24, జూన్ 2023, శనివారం

మరవటం మర్చిపోయాను...(సీరియల్)...(PART-12)

 

                                                                        మరవటం మర్చిపోయాను...(సీరియల్)                                                                                                                                                         (PART-12)

శ్యామ్ చాలా శోకంగా ఉన్నాడు.

రోజు వరకు అతను అంత ఎక్కువగా తాగింది లేదు. గది స్నేహితుడు తన చెల్లి పెళ్ళికొసం ఊరికి వెళ్ళిపోవటం చాలా మంచిదయ్యింది. ఎటువంటి ట్రబుల్ లేని మౌనం.

మరుసటి రెండు రోజులు అతను ఉద్యోగానికి వెళ్ళలేదు.

మేనేజర్ దగ్గర నుండి, ఆఫీసు నుండి పలు ఎస్.ఎం.ఎస్. లు, ఫోన్లు. ఏదీ చూడలేదు. సమాధానం చెప్పలేదు. బయట కనెక్షన్ పూర్తిగా కట్ చేసాడు. ఒక గ్లాసు లోనే నివాసమున్నాడు. మధ్యం గిన్నె ఒడిలో మత్తు ఎక్కే వరకు పడి శోకాలుపెట్టాడు.

నాలగవ రోజు.

రోజైనా ఉద్యోగానికి వెళ్దామని స్నానం చేసి, డ్రస్సు మార్చుకుని బయలుదేరే ముందు, తలుపులు తడుతున్న శబ్ధం. తెరిచాడు.

రోహిణీ నిలబడుంది.

పట్టుచీర, తల స్నానం పూర్తిచేసిన తడి తల, గుడికి వెళ్ళి వచ్చిన దాని వేషాధారణలో కనిపించింది.

సారీ శ్యామ్

ఏం కావాలి?”

నేను అలా చేసుండకూడదు

ఎలా?”

నీ దగ్గర కోపంగా ఉండి ఉండకూడదు. సారీ

నాలుగు రోజులుగా ఆమె మీద ఉన్న కోపం ఒకే మాటతో తీరిపోయింది.

పరవాలేదు...వదులు

రియల్లీ...సారీ

ప్రేమికులు సారీ అడగక్కర్లేదు రోహిణీ

హోటల్లో పోట్లాడి దెబ్బతిన్న చోట ఇంకా ఎర్రగానే ఉంది. రోహిణీ చోటును ముట్టుకుని చూసింది.

బాగా నొప్పిగా ఉందా?”

ఇప్పుడు లేదు

ఖచ్చితంగా?”

నీకొసం నేను కష్టపడి పోట్లాడి దెబ్బ తీసుకున్నది. అందువలన నొప్పి పుట్టదు

నాకోసం తిన్నది ఉండనీ. ఇదిగో చూడు. నీకొసం నేను తీసుకున్నది

ఒక నగ పెట్టెను తెరిచింది.

జత డైమండ్ ఉంగరాలను చూపించింది.

షాకైయ్యాడు.

ఎంత?”

నలబై వేలు

ఎందుకింత కాస్ట్ లీ?”

నా క్షమాపణ ఎప్పుడూ కాస్ట్ లీ నే...

శ్యామ్ యొక్క వేలుకు ఉంగరం తొడిగింది.

జవాబుగా శ్యామ్, రోహిణీ యొక్క వేలుకి ఉంగరం తొడిగాడు.

వెంటనే అతని ఛాతి మీద వాలిపోయింది.

ఇక మీదట నువ్వూ, నేనూ భార్యా-భర్తలం

అంత సాన్నిహిత్యం అతను ఎదురు చూడలేదు!

అవును శ్యామ్, తాలి అవసరం లేదు. నువ్వే నా సరి సగం

ఇద్దరూ మొహానికి మొహం రాసుకుని...ప్రాణ శ్వాస పంచుకుని...గట్టిగా కౌగలించుకుని... ఒకటిగా కలిసి---

ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు విసుగు విసుగ్గా కట్ చేయాల్సిన దృశ్యాలు అక్కడ చోటు చేసుకున్నాయి.

చివరిలో ఇద్దరూ కలిసి స్వర్గం యొక్క తలుపులను తెరిచారు.

అన్నీ పూర్తి అయిన తరువాత ఆయసపడుతూ అడిగాడు శ్యామ్.

ఎలా రోహిణీ మార్పు? ఇప్పుడు మనిద్దరి మధ్యా ప్రేమ వర్క్ అవుట్ అయిపోయిందా?”

జీవితంలో జరిగే కొన్ని విషయాలకు కారణం ఏమిటో చెబితే చాలా చప్పగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివి అడగొద్దు శ్యామ్

మాటి మాటికీ నీకు తలనొప్పి వస్తోందే...ఎందుకు రోహిణీ? ఇప్పుడు ఎలా ఉంది?”

చటుక్కున ఒక్క క్షణం రోహిణీ మొహం మారి తరువాత సర్ధుకుని నవ్వింది.

దీనికంటే నువ్వు ముందు అడిగిన ప్రశ్న బెటర్

సరే. అయితే నేను అదే అడుగుతాను. ఇప్పుడు మనిద్దరిలో ప్రేమ వర్క్ అవుట్ అయింది కదా?”

దీనికి సమాధానం రేపు నీకు ఆఫీసులో తెలుస్తుంది అంటూ మళ్ళీ అతన్ని గట్టిగా కౌగలించుకుంది.

                                                                                                                Continued...PART-13

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి