13, ఏప్రిల్ 2022, బుధవారం

ప్రేమకు సహాయం...(సీరియల్)...PART-11

 

                                                                         ప్రేమకు సహాయం...(సీరియల్)                                                                                                                                                                PART-11

దుస్తులు మార్చుకు వచ్చిన ముకుంద రావ్, ధర్షిని ని ఒంటరిగా వదిలి పెట్టలేదు. బైకులో ముందు కూర్చో పెట్టుకుని, వెనుక నందిని ఎక్కించుకున్నాక, మోటర్ సైకిల్ అప్పుడు హాస్టల్ వైపుకు బయలుదేరింది. గడియారంలో పది నిమిషాలే ఉన్నది.

ఎంత వేగంగా వెళ్ళినా, టైము ఎనిమిది దాటింది. సెక్యూరిటీ కోపంగా చూశాడు.

మొదట వార్డన్ను చూడమ్మా... అంటూనే గేటు తెరిచాడు.

అలాగే ముకుంద రావ్ ను చూసి ఈయనే నీ ప్రేమికుడా?” అని కూడా అడిగాడు.

ముకుంద రావ్ కు చెంప మీద కొట్టినట్టు అనిపించింది.

ఏయ్ వాచ్ మ్యాన్...తిన్నగా మాట్లాడు. ఒక లేడీస్ హాస్టల్ వాచ్ మ్యాన్ మాట్లాడాల్సిన మాటలా ఇవి?” -- అరిచాడు.

వాచ్ మ్యాన్ కు ముకుంద రావ్ అరుపులు భయం పుట్టించినై. బెదురు చూపులు చూశాడు. నందిని కి ధర్మ సంకటంగా ఉంది.   

మిస్. నందిని, బాధ పడకండి! ధర్షిని కి సహాయం చేయవలసి వచ్చినందువలనే కదా ఆలశ్యం అయ్యింది. నేను కావాలంటే లోలకు వచ్చి చెప్పనా అని అడిగాడు.

ఛాన్సే లేదు. ఇక్కడ ఎప్పుడూ ఒక వార్నింగే. మీరు అలా పక్కగా నిలబడండి...పెట్టె బేడతో మ్యాడం ఎలాగూ బయటకు వస్తుంది. తీసుకు వెళ్ళటానికి సౌకర్యంగా ఉంటుంది

వాచ్ మ్యాన్ చెప్పింది చెప్పినట్టే జరిగింది. నందిని తన సూట్ కేసూ, మినీ బెడ్ తో బయటకు వచ్చింది.

ముకుంద రావ్ కు కచ్చె పుట్టింది!

మిస్. నందిని...ఇదేమిటి అన్యాయం? ఒక హాస్టల్ అంటే కట్టుబాట్లు ఉండాల్సిందే! కానీ, ఇక్కడ చాలా ఓవర్ గా చేస్తున్నారే? ఇది కాలేజీ హాస్టలా...ప్రైవేటు హాస్టలా? వయసులో ఉన్న అమ్మాయిని కూడా చూడకుండా బయటకు పంపించేశారు. మీకు రాత్రికి ఏదైనా జరగకూడనిది జరిగితే దానికి ఎవరు బాధ్యులు?”

వాచ్ మ్యాన్ చెవిలో పడేటట్టు అరిచాడు.

లేదు సార్...నన్ను రేపు ప్రొద్దున రూము ఖాలీ చేయమన్నారు...నేనే ఇప్పుడే బయలుదేరి వచ్చాశాను

తోందరపడ్డారే...ఇంత రాత్రివేల ఎక్కడికి వెళతారు?”

ఏదైనా ఒక హోటల్లో రూము తీసుకుని ఉండాల్సిందే! రేపు స్కూలుకు లీవ్పెట్టి వేరే ఏదైనా మంచి హాస్టల్, లేదంటే చిన్నదిగా ఒక ఇల్లు చూడటమే

నందిని ఆందోళన చెందకుండా చెప్పింది.

ఇలా జరిగినందుకు మీకు కొంచం కూడా బాధగా లేదా...?”

ఒక జైలు నుండి బయటకు వచ్చేటప్పుడు, సంతోషంగానే కదా ఉంటుంది....?”

అది కూడా కరెక్టే! .కే. మీరు రాత్రి సమయంలో వేరే ఎక్కడికీ వెళ్ళి కష్టపడొద్దు. మాట్లాడకుండా మా ఇంట్కి వచ్చేయండి

ముకుంద రావ్ అమెకు స్వీట్ షాక్ ఇచ్చాడు.

సార్...

రండి...మా ఇంట్లో ఉంటూనే మీరు వేరే మంచి హాస్టల్ వెతుక్కోండి. లేకపోతే...చిన్నగా ఒక ఇల్లు కూడా చూడొచ్చు

హయ్యా! టీచర్ మనతో ఉండబోతోందే... అన్నది ధర్షిని. ఆమె మొహంలో ఎప్పుడూ లేనంత ఒక కొత్త ఉత్సాహం . నందిని దగ్గర చట్టుకున ఒక ఆలొచన.

సార్...వెళ్ళే దోవలో ధర్షినిని డాక్టర్ దగ్గర చూపించి వెళ్దామా?” అని అడిగింది.

! దారాళంగా...ఇది కూడా మంచి ఐడియానే

ఆమె ఒక ఆటో పుచ్చుకుని, పెట్టె బేడ లోపల పడేసి లోపలకు ఎక్కింది.

నాన్నా! నేను టీచర్ తోనే వస్తాను ధర్షిని కూడా నందిని తో చేరిపోయింది.

ముకుంద రావ్ బైకును ముందు నడపగా, ఆటో బైకు వెనుకే వచ్చింది.

హాస్పిటల్ వాకిలి ముందు నిలబడ్డారు. లోపలకు వెళ్ళి చూపించారు. డాక్టర్ స్కాన్తీయమని రాసిచ్చారు. తాత్కాలిక నివారణ కోసం ఒక ఇంజెక్షన్ చేసి, మాత్రలు ఇచ్చాడు.

నందిని ని తప్పుగా ధర్షిని తల్లి అనుకుని,

మీరు కొన్ని రోజులు పిల్లతోనే ఉండండి. రోజు వచ్చింది ఫిట్స్అయితే...ఖచ్చితంగా అదే సమయానికి మళ్ళీ ఒకసారి రావచ్చు. ఫిట్స్లాంటి నరాల బలహీనత ఉంటే ఆపద ఉండదు. అది తిరిగి రాదు. పిల్లను ఒంటరిగా మాత్రం వదిలి పెట్టకండి. రేపు స్కాన్ రిపోర్టుతో వచ్చి చూడండి. అది చూసి తరువాతి ట్రీట్ మెంట్ ఆలొచిద్దాం -- అన్నాడు.

ముకుంద రావ్ మిక్కిలి వేగంగా డాక్టర్! ఆమె నా భార్య కాదు. ధర్షిని యొక్క స్కూల్ టీచర్. పిల్ల ఆరొగ్యం గురించి తెలుసుకోవటానికి వచ్చింది. అంతే... 

మాటకు నందిని కూడా సంతోషించింది.

తరువాత ఇంటికి వచ్చారు. వచ్చే దోవలోనే హోటల్లో తినేసి రావడంతో, నిద్ర పోదాం అనుకుంటున్నప్పుడు ఫోన్ మోగింది.

మావయ్య పరమేశం మాట్లాడారు.

ముకుందం...

మావయ్యా..? చెప్పండి మావయ్యా...

ఏంటబ్బాయ్ చెప్పమంటావు? ఇక మీదట నువ్వు సంతోషంగా ఉండచ్చు...!

ఏమిటి మావయ్యా చెబుతున్నారు..? కొంచం అర్ధం అయ్యేటట్టు చెప్పండి

నేను ఇప్పుడు జీ.హెచ్. మార్చ్యురీ దగ్గర నిలబడున్నాను. లోపల ఉమ శరీరం  ఉంది...

మావయ్యా! ఏమిటి మావయ్యా చెబుతున్నారు

ఉమ ఆత్మ...ఆత్మహత్య చేసుకుంది

అయ్యో మావయా! ఇదేంటి మావయ్యా కర్మ...?”

అరే పోరా...నువ్వు మాత్రం నా కూతుర్ని పెళ్ళి చేసుకోవటానికి ఒప్పుకోనుంటే, ఇదంతా జరిగే ఉండదు. ఒక విధవరాలుగా జీవించటానికి అది ఇష్టపడలేదు. నాకు భారంగా ఉంటున్నట్టు భావించి, ఇలాంటి దారి సెలెక్ట్ చేసేసుకుంది

మావయ్య అటుపక్కన వెక్కి వెక్కి ఏడుస్తూ మాట్లాడింది, ఇటు పక్కనున్న నందిని చెవులకు కూడా వేగంగా వినిపించింది.

ఉమ తొందరపడింది మావయ్యా...

మనం ఎలాగైనా చెప్పుకోవచ్చురా...కానీ, మనసు పడే బాధ నీకు ఇప్పుడు అర్ధం కాదు. నీకూ ఒక అమ్మాయి ఉందిగా...దాని జీవితంలో కూడా తుఫాన గిఫాన వస్తున్నప్పుడే అర్ధమవుతుంది. కానీ, నాకొచ్చిన కష్టాన్ని ఇంకెవరికీ ఇవ్వకు అని దేవుడు దగ్గర కోరుకున్నాను...

మావయ్య మాట్లాడటం మానేసి సెల్ ఫోన్ కట్ చేశాడు. ముకుంద రావ్ ని ఒక విధమైన మౌనం పట్టుకుంది.

ధర్షిని నిద్రపోయింది.

సార్...ఏదైనా చెడు వార్తా?”-- నందిని మెల్లగా ప్రారంభించింది.

అవును మిస్. నందిని..

ఏమిటని నేను తెలుసుకోవచ్చా?”

అది...అది...

చెప్పకూడదని అనుకుంటే చెప్పకండి -- వదిలేయండి...

ఎలా చెప్పాలో తెలియటం లేదు నాకు...

అంత చిక్కుముడి విషయమా?”

కొంచం అంతే!

ఏదైనా సరే సార్ చెప్పండి. మీకూ మనోభారం తగ్గినట్టు ఉంటుంది కదా?”

నా మనోభారం ఎప్పుడూ, దేని వలన తగ్గదు మిస్. నందిని

సార్! మీరు సాధారణంగా నందిని అనే పిలవండి. ఎందుకు మిస్ మర్యాద...?”

థ్యాంక్స్... -- అతనూ ఉమ గురించిన విషయం చెప్పి ముగించాడు.

అరెరె... రోజుల్లో ఇలా ఒక అమ్మాయా?”

అన్ని కాలాలలోనూ అన్ని రకాల అమ్మయులూ ఉన్నారు నందిని. కానీ, మనం అందులో కొన్ని రకాల మనుష్యులనే కలుసుకుంటున్నాము

మీ అభిప్రాయం నిజంగా కూడా ఉండొచ్చు. తరువాత నేనొక విషయం అడిగితే తప్పుగా తీసుకోరు కదా?”

మీరేం అడగబోతారో నాకు బాగా తెలుసు నందిని

అలాగా. ఏదీ...చెప్పండి చూద్దాం?”

మీరెందుకు ఉమ ను పెళ్ళి చేసుకోనుండ కూడదు అని అడగబోతారు. కరెక్టేనా...?”

అవును సార్. ఆమె ఒక విధవరాలుగా ఉన్నందున ఒప్పుకోలేదా?”

ఛఛ...నిజంగా అలగంతా లేదు. అందులోనూ ఉమ నా మావయ్య కూతురు. చిన్న వయసు నుండే ఆమె నాకు  తెలుసు. ఆమె యొక్క మంచీ-చెడులలో అక్కఱకలిగిన ఆమె యొక్క బంధువుని నేను. ఇంకా చెప్పాలంటే అమె నాకు వరుసే

అలాగైతే ఎందుకింత పట్టుదల...? మీ భార్య యొక్క ఆత్మ మిమ్మల్ని మన్నించదు అనే భావనా...లేక భయమా?”

అది కూడా కాదు. నేను పెళ్ళి బంధాన్నే లోకంలో అతిపెద్ద బంధంగా అనుకుంటాను. మమకారంలో తల్లి మమకారమే పెద్దదంటారు. అలాగే బంధుత్వంలో స్నేహం చాలా పెద్ద బంధుత్వం. ఇవన్నీ పెళ్ళి బంధంలోనే కలిసున్నాయని నేను అనుకుంటున్నాను.

ఏక్కడో ఎవరి కడుపులోనో పుట్టిన ఒక మగవాడూ, ఆడది పరస్పరం తమ భవిష్యత్ కాలాన్ని పెళ్ళి బంధంతోనే రూపొందించుకుంటున్నారు. ముఖ్యంగా ఆమ్మాయిలు తమ పుట్టిల్లూ, తోబుట్టువులు -- బంధువులు అనే అన్నిటినీ పక్కన పెట్టేసి ఎవర్ని పెళ్ళి చేసుకుంటున్నారో... భర్త కుటుంబంలో ఐక్యమైపోతారు తరువాత పిల్లలు పుట్టి వాళ్ళకోసం జీవించాలనే వారి జీవితం పరిగెత్తుతూ ఉంటుంది.

ఒక పక్క భర్తకు భార్యగా, ఇంకో పక్క మంచి కోడలుగా -- ఇంకో పక్క మంచి తల్లిగా పలు అవతారాలు ఆమ్మాయులు ఎత్తవలసి ఉంది.

దీన్ని మామూలు విషయంగా ఆనుకోవటం నాకు కుదరటం లేదు. నాకూ, సంధ్యకు అలాంటి పెళ్ళి బంధం డెవలప్ అయ్యింది. ఆమె నన్ను కొండలా నమ్మింది...నా కోసం  తన తల్లి-తండ్రులను విధిలించి కోట్టింది! ఒక ఆడదో - మగాడో ప్రేమించుకునేటప్పుడు, పెద్దలకు ఎదురుగా నడుచుకునే పరిస్థితి డెవలప్ అవుతుంది.

కని-పెంచి మనల్ని మనిషిగా తీర్చి దిద్దిన వాళ్ళకు ఎదురుగా పెళ్ళి విషయంలో నిర్ణయం తీసుకోవటం తప్పే. పెళ్ళి అనేది మాత్రం అందరికీ ఇష్టంగానే జరగాలి. కానీ ప్రేమించుకున్న వారికి ఇది సాధ్యం లేకుండా పోతోంది. మా వరకు అదే జరిగింది.

అంత కష్టపడి పెళ్ళి జీవితం మొదలు పెట్టిన నాకు, దానికీ అదృష్టం లేకుండా పోయింది. రెండే సంవత్సరాలలో సంధ్యను పచ్చ కామెర్లు అనే వ్యాధి వచ్చి తీసుకు వెళ్ళిపోయింది.

నాకూ, సంధ్యకు ఉన్న బంధుత్వం సాక్షిగా దర్షిణి మాత్రం ఒక వయసు పిల్లగా నా చేతిలో ఉన్నది క్షణంలోనే నేను జీవితం గురించి, బంధువుల గురించి, తోబుట్టువుల గురించి క్లియర్ గా అర్ధం చేసుకున్నానుప్రేమ అనేది ఎంతపెద్ద ప్రమాదమైన విషయమో అప్పుడే నాకు అర్ధమయ్యింది.

యుక్త వయస్సులో, ఉడుకు రక్తం పొగరుతోనూ - మోహంతోనూ, మాక్సిమం పదిహేనేళ్ళ వయసు నుండి ముప్పై ఏళ్ల వయసు లోపల వచ్చి వెళ్ళే ప్రత్యేక కామమే ప్రేమ! ఒక మగవాడికి ఏర్పడి, అదే లాగా ఒక ఆడదానికీ ఏర్పడేటప్పుడే ఇద్దరూ ఆకర్షితులై దగ్గరవుతారు. అలా ఆకర్షితులైన వారికి తల్లి-తండ్రులు, ఊరు, ప్రపంచం, తోబుట్టువులు, బంధువులూ అందరూ దూళి లాగా మారిపోతారు.

జీవితంలోకి దిగి జీవించటం ప్రారంభించినప్పుడే రంగు అంతా వెలిసిపోవటం మొదలవుతుంది! ఇంటద్దె, పచారి సామాన్లు, టెలిఫోన్ బిల్లు, కరెంటు బిల్లు అనే ఒత్తిడి ఒకవైపు...చెమట,మురికి,నిద్రలో గురక అనే లోపల మురికి, దాని వలన ఏర్పడే ఒత్తిడి ఇంకొకవైపు.

అందంగా మేకప్ చేసుకుని, పరస్పరం ఏమార్చుకున్నది పగిలి ముక్కలై, అందవికారాన్ని కలుసుకున్నప్పుడే యధార్ధం అర్ధమవుతొంది. ఇప్పడు భారానికి చేయూత నివ్వడానికి చుట్టూ ఎవరూ లేరు. చుట్టు పక్కల ఉన్నవాళ్ళు కూడా ప్రేమికులను ద్రొహులుగానే చూసే ఒక పరిస్థితి.

దీని వలనే నూటికి డెబ్బై శాతం ప్రేమలు, ఓటమి చూస్తున్నాయి. ముప్పై శాతం ప్రేమలు పలు కారణాల వలన ఓటమి నుండి కాపాడ బడుతున్నాయి.

నాకు తెలిసి ఒక ప్రేమ కూడా లోకానికి ఉదహరణగా కష్టం లేకుండా లేవు. నా అనుభవంతో చెబుతున్నా నందిని...ప్రేమనేది పెళ్ళి తరువాత భార్య దగ్గరే జరగాలి.

పెళ్ళికి ముందు ఒకరికి ఏర్పడితే...అది పాపం తోనే చేరుతుంది! పాపాత్ములకు మాత్రమే ప్రేమ వస్తుంది. వాళ్ళువాళ్ళు కష్టపడుతూ, తమ కుటుంబాన్ని కష్టపెట్టి, తమ పిల్లలనూ కష్టపెడతారు.

నేను కూడా ఇప్పుడు దర్షిణిని కహ్టపెడుతూనే ఉన్నాను. పాపం దర్షిణి. మాకు కూతురుగా వచ్చి పుట్టింది..."  

ముకుంద రావ్ తన మాటల్లో కొన్ని నిజాలను, కొన్ని సత్యాలను చెప్పిన వాడిలాగా స్వరం బొంగురుపోయి ఏడవటం మొదలుపెట్టాడు.

నందిని మనసులో అతని మాటలు ఒక విధ నేర భావననూ, భయాన్నీ ప్రేరేపించింది. పాపాత్ములకే ప్రేమ వస్తుందిఅని అతను చెప్పింది ఆమెను ఆందోళనకు గురిచేసింది. అయినా ఆమెలో పలు ప్రశ్నలు.

సార్...

ఏమిటి నందిని..నా అభిప్రాయంతో నీకు ఏకీభవం లేదు కదా?”

కొంచం అలాగే సార్...

అలాగైతే మీరు ఎవర్నైనా ప్రేమిస్తున్నారనుకుంటా?”--కన్నీళ్ళు తుడుచు కుంటూ అడిగాడు.

షాకయ్యింది నందిని. మెల్లగా అవును అంటూ తల ఊపింది.

అనుకున్నా...

ప్రేమను నేను ఒక కావ్య భావన అనే అనుకుంటున్నాను

అలా అనుకుంటేనే కదా నందిని, మోసపోయి ప్రేమిస్తాం

ఏమిటి సార్ ఇలా చెబుతున్నారు...? సాహిత్యంలో కూడా  ప్రేమకే కదా సార్ మొదటి స్థానం...? ”

ఎవరు చెప్పారు నందిని...? సాహిత్యాలలో ప్రేమించి, జయించి, విజయవంతంగా జీవించిన ఒకర్ని చెప్పండి చూద్దాం...

గబుక్కున జ్ఞాపకానికి రావటం లేదు...కానీ జయించిన వాళ్ళూ ఉన్నారు సార్...

సరే వంద మందిలో ఒకరో, ఇద్దరో జయించారనే పెట్టుకుందాం. ఓడిపోయిన 98 శాతం పెద్దదా...జయించిన ఇద్దరు పెద్దదా?”

ఒక పందెంలో వందమంది పరిగెత్తినా, మొదటి బహుమానం ఒక్కరికే కదా సార్! ఒకరిగా నేనుండాలనే కదా అందరూ పరిగెత్తుతారు...

జీవితమనేది ఇలా పరిగెత్తి సాధించాల్సిన ఒకే బహుమానం కాదు నందిని. అది ఒక నిత్య పరుగు పందెం. పోటీకైన పరుగు కాదు అది

నిజమే! కానీ సినిమా, నాటకం, కథ ఏది తీసుకున్నా, అందులో ప్రేమే కదా మొదటి స్థానంలో ఉంటుంది...

అవును నందిని...అందులోనే కదా మనం మన యొక్క నెరవేరని ఆశను చూస్తాము. తరువాత, ఊహల్లో సుఖం చూడటమే కదా మనుషుల యొక్క అలవాటు.

సినిమాల్లో హీరోయిజం ఎందుకు గెలుస్తోంది? నిజ జీవితంలో పది మందిని నేనొక్కడిగా కొట్టగలనా? డూయట్ పాడగలమా? ఊహల్లో అది జరిగేటప్పుడు, ఒక అల్ప సంతోషం మనలో ఏర్పడుతుంది

అలాగైతే ప్రేమ గురించిన మీ ఫైనల్ సలహా?”

పెళ్ళి తరువాత వస్తే అది తేనె. పెళ్ళికి ముందు వస్తే అది సందేహం  లేదు...విషం

సరే, సరిదిద్దుకోవటానికి మీకు ఛాన్స్ వచ్చినా మీరెందుకు ఒప్పుకోనంటున్నారు...?”

నా జీవితంలో ఒక తప్పు చేసి, దానికైన శిక్షనూ అనుభవించిన వాడిని. మొత్తానికి నేనొక  నేరస్తుడిని. దాంతో పాటూ నేను ఆశగా ప్రేమించిన భార్యతో జీవించలేని దురదృష్టవంతుడ్ని. నా వలన ఇంకో అమ్మాయి కష్టపడాలా?”

ఏం ఇక అమరబోయే జీవితం మంచిగా ఉండకూడదా? ఒకసారి ఒకరు తప్పు చేస్తే, వాళ్ళు దాంట్లోనే ఉండాలా? వాళ్ళకు విమొచనమే లేదా?”

మంచి ప్రశ్నే...అయినా కానీ నాలో ఒక వైరాగ్యం. చిన్న వయసులోనే భార్య చనిపోతే, వెంటనే ఇంకో పెళ్ళి అనేది ఒక మగాడికి జీవిత పాటగా ఉంది. అందుకనే భార్య చనిపోయిన వాడిని కొత్త పెళ్ళి కొడుకుఅనే సామెత మొలచింది. సామెతను నేనైనా జయిద్దామనుకుంటున్నా

ఒకవైపు ప్రేమను పాపంఅని చెబుతున్న మీరు, ప్రేమను పవిత్రమని చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఆశ్చర్యంగా ఉంది సార్

నందిని...నేను ఇప్పుడు దెబ్బతిని మారాను. అందుకని నీ దగ్గర ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. అదే సమయం నా లోపల దానికి గౌరవం చేర్చాలని ప్రయత్నిస్తున్నాను. నాలాగా కష్టపడి జీవించాలని ఎవరూ అనుకోరు

అతని సమాధానం నందిని ని అధికంగా ఆలొచింప చేసింది. చాలాసేపు మౌనంగానే ఉన్నది.

అతను ఆమె మౌనాన్ని ఛేదించ దలచుకున్నాడు.

అవును, మీ ప్రేమికుడు ఎవరు...ఏం చేస్తారు?”

ఆమె సునీల్ గురించి వివరంగా చెప్పింది.

మీ ప్రేమకు పెద్దవారి అంగీకారం దొరుకుతుందా?”

మా ఇంట్లో అడ్డు చెప్పరు సార్. సునీల్ ఇంట్లో వాళ్ళ అక్కయ్యకు పెళ్ళి జరిగితే, అక్కడా అడ్డు ఉండదని నా నమ్మకం. కానీ, అమ్మాయి ఒక పోలియో బాధింపు గలది

ఒకవేల అడ్డు చెబితే...?”

మీరు చేసిన తప్పునే మేమూ చేస్తాం. వేరే దారి లేదు?”

అవును. మనసులు ఓకే అనుకుని ప్రేమించేస్తే, సుముఖంగా విడిపోవటం కంటే పోరాడి ఒకటిగా చేరటమే కరెక్టు. ప్రేమించ కుండా ఉండటమే తెలివిగలతనం

ప్రేమించారు కాబట్టి, మా ప్రేమకు మీ సహాయం దొరుకుతుందా సార్...?”

ఖచ్చితంగా...! ప్రపంచంలో పలు జాతులు ఉన్నట్టుగానే -- ప్రేమించుకుంటున్న వారు, ప్రేమించుకున్న వారూ ఒక జాతి. మనమందరం ఒక జాతి. ఎలా సహాయం చేయకుండా ఉంటాను?”

థాంక్యూ సార్...! ఎక్కడ మమ్మల్ని విడిపొండి అదే మంచిదిఅని చెబుతారేమోన్నన్న భయంలో ఉన్నా

నేను ఎవరినైనా సరే ప్రేమించ వద్దు అని చెబుతాను. ప్రేమిస్తే సమస్య వచ్చినా విడిపోకూడదు

దానికి అందరినీ ప్రేమించండి, విడిపోకండి అని చెప్ప వచ్చే సార్. అందులో తప్పేముంది...? జాతి భేదం దీని వలన తగ్గిపోతుందే?”

జాతిని గురించి మనం తరువాత మాట్లాడుకుందాం. అది ఇంకొక యుద్ద భూమి. ఇప్పుడు ప్రేమ గురించి మాత్రం మాట్లాడుకుందాం. ప్రేమనేదే ఇద్దరి మనుష్యుల మధ్య ఎందువల్ల ఏర్పడుతుందో కొంచం చెప్పండి చూద్దాం...

పరస్పరం నచ్చినందువలన

ఇది అందరూ చెప్పే సహజమైన కారణం. మీరు మీ ప్రేమికుడ్ని ఎందువలన ఇష్టపడ్డారో చెప్పగలరా?”

...నా సునీల్ మొదటగా మంచి అందగాడు, మంచి ఉత్సాహవంతుడు, తరువాత నా కోసం ప్రాణం ఇవ్వటానికి కూడా వెనుకాడడు. అతని వరకు నేనూ తయారుగా ఉన్నాను

అంటే మీ కన్నవారు చూసి చూసి చేసే పెళ్ళిలో భర్తగా రాబోయే అతను అలా ఉండడని మీ ఆలొచన

నేను అలా చెప్పలేదే...!

అప్పుడైతే మీ ప్రేమికుడి క్వాలిఫికేషన్ నచ్చిన రూపం, ఉత్సాహం,--ప్రాణం కూడా ఇవ్వగలిగిన అభిమానంఇదే కదా, సరేనా?”

ఖచ్చితంగా!

ఇదంతా అబద్దం నందినీ...మీరు చూసినది అతని బయటి రూపం, వ్యక్తిత్వం మాత్రమే! పలు సంవత్సరాలు అతనితో మీరు స్నేహంగా కలిసి తిరిగి ఉన్నా, సమస్యలకైన ఘటనలను మీరు ఇంకా కలువలేదు

సమస్యలకైన ఘటనలని మీరు దేనిని అంటున్నారు?”

చాలా ఉంది నందిని

పెద్దవాళ్ళ బెదిరింపులు, వాళ్ళ నిరాకరణ,కిరాయి మన్యుషులను పెట్టి భయపెట్టటం, తరమటం....ఇవే కదా?”

ఇవి మాత్రమే కాదు నందిని...ఇంకా చాలా ఉంది

అవి ఏమిటి సార్?”

గబుక్కున నేను చెప్పలేను. కానీ చాలా ఉంది. పైన నువ్వు చెప్పిన వన్నీ చాలామంది ప్రేమికులకు ఉండేవే. నేను చెప్పే సమస్యలకైన ఘటనలు మనిషికీ,మనిషికీ తేడాగా ఉండవచ్చు. సమస్యలకైన ఘట్టాలు కొందరికి పెళ్ళికి ముందు వస్తుంది...కొందరికి పెళ్ళి తరువాత వస్తుంది.

ఘట్టాలు సంప్రదాయకంగా పెళ్ళి చూపులు చూసి, పెద్దల ఇష్టప్రకారం పెళ్ళి చేసుకున్న వారికీ వస్తుంది. కానీ, వాళ్ళు సమస్యలలో నుండి సులభంగా బయటపడతారు. బయటపడలేని వారికి పెద్దవాళ్ళు చేయూతను  అందిస్తారు. ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకున్నవారికి ఆదరణ లేకపోవటం వలన, ఘట్టాలను హఠాత్తుగా ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి అల్లాడిపోతారు

ఏం సార్! నిజంగా ప్రేమించుంటే ఎలా సార్ తడబాటు  వస్తుంది?”

నిజంగా ప్రేమించటం అంటే రూపం, అందం-వీటిని మూటకట్టి పెట్టేయాలి. తెలివితేటలు, గుణం,త్యాగం, ఉత్సాహం, దయ లాంటి విషయాలను చూసే ఆకర్షితులవాలి. ప్రేమ పుట్టాలి. ఇంకో మెట్టు పైకెళ్ళి చెబుతున్నా నందిని....

నిజమైన ప్రేమకు---అందనికీ, గ్లామర్ కూ సంబంధమే లేదు. ఇది నేను చెప్పిన తెలివి,గుణం, దయ గలవారికే వచ్చే అవకాశం ఉంది. అలా చూస్తే టెలిఫోన్ బూతుల్లో పనిచేసే వికలాంగ అమ్మాయిలే మొదట ప్రేమించబడి ఉంటారు

ముకుంద రావ్ చెప్పింది నందిని బుర్రలో మేకు పెట్టి ఎవరో కొట్టినట్టు దిగింది.

అవును సార్...నా సునీల్ కూడా నేను ఐశ్వర్యా రాయ్ లాగానే ఉన్నానని చెప్పే నన్ను వర్ణిస్తాడు. నేనూ అతన్ని శోభన్ బాబూ, చిరంజీవీ లాగే పలు విధాలుగా ఊహించుకుని చూశాను. మా ప్రేమలో రూపానికి కూడా పెద్ద భాగం ఉన్నదని చెప్పగలను

మీ ప్రేమలో మాత్రము అని చెప్పకు...వందకు వంద శాతం ప్రేమల్లో ఇదే ఉంది రూపం అనేది మార్పుకు లోనయ్యేది. ఇరవై నాలుగు గంటలూ రూపానికి మేకప్ వేసుకునే ఉండగలమా? మేకప్ కరిగిపోయిన తరువాత ప్రేమ అనేది కరగటం ప్రారంభిస్తుంది

భయపెడుతున్నారే....నా ప్రేమలో అలాగంతా ఏదీ జరగ కూడదు సార్...

భయపడటం మొదలు పెట్టింది నందిని. గడియారమూ రాత్రి పన్నెండు దాటింది అన్నట్టు శబ్ధం చేసి గుర్తు చేసింది.

దర్షిణి చాలాసేపటికి ముందే నిద్రపోయినందువలన చాలా విషయాలు మనసు విప్పి మాట్లాడుకోగలిగారు. ముకుంద రావ్ కూడా ఆవలింత పెట్టాడు.

సరే నందిని! వెళ్ళి పడుకోండి...మీకు మంచి చోటు దొరికేంత వరకు, మీరు ఇక్కడే ఉండబోతారు. చాలా సమయం ఉంది....అప్పుడు మనం ఇంకా విస్తారంగా  మాట్లాడుదాం అంటూనే నందిని పడుకునేందుకు మంచం వేశాడు. ఆమె కూడా వెళ్ళి నిద్రపోవటానికి మంచం మీద వాలింది.

ముకుంద రావ్ దర్షిణి దగ్గరకు వెళ్ళి పడుకున్నాడు. దర్షిణి మొహం నిర్మలంగా...రాత్రి పూట పూసిన ఒక రోజా పువ్వులాగా దృశ్యం ఇచ్చింది. చాలాసేపు కూతురి మొహాన్నే చూశాడు. తరువాత నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు.

ఇదంతా నందిని గమనిస్తూనే ఉన్నది. ఆమెకూ చాలా ఆశ్చర్యంగానే ఉన్నది.

ముకుంద రావ్ పక్కన పడుకున్న స్థితిలోనే నిదానంగా కూతుర్ను  కావలించుకున్నాడు.

మమకారమే ఎన్ని ఉన్నతమైన విషయాలను ఎత్తి చెబుతోంది? ప్రపంచంలో మనుష్యుల దగ్గర నుండి జంతువుల వరకు మనసుల్లో చూడ గలిగేది దయ యేనా? దీన్ని రక్తంలో ఉంచే భగవంతుడు స్రుష్టించాడా? ఇది మాత్రం లేకుండా పోయుంటే, మనిషికి జీవితాంతం ఇంకేది ముఖ్యంగా ఉండగలదు..?’

బోర్ల పడుకున్న నందిని కి ప్రశ్నల పైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి!

                                                                                      Continued...PART-12(చివరిది)

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి