1, ఏప్రిల్ 2022, శుక్రవారం

ప్రేమకు సహాయం...(సీరియల్)...PART-5

 

                                                                            ప్రేమకు సహాయం...(సీరియల్)                                                                                                                                                                 PART-5

సినిమా పూర్తి అయిన తరువాత, అది ఎందుకు పూర్తి అయ్యింది అనే అనిపించింది సునీల్ కు.

చీకటిపోయి వెళుతురు వచ్చినప్పుడు, అంతవరకు నందిని చుట్టూ ఉన్న చేతులు వేరైనాయి. ఆమెకు ఏదో ఒక సుఖంలో తేలుతున్నట్టు ఉంది.

అందరూ లేచి బయటకు వెళుతుంటే, ఇద్దరూ లేచి నిలబడ్డారు.

అతని బుగ్గల మీద అక్కడక్కడ నందిని యొక్క పెదాల ముద్దుతో ఏర్పడున్నది లిప్ స్టిక్మరకలు. బయటకు వచ్చిన తరువాత వెళుతురులో దాన్ని గమనించినప్పుడు, అతి వేగంగా తన దుప్పటాతో తుడిచింది.

అది కొందరు చూసి ముసి ముసి నవ్వు నవ్వుకున్నారు. ఒకరు వాళ్ళకు వినబడేటట్టు రాను రాను సినిమాహాళ్ళు కూడా లాడ్జీలలాగా మారటం మొదలు పెట్టినై అన్నాడు.

నందినికి మాటలు నొప్పి కలిగించింది.

అంతవరకు ఏర్పడిన సంతోషం అంతా మాటలతో దూరమయ్యింది . ఆమె స్వీయ గౌరవం తప్పు చేసినట్లు భావించింది.

సునీల్ కూడా గమనించాడు.

ఏమిటి నందిని...ఏదో ఒక కుక్క మొరిగిందని నువ్వెందుకు బాధపడతావు

అందులో కొంచం నిజం కూడా ఉందిగా సునీల్...!

పిచ్చిదానా! అందులో ఎటువంటి నిజమూ లేదు. అతను ఈర్ష్యతో మాట్లాడాడు. అతని తలను చూసావా. ఒక్క వెంట్రుక కూడా లేదు. వీడ్ని అమ్మాయి ఇష్టపడుతుంది? దగ్గరకు వెడితేనే పోరా చపాతి తలగాడాఅని చెప్పి ఎగతాలి చేస్తుంది. వాడికి అదే కోపం...

సునీల్ చెప్పింది హాస్యంగా నవ్వించే విధంగా ఉన్నది. ఆమెకు నవ్వు వచ్చింది. వచ్చిన నవ్వు వచ్చిన వేగంతోనే చెదిరిపోయింది.

ఏమిటి నందిని...ఇంకా ఎందుకు బాధ?”

సునీల్! ఇలాగే ఇంకా ఎన్నాళ్ళు?”

హోటల్ కు వెళ్ళి టిఫిన్ తింటూ మాట్లాడుకుందామే...?”

మాట్లాడటానికే నేను ఇప్పుడు హోటల్ కు వస్తున్నాను...తినడానికి కాదు...

తినడానికే వెడుతున్నాము. అలాగే వెళ్ళిన చోట మాట్లాడబోతాము. ఇప్పుడేంటి?”

ఎదురుగానే ఒక హోటల్ కనబడ్డది.

ఇద్దరూ లోపలకు వెళ్ళారు. ఏసి రూము ఎక్కడ అని అడిగారు. అక్కడ ఒక మూలగా కూర్చున్నారు.

ఇలా వచ్చే వారి దగ్గర నుండి ఎక్కువ డబ్బు టిప్స్ గా దొరుకుతుందని హోటల్ సిబ్బంది ఆశగా వస్తారు.

ఒక సర్వర్ వచ్చాడు.

రెండు మినపట్లు... అని అతన్ని కట్ చేసిన సునీల్, నందినిని చూసాడు.

...ఇప్పుడు చెప్పు...

ఏమిటి చెప్పేది. నీతో పాటూ ఊరు తిరగటం నా వల్ల కాదుఎవరైనా చూస్తారేమోనన్న భయం నన్ను చంపుతోంది

ఇదిగో చూడు! నీకూ ఊరు కొత్త. నాకూ కొత్త. ఎందుకు భయపడి చావటం?”

ఊర్లోనూ నాకు బంధువులు ఉన్నారు...తెలుసుకోండి

సరే నందిని! ఎందుకు నీలో ఇంత భయం? నా మీద నీకు నమ్మకం లేదా?”

నమ్మకం లేకేనా చీకట్లో ముద్దు ఇచ్చాను...నిన్నూ వద్దన్నానా?”

నువ్వెక్కడ ఒప్పుకున్నావు! నేనే లాగి పట్టుకుని ఇచ్చాను

మాట మార్చకు సునీల్....త్వరగా పెళ్ళికి ముహూర్తం చూడు...

నేను ఇప్పుడే...ఇక్కడే రెడీ. కానీ, నాకు ఒక అక్కయ్య ఉన్నదని, ఆమె పోలియో పేషంట్ అనేది నీకు బాగా తెలిసుండి, నువ్వు అవసర పడితే ఎలా నందిని

సునీల్! మాటే ఎన్ని రోజులు చెబుతావు? మీ అక్కయ్యకు త్వరగా పెళ్ళి ఏర్పాటు చెయొచ్చు కదా?”

చెయ్యకుండానా ఉన్నాము? కానీ, అక్కయ్యకు ఒక కాలు పోలియో వలన పనిచేయటం లేదని తెలుసుకుని, అలాగే వెనక్కి వెళ్ళిపోతున్నారు...

అయితే మీ అక్కయ్య పెళ్ళి ముగిసేంత వరకు, ఇలా మనం కలుసుకోవద్దు

నందిని! ప్రేమలో కొంచం చిలిపి చేష్టలకు చోటుందని గ్రహించు. అది ప్రేమించేటప్పుడే చెయ్యటం కుదురుతుంది

అతని సలహాలో బాగా ఉద్రేకం. చెప్పే విధంలోనూ ఉద్రేకం. మధ్యలో అట్టు వచ్చింది.

తిను! నీకు అనవసరమైన నేర భావన. నువ్వు చాలా భయపడుతున్నావు...

నిజంగా లేదు. నేనేమన్నా మట్టి బుర్రనా. నాకూ భావోద్వేగాలు  ఉన్నాయి

అలాగైతే ఎందుకు కలుసుకోవటాన్ని ఒక తప్పుగా అనుకుని, ఇక వద్దంటున్నావు

కలుద్దాం...మాట్లాడదాం. సినిమాలకూ, పార్కులకూ వద్దు. పెళ్ళి తరువాత నువ్వు నన్ను ఏమైనా చేసుకో

...! నువ్వొక తెలుగు అమ్మాయివని చెప్పకుండా చెబుతున్నావు...అంతే కదా?”

నువ్వు ఎలాగైనా తీసుకో

సరే మాడం! నేను ఇక సెలవులన్నీ పెట్టి హైదరబాద్ నుండి విజయవాడకు రాను. ఫోనులోనే మాట్లాడుకుందాం. తరువాత అక్కయ్యకు పెళ్ళే జరగకుండా పోతే ఏం చేద్దాం?”

సునీల్! ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు?”

లేదు. నీ దగ్గర అడిగి చూద్దామని. ఎందుకంటె, దానికీ చాన్స్ ఉంది

అలా అయినా నువ్వే కదా నిర్ణయం తీసుకోవాలి?”

నేనేం నిర్ణయం తీసుకోవాలి. నువ్వే చెప్పు?”

నువ్వు మాట్లాడేది చూస్తే మీ అక్కయ్యకు పెళ్ళి జరగకపోతే, నీకు పెళ్ళి వద్దని ఒక నిర్ణయానికి వచ్చేటట్టు తెలుస్తోందే...

అది నువ్వు తీసుకునే నిర్ణయంపైన ఆధారపడి ఉంటుంది

నేనేమిట్రా నిర్ణయం తీసుకునేది? నాకు ఎప్పుడూ ఒకటే నిర్ణయం. అది మన పెళ్ళే

సరే, నేను ఎలాగైనా అక్కయ్యను తోసేయటానికి ప్రయత్నిస్తాను

తోసేస్తావా...ఆమె నీ అక్కరా. బ్రేక్ డౌన్ అయిపోయిన నీ డొక్కు స్కూటర్ కాదు. ఆలొచించి మాట్లాడు

ఆలొచించే మాట్లాడుతున్నాను. సరి, సరి. తిను

అత్యంత సంతోషంతోనూ, ఉత్సాహంతోనూ ప్రారంభమైన వాళ్ళ మీటింగు...పెళ్ళి అనగానే అవి తగ్గిపోయి, అందులో మెల్లగా చేదు విస్తరించడం  ప్రారంభమయ్యింది.

నందిని కూడా తొందర తొందరగా తినింది. చేతి గడియారం చూసుకుంది.

టైము ఎనిమిది!

భగవంతుడా...నేను హాస్టల్ కు వెళ్ళాలి. లేటుగా వెడితే లోపలకు పంపరే...

సరే...బయలుదేరు

నువ్వెప్పుడు హైదరబాద్ వెళ్ళబోతావు?”

ఇలాగే బస్ స్టేషన్ కు వెళ్ళి బస్సు ఎక్కి వెళ్ళిపోవటమే

సరే నేను బయలుదేరతా. రేపు నువ్వు హైద్రబాద్ వెళ్ళిన వెంటనే ఫోన్ చెయ్యి

ఖచ్చితంగా

ఇద్దరూ ఒకరుగా విడిపోయే ఘట్టానికి వచ్చారు. వేరు వేరు ఆటోలలో ఎక్కారు.

ఆటోలు బయలుదేరినై.

నందిని హాస్టల్ ముందు దిగింది. గేటు దగ్గరకు వెళ్ళింది. గేటు తాళం వేసుండటంతో కొంచం భయపడ్డది.

సెక్యూరిటీ -- గట్టిగా కేక వేసింది.

సెక్యూరిటీ దగ్గరకు వచ్చాడు.

గేటు తీయండి...

టైము ఇప్పుడు ఎంతైందో తెలుసా?”

ఎనిమిది ఇరవై

ఎనిమిది గంటల కల్లా రావాలని తెలుసా...తెలియదా?”

సారీ...గుడిలో ఎక్కువ జనం ఉన్నారు

సినిమా హాలు అని చెప్పమ్మా...--సెక్యూరిటీ గట్టిగా చెబుతూ గేటు తెరిచాడు.

ఆమెకు ఒక్కసారిగా గుండె గుభేలుమంది. లోపలకు అడుగు పెట్టింది.

వెళ్ళి వార్డన్ గారిని చూసేసి వెళ్ళమ్మా... అన్నాడు సెక్యూరిటీ.

ఆమెకూ అర్ధమయ్యింది.

వార్డన్ ఒక గయ్యాలి...హాస్టల్ వార్డన్లు చాలావరకు గయ్యలులుగా వుండాలనేది ఒక శాపమో?

గుడ్ ఈవెనింగ్ మ్యాడం... చెబుతూనే లోపలకు వెళ్ళింది.

ఇది ఈవెనింగామ్మా...ఇప్పుడు టైమెంత?”

ఎనిమిదీ ఇరవై మ్యాడం...

ఇలాగా ఆలస్యంగా వస్తావు?”

సారీ మేడం

ఏమిటి సారీ...! నిన్ను సినిమా హాలులో ఎవరో ఒక అబ్బాయితో చూసినట్లు సమాచారం. నిజమా..?”-----హాస్టల్ వార్డన్ మాట బలంగా ఉంది.

నందిని కూడా అబద్దం చెప్పదలుచుకోలేదు, “అవును మ్యాడం. ఆయన నాకు కాబోయే భర్త అన్నది.

అంటే ఇప్పుడు ప్రేమికుడు...అంతే కదా?”

...అవును

సారీ అమ్మాయ్. ప్రేమ, ఊరంతా తిరగటం హాస్టల్ జీవితానికి సరిపోయే విషయం కాదు

మేడం! ఇదేమన్నా కాలేజీ హాస్టలా? నేను టీచర్ను. నేనేమీ మీకు బానిస కాదు

నేను అలా చెప్పలేదే?”

మరైతే ఎందుకు మ్యాడం నా ప్రేమ గురించి, ఊరంతా తిరగటం గురించి మాట్లాడుతున్నారు?”

అవునమ్మా! ఇక్కడ మాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. రేపే నువ్వు తప్పు చేసి, గర్భం దాల్చి -- అలాగే ఇక్కడకు వస్తావు....లేదు ప్రేమికుడు వదిలేసేడేనని, ఇక్కడున్న గదిలో ఆత్మహత్య చేసుకుంటావని పెట్టుకో, అది మా హాస్టల్ కే కదా చెడ్డ పేరు?”

---వార్డన్ ఊహలలో ఎక్కడికో వెళ్ళిపోయింది. అది విని అదిరిపడ్డది నందిని. అంతకు మించి ఆమెతో వాదం చేయటానికి ఆమెకు ఓపిక లేదు.

ఇదేమీ మీ ఇల్లు కాదమ్మా. ఒక వేల ఇల్లుగా ఉన్నా, మీ అమ్మ ఖచ్చితంగా అడిగే తీరుతుంది కదా...

అవును మ్యాడం

అలా అయితే నువ్వు హాస్టల్ కు తగినట్టు నడుచుకోటానికి ట్రై చెయ్యి. లేకపోతే దయచేసి హాస్టల్ ఖాలీ చెయ్యి

సరే మ్యాడం

ఏమిటి సరే... ఇక నీ వరకు ఒక్క నిమిషం ఆలశ్యం కూడా అనుమతించను. అదేలాగా నువ్వు ఎవరితోనో బయట తిరిగేది నా చెవికి వచ్చినా నేను వూరికే ఉండను

----హాస్టల్ వార్డన్ యొక్క కఠినమైన స్వరం గదమాయించింది.

నందిని కూడా కలతతో తన గది వైపుకు నడిచింది. సునీల్ తో కలిసి ఎంజాయ్ చేసిన తరునాలు, వరద నీళ్ళు లాగా వచ్చి వెళ్ళినట్లు వున్నది.

                                                                                                                      Continued...PART-6

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి