5, జూన్ 2023, సోమవారం

మరవటం మర్చిపోయాను...(సీరియల్)...(PART-3)

 

                                                                        మరవటం మర్చిపోయాన...(సీరియల్)                                                                                                                                                         (PART-3)

ఆఫీసు లిఫ్టు’!

చెవిలో ఇయర్ ఫోన్ తగిలించుకుని పాటలు వింటూ నిలబడున్నది రోహిణీ. మూసుకుంటున్న లిఫ్ట్ తలుపులను వేగంగా పరిగెత్తుకు వచ్చి ఆపి లోపలకు దూరాడు శ్యామ్.

హాయ్ రోహిణీ...

హాయ్ శ్యామ్...

లిఫ్ట్పైకెక్కటం మొదలయ్యింది.

ఏం పాట వింటున్నావు?” అన్నాడు.

గబుక్కున అతనికి దగ్గరగా వచ్చి అతన్ని రాసుకుంటూ, తన చెవిలో ఉన్న ఇయర్ ఫోన్ను అతని చెవికి మార్చింది.

అంతా రామ మయం

గాడ్...బ్రహ్మాండం! అద్భుతం

అలాగా? పాట నీకూ నచ్చుతుందా శ్యామ్?”

లేదు...నువ్వు నన్ను ఇలా వచ్చి రాసుకుంటున్నది చెప్పాను

చటుక్కున కోపగించుకుని జరిగింది.

చూడటానికి మాడర్న్గా ఉన్నావు! బుర్ర కథ పాటలు వింటున్నావు?” అని శ్యామ్ ఎగతాలిగా నవ్వాడు.

అతన్ని కోపంగా చూసి వెళ్ళిపోయింది రోహిణీ.

ప్రసిద్ద హోటల్.

కంపెనీ డీలర్స్ ఇచ్చిన విందులో కలుసుకుని--కోలాహలంగా ఉన్నది ఆఫీసు మొత్తం.

రోహిణీ...

చెప్పు శ్యామ్

నావల్ల జీర్ణించుకోవటమే కుదరటం లేదు

మరి...ఫ్రీగా దొరుకుతోంది కదా అని మూడు ప్లేట్ల బిరియాని తింటే?”

అది చెప్పటం లేదు

మరి?”

నువ్వు ఒక అల్ ట్రా మోడ్రన్ గర్ల్’. నువ్వు పోయి బుర్ర కథ పాటలను విని ఆనందిస్తున్నావే...ఏదో అడ్డు తగులుతోందే! నేను హైదరాబాద్ అమీర్ పేటలో మనోతత్వ డాక్టర్ దగ్గర ఒక అప్పాయింట్ మెంట్తీసుకోనున్నాను

ఎప్పుడు వెళ్ళబోతావు?”

నాకు కాదు...నీకు

నేను బాగానే కదా ఉన్నాను

ఏదీ...నీ తలను బాగా ఊపు?”

ఊపి చూపింది.

ఎందుకు?”

లోపల నట్లు ఊడిపోయిన శబ్ధం వస్తున్నదా అని చూసాను

నేను బాగానే ఉన్నాను. నాకేమీ లేదు. నువ్వేమీ బాధపడక్కర్లేదు. నీ పని ఎలా పోతోంది?”

అలాగే ఉంది

ఏమిటీ?”

నాలుగు రోజుల క్రితమే నువ్వు ఆఫీసుకు వచ్చావు

అందుకని...?”

రోజు నుండి పనిచేయటం కుదరటం లేదు

అర్ధం కాలేదు...

ఇదిగో చూడు...ఇది చాలా చిన్న కథ. ఎక్కువగా బంకలాగా లాగలేము. అందువలన ఇప్పుడే చెప్పేస్తున్నాను. .లవ్.యూ రోహిణీ

రిజెక్టడ్! నీ అప్లికేషన్ను నేను తిరస్కరిస్తున్నాను

సరే. అట్నుంచి వస్తాను. నువ్వెలా ఉద్యోగానికి వచ్చావు?”

బస్సులో

నేను అది అడగలేదు...ఎందుకు వచ్చావు?”

పాత ఉద్యోగం చాలా విసుగు అనిపించింది. కొత్తగా ఏదైనా చేసి చూడాలని అనిపించింది. నీకు తెలుసా శ్యామ్...నేను లాచదివాను

అబ్బో...అలాగా? నువ్వు పెద్ద న్యాయాధిపతి అయ్యుండచ్చే?”

అది కూడా పెద్ద విసుగే. ఎదురుకుండా ఇద్దరు నిలబడి రోజంతా గోల గోలగా మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు, వాళ్ళ ఎదురుగా ఒక మహిళ కూర్చుని ఏమీ మాట్లాడకుండా వేడుక చూస్తూ ఉండటం లాంటి ఒక నరకం, లోకంలో ఇంకేదీ లేదు

అర్ధమయ్యింది. అయితే నీకు నచ్చిన ఉద్యోగం ఏది?”

ఏర్ హోస్టస్!

ఎందుకని?”

అక్కడే అందరు మగవాళ్ళనూ బెల్టుతో కట్టిపడేయగలం

హా...హా...హా...హా...

ఆమె ఏది చెప్పినా నవ్వాలని ఇంతకు ముందే తీర్మానం నెరవేర్చుకుని ఉన్నాడు శ్యామ్.

రోహిణీని ప్రేమ మాటలతో, ప్రేమ చూపులతో, సంధర్భం దొరికినప్పుడు ప్రేమ సైగలతో, చేష్టలతో పడేసి సరైన టైము చూసి గ్రద్ద చూపులతో ఎత్తుకెళ్ళిపోదాం అని కాచుకోనున్నాడు.

ఆఫీసు.

ఉద్యోగం సమయంలో కవిత్వం రాస్తున్నాడు. అతని డైరీ పిచ్చ పిచ్చగా కవిత్వ వర్షంతో తడుస్తూ ఉన్నది.

ఒక పేజీలో

రోహిణీ -- ఈమె నా కోసమే పుట్టింది!

ఆమెను నేను ప్రేమిస్తున్నాను.

ఆమె చిలిపి నవ్వును --

ఆమె గుండ్రటి కళ్ళనూ--

ఆమె పోడవాటి జడను --

నున్నగా ఉండే ఆమె కడుపును --

మెడకు కింద ఉండే హృదయ రూప మచ్చనూ --

మాట్లాడేటప్పుడు కొరికి లాగే ఆమె కింది పెదాలనూ --

ఆమె ఆవలింత  మౌనాన్ని --

తుమ్ము యొక్క సంగీతాన్నీ --

నుదుటి మీద పెట్టుకునే చిన్న బోట్టును ---

అవును రోహిణీ...నేను నిన్ను.

పిచ్చివాడిలాగా ప్రేమిస్తున్నాను

ప్రేమించుకో...నాకేమీ బాధ లేదు అన్నది రోహిణీ.

ఏమిటంత సాధారణంగా చెప్పేసావు? నాకే రుచీ పచీ లేదు. చెప్పులు తీయటం లేదా?”

ఇదిగో చూడు శ్యామ్...నన్ను నువ్వు ప్రేమించటం నీ ఇష్టం. నువ్వు మాత్రమే కాదు... ఆఫీసులో తొంబై శాతం మంది నన్ను ప్రేమిస్తున్నారని నాకు బాగా తెలుసు. ఆఫీసులో నన్ను ప్రేమించని మగాడు ఒకే ఒకడే 

ఎవరది?”

కంపెనీ ఎం.డి

ఆయన చనిపోయి నలభై సంవత్సరాలు అవుతోందే! ఆఫీసులో ఆయన ఫోటో మాత్రమే కదా ఉంది

అందుకోసమే ఆయన నన్ను ప్రేమించటం లేదు

ఏయ్ పాపీ

నా ఏరియాలో డెబ్బై శాతం. రోడ్డులో వెళ్తున్నప్పుడు ఎనభై శాతం...నన్ను చూసినంత మాత్రానే నూరు శాతం మగవాళ్ళు నన్నే ప్రేమిస్తున్నారని నాకు బాగా తెలుసు. నేనేమన్నా కృష్ణ పరమాత్మానా, అందరి దగ్గర ఒకే సమయంలో ఉండటానికి!

అయినా కానీ...

అయినా కానీ నీ ఊహలను నేను అడ్డుకోలేను. ఎవరి ఊహలనూ నేను అడ్డుకోలేను. చాలా మంది కలలలో...నేను దుస్తులు లేకుండానే వస్తున్నట్టు నాకే బాగా తెలుసు. నీ కలలో ఎలా వస్తున్నాను?”

అది...అది...

పరవాలేదు...చెప్పు

లంగా -- షర్టులో!

థ్యాంక్స్. అంత మంచి వాడివా నువ్వు?”

అంతలో అలారం మోగి నన్ను లేపి చంపుతోంది...దరిద్రం

అరె ఇడియట్...అదేకదా చూసాను. సరే...నువ్వు ఇంత నిజమన్నా చెబుతున్నావే! ఇలా చూడు శ్యామ్...నన్ను నీ కలలలో నువ్వేం చేసుకోవాలనుకుంటే అదే చేసుకో! కానీ, ఎదురుగా ఉన్నప్పుడు నన్ను ట్రబుల్ చెయ్యకు!

మరుసటి రోజు.

ఏయ్ ఏయ్ ఏయ్... శ్యామ్

ఏమిటి...ఏమిటి రోహిణీ?”

అదివ్వు...ఇవ్వు మొదట్లో...

రోహిణీ వేగంగా వచ్చి శ్యామ్ చేతిలో ఉన్న తన పెన్నును లాక్కుంది.

ఏమిటీ...ఒక పెన్ను కొసం...ఇలా...

ఇలా చూడు శ్యామ్...నా వస్తువులను అవతలి వారు ఉపయోగించటం నాకు ఇష్టం ఉండదు

పెన్నునే కదా తీసేను. దానికి ఇంత సీను వెయ్యాలా?”

పెన్నో...పెన్సిలో...? నా వస్తువులను ముట్టుకోకు -- అందులోనూ నా అనుమతి లేకుండా! నాకు నచ్చదు. నేను అదో రకం...

అదొక రకం అంటే?”

అదో రకం అంటే, దానివలన ఒక కంపెనీలో నాకు ఉద్యోగమే పోయిందని పెట్టుకో

అలాగా...అదెలా?”

నేను పనిచేస్తున్న కంపెనీలో, ఎం.డి తో మాట్లాడుతున్నాను. అప్పుడు నా చేతిలో ఉన్న పర్సనల్ డైరీకింద పడిపోయింది. ఎం.డి. చటుక్కున కిందకు వంగి అది తీసి ఇచ్చారు. వెంటనే నేను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి వచ్చాశాను

ఎందుకలా...ఎందుకు?”

నా పర్సనల్ డైరీని ఆయనెలా ముట్టుకోవచ్చు?”

ఏయ్.సిల్లీ గర్ల్...కిందపడిన డైరీనినే కదా ఆయన తీసిచ్చాడు?”

నేను అంత పొససివ్,సెన్సిటివ్అని చెప్పొచ్చాను. ఇక మీదట నా వస్తువులను దేనినీ ముట్టుకోకు

ఓసి రాక్షసీ. నేను నిన్ను పాల్కోవా అనుకున్నాను. నువ్వొక సైకోనా?”

మద్యాహ్నం లంచ్ టైము.

వేగంగా శ్యామ్ దగ్గరకు వచ్చింది రోహిణీ.

నేను క్యాంటీనుకు వెళుతున్నాను. నీకేమైనా కావాలా?”

నాకు ఏం కావాలో నీకు బాగా తెలుసు రోహిణీ అంటూ రోహిణీని ఆశగా చూసాడు.

ఏమిటలా చూస్తున్నావు?”

మళ్ళీ అదేలాగానే చూస్తూ నిలబడ్డాడు.

ఏమిటీ...ఏం కావాలి? నోరు తెరిచి చెబితేనే కదా తెలుస్తుంది?”

శ్యామ్ మెల్లగా, “వేడిగా కాఫీ అన్నాడు.

అంతేనా? నువ్వు ఇంకేదో చెప్పబోతావని అనుకున్నా

ఏం చెబుతానని అనుకున్నావు?”

రోహిణీ సర్దుకుని టీ చెబుతావేమోనని అనుకున్నా

ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకున్నారు.

రోహిణీ...నేనొకటి చెప్పనా?”

...

నేను నీకు బల్బుఇస్తే, నువ్వు నాకు ట్యూబు లైటుఇస్తున్నావు

రోహిణీ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.

మేనేజర్ హాయ్రామప్ప గది.

శ్యామ్... ఆదివారం ఏం చేస్తావు?”

అది సోమవారం నాడే సార్ నాకే తెలుస్తుంది

అలాగంటే...?”

ఏదో ఒకటి చేస్తాను సార్. ఇప్పుడు తెలియదు. సొమవారం ఆలోచిస్తేనే ఆదివారం ఏం చేసానో నాకే అర్ధమవుతుంది. ఏం సార్...ఒక బ్యాచులర్దగ్గర ఇలా కఠినమైన ప్రశ్నలన్నీ అడుగుతున్నారు?”

ఆదివారం ఆఫీసు స్టాఫ్ అంతా కలిసి టూర్ వెళుతున్నాం. నువ్వు వస్తావా...?”

ఖర్చు దండగ. నేను రాను...

ఏం.డి కూతురు మాధవి కూడా వస్తోంది. చూడటానికి ఆమె సూపర్ గా -- పాల మీగడ గడ్డలా తళ తళమని ఉంటుంది

ఛఛ...ఒక మేనేజర్ మాట్లాడే మాటలా ఇవి? నేను రాను సార్

ఆఫీసు మొత్తమూ అని చెప్పాను

నేను రాను అని చెప్పాను

ఆఫీసు మొత్తం అంటే నీకింకా అర్ధం కాలేదంటే నువ్వు ఉత్త మట్టి బుర్రగాడివి. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఉద్యోగమే ఎలా చేస్తున్నావో తెలియటం లేదు. నీకు అర్ధమయ్యేటట్టు నేనే చెబుతా...ఆఫీసు మొత్తం అంటే రోహిణీని కూడా కలిపి

సార్...నేనెప్పుడు రానని చెప్పాను?”

                                                                                                              Continued....PART-4

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి