8, జూన్ 2023, గురువారం

మరవటం మర్చిపోయాను...(సీరియల్)...(PART-5)

 

                                                                          మరవటం మర్చిపోయాను...(సీరియల్)                                                                                                                                                           (PART-5)

మళ్ళీ బస్సు ప్రయాణం!

ఒకరోజు ఎంజాయ్ చేసాను.

మరుసటి రోజు ఛీ అన్నాను.

నిన్ను నేను చంపకుండా చంపి.

పూడ్చెనే...క్షమిస్తావా క్షమిస్తావా?’

రోహిణీ సన్నటి స్వరంతో శ్యామ్ ను సూటిగా చూసి పాడగా అతను కాగితంగా మారి కిటికీ ద్వారా బయటకు చూపులను పరిగెత్తించి, తిరిగి మళ్ళీ రోహిణీని  చూసినప్పుడు.

ఆమె మిగిలిన మగవారిని చూస్తూ పాడుతున్నది.

షాకయ్యి ఓసి దుర్మార్గురాలా!అనుకున్నాడు.

శ్యామ్...ఇప్పుడు నువ్వు పాడు

మనసులో నిన్ను ఉంచుకున్నానూ అని పాడాలని అనుకుంటున్నా...దాని తరువాత తెలియటం లేదు

నీకు పూర్తిగా ఏది తెలుసు చెప్పు?”

సడన్ గా అడిగితే ఎలా పాడేది?”

అది వదులు...నాకు వేడిగా గులాబ్ జామూన్ కొని పెడతావా?”

డబ్బులివ్వు

పిసినారీ. నువ్వే ఇవ్వు

మాధవి ఇంకా తన చూపులతో శ్యామ్ ను తినేలాగా చూస్తోంది.

మధ్యలో బోటింగ్ సెంటర్ దగ్గర బస్సు ఆగింది.

కరెక్ట్ అయిన సమయం చూసి రోహిణీని పక్కకు తోసాడు శ్యామ్.

ఎందుకలా చెప్పావు?” రోహిణీని అడిగాడు శ్యామ్

ఏం చెప్పాను?”

నాకు ఏదీ పూర్తిగా తెలియదని

సరదాగా

నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరా?”

లేరు

నీలాంటి అందమైన అమ్మాయలకు...

బాయ్ ఫ్రెండ్ ఉండటం తప్పనిసరా?

అందరూ ఒక కోతినైనా తమకు తోడుగా ఉంచుకుంటారు

నాకు కోతీ వద్దు అంటూ శ్యామ్ ను దీర్ఘంగా చూసింది.

అదెందుకు నన్ను చూసి చెబుతున్నావు?”

ఉత్తినే

ఎందుకు నీకు బాయ్ ఫ్రెండ్ వద్దు? నువ్వు లెస్బియనా?”

కాదు

మరి?”

ఎవరికీ గర్ల్ ఫ్రెండుగా ఉండటం నాకు ఇష్టం లేదు

...

ఎవరికీ ఏదీగానూ ఉండటం నాకు నచ్చదు

...

ఏమిటీ ప్రతిదానికీ . అంటున్నావు?”

...

ఇదిగో చూడు...నేను నేనుగా ఉండటానికి ఇష్టపడుతున్నాను. స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడుతున్నాను. ఎవరికీ సమాధానం చెప్పటం నాకు నచ్చదు

ఎవరికైనా సమాధానం చెప్పటంలో ఏముంది తప్పు? మన మీద అక్కర చూపటానికి ఒక వ్యక్తి కావద్దా?”

అలా ఎవరైనా ఉంటే... తరువాత ఏం జరుగుతుందంటే, ఒక స్టేజీలో వాళ్ళ ఫీలింగ్స్ ను గాయపరచ వలసి వస్తుంది. తరువాత నన్నే ఎక్కువగా గాయపరచుకో వలసి వస్తుంది

కమాన్ రోహిణీ....ప్రేమ ఒక దేవుడు

లేదు...ప్రేమ ఒక శని

హఠాత్తుగా ఒక రోజు నువ్వు ప్రేమలో పడిపోతే ఏం చేస్తావు?”

నేను ప్రేమలో పడటమా...ఛాన్సే లేదు

పడిపోయేవే అనుకో...అప్పుడు -- తరువాత?”

పడితే వెంటనే లేచి బయటకు వచ్చేస్తాను. పడిపోయే ఉండను

ఇదేం జవాబు?”

ఇదే జవాబు! గుంటలో చాలా మంది పడటం చూసాను. గుంట అని తెలిసి ఎవరైనా పడతారా? లేక...పడినా లేవకుండా ఉంటారా?”

ప్రేమ ఉన్నదే...అదొక ఉన్నతమైన ఫీలింగ్. దాన్ని మాటల్లో వర్ణించలేము

సారీ శ్యామ్. మాటల్లో వివరించలేనిది ఏదీ నా జీవితంలో వద్దు. అది నాకు సెట్ అవదు. అది ఉపయోగం లేదు. నేను చాలా ప్రాక్టికల్ రకం. ఒక వస్తువును గ్యారంటీ లేకుండా కొనేది వేస్టు. అది ప్రేమగా ఉన్నా సరే!

ప్రేమ, దేవుడు సృష్టించింది

అలాంటప్పుడు ఎందుకు కోర్టు గుమ్మాల దగ్గర అంతమంది విడాకుల కోసం నిలబడుతున్నారు?”

ఎందుకంటే విడాకులు మనిషి సృష్టించింది

మూర్కత్వపు వాదన

లేదు రోహిణీ. మా తల్లి-తండ్రులు కూడా విడాకుల దంపతులే. అందువలన నాకేమైనా ప్రేమ మీద నమ్మకం పోయిందా? లేదే!

సరే...ప్రేమంటే ఏమిటి?”

అదే చెప్పానే...దాన్ని వ్యాసంలాగా రాయలేము. చేసి చూపించటానికి అదేమన్నా వంట కార్యమా -- బలవంతం చేయటానికి హింసాత్మకం కాదు. ఎవరూ దాన్ని కళ్ళతో చూడలేరు. అదో అద్భుతం. ఎప్పుడైనా నీలో ఫీలింగ్ వచ్చే తీరుతుంది

అలా వస్తే, తప్పు అడ్రస్సుకు వచ్చిందని అనుకుని అదే తిరిగి వెళ్ళిపోతుంది

రోహిణీ, ప్రేమనేది...

నాకు తల నొప్పిగా ఉంది

ఒకే ఒక మాట చివరిగా మాట్లాడేస్తాను

సరే, త్వరగా చెప్పు. నాకు తలనొప్పి ఎక్కువగా ఉంది

ప్రేమ అనేది...తలనొప్పి కలిగించేది కాదు. ప్రేమ అనేది మనసును నొప్పి కలిగించేది

ఆమె అర్ధంకాక చూసింది!

                                                                                                              Continued...PART-6

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి