గాలితో ఒక యుద్దం (నవల)
నవలలు
అంటేనే చాలా వరకు సస్పెన్స్, మర్మం కలిగే ఉంటాయి, నవలలు అంతకు మించి మంచి విషయాలను ఆలోచింపచేయదు అనే ఒక
విమర్శ కొందరిలో ఉంది.
అందులోని కొంతమంది చాలా వరకు మర్మ నవలలను రాయడానికి ప్రయత్నించి, రాయలేకపోయారు. వీళ్ళ విమర్శలూ 'ఛీఛీఛీ...ఈ పండూ పులుపే' అనే రకమే!
ఈ 'గాలితో ఒక యుద్దం' కూడా మర్మ నవలే. అదే సమయం ఈ నవల, ఈ రోజు మనిషి జీవితంలో ఉన్న అధ్యాత్మిక నమ్మకాలను, వాటిని నిర్లక్ష్యం చేయటం వలన ఏర్పడే పరిణామాలను, నష్టాలను అన్వేషించి చూస్తోంది. నవల పూర్తిగా ఈ రోజుల్లో సమూహ స్థితిని రిజిస్టర్ చేస్తోంది. నవల ముగింపు కొందరిని ఆశ్చర్యపరుస్తుంది, కొందరిని ఆలొచింపచేస్తుంది.
*********************************
కొన్ని నమ్మకాలు వినోదంగా ఉంటాయి. కొన్ని నమ్మకాలు లోతుగా ఉంటాయి. కొన్ని నమ్మకాలు చిక్కుముడిలాగా ఉంటాయి. కొన్ని నమ్మకాలకు అర్ధమే ఉండదు. కానీ, నమ్మకాలు...నమ్మకాలే! అదిలేకపోతే ఒక్క అడుగు కూడా ఒక్కరూ ముందుకు వేయలేరు. మనం నిద్ర నుండి లేస్తున్నప్పుడే నమ్మకం కూడా మనతో పాటూ కలిసే లేస్తుంది. ఈ రోజు ఖచ్చితంగా సూర్యుడు ఉదయిస్తాడు. తాగటానికి నీళ్ళు దొరుకుతాయి లాంటి విషయాలు ఎన్నో కాలల నుండి మనల్ని మోసం చేయకుండా ఉంటున్న నమ్మకాలు!
వాకిట్లో మోటార్ సైకిల్ శబ్ధం.
తొంగి చూసింది పల్లవి.
కార్తిక్ లోపలకు రావటం కనబడింది. అతనికి ముప్పై సంవత్సరాల వయసు.
“అన్నయ్య వచ్చాసాడు” అని అరిచింది పల్లవి.
అది విని వంట గదిలో నుండి తల్లి విమలాదేవి, పెరట్లో బట్టలు ఉతుకుతున్న అతని భార్య అఖిల, పూజ రూములో నుండి తండ్రి రామశర్మ హాలులోకి వచ్చారు.
హాలులో కొన్ని వెదురు కుర్చీలు, ఒక కుషన్ సోఫా వేసున్నాయి. మధ్యలో ప్లాస్టిక్ మోడా. దానిపైన ఆ కుటుంబం చదివే దిన పత్రికలు, వార పత్రికలు పడున్నాయి. అందులో ఒకటి పల్లవి చేతిలో ఉంది.
కార్తిక్ నీరసంగా లోపలకు వచ్చి ఒక వెదురు కుర్చీలో కూర్చున్నాడు.
ఎక్కువ చెమటతో తడిసిపోయున్నాడు. నిట్టూర్పు వచ్చింది.
అందరూ అతన్నే ఆసక్తితో చూస్తున్నారు.
విమలాదేవి మాత్రం మాట్లాడటం మొదలు పెట్టింది.....
“వెళ్ళిన పని ఏమైందిరా అబ్బాయ్?”
“మంచిగా జరిగుంటే నేనిలా నిట్టూర్పు విడిచే వాడినా?”--అతనూ తిరిగి అడిగాడు.
“సరే అబ్బాయ్...ఏం జరిగింది? అదైనా చెప్పు” ---ఇది అతని తండ్రి రామశర్మ.
“ప్రయోజనం లేదు నాన్నా! 'గాలిపేట ఇల్లు’ అంటేనే అందరూ పరుగెత్తి వెళ్ళిపోతున్నారు.”
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
గాలితో ఒక యుద్దం…(నవల) @ కథా కాలక్షేపం-2
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి