మాయల ముని (కథ)
నమ్మకం అనేది మన
జీవితంలో అతి ముఖ్యమైన భాగం. నమ్మకం లేకుండా మనం మన నిజ జీవితములో అంగుళం కూడా
కదలలేము.
భగవంతునిపై నమ్మకం
అనేది బహుశా అత్యంత ఉన్నతమైనది మరియు పరిణతచెందినది. మన తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, పొరుగువారు మరియు యజమానులపై నమ్మకం ఉంచడం
చాలా సులభతరం, ఎందుకంటే వారు మనము ప్రత్యక్షంగా అనుభవించగల స్పష్టమైన
వ్యక్తులు. కానీ దేవుని గురించి మనకు ఎటువంటి అనుభవము లేదు, అందుకే ఆయన మీద నమ్మకం అంత సులభం కాదు.
ఇది అంత సులభం కానప్పటికీ, ఇది ఇది మానవ జీవితములో జరిగే ఒక గొప్ప అద్భుతం.
దేవునిపై నమ్మకం
ఉంచటం అంటే మనము దేవునికి ఎదో ఉపకారం చేస్తున్నామని కాదు. ఇది మనకు మనం ఉపకారం
చేసుకొంటున్నామని. దేవుడు తనపై మనకున్న నమ్మకం వల్ల ప్రయోజనం పొందడు, కాని మనం పొందుతాము. మనకు భగవంతునిపై
ఉన్ననమ్మకం వల్ల మన దైనందిన జీవితంలో ప్రశాంతంగా, సమతుల్యముగా, ఆందోళరహితముగా, సురక్షితముగా , దయ, సహనంతో, సంతోషంగా, ప్రేమగా ఉండగలుగుతాము. ఈ లక్షణాలను ఎవరు
వద్దనుకుంటారు?
రుద్రయ్య
శివ భక్తుడు. పేపర్లో వచ్చిన న్యూస్ ను చదివాడు.
'శివతాండవ పురంలో ఉన్న పాడుపడిపోయిన శివాలయంలో
ప్రతి పౌర్ణమి రాత్రి మునులు సంచరిస్తున్నారు. ఆ శివాలయంలో ఎలాంటి విగ్రహాలూ లేవని
అందరికీ తెలుసు. విగ్రహాలన్నీ ఎప్పుడో ధ్వంసం చేయబడ్డాయనే విషయం కూడా అందరికీ
తెలుసు. గురుకులం లేదు. ఒక్కొక్క సన్నిధిలోనూ దేవుడే లేకుండా ఖాలీగా ఉంటుంది!
అయినా పొర్ణమి రోజు రాత్రి పూట...గర్భ గుడిలో తానొక శివలింగాన్ని చూశానని, పండిపోయిన
శరీరంగల ఒక వృద్ద మనిషి ఒకరు శివ పూజ చేస్తూండటాన్ని తాను కళ్ళార చూశానని, ఆ
వయసైన పెద్దమనిషి తనని ఆశీర్వదించి మాయమైపోయారని...తరువాత రోజు నుండి తన
సమస్యలన్నీ పటాపంచలై పోయి, తన జీవితమే ఆనందమయంగా మారిపోయిందని భక్తుడొకడు తన
స్వీయ అనుభవాన్ని ప్రకటించాడు’ అనే వార్త ప్రచురుణ అయ్యింది.
రుద్రయ్య
తన సమస్యలు కూడా పటాపంచలైపోవాలని ఆశపడ్డాడు. ఆ గుడికి బయలుదేరాడు. రుద్రయ్య శివతాండవ పురంలో ఉన్న పాడుపడిపోయిన శివాలయంలో ఎవరినైనా చూసాడా? అతని
సమస్యలు గురించి ఆయనతో చెప్పాడా? అతని సమస్యలు తీరినైయా?....తెలుసుకోవటానికి
ఈ కథ చదవండి.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
మాయల ముని…(కథ) @ కథా కాలక్షేపం
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి