11, జూన్ 2023, ఆదివారం

మరవటం మర్చిపోయాను...(సీరియల్)...(PART-6)

 

                                                                    మరవటం మర్చిపోయాను...(సీరియల్)                                                                                                                                                           (PART-6)

క్లినికల్ రీసెర్చ్ ఇన్స్-టిట్యూట్ సంస్థ జీడిమెట్లలో ఉంది. ఎక్కువ హడావిడి లేని ప్రశాంతమైన భవనంలో, ప్రపంచాన్నే తలకిందలు చేయగల ఒక పరిశోధన జరుగుతున్నదని బయటున్న బడ్డీకొట్టు పెట్టుకున్న సామాన్య మానవుడు నుండి పార్లమెంటులో ఉంటున్న ఎం.పి. లతో సహా ఎవరికీ తెలియదు. పెద్ద డబ్బుగల సంస్థ అనేది భవనంలో అడుగడుగునా వేసిన మార్బుల్ రాళ్ళతోనూ, అక్కడ కనబడే నిశ్శబ్దం వాతావరణం వలన అర్ధమవుతోంది.

లోపల డాక్టర్ గదిలో.

నలభై సంవత్సరాల మధ్య వయసున్న కళ్ళద్దాలు పెట్టుకున్న ఒక వ్యక్తి ఆందోళనతో కూర్చోనున్నాడు. ఆయన పక్కన ఇరవై ఐదు ఏళ్ళ వయసున్న యువకుడు ఒకడు నిద్రకు అవస్తపడుతున్నట్టు కూర్చోనున్నాడు. ఎదురుగా...  డాక్టర్. నాగార్జున్, న్యూరో సైంటిస్ట్అనే ఇత్తడి నేమ్ బోర్డ్ ప్రకాశవంతంగా ఉన్నది.

డాక్టర్ నలభై ఐదేళ్ళ యువకుడిలాగా, ఫ్రీజర్ లో ఉన్న ఆపిల్ పండులాగా తలతలమని మెరిసిపోతున్నారు.

జగదీష్ ఎవరు?”

ఇతనే

ఏమిటి సమస్య?”

గత మూడు సంవత్సరాలుగా మనోవ్యాధితో బాధ పడుతున్నాడు. ఎన్నో చికిత్సలు తీసుకున్నాడు. గుణమవలేదు. చివరగా...మీ దగ్గరకు తీసుకు వెళ్ళమని డాక్టర్. శివరామ్ గారు చెప్పారు

ఆయన ఎందుకు అలా చెప్పారో మీకు తెలుసా?”

తెలియదు డాక్టర్. అక్కడికి వెళ్ళండి, తెలుసుకుంటారు అని చెప్పారు.

ఇది ఎలాంటి ఇన్స్-టిట్యూటో, ఇక్కడ ఏం జరుగుతున్నదో అనేది మీకేమైనా తెలుసా?”

తెలియదు

తెలిసుంటే వచ్చుండేవారు కాదు అన్నాడు డాక్టర్. నాగార్జున్ చాలా సింపుల్ గా.

డాక్టర్...

ఇదొక పరిశోధనా ఇన్స్-టిట్యూట్. ఇక్కడ పలురకాల సైన్స్ పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక్కొక పరిశోధనా, మనిషి యొక్క జీవిత సైలిని పూర్తిగా మార్చి పెట్ట గలిగినది. ప్రపంచాన్నే తలకిందలు చేయగల విప్లవాత్మక--ప్రమాదకరమైన పరిశోధనలు ఇక్కడ జరుగుతున్నాయి

కళ్ళద్దాల మనిషిలో ఏదో ఒక భయం ఏర్పడింది. చేతులు చిన్నగా వణికినై.

మేము ఇప్పుడు ఒక ముఖ్యమైన పరిశోధన యొక్క చివరి దశకు చేరుకున్నాము. సైన్స్ ప్రకారం నేనే మీకు దాన్ని వివరించగలను. కానీ మీకు అర్ధం కాదు మిస్టర్...మిస్టర్...సారీ...మీపేరు?”

రామప్ప. హాయ్ రామప్ప

ఇతను మీ అబ్బాయా?”

లేదు. నా బావమరిది. నా భార్య తమ్ముడు. పేరు జగదీష్

ఓహో...సరి...సరి...నేను ఏం చెబుతున్నాను...

ఒక ముఖ్యమైన పరిశోధన...ప్రమాదకరమైన పరిశోధన

అవును. ఎలుకలను పెట్టుకుని ఆ పరిశోధనను విజయవంతంగా ముగించాము. ఇప్పుడు మా పరిశోధనను పరిశోధించ చూడటానికి ఒక మనిషి కావాలి. దాని కోసమే మీరు ఇప్పుడు జగదీష్ ను తీసుకు వచ్చారు

డాక్టర్! ఇది నాకు ముందే ఎందుకు చెప్పలేదు. దీనికి నేను ఒప్పుకోనుషాకయ్యాడు హాయ్. 

తెలుసు. దీనికి మీరు ఒప్పుకుంటే, అది నాకే పెద్ద ఆశ్చర్యంగా ఉంటుంది

హాయ్ అయోమయంలో పడ్డారు.

ఏమిటి డాక్టర్ చెబుతున్నారు. నాకు అంతా కన్-ఫ్యూజన్ గా ఉంది?”

ఇది అలాంటి పరిశోధన. దీన్ని సాధారణ మనుష్యుల మీద పరీక్ష చెయ్యటం కంటే, జగదీష్ లాంటి పరిస్థితిలో ఉన్న, ఐ మీన్ మనోవ్యాధితో బాధపడుతున్న మనిషి మీద చెయ్యటం మంచి ఫలితం ఇస్తుంది. కానీ పరిశోధన ఫైలు అయితే, ప్రాణానికే ముప్పు ఏర్పడ వచ్చు. మేము దేనికీ బాధ్యత తీసుకోము

డాక్టర్!

పరిశోధన సక్సస్ అయితే, జగదీష్ పూర్తిగా గుణమయిపోతాడు

డాక్టర్!

మీకు ఏది కావాలి? జగదీష్ ఇలాగే మనోవ్యాధితో బాధపడుతూ చివరి వరకూ ఉండాలా? లేక ఒక రిస్క్తీసుకుని పరిశోధనకు ఒప్పుకుని, గుణమయ్యి, జీవితాంతం మామూలు మనిషిగా, మన అందరిలాగా జీవించాలా? ఏది మీకు ఇష్టం? మీరే నిర్ణయించుకోవాలి. నిర్ణయం తీసుకుని తరువాత రండి. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు

హాయ్ పూర్తిగా చెమటతో తడిసి ఉన్నారు.

ఒక రోజు అవకాశం తీసుకోండి. .కే. అనుకుంటే రండి. లేకపోతే ఫోనులోనే చెప్పేయండి. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు

హాయ్ తడబడుతూ లేచారు. జగదీష్ ను తీసుకుని గది గుమ్మం వరకు వెళ్ళినాయన, సంసయంతో నిలబడ్డారు. వెనక్కి తిరిగారు.

డాక్టర్...

ఇంతలోనే నిర్ణయించేసుకున్నారా?”

లేదు. కానీ, నిర్ణయించుకునే ముందు ఒకే ఒక అనుమానం?”

అడగండి

ఇదొచ్చి...ఎలాంటి పరిశోధన?”

డాక్టర్ కాసేపు హాయ్ గారినే చూశారు.

తరువాత మెల్లగా చెప్పారు.

మనిషి మెదడులో నుండి అక్కర్లేని, ట్రబుల్ చేసే జ్ఞాపకాలను తుడిచే పరిశోధన

హాయ్ గారు తీవ్ర షాకుకు గురి అయ్యారు.

జగదీష్ యొక్క చెయ్యి పుచ్చుకుని వేగంగా బయటకు వెళ్ళిపోయారు.

                                                                                                                            Continued...PART-7

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి