28, జూన్ 2023, బుధవారం

వైరాగ్యం.. .(కథ)

 

                                                                                      వైరాగ్యం                                                                                                                                                                                                                                   (కథ)

వైరాగ్యం అంటే విరక్తి, అయిష్టత, నిరాసక్తత, విముఖత, పట్టుదల అనే వివిధ పదాలే వైరాగ్యం యొక్క అర్ధంగా భావించవచ్చు. వైరాగ్యం అనేది ఎలాంటి విషయాల్లో ఎప్పుడు ఏర్పడుతుందీ అంటే వివిధ సందర్భాల్లో నిరాశ కలిగినపుడు ఆయా విషయాలపట్ల నిరాసక్తత కలుగుతుంది.

వైరాగ్యం కలిగినందుకు బాధ, దుఃఖం ఉండవు. కానీ జీవితాంతం వైరాగ్యంతో ఉండటం కష్టం అంటారు.  ఎందుకంటే వైరాగ్యంగా ఉన్నవారిని తమ తమ సలహాలతో చాలమంది నిరాశపెడతారు. అలాంటి వాళ్ళ సలహాలకు, ఒత్తిడ్లకు లొంగిపోక తాను పట్టుదలతో తాను బ్రతకడమే నిజమైన వైరాగ్యం.

కథలో పూర్ణిమ తన పెళ్ళి తరువాత వైరాగ్యంతో జీవించింది. ఆమె చివరి వరకూ అదే వైరాగ్యంతో ఉన్నదా? అనేది తెలుసుకోవాలంటే కథ చదవండి:

మోనికా కు ఇంకో గంటలొ పెళ్ళి. మోనికా తండ్రి సుబ్బారావ్ మెల్లగా కల్యాణ మండపం వైపు నడుస్తున్నాడు. అతను తన కూతురుని చివరగా చూసింది ఊయలలో పాపగా ఉన్నప్పుడు!

అతనికి పెళ్ళి పిలుపు లేదు. ఎలా పిలుస్తుంది భార్య పూర్ణిమ? పాతవన్నీ అమె ఎలా మరిచిపోగలదు?

తాగుడు మత్తులో కారణమే లేకుండా కొట్టడం, తన్నడం అతనికి టైములో జ్ఞాపకం వచ్చి గుండెను నొక్కుతున్నట్లయ్యింది.

కల్యాణ మండపంలోకి వెల్దామా, వద్దా?---అనే ఆలొచనతోనే నడుస్తున్నాడు.

"ఇదిగో చూడండి...ఊరంతా మీ గురించి తప్పుగా మాట్లాడుతోంది. పోనీ దాన్ని వదిలేయండి. సరళా సహవాసమే వద్దు. మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను. మనకు ఒక ఆడపిల్ల ఉంది...అది పెరిగి పెద్దదై మీ గురించి తెలుసుకుంటే ఏమనుకుంటుంది?"

పూర్ణిమ ఏడుస్తూ బ్రతిమిలాడింది.

"పోవే! ఇది నా కూతురేనా అన్న సందేహం వస్తోంది!"

సుబ్బారావ్ అనుమానిస్తునట్లు మాట్లాడాడు.

పూర్ణిమ తన చెవులను మూసుకుంది.  

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

వైరాగ్యం.. .(కథ) @ కథా కాలక్షేపం 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి