14, ఏప్రిల్ 2022, గురువారం

శవాలు కూడా నిజాలు చెప్పాల్సిందే...(ఆసక్తి)

 

                                                              శవాలు కూడా నిజాలు చెప్పాల్సిందే                                                                                                                                                                  (ఆసక్తి)

టెక్నాలజీ వలన ప్రపంచం ఎంత అభివ్రుద్ది చెందిదో ప్రత్యేకంగా ఎవరికీ చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి వ్యక్తి చేతిలోనూ ఉన్న స్మార్ట్ ఫోన్ విషయాన్ని రుజువు చేస్తుంది. ఒక్క స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే మొత్త ప్రపంచమే మన చేతిలో ఉన్నట్లే. ప్రపంచంలో ఏం జరుగుతున్నా తెలుసుకోవటానికీ, మన ఆత్మీయులను దగ్గరగా చూస్తూ మాట్లాడు కోవటానికి వీడియో కాలింగ్ వసతులు, ఎక్కడ ఉన్న సరే ఎంటర్ టైన్ మెంట్ తో సమయం గడపటానికీ, నాలెడ్జ్ పెంచుకోవటానికి....ఇలా ప్రతి చిన్న, పెద్దా విషయం లోనూ టెక్నాలజీ ఏంతో ఉపయోగ పడుతోంది. దేశంలోనైనా పోలీసు వ్యవస్త పటిష్టంగా ఉంటే అక్కడ చట్టం నాలుగు కాళ్ళమీదా నడుస్తుంది, దాని వలన అక్కడ ప్రశాంత వాతావరణం ఏర్పడి, ప్రజలు శాంతియుతంగా జీవితం గడపగలరు. దీనికొసం పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు సరికొత్త టెక్నాలజీలు త్వరలోనే వాస్తవరూపం దాల్చనున్నాయి.

సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నట్లయితే పోలీసు నిఘా నేత్రం నుంచి నేరస్తులు తప్పించుకునేందుకు మాత్రం ఆస్కారం ఉండదు. పోలీస్ వ్యవస్థనే పూర్తిగా మార్చేసే భవిష్యత్ టెక్నాలజీ అతి తొందరలోనే నిజరూపం ఎత్తబోతోంది.

నెక్స్ట్ జనరెషన్ సంకెళ్ళు

మైక్రోఫోన్, కెమెరా ఇంకా ఇతర సెన్సార్ వ్యవస్థలను కలిగి ఉండే నెక్స్ట్ జెనరేషన్ సంకెళ్ళు నిందితుడిని నిరంతరం పరవ్యేక్షించటంతో పాటు ప్రతిఘటించిన సమయంలో ఎలక్ట్రిక్ షాక్‌‍కు గురి చేసి కొద్ది సేపటి వరకు మూర్చపోయేలా చేస్తాయి.

ట్రాకింగ్ బుల్లెట్స్

పోలీస్ నిబంధనలను, చెకింగ్ లను అతిక్రమించి ముందుకు దూసుకుపోతున్న వాహానాంపైకి ప్రత్యేకమైన జీపీఎస్ డివైస్ను షూట్ చేస్తారు. సదరు వాహనంలోకి చొచ్చుకుపోయే జీపీఎస్ డివైస్, వాహనం లోకేషన్‌‌కు సంబంధించిన వివరాలను పోలీసులకు సూచిస్తుంది.

అగ్రెషన్ ప్రెడిక్టింగ్ కెమెరాలు

అగ్రెషన్ ప్రెడిక్టింగ్ కెమెరాలు నేరస్థుడి కదిలికలను మందుగానే పసిగట్టి పోలీసులను అప్రమత్తం చేస్తాయి.

ఎన్వైపీడీ 2020

పోలీస్ ఫోర్స్ మొత్తానికి అందుబాటులో ఉండే ఎన్వైపీడీ2020 ప్రోగ్రామ్ పోలీసులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వ్యూహాలు పక్కాగా అమలయ్యేలా చేస్తుంది.

క్విక్ డీఎన్ఏ ప్రొఫైలింగ్

ఎల్జీసీ ఫారెన్సిక్స్ అనే సంస్థ డిజైన్ చేసిన రాపిడ్ డీఎన్ఏ సిస్టం, వ్యక్తి డీఎన్ఏ ప్రొఫైల్ను గంటలోపే విశ్లేషించేస్తుంది.

కార్నియల్ ఇమేజింగ్ టెక్నాలజీ

కార్నియల్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా మనుషులను సలువుగా గుర్తించవచ్చు.

3డీ-ఐడీ టెక్నాలజీ

అనుమానాస్పద మృత దేహాలకు సంబంధించి నిర్వహించే శవ పరీక్షలలో 3డీ-ఐడీ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన టెక్నాలజీ అనుమానాస్పదంగా మృతి చెందిన వారి శరీరాలను 3డీ టెక్నాలజీ సాయంతో క్షుణ్నంగా జల్లెడ పడుతుంది.

రోబోటిక్ పోలీసులు:

రోబోటిక్ టెక్నాలజీ పై స్పందించే రోబో పోలీసులు నేరరహిత సమాజం కోసం పాటు పడగలవుపోలీసులు నిర్వర్తించే అన్నిరకాల విధులను  రోబో పోలీసులు నిర్వర్తిస్తాయిత్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు.

సూపర్ రికగ్నైజర్స్

మనుషుల ముఖాలను గుర్తించటంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన సూపర్ రికగ్నైజర్స్ తమ ఆసాధారణ తెలివితేటలతో నేరస్తులను ఇట్టే గుర్తించేస్తాయి.

ఇవన్నీ వాడుకలోకి వస్తే నేరాల సంఖ్య చాల వరకు తగ్గిపోవచ్చు.

Images Credit: To those who took the original photos.

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి