7, జూన్ 2023, బుధవారం

మరవటం మర్చిపోయాను...(సీరియల్)...(PART-4)

 

                                                                       మరవటం మర్చిపోయాను...(సీరియల్)                                                                                                                                                          (PART-4)

ఆదివారం.టూర్!

బస్సే కోలాహలంగా ఉంది. టూరూ బయలుదేరటానికి ముందు ఏర్పడే ప్రారంభ కాల ఉత్సాహం, గుంపు దగ్గర కూడా కనబడింది. ఒకటే గోల, శబ్ధం, ఈలలూ, చప్పట్లూ, పాట, బస్సుకు పక్కన డాం.డాం.డాంమోత, నవ్వులు, గేలీ -- ఎగతాలి....

ఎం.డి. కూతురు మాధవి, అమెరికాలో చదువుకుని వచ్చింది. ఆమె, గుంపుకు కొత్త. అందరికీ పరిచయం చేయబడింది.

శ్యామ్ యొక్క చేతులను నొక్కి పట్టుకుని చాలాసేపు షేక్ హ్యాండ్ ఇచ్చింది. అది గమనించటం మరిచిపోలేదు రోహిణీ. ఆమెలో చిన్నదిగా ఒక ఈర్ష్య రవ్వపేలింది. అది ఎందుకుఅనేది ఆమెకే అర్ధం కాలేదు!  

శ్యామ్ కిగిటార్వాయించటం తెలుసు అని ఆరోజే ఆఫీసులో వాళ్ళందరికీ తెలిసింది. ఉండిపోరాదే..గుండె నీదేలేపాటను అతను మధురంగా గిటార్  వాయించ హాయ్రామప్ప లేచి డాన్స్ చేసారు. చప్పట్లు మారుమోగినై.

తరువాత మాధవి ఒక ఆంగ్ల పాట పాడగా, దానికి తగినట్లుగా ఇంపుగా గిటార్  వాయించాడు శ్యామ్. మాధవి బాగా ఎమోషనల్ అయ్యింది.

నీకు ఇంగ్లీష్ పాటలు నచ్చుతాయా?” అని అడిగింది.

అవన్నీ విన్నది కూడా లేదు

మరెలా వాయించావు?”

వాటన్నింటినీ ఎప్పుడో తెలుగులో కాపీకొట్టేసారుగా! అనగానే గుంపు  గొల్లుమని నవ్వింది. మాధవి కూడా నవ్వులతో తన నవ్వును కలిపింది.

మరి కొంతమంది కూడా పాడగా, వాళ్ళందరికీ కూడా గిటార్సంగీతం వాయించాడు శ్యామ్. అప్పుడప్పుడు ఓర కంటితో రోహిణీని చూస్తూ ఉన్నాడు.

రోహిణీనేమో మాధవి శ్యామ్ ను మింగేసేలాగా చూస్తూ ఉండటాన్ని గమనించింది. 

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కోసం బీచ్ రోడ్డులోని ఒక హోటల్ దగ్గర బస్సు ఆపబడింది. అందరూ టిఫిన్ సెంటర్ లోకి పరిగెత్తారు.

శ్యామ్ గిటారుతో హోటల్ తోట వైపుకు నడిచాడు. చాలా దూరం నడిచిన తరువాత ఒక పొద దగ్గరున్న చెట్టు కింద కూర్చున్నాడు. ఏకాంతంగా గిటార్వాయించడం ప్రారంభించాడు. సంగీతం ఉత్సాహంగా ప్రవహించింది. చుట్టుపక్కలను నింపింది. 

మాధవి తోట మట్టిలో వయ్యారంగా నడిచి వచ్చింది. ఆమె వేసుకున్న టైటైన టీ షర్ట్ బొత్తాలు జస్ట్ లైక్ దట్ ఊడిపోయి, ఆమె యౌవ్వనాన్ని అడ్వర్టైజ్ చేసింది. ఆమె యొక్క టైటైన జీన్స్, ఆమెను మరింత గ్లామర్ గా చూపించి కిక్ ఎక్కించింది.    

సంగీతాన్ని ఎంజాయ్ చేసింది ఆమె. ఇటువైపు, అటువైపూ పలు కోణాలలో నిలబడి తన మొబైల్ ఫోనులో ఫోటోలు తీసింది.

కళ్ళు మూసుకుని ఎంజాయ్ చేస్తూ, గిటార్ను వాయించి ముగించాడు శ్యామ్. కళ్ళు తెరిచినప్పుడు, ఫోటోలు తీస్తూ ఉన్నది మాధవి.

అయ్యో...అయ్యో...ఏం చేస్తున్నారు?”

అంత మర్యాద అక్కర్లేదు. మాధవి...నువ్వు...రా...పో...అంటూ చెప్పినా కూడా చాలు

ఏం చేస్తున్నావు నువ్వు? ఫోటోలన్నిటినీ తిరిగి ఇచ్చేయి. లేకపోతే డిలేట్

చేసేయి

ఎందుకని?”

ప్లీజ్...సెంటిమెంటల్ గా నాకు ఫోటోలు తీస్తే నచ్చదు. డిలేట్ చేసేయి...ప్లీజ్!

సరే! కానీ, ఒక షరతు

ఏమిటి?”

నాకు నువ్వు గిటారువాయించడం నేర్పాలి

అది చాలా సింపుల్. గి.టా.ర్...గిటార్ అంతే

“‘గిటర్అని మాట్లాడటం నేర్పించమనలేదు. గిటారు వాయించడం నేర్పించమన్నాను

నేనే ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఎవరైనా పెద్ద విద్వాంసుడి దగ్గర నేర్చుకో. బాగా నేర్పుతారు

లేదు లేదు...నేనేమన్నా వేదిక ఎక్కి కచేరీనా చెయ్యబోతాను? సింపుల్ గా పొద్దు పోవటానికి వాయించటం నేర్చుకుంటే చాలు

నేర్పించవచ్చు...తప్పులేదు. కానీ...

అయితే ఇప్పుడే నేర్పించు

సరే. ఇదిగో...మొదట గిటారును ఇలా పట్టుకోవాలి. ఇలా వాయించాలి

శ్యామ్, మాధవి చుట్టూ పట్టుకుని గిటార్ను పట్టుకోవటం నేర్పించ -----

దూరంగా, టిఫిన్ తింటూనే వీళ్ళనే చూస్తున్న రోహిణీ కోపంగా కుర్చీలో నుండి లేచింది.

ప్లేటును అలాగే పడేసి వాళ్ళ వైపుకు నడిచింది.

శ్యామ్, తప్పించుకోలేక మాధవిని కౌగలించుకుని నేర్పిస్తుంటే, ఆమె వాసన అతన్ని ఉక్కిరి బిక్కిరి చేయ, అతని చేతులు ఇష్టం వచ్చినట్టు ఆమె మీద పడగా--

ఆమేమో దాన్ని పట్టించుకున్నట్టే తెలియటం లేదు. అమెరికా ప్రకృతి.

రోహిణీ వేగంగా వచ్చి పొదకు అటుపక్కగా నిలబడి వాళ్ళను గమనించడం మొదలుపెట్టింది.

ఇదిగో చూడు మాధవి...ఇలా వాయించాలి -- అతను ఆమె చేతులను అదిమి పట్టుకుని వాయించి చూప, ఆమె ఒళ్ళు చెమటపట్టి వణికింది.

సడన్ గా ఎందుకింత చెమటలు పడుతున్నాయి నీకు?”

అది...అది...నువ్వు ముట్టుకున్న వెంటనే...

నేను వాయించటాన్ని గమనించు

అతని సన్నిహితాన్ని అనుభవించిన మాధవి కళ్ళు తడిసినై. ఏదీ అర్ధం కాలేదు ఆమెకు. అయినా కానీ, “... అన్నది.

పొదకి అవతలి వైపు నిలబడున్న రోహిణీ, పొద ఆకులను పీకి, కోపంతో నమిలి ఉమ్ముతున్నది.

తరువాత దీంట్లో కీ సిగ్నేచర్ఉంది, ‘టైం సిగ్నేచర్ఉన్నది

మాధవి శరీరం జలదరించింది. ఇంత స్పీడుగా నేర్పొద్దు శ్యామ్. ఏదీ అర్ధం కావటం లేదు. ఒకే రోజులో పూర్తి చేస్తావా?”

నువ్వు సరిగ్గా వాయించేటప్పుడు, నీకు శబ్ధం వినిపించాలి

శ్యామ్ వాయించి చూపించాడు.

శబ్ధం వినబడుతోందా?”

వినబడలేదు

పొదల వెనుకే ఉన్న రోహిణీ హఠాత్తుగా అరిచింది. ...అయ్యో...అమ్మో...

ఇప్పుడు వినబడుతోంది... అన్నది మాధవి.   

శ్యామ్ అధిరిపడ్డాడు. ఏయ్...అది...నేను కాదు. వేరే ఎవరో అరుస్తున్నారు

శ్యామ్ పొద చుట్టూ పరిగెత్తుకు వెళ్ళి చూసాడు. మరోసారి అధిరిపడ్డాడు.

అక్కడ రోహిణీ తన కాలు పుచ్చుకుని పడిపోయింది.

అయ్యో రోహిణీ...ఏమైంది?”

పా...పా...పా...

పాల ఐస్ క్రీం కావాలా?”

ఊహూ. పా...పా...పా...

పాపం పసివాడు సినిమానా?”

మాధవి పరిగెత్తుకు వచ్చింది. గాడ్... రోహిణీ. ఏం జరిగింది?”

పా...పా...పాము...! అయ్యో నా కాలు మీద పొదల్లో ఉన్న పాము కాటేసి వెళ్ళిపోయింది...పెద్ద పాము...నాగు పాము...

పామా! -- శ్యామ్ బెదిరిపోయి గెంతులు వేశాడు.

వెళ్ళిపోయిందా...ఎటు వెళ్ళింది?” అడిగింది మాధవి ఆదుర్దాగా.

ఎటు వెళ్ళింది అంటే...వెళ్ళేటప్పుడు అదేమన్నా అడ్రస్సు ఇచ్చా వెళుతుంది...ఎక్కడికో వెళ్ళిపోయింది...అదిగో...అటే వెళ్ళింది

రోహిణీ ఏదో ఒక వైపుగా చై చూపింది.

మాధవి వంగుని అటువైపుగా పాముని వెతుక్కుని వెళ్ళింది.

శ్యామ్ తిరిగి రోహిణీని చూశాడు.

అతను చూస్తూ ఉన్నప్పుడే, రోహిణీ యొక్క ముక్కులో నుండి సన్నగా నెత్తురు కారటం ప్రారంభించింది.

అది చూసి శ్యామ్ భయపడిపోయాడు. అయ్యో... రోహిణీ...ముక్కు నుండి నెత్తురు. డాక్టర్...డాక్టర్... కేకలు వేశాడు.

శ్యామ్... శ్యామ్...భయపడకు...భయపడకు

డాక్టర్...డాక్టర్

ఏయ్... షెటప్! గోల చేయకుండా ఇలా కూర్చో. నేను చచ్చి పోతానేమోనని నాకు భయంగా ఉంది...నా పక్కన కూర్చో శ్యామ్. నేను నీ మీద కొంచం ఆనుకుంటాను...

లేదు...డాక్టర్ దగ్గరకు...

డాక్టర్ దగ్గరకు తరువాత వెళదాం. చెబుతున్నా కదా...కొంచం పక్కన కూర్చోరా...ఇడియట్! --- రోహిణీ చివాట్లు పెట్టింది.

శ్యామ్ భయపడుతూ కూర్చున్నాడు.

రోహిణీ అతని మీద వసతిగా ఆనుకుంది.

ఏయ్...ఏం చేస్తున్నావు...?”

అయ్యో...కళ్ళు బైర్లు కమ్ముతున్నాయే! తలతిరుగుతోందే...నోట్లో నురుగు వస్తోందే...గుండె దఢ దఢ మని కొట్టుకుంటోందే

పాము కనబడక మాధవి తిరిగి వచ్చి అడిగింది. ఏయ్...పాము చోట కరిచింది...?”

కాలు మీద... అన్నది రోహిణీ.

కాలు చూపించు...

రోహిణీ కాలు ఎత్తి చూపింది... మాధవి అనుమానంతో చూసింది.

ఏయ్...కాలు మీద పాము కరిచిన గాట్లే ఏమీ లేవే...?”

అది నోరు లేని జీవి...దాని నోరును వెతికితే కనబడుతుందా? శ్యామ్...నాకు గుండె అంతా పట్టేస్తున్నట్టు ఉంది. తల తిరుగుతోంది. నన్ను వదిలేసి వెళ్ళిపోకు...

రోహిణీ...రా! డాక్టర్ దగ్గరకు వెళదాం...

నావల్ల నడవటం కుదరదు. ఇదిగో ఈమెను వెళ్ళమని చెప్పు. ఏయ్ మాధవీ...త్వరగా వెళ్ళు. డాక్టర్ను పిలుచుకురా...

నేనా...నేను వెళ్ళను

రోహిణీ ఉమ్మును నురుగులాగా నోటి ద్వారా బయటకు వదిలింది.

శ్యామ్ భయపడి అయ్యో...నోట్లోంచి నురుగు వస్తోంది. వెళ్ళు మాధవీ...త్వరగా. డాక్టర్...డాక్టర్... అని అరిచాడు.

తోట మట్టినేలపై నడవటానికి తడబడుతున్నా వేగంగా అడుగులు వేస్తూ ఆయాసపడుతూ పరిగెత్తటం మొదలుపెట్టింది మాధవి.

రోహిణీ గబుక్కున లేచి కూర్చుని ఆమె పరిగెత్తటాన్ని వేడుకు చూస్తూ నవ్వింది.

శ్యామ్ ఆశ్చర్యపోయి, “ఏయ్...అయితే పాము కరవలేదా?”

పాము ఏమిటీ, నన్ను కరవట మేమిటీ! నేను చైనా హోటల్లోనే పాము మాంశం తిన్న దాన్ని

మొదట నెత్తురు వచ్చిందే? నోటి నుండి నురుగు వచ్చిందే...?”

అయ్యో...మాటి మాటికీ అదే చెప్పకు! అదంతా సెటప్

అలాగా... మాధవి పాపం అని శ్యామ్ జాలిపడ్డాడు.

రోహిణీ కోపంగా చూస్తూ, “ఏమిటి పాపం? ఒక తెల్ల తోలు వచ్చి గిటార్ నేర్చుకోవాలి అన్న వెంటనే టాం టాం అంటూజొల్లు కార్చటమేనా? ఏముంది...డబ్బు గలది కదా! అలాగే బ్రాకెట్ వేసేద్దామని చూస్తున్నావా? నాకు తెలుసయ్యా...నీ లక్ష్యమే అడ్డు దోవలో డబ్బు సంపాదించాలి. అంతే కదా?”

ఛఛ

మరి? దొరికింది కదానని గట్టిగా కౌగలించుకుని కరిగి కరిగి గిటారు నేర్పిస్తున్నావు...చంపేస్తా!

నిన్ను అర్ధం చేసుకోవటమే కుదరటం లేదు

నన్ను అర్ధం చేసుకోవటానికి జన్మలో ప్రయత్నించకు

ఏం రోహిణీ?”

"అది నీవల్ల కాదు. అటు చూడు...ఆమెను ఎలా పరిగెత్తించానో

శ్యామ్ మళ్ళీ అటు వైపు చూశాడు.

డాక్టర్...డాక్టర్ అని అరుస్తూ మాధవి తోట మట్టినేలపై పరిగెత్తలేక అవస్తపడుతున్నది తెలుస్తోంది.

రోహిణీ పడీ పడీ  నవ్వింది.

శ్యామ్ జాలిగా మాధవి వెళ్తున్నవైపు చూస్తూ, ‘ రోహిణీ ఒక మర్మ దేవతఅని అనుకున్నాడు.

                                                                                                                Continued...PART-5

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి