27, జూన్ 2023, మంగళవారం

మరవటం మర్చిపోయాను...(సీరియల్)...(PART-14)

 

                                                                      మరవటం మర్చిపోయాను...(సీరియల్)                                                                                                                                                          (PART-14)

మరుసటిరోజు.

శ్యామ్, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు రెండు పెద్ద షాకింగ్ వార్తలు కాచుకోనున్నాయి.

హాయ్ గదిలో జగదీష్ నవ్వుతూ కూర్చోనున్నాడు.

అది శ్యామ్ కు అతిపెద్ద సంతోషకరమైన షాక్ గా ఉన్నది.

జగదీష్...ఎలా ఉన్నావు?” అన్నాడు.

శ్యామ్ అన్నయ్యా...నేను పూర్తిగా గుణమయ్యాను. ఇప్పుడు బాగున్నాను. మావయ్య, నాకు జరిగిన ట్రీట్ మెంట్ గురించి అన్నీ చెప్పారు. ఒక మూడు నెలలుగా నేను మామూలు మనిషిగాలేకుండా మిమ్మల్నందరినీ కష్టపెట్టాను అని అనుకుంటున్నప్పుడు...నాకు అదోలాగా ఉన్నది

నో...నో... నువ్వు గుణమై తిరిగి మామూలు మనిషిగా మారటం మాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? మనకు మనకి అక్కర్లేని, మనల్ని బాధపెట్టే జ్ఞాపకాలను ఇలా చెరిపేసుకోవచ్చు అని అనుకుంటున్నప్పుడు, ఆశ్చర్యంగానూ -- హ్యాపీ షాకుగానూ ఉంది. సైన్స్ మనుషులను భగవంతుడికి సరిసమంగా చేసేసింది. దాన్ని సెలెబ్రేట్ చేయటానికి నా ఖర్చులతో ఒక పార్టీ పెట్టే  తీరాలి

హమ్మయ్య...నేను తప్పించుకున్నాను అన్నారు, అప్పుడే లోపలకు వచ్చిన హాయ్.

ట్రీట్ మెంటుకు ఎన్ని రోజులయ్యింది?” అడిగాడు శ్యామ్ ఆశ్చర్యంగా.

మామూలుగా సగం రోజులో -- మనకు అక్కర్లేని జ్ఞాపకాలను మెదడులో నుండి చెరిపేస్తారట. నేను మొదటి కేసు, అందులోనూ పరిశోధనా పేషెంటు కాబట్టి దగ్గర దగ్గర ఒక నెలరోజులు తీసుకున్నారు

సగం రోజులో అక్కర్లేని జ్ఞాపకాలను తుడిచేయడం కుదురుతుందా? అద్భుతం! అన్నాడు శ్యామ్. కానీ అతని మొహంలో అపనమ్మకం తొంగి చూసింది.

సరే శ్యామ్, నాలుగు రోజులూ నివ్వెక్కడికి వెళ్ళావు...అందులోనూ ఆఫీసులో  చెప్పకుండా

మేనేజర్ హాయ్ ఎప్పటిలాగే విసుక్కున్నారు.

లేదు సార్...ఊర్లో ఒక సమస్య

చెప్పి వెళ్లటానికి ఏం?”

అదే ఇప్పుడు వచ్చేసానుగా...వదలండి సార్. ఇంకేమన్నా విషయం ఉందా...చెప్పండి?”

ఏం.డీ. కూతురు మాధవి...

అవును...ఆవిడకేమిటి?”

ఆవిడే ఇప్పుడు ఆఫీస్ ఇన్ చార్జ్’. ఆమెతో పాటూ నువ్వు ఉండి, కంపెనీ వర్కింగ్ విధానాన్ని ఆమెకు నేర్పించాలి. నువ్వెక్కడ, ఎక్కడ అని అడుగుతూ నన్ను నాలుగురోజులుగా హింసపెడుతోంది

నేనేమన్నా ఆమెకుపి.నా?”

అవును. ఇకమీదట అంతే

పొండిసార్...వేరే పనిలేదా?”

లేదే!

నన్ను వదలండి సార్. మీ 'పి.' రోహిణీని ఆమెకు పి.చేయండి

ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళిపోయింది

ఏమిటి? రాజీనామానా?...ఊరుకోండి సార్. నాతో ఆటలెందుకు సార్ మీకు

శ్యామ్ ఇది ఆటకాదు--ఫాక్టు. నిజంగానే రోహిణీ పని వదిలేసి  వెళ్ళిపోయిందయ్యా

ఎప్పుడు?”

రెండు రోజులయ్యింది

ఈసారి మరో అతిపెద్ద షాకుకు గురి అయ్యాడు శ్యామ్.

రెండు రోజులయ్యిందా? నా దగ్గర చెప్పనే లేదే?”

నా దగ్గరే ఆమె సరిగ్గా చెప్పలేదు

ఎందుకు రాజీనామా చేసింది?”

ఆమె ఒక క్రాక్’. మొదట రాజీనామా లెటర్ మాత్రం ఇచ్చింది. ఎందుకు రాజీనామో చేస్తున్నావో కారణం చెబితేనే నిర్ణయం తీసుకోగలను అన్నాను. వెంటనే కోపంతో నాకు శ్యామ్ యొక్క ట్రబుల్ ఎక్కువగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను. అందువలన రాజీనామా చేస్తున్నాను. లెటర్ ఇటివ్వండి...కారణాన్ని దాంట్లో కూడా రాసిస్తాను అన్నది

ఏమిటీ...నేను ఆమెను ట్రబుల్ చేస్తున్నానా? ట్రబుల్ తట్టుకోలేక రాజీనామా ఇస్తున్నట్టు చెప్పిందా?”

అవునయ్యా. కానీ, నేను వదుల్తానా? ‘శ్యామ్ యొక్క ట్రబుల్ ఎక్కువగా ఉందంటే, అతన్ని డిస్మిస్ చేస్తాను. నువ్వు ఉద్యోగం వదిలి వెళ్ళకు. నిజం చెప్పుఅని అడిగాను

ఏమిటి సార్! ప్రతి ఒక్కరూ నన్ను ఇలా డ్యామేజ్ చేస్తున్నారు? మీకు నాకంటే ఆమె ఎక్కువ అయిపోయిందా?”

ఉండవయ్యా బాబూ -- ఊరికే అలా ఒక ఎర వేసి చూసాను. వెంటనే రాసిన దానిని కోపంగా చెరిపేసి, దానిపైనే...నాకు మెదడులో గడ్డ ఉంది. అందువల్ల ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానుఅని రాసిచ్చింది. నేను అడిగినదానికి ఉద్యోగం రాజీనామా చేయటానికి మీకు ఏదో ఒక పిచ్చి కారణం కావాలి...అంతే కదా సార్. కారణం ఏదైతే మీకేంటి?’ అని అంటూ నిర్లక్ష్యంగా చెప్పేసి వెళ్ళిపోయింది

ఆమె ఒక ఇడియట్. ఆమెకు బుర్రే లేదు. తరువాత దాంట్లో గడ్డ ఎందుకు వస్తుంది?”

ఆమెకు ఏముంది...ఏం లేదు అనేది నీకే బాగా తెలుసు?”

ఎగతాళా? ఏం సార్...ఆమె కారణం రాసిచ్చినా, మీరు దాన్నీ ఒప్పేసుకుంటారా?”

ఒప్పుకోలేదయ్యా! నేను వదుల్తానా? దానికి రుజువు ఏమిటి? ‘డాక్టర్ సర్టిఫికేట్కావాలి...అన్నాను. అది ఆమె ఎదురు చూడలేదు. సరే, తీసుకు వస్తానుఅని చెప్పి జీతం తీసుకుని వెళ్ళిన మనిషి. రెండు రోజులుగా మనిషి కనబడలేదు. ఎవరైనా ఇలా చేస్తారా శ్యామ్?”

సార్...ఆమె ఎప్పుడు, ఏం మాట్లాడుతుందో ఎవరికీ తెలియదు. పొద్దున బుగ్గల మీద ముద్దుపెడుతుంది. సాయంత్రం...మనం విడిపోదాం అంటుంది

...అంత జరిగిందా?”

ఒక ఉదాహరణకి చెప్పాను సార్

ఇంత పరిపూర్ణ ఉదాహరణను నేను ఇప్పుడే వింటున్నాను

ఆమె ఇలా అప్పుడప్పుడు మూడ్ అవుట్అవటానికి మెడిసన్ లో...

ఏం పేరు?”

అది...ఏదో పేరు. గుర్తుకురావటం లేదు...వదలండి

ఏం శ్యామ్...ఆమె నిజంగానే నీ బుగ్గలమీద ముద్దు పెట్టిందా?”

ఇప్పుడు విషయం అంత ముఖ్యమా సార్?”

చాలా ముఖ్యమయ్యా

అవును సార్. ఇచ్చింది. చాలా...? ఇప్పుడు రోహిణీ ఎక్కడ?”

ఎవరికి తెలుసు? ఆమె మన కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు అడ్రస్ రాసిచ్చింది. అడ్రస్సు ఎవరికీ తెలియదు

శ్యామ్ అయోమయంలో పడి నిలబడిపోయాడు.

మాధవి అందంగానే ఉంది. ఆమె తలుకులలోనూ, ధోరణిలోనూ, శరీరంలోనూ డబ్బూ, అంతస్తూ ఊరిపోయి ఉంది.

శ్యామ్...నువ్వు రాసిన గ్రీటింగ్ కార్డు వాక్యాలన్నిటినీ నేను చదివాను. జస్ట్ లవ్  ఇట్

థ్యాంక్యూ

తర్వాతి మ్యూజిక్ క్లాసు ఎప్పుడు? నీ దగ్గర గిటారు నేర్చుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది

అతని దగ్గరగా వచ్చి, అతన్ని రాసుకుంటూ నిలబడి అడిగింది. ఆమె అందచందాలను అతను ఫీలవగలిగేంత దగ్గర.

చెబుతాను మ్యాడమ్

ఎమిటీ...మ్యాడమా? నీకు నేను మాధవి మాత్రమే 

అది బాగుండదు మ్యాడమ్. ఇది ఆఫీసు. ఇక్కడ నేను నీ పేరు చెప్పి పిలిస్తే, అవతలివారికి మిమ్మల్ని గౌరవించాలని అనిపించదు

సరే! కానీ, ఆఫీసు టైము ముగిసిన తరువాత ఖచ్చితంగా మాధవీనే

రక్తం తాగే జలగ లాగా అతన్ని అతుక్కునే ఉన్నది మాధవి.

సాయంత్రం దాకా ఆమె నీడలాగా ఉండవలసి వచ్చింది. ఒక్కొక్క క్షణమూ శ్యామ్... శ్యామ్అంటూ సెకెండ్ల ముల్లు లాగా కొట్టుకుంది. అతని మాటలనూ--చూపులనూ--చూసి ఆనందించింది. చిన్న చిన్న విషయాలలో పరవశించింది. ఆమెతో మాట్లాడి మాట్లాడి రోహిణీని ఆ రోజు మరిచాడు శ్యామ్.  

సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు మాధవి మీద వేసిన వాసన... శ్యామ్ పైనా వచ్చింది.  

కానీ ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన శ్యామ్ కు మాటి మాటికీ రోహిణీనే గుర్తుకు వచ్చింది. రోజు రాత్రంతా అతను నిద్రపోలేదు. రోహిణీ జ్ఞాపకాలు అతన్ని వెంటాడినై.

                                                                                         Continued....PART-15

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి