ని విశ్వం
తో పక్వంగా చెప్పటం ఎలా అని ఆమెకు తెలియదు. అలాగే నిద్రపోయింది.
**********************************
విశ్వం, రేఖా ఆఫీసుకే వచ్చేసాడు.
అదే గది. కానీ ఆ రోజు గందరగోళంలో ఉన్నట్టు
కనిపించిన అతను ఈ రోజు దుఃఖం లో ఉన్నాడు. “మాధవికి పెళ్ళి నిశ్చయ మయ్యిందట. వాళ్ళ అన్నయ్య చెప్పాడు” అన్నాడు .
“ఓ!” అన్నది రేఖా. అంతకు మించి ఆమె వల్ల నటించటం
కుదరలేదు. “నేనూ నిన్ననే
విన్నాను” అన్నది.
“నేను
ఈ రోజు విన్నాను”
అన్నాడు విశ్వం. “ఇప్పుడు
ఏం చేయాలండీ? నా
మీద ఎందుకు కోపం వచ్చిందో కూడా చెప్పకుండా ఇలా సడన్
గా ఇంక్కొకర్ని పెళ్ళి చేసుకోవాలనుకోవడంలో ఏమిటండీ అర్ధం? అమ్మాయలకని వెరే న్యాయమా?”
“విశ్వం, ఆమె ఇలా చేయటానికి ఆమె వైపు ఏదో ఒక న్యాయం
ఉండొచ్చు కదా?” అంటూ
"మీరు ఆవేశపడకండి. తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం”
“ఇంక
చేయటానికి ఏముంది?”
“మాధవి
ఈ రోజు మధ్యాహ్నం ఊరికి బయలుదేరుతోంది! రైల్వే స్టేషన్లో ఆమెను కలిసి మాట్లాడి చూడండి. ఒక వేల ఆమె మనసు
మారొచ్చు”
“నాకు
ఆ నమ్మకం లేదండి. అయినా కానీ ప్రయత్నిస్తాను” అన్నాడు. తరువాత విరక్తిగా నవ్వి “నేరుగా మాట్లాడటం మంచిదే! ఆమె ఒప్పుకుంటే అదే
రైలులో ఊరికి వెళ్ళొచ్చు. లేదంటే చావటానికి రైలు పట్టాలు ఉన్నాయి” అన్నాడు.
ఆమె
షాక్ అవటం చూసి “వూరకనే
చెప్పేనండీ. నేను అంత ధైర్యం ఉన్నవాడినీ కాదు. అంత పిరికివాడ్ని కాదు” అన్నాడు.
**********************************
విశ్వం
ఒక్కొక్క రైలు పెట్టె ఎక్కి దిగితున్నాడు. మాధవి కనబడలేదు.
‘ఆమె
ఇంకా రాలేదా? లేక
బస్సులో ఊరికి వెళ్ళిపోయిందా? ఈ ప్రయత్నమూ ఫైల్ అవుతుందా?’
‘ఒక
వేల ఆమె రాకపోతే ఏం చేయాలి? నిశ్చయతార్ధ మండపానికి వెళ్ళి కేకలు పెట్టాలా? ఆమెకు నా మీద ఎందుకింత కోపం అనేది తెలిస్తేనా
కదా అది తీర్చగలను?’
నీరసంతో
ఒక సీటులో కూర్చున్నాడు. మాధవి, రేఖా, గిరిధర్ అందరూ తనని మోసం చేశారని కుమిలిపోయాడు.
అదే
సమయం మాధవి ఆ రైల్వే స్టేషన్ లోపలకు వచ్చింది. ఏవో స్నాక్స్ కొనుక్కుని రైలు
పెట్టెను చూసుకుంటూ నడిచింది.
ఆమె
తన పెట్టె దగ్గరకు వచ్చి చేరడం, విశ్వం అదే పెట్టెలో నుంచి దిగటం సరిగ్గా అమరింది. ఇద్దరూ
ఆశ్చర్యంతో ఒకరికొకరు చూసుకున్నారు.
మొదట
నిగ్రహించుకున్నది మాధవీనే. గబుక్కున పెట్టెలోకి ఎక్కి కిటికీ దగ్గర కూర్చుంది. విశ్వం
అక్కడున్నాడనే విషయమే గ్రహించనట్లు ఉన్నది ఆమె నడవడిక.
ఆ
కిటికీ దగ్గరకు జరిగాడు విశ్వం. “నిన్ను
చూసి ఒక వారం అవుతోంది మాధవీ”
ఆమె
సమాధానం చెప్పలేదు. అక్కడ్నుంచి లేచి వేరే సీటులో కూడా కూర్చోలేదు. అలాగే ఉన్నది.
“నీకు
నాతో ఏమిటి సమస్య మాధవీ? ఎందుకంత సడన్ గా నన్ను వదలి దూరంగా వెడుతున్నావు? మాట్లాడటానికి సంధర్భం కూడా ఇవ్వనంటున్నావు...నేనేం చేయను”
అతన్ని
నేరుగా చూసి “అమాయకుడిలా
నటించకు!” అన్నది.
“మళ్ళీ
పజిల్ వేస్తే ఏమిటి అర్ధం మాధవీ? నా మీద ఎందుకంత కోపమో బహిరంగంగానే చెప్పు”
“నన్నెందుకు
అడుగుతున్నావ్? ఆమెను
అడుగు”
“ఎవర్ని?”
“నీ
కొత్త ప్రేమికురాలుని?"
“కొత్త
ప్రేమికురాలా? ఏం
చెబుతున్నావు? ఎవరది?”
“ఏం? ఆమె పేరు నా నోటితో వినాలని ఆశ పడుతున్నావా?” అన్న మాధవి “ఇలా చూడు విశ్వం, నీ కొత్త ప్రేమకు నేను అడ్డురాను. నన్ను
ప్రశాంతంగా జీవించ నివ్వు. నీ దగ్గర అవస్థ పడింది చాలు”
“దయచేసి
విషయాన్ని పగులకొట్టి చెప్పు. సమస్య ఏమిటో తెలియక నీతో వాదించటం నాకు టయర్డ్ గా
ఉంది”
“నేనే
నీకు విసిగెత్తిపోయాను. ఇక నా మాటలు నిన్ను విసిగించవా ఏమిటి?”
“మార్చి
మార్చి అక్షర ఆట ఆడబోతామా?”
“నేనా
మొదలుపెట్టాను? నువ్వే
కదా నన్ను వెతుక్కుంటూ వచ్చింది?”
“అంటే, నువ్వు నాకు ఒక చాన్స్ కూడా ఇవ్వ దలుచుకోలేదా?”
“నేనెందుకు
ఇవ్వాలి? రేఖా దగ్గర ఇంకా పెద్ద చాన్సులు
దొరుకుతాయి కదా?”
“రేఖానా?”
“ఏం? విషయం నాకు తెలిసిపోయిందని షాక్ అయ్యావా?”--నవ్వూతూ అడిగిన మాధవి “ఎక్కడ ఆ రేఖా, ఎక్కడో దాక్కుని నిన్ను పంపించిందా?”
“మూర్ఖంగా
మాట్లాడకు మాధవి. ఇందులో రేఖా ఎలా
వస్తుంది?”
“అబ్బో, ఆమె మీద అంత మర్యాదనా? న్యాయమే!”
“మాధవీ
నువ్వు ఏం చెబుతున్నావో నాకు అర్ధం కావటంలేదు”
గబుక్కున
‘సెల్ ఫోన్’ తీసి, గబగబా వెతికి, ఆ ఫోటోను చూపించింది. “ఈ ఫోటోలో ఉన్నది నువ్వూ, ఆమే కదా?”
“అవును...దానికేమిటిప్పుడు?”
“నువ్వూ, నేనూ స్నేహంగా ఉండకూడదని ఆమె ఒంటి కాలు మీద
నిలబడ్డప్పుడు, ఆమెను
నువ్వు ఒంటరిగా కలుసుకోవటానికి అర్ధం?”
“మాధవీ...నేను...”
“నువ్వేమీ
మాట్లాడొద్దు. నాకు అంతా అర్ధమయ్యింది. ఆమె, నువ్వూ ఇష్టపడినట్లే నేనూ దూరంగానే నిలుచున్నా కదా. ఆ
తరువాత ఇద్దరూ ఎందుకు నన్ను మారి మారి ట్రబుల్ చేస్తున్నారు?”
“దీనికీ, రేఖాకీ ఎటువంటి సంబంధమూ లేదు. నువ్వు
తప్పుగా...”
“ఇప్పుడే
నేను సరిగ్గా అర్ధం చేసుకున్నాను. దయచేసి ఇంకా డైలాగులు మాట్లాడుతూ ఇక్కడ నిలబడకు.
నువ్వూ, తనూ ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు. ఇక నేను మీ
వైపుకే తిరగను...సరేనా...?”
అతను
ఆశ్చర్యపోతూ “నా
మీద నువ్వు నమ్మకం పెట్టింది ఇంతేనా?” అన్నాడు.
“నిన్ను
పూర్తిగా నమ్మేననటం నిజం. అందుకే నువ్వు చేసిన ద్రోహం నొప్పి పుట్టింది. క్షమించాలి...కొన్ని రోజులు నొప్పి
పుట్టించిందని మాత్రమే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ నొప్పి లేదు. పూర్తిగా
పోయింది. ఎలాగంటే నిన్నుపూర్తిగా
మర్చిపోయాను. దయచేసి మళ్ళీ నువ్వు నన్ను కలిసి కెలకకు?”
“నన్ను
నువ్వు తుచ్చంగా భావించవచ్చు. కానీ నాకు అన్నీ నువ్వే. అందువలనే ఒక వారం రోజులుగా
నిన్ను చూడాలని పిచ్చిగా తిరిగాను. నువ్వు నన్ను ప్లాను వేసి తరిమినా, ఎలాగైనా నీతో మాట్లాడితే అన్ని అపోహలూ తొలగిపోతాయి
అనుకున్నా.
నిన్ను
చూడటానికి ముందు నేను చాలా వేదన చెందాను. జీవితంలోని చిట్ట చివరి ఘటన
అంటారే...అక్కడ ఉన్నాను. కానీ, నువ్వు కనిపించిన తరువాత అన్ని సరైపోతాయి అనే నమ్మకం
వచ్చింది. ఇప్పుడు నువ్వే ఆ నమ్మకాన్ని
తీసి అవతల పారేసినందువలన, మునుపటి కంటే ఇంకా చివరి ఘట్టానికి వెళ్ళిపోతాను”
“ఈ
డైలాగులన్నీ బద్రంగా దాచుకో. రేఖాకి ద్రొహం చేసి ఇంకొక దాని దగ్గరకు వెళ్ళేటప్పుడు
ఉపయోగపడుతుంది. నేను ఓపెన్ గానే చెప్పాను. ఇకమీదట మనిద్దరి మధ్య ఏమీలేదు. బయలుదేరు”
మొహం
తిప్పుకుంది.
రైలు
జరగటం మొదలైయ్యింది.
విశ్వం, కిటికీ చివరిగా కూర్చోనున్న మాధవిని చూస్తూ అక్కడే నిలబడ్డాడు.
మాధవి
అతన్ని తిరిగి కూడా చూడలేదు.
కొద్ది
నిమిషాల తరువాత ఒకమ్మాయి... మాధవి ఎదురుగా వచ్చి కూర్చుంది.
‘నమస్తే” అని, “నేను మీ దగ్గర కొంచం మాట్లాడాలే!”
“చెప్పండి.
ఏమిటి విషయం?”---కొంచం
విసుగ్గా అన్నది.
“నా
పేరు మథులత... విశ్వం యొక్క మాజీ ప్రేమికురాలుని”
Continued...PART-10...చివరి భాగం
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి