ప్రేమకు సహాయం...(సీరియల్) PART-6
తెల్లవారటంతో కళ్ళు
నలుపుకుంటూ
లేచారు
పరమేశం
గారు. కానీ, ఆయనకు
ముందే
లేచాడు
ముకుంద
రావ్. ఇంటి వాకిట్లో
లైటు
వెలుగుతోంది.
కళ్ళు
నలుపుకుంటూనే
చూశారు.
దర్షిణి ముగ్గు వేస్తోంది!
ముకుంద
రావ్ దగ్గరుండి నేర్పిస్తున్నాడు.
“దర్షిణీ! అలా
కాదురా...ఇటుపక్కగా
సన్నగా
లాగు.
అది
చాలు”
“అన్నీ నాకు
తెలుసు
నాన్నా.
నువ్వు
వూరికే
వుండు”
వాళ్ళిద్దరి సంభాషణ
ఆయన
కళ్ళను
తడి
చేయటం
జరిగింది.
వాళ్ళూ
మావయ్య
వచ్చి
నిలబడింది
చూశారు.
“అరెరె! మావయ్యా
లేచేసారా?”
“ఏమిటయ్యా ఇది...? ఎప్పుడూ
నేనే
తొందరగా
లేస్తాను
అనుకుంటే, నా
కన్నా
తొందరగా
ఉన్నావే?”
“ఇది మాకు
రోజూ
ఉండే
అలవాటు.
నేను
ఇప్పుడు
వెళ్ళి
పాలు
కొనుకొచ్చి
కాఫీ
పెడతాను.
దర్షిణి
హోం వర్క్ అంతా
పూర్తి
చేస్తుంది.
ఎనిమిది
గంటలకల్లా
వంటావిడ
వచ్చేస్తుంది” అంటూనే
ఇద్దరూ
లోపలకు
వచ్చారు.
పరమేశం వాళ్ల
వెనుకే
వచ్చారు.
ఆయనకు
ఏదో
ఒకటి
చెయ్యాలని
ఉన్నది.
కానీ, ఏం
చేయాలో
మాత్రం
తెలియటం
లేదు.
ముకుంద రావ్ ఒక
చొక్కా
వేసుకుని, వైరు
బుట్టతో
వచ్చాడు.
“మావయ్యా! పాల
బూత్
వరకు
వెళ్ళొస్తా”
“ముకుందం! నేనూ
నీతో
వస్తారా...”
“రండి మావయ్యా”
ఇద్దరూ వీధిలోకి
రావటంతో
దర్షిణి
జాగ్రత్తగా
తలుపు
వేసుకుంది.
వీధిలో చీకటి
ఇంకా
పూర్తిగా
కనుమరుగవలేదు.
ప్రొద్దుటి
మంచు
సన్నగా
పడుతోంది.
కొన్ని ఇళ్ళ
వాకిళ్ళల్లో
ముగ్గులు
వేస్తున్నారు.
పేపర్లు
వేసే
కుర్రాళ్ళు
అప్పుడప్పుడు
వేగంగా
సైకిల్ల
మీద
వెడుతున్నారు.
సూర్యోదయ సమయం
హాయిగానే
ఉంది!
అందులో
కాలి
నడకన
వెళ్ళటం
మరో
హాయి.
బాగా నిద్రపోయి
లేచిన
తరువాత, చేతులు
ఊపుకుంటూ
కొద్దిగా
వేగంగా
నడుస్తుంటే
శరీరంలో
ఉన్న
అవయవాలకు
కొత్త
శక్తి
పోసినట్టు
ఉంటుంది.
ముకుంద రావ్ కూడా
వెగంగా
చేతులు
వూపుకుంటూనే
నడిచాడు.
అతని
వేగానీకి
సరితూగలేకపోయాడు
మావయ్య.
కానీ, మనసులో
అతిపెద్ద
ఎత్తులో
ఉన్న
ఒక
చోటుకు
వచ్చినట్టు
ఆయనవరకు
భావించాడు.
ఆ
భావన
తాకిడి
తగ్గకుండా
ఆ
ప్రొద్దుటి సమయంలో
అతని
దగ్గర
మాటలు
మొదలుపెట్టారు.
“ముకుందం...”
"చెప్పండి
మావయ్యా"
“ఈ ప్రొద్దుటివేల
చాలా
బాగుంది
కదా?”
“అదే కదా
మావయ్యా
సూర్యోదయ
వేలకు
ఉన్న
శక్తి”
“ఇప్పుడు ఆలొచన, మాటలూ
కూడా
క్లియర్
గా
ఉంటాయి--అవును
కదా?”
“మావయ్యా మీరు
ఏం
మాట్లాడ
దలుచుకున్నారో
నాకు
తెలిసిపోయింది...”
“అలాగా! ఏమిటో
చెప్పు
చూద్దాం?”
“మళ్ళీ నా
పెళ్ళి
గురించే
మాట్లాడబోతున్నారు...కరెక్టే
కదా?”
“అవునురా...నిన్ను
ఇలా
చూస్తున్నప్పుడు
మనసుకు
ఎంత
బాధగా
ఉందో
తెలుసా?”
“ఏమిటి మావయ్యా...నేనేమన్నా
రాళ్ళా
కొడుతున్నాను...నన్ను
చూసి
బాధ
పడేందుకు?”
“అది కూడా
నీ
ముందు
చిన్న
పనే.
ఎందుకంటే
నువ్వు పగులకొట్టేది
రాళ్లను
కాదు, అందరి
మనసులనూ
విరక్కొడుతున్నావు...”
“నేనా?”--వీధి
అని
కూడా
చూడకుండా
నిలబడి
ఆయన్నే
తధేకంగా
చూశాడు.
“ఏమిటయ్యా! నేనా
అని
ఒక
లాగా
కేక
వేస్తున్నావు? నువ్వే!”
“లేదు మావయ్యా!
నాకు
ఎవరి
మనసూ
విరక్కొట్టటం
అనేది
తెలియదు
మావయ్యా”
“తెలియకనే రాత్రి
నేను
అడిగిన
ప్రశ్నకు
సమాధానమే
చెప్పకుండా
మాట
మార్చేవు?”
“నేను సమాధనం
చెప్పలేక
మాట
మార్చ
లేదు....సమాధనం
చెప్పకూడదని
మాట
మార్చా”
“ఎందుకయ్యా అలా?”
“అది అంతే
మావయ్యా!
నాకు, నా
భార్య
సంధ్యకు
ఉన్న
బంధం
ముగిసిపోయిందని
నేను
అనుకొవటం
లేదు.
శరీరకంగా
ఆమెతో
ఉండలేకపోతున్నా.
అంతే
నని
నేను
అనుకుంటున్నాను”
“ఇది భార్యను
పోగొట్టుకున్న
ప్రతి
మొగవాడూ
పాడే
పల్లవినే
ముకుందం ...”
“పల్లవియో, చరణమో...నా
వరకు
అదే
నిజం.
మీకు
తెలియదు
మావయ్యా...నా
సంధ్య
నా
మీద
ఎంత
ప్రేమ, అభిమానం
పెట్టుకుందో
తెలుసా?”
అతను చెబుతున్నప్పుడే
అతని
గొంతు
బొంగురు
పోయింది.
కళ్ళ
నుండి
నీరు
కారింది.
“ముకుందం! నేను
నిన్ను
ఏడిపించటం
కోసం
రాలేదయ్యా.
నిజానికి
నేనొచ్చిన
పని, కారణం
వేరు...”
“తెలుసు మావయ్యా, అదేమిటో
కూడా
నాకు
తెలుసు”
“ఏం తెలుసయ్యా
నీకు.
నీకు
తెలిసిందేదో
కొంచం
చెప్పు...?”
“మీ కూతురు
ఉమ, భర్తను
పోగొట్టుకుని
నిలబడుంది.
నేను
నా
భార్య
సంధ్య
ను పోగొట్టుకుని నిలబడున్నాను. ఆల్
జీబ్రా
లెక్కల్లో
‘మైనస్
ఇంటు
మైనస్
ప్లస్’ అనే
లెక్క
ఉంది.
అదేలాగా
మైనస్
ల
మైన
మేమిద్దరం
ఎందుకు
ఒకటిచేరి
ప్లస్
అయ్యి
జీవించకూడదని
మీరు
అనుకుంటున్నారు.
కరెక్టేగా?”
----ముకుంద రావ్ అడిగేటప్పటికి
పూర్తిగా
వెలుతురు
వచ్చింది.
“ముకుందం...”--అని గొంతు
నీరసించ, అతని
చేయ్యి
పుచ్చుకున్నారు.
అయోమయంగా
చూశారు.
“కరక్టే కదా
మావయ్యా?”
“అవునయ్యా...! నేను
ఆ
ఆలొచనతోనే
నిన్ను
చూడటానికి
వచ్చాను.
ఒక
తండ్రిగా
నా
కూతుర్ని
సంపూర్ణ
జీవితం, జీవించేటట్టు
చేయాలనుకోవడం
తప్పేమీ
కాదే?”
“ఖచ్చితంగా తప్పు
కాదు
మావయ్యా.
కానీ, నన్ను
మన్నించండి.
మీ
ఆశను
నేను
నెరవేర్చ
లేను.
జరగని
ఈ
విషయం
గురించి
ఎందుకు
మాట్లాడటం
అనే
రాత్రి
మాట
మార్చాను...”
“ముకుందం...ఒక
విధవరాలుకి
మరు
జీవితం
ఇవ్వమని
చెప్పటానికి
మాత్రమే
నేను
ఇప్పుడు
మాట్లాడటం
లేదు.
దీన్ని
సాకుగా
పెట్టుకుని
నీ
జీవితాన్ని
కూడా
సరిచేసుకోవయ్యా.
ఉమ
నీ
కూతురికి
ఒక
మంచి
తల్లిగా
ఉంటుంది”
ఆయన్ని మాట్లాడిస్తుంటే
నొరు
విప్పి
ఏడ్చేసేటట్టు
ఉన్నాడు.
కానీ, అతను
కొంచం
కూడా
దానికొసం
ఆలొచించక, తాను
ఇంతకు
ముందే
జ్ఞాపకం
తెచ్చుకోవాలని
ఆశపడ్డ
సంధ్య
తో ట్యాంక్ బండ్
దగ్గర
జరిగిన
సంఘటనలను
జ్ఞాపకం
తెచ్చుకోవటం
మొదలు
పెట్టాడు.
యంత్రంలాగా చేతులు
పాల
ప్యాకెట్లను
తీసుకున్నాయి.
కాళ్ళు
కూడా
ఇంటివైపుకు
నడవసాగినై.
మావయ్య
ఎటువంటి
చలనం
లేకుండా
అతనితో
నడిచాడు.
అతనిలో
సంధ్య
గురించిన
ఆలొచనలు.
ట్యాంక్ బండ్
వద్ద
ఎప్పటిలాగానే
ఎక్కువ
జనం.
అవతలవైపున్న
చెట్ల
మధ్యే
ప్రేమికులు
దాక్కునే
చోటు.
సంధ్య
కోసం వచ్చి కాచుకోనున్నాడు.
ముకుంద రావ్ కళ్ళకు
కనిపించినంత
దూరంలో
ఆమె
వచ్చేది
కనబడలేదు.
విసుగ్గా
ఉంది.
ట్యాంక్
బండ్
దగ్గర
ఆ
రోజు
గాలిలో
వేగం
లేదు.
ఏదో
పేరుకు
గాలి
వీస్తోంది.
ప్రొద్దున కాచిన
ఎండ
యొక్క
వేడి
సెగ
మిగిలింది.
కూర్చోనున్న
బెంచీ, వేసుకున్న
ప్యాంటును
దాటి
తొడ
భాగంలో
వేడెక్కింది.
దాన్నుండి
తప్పించుకోవటానికి
కొంచం
నీడగా
ఉన్న
చోటుకు
వెళ్ళి
నిలబడ్డాడు.
ఒకసారి ట్యాంక్
బండ్
ను
పూర్తిగా
చూశాడు.
విపరీతమైన
జనం.
లైటు
వెలుతురుతో
అందంగా
కనబడింది.
ఎవరైనా
ప్రపంచం
లోని
అందమైనది
ఏదీ
అని
అడిగితే...టక్కుమని
ట్యాంకు
బండ్
అని
చెబుతా.
ఇక్కడున్న
బెంచ్
ల
మీద
కూర్చుని
చల్లటి
గాలి
పీల్చుకుంటూ
హాయిగా
రిలాక్స్
అయితే
అది
ఒక
ఖరీదు
కట్టలేని
ఆనందం.
ఈ
ఆనందానికి
ముందు
డబ్బూ, పదవి
ఎందుకూ
పనికి
రావు.
ముకుంద రావ్ మనసులో
ట్యాంక్
బండ్
అనేది
ఇలాగే
ఆలోచింప
చేసింది.
ఇలాగూ
ఆలొచించ
వచ్చు
అనే
లాగా
ఉంది.
అదే
లాగా, ఇలాంటి
ఏ
ఒక
ఆలొచనా
లేకుండా ఒక ప్రేమ
జంట
మిక్కిలి
అందంగా
తప్పు
చేస్తూ
ఉన్నారు.
జన్మకు తెలిసిందే
కౌగలించుకోవటం, ముద్దుపెట్టుకోవటమే
అన్నట్టు
ఉన్నది.
దగ్గర
దగ్గర
ముకుంద
రావ్ ట్యాంక్ బండ్
వైపు
చూస్తూ
ఉన్న
దిక్కు
వైపే
ఆ
జంట
ఉల్లాశంగా
ఉన్నది.
ఎవరైనా
చూస్తే
ముకుంద
రావ్ ఆ దృశ్యాన్నే
చూస్తూ
ఉన్నాడు
అనే
అనుకుంటారు.
అలాగే అప్పుడే
అక్కడికి
వచ్చి
జేరిన
సంధ్య
కూడా
అనుకుంది.
ఆమెకు
కంపరం
పుట్టింది.
కుడి
కాలితో
మట్టిని
తంతూ
...‘ముకుంద్’ అని
కొంచం
కసురుకుంటున్న
స్వరంతో
పిలిచింది.
అతనూ తలెత్తి
చూశాడు.
“సంధ్యా...”
“ఏమిటి ముకుంద్...? ఆ
అసహ్యాన్ని
ఏమిటి
లుక్కు
వేస్తున్నారు...? అంత
మోసమైన
టేస్టా
మీకు?”
ఆమె అడిగిన
తరువాతే
అతను
అటు
చూడటం
చేశాడు.
కళ్ళను
మూసుకున్నాడు.
“ఇదంతా వుత్త
యాక్టింగ్.
మొదట
చేసేయటం.
తరువాత
నేను
ఇలా
అడిగాను
కనుక
కళ్ళను
మూసుకుంటున్నట్టు
యాక్టింగ్
చేయటం...”
ఆమె దగ్గర
చిటపటలు.
“సంధ్యా, నిజంగా
చెబుతున్నా...నేను
ట్యాంక్
బండ
అందాలనే
చూస్తున్నాను.
ఆ
అసహ్యాన్నంతా
చూడ
లేదు.
నన్ను
నమ్ము...”
“సరే...మొదట
ఈ
చోటు
వదిలి
రండి...”
అతన్ని పిలుస్తూనే
వేరే
వైపుకు
మిక్కిలి
వేగంగా
నడవటం
మొదలుపెట్టింది.
అతనూ, “ఉండు
సంధ్యా...నీకొసం
ఎంత
సేపు
కాచుకోనున్నానో
తెలుసా...? అవును, ఎందుకు
లేటు?” అంటూ
ఆమె
వెనుకే
వెళ్లాడు.
ఆమె వెళ్ళి
మరొక
చెట్టు
పక్కనున్న
బెంచ్
మీద
కూర్చుంది.
మొహంలో
కొట్టొచ్చినట్టు
కనబడింది
కోపం.
“సంధ్యామ్మా ...”
“ఏమీ మాట్లాడకండి”
“అయ్యో రామా!
ప్రేమలో
ఇదంతా
చాలా
సహజమైన
విషయమమ్మా...”
“వాళ్ళకు సపోర్టా?”
“లేదు...లేదు...!
అది
ప్రేమ
జంటే
కాదు.
డబ్బిచ్చి
తోసుకు
వచ్చిన
కేసు
లాగుంది”
“వాళ్ళను గమనించకుండా
అదెలా
మీకు
తెలుసు?”
“నేను గమనించానే...!”
“అలాగైతే ఎందుకు
ట్యాంక్
బండ్
అందాలను
చూస్తున్నానని
అబద్దం
చెప్పారు...?”
“భగవంతుడా! నువ్వు
అరిచిన
తరువాతే
చూశాను.
దాన్నే
గమనించానని
చెప్పాను”
“బాగానే మాట
మారుస్తున్నారు”
“ఏమిటి సంధ్యా!
ఎంతైనా
నువ్వు
ఇంత
‘సెన్
సి
టివ్’ గా
ఉండకూడదు”
“ఇలా ఉండటానికి
పేరు
‘సెన్
సిటివ్వా’?”
“కాదా మరి? రేపు
మన
పెళ్ళి
అయిన
తరువాత
కూడా
నిన్ను
చూడాలంటే
పాస్
పోర్టూ, వీసా
తీసుకు
రావాలని
చెప్తావు
లాగుందే?”
“చీ,చీ...!”--ఆమె దగ్గర
ఒక
మార్పు
ఏర్పడి, సిగ్గు
బయట
పడింది.
అతనూ దగ్గరగా
కూర్చున్నాడు.
“ఇక్కడ ఎంత
సేపు
నేను
బోరు
కొట్టుకుంటూ
కూర్చున్నానో
తెలుసా?”
“నేను కావాలనే
లేటుగా
వచ్చాను”
“అదా సంగతి!
నన్ను
కాచుకోబెట్టి
వేడుక
చూడటం
ప్రారంభించావా
నువ్వు?”
“వేడుక చూడలా...పరిశోధించి
చూసా”
“పరిశోధనా?”
“అవును! నా
కోసం
కాచుకోనుంటారా...లేక
కాచుకొని
ఉన్నందుకు
మండి
పడతారా? అదీ
లేకపోతే...ఇలా
‘సీను’ చూసుకుంటూ
ఉంటారా? అని
నా
లోపల
ఏన్ని
ప్రశ్నలో
తెలుసా?”
“సంధ్యా! ఇలాగంతా
ఎవరు
నడుచుకుంటారో
తెలుసా?”
“ఎవరు?”
“కొంచం కూడా
నమ్మకం
లేని
వాళ్ళు.
అనుమాన
ప్రాణులు, సాడిస్టులు.
వీళ్ళే
ఇలా
నడుచుకుంటారు.
ఇందులో
నువ్వు
ఏ
రకమనేది
తెలియటం
లేదు!”
ఆమె ఆ
మరు
క్షణమే
బాణం
గుచ్చుకునేటట్టు చూపు
చూసింది.
“ఏమిటి చూస్తున్నావు...? నేనేమీ
తప్పుగా
చెప్పలేదు.
ఉన్నదే
చెప్పాను”
“లేదు ముకుంద్!
నాలుగో
రకం
ఒకటుంది.
అది
మీరు
వదిలేసారు...”
“నాలుగో రకమా...అదేమిటి?”
“తన ప్రేమికుడ్ని
తప్ప
ఈ
లోకంలో
ఇంకేదీ
పెద్దది
లేదు
అని
అనుకునే
ఒక్కొక్క
అమ్మాయీ
ఇలాగే
నడుచుకుంటుంది...”
“సంధ్యా...”
“అవును ముకుంద్!
మామూలైన
ఈ
కాచుకోవటానికే
ఓర్పు
లేని
ప్రేమికుడా...జాతి, మతం, కుటుంబం, సమాజం
వీటన్నిటినీ
వదిలిపెట్టి
ఒక
అమ్మాయి
చేయి
పడతాడు?”
“ఓ! నీ
ఆలొచన
ఇలా
పోతోందా?”
“వేరే ఎలా
ముకుంద్
పోవాలి?”
“ఇదొక చిన్న
విషయం
సంధ్యా.
దీనికీ, నువ్వు
చెప్పిన
మిగిలిన
విషయాలకూ
సంబంధం
ఉందని
నేను
అనుకోవటం
లేదు...”
“లేదు ముకుంద్!
సంబంధం
ఉన్నదని
నేను
ఖచ్చితంగా
నమ్ముతున్నాను”
“సరే. దీన్ని
పెట్టుకుని
మనం
పోట్లాడుకోవద్దు.
నువ్వు
అలాగే
ఆలోచించు...నేను
ఇలా
ఆలొచించి
వెడతాను”
“చూశారా...ఈ
చిన్న
విషయానికి
కూడా
మన
దగ్గర
అభిప్రాయాలు
ఒకటిగా
లేవు...!”
“ఏమిటి సంధ్యా...ఎందుకు
ఈ
రోజు
అపోజిట్టు
గా
మాట్లాడుతూ
వెడుతున్నావు...?”
“భయంగా ఉంది
ముకుంద్...చాలా
భయంగా
ఉంది”
“ఏమిటి భయం?”
“అవును...మనకు
పెళ్ళి
అయ్యి
బాగుంటామా?”
“హఠాత్తుగా ఎందుకు
నీకు
ఈ
అనుమానం...?”
“లేదు...మా
ఇంట్లో
నన్ను
చంపేసినా
చంపేస్తారు.
ఖచ్చితంగా
మన
పెళ్ళికి
ఒప్పుకోరు.
దగ్గర
దగ్గర
మీ
ఇంట్లో
కూడా
అదే
పరిస్థితి
కదా”
“ఇది తెలిసిన
విషయమే
కదా
సంధ్యా...?”
“ఇందులో ఇంకో
చిక్కు
కూడా
ఉంది
ముకుంద్...”
“ఏమిటి సంధ్యా!
కొత్త
కొత్తగా
ఏమిటేమిటో
చెబుతున్నావు?”
“కొత్తగానే కదా
అంతా
మొలకెత్తుతోంది...”
“నువ్వు చూట్టూ
తిప్పకుండా
అసలు
విషయం
చెప్పు”
“ముకుంద్! మిమ్మల్ని
చంపటానికి
మా
అన్నయ్య
కిరాయి
రౌడీలను
రెడీ
చేస్తున్నట్టు
తెలుస్తోంది”
“రానీ...నేను
ఎదుర్కోంటాను.
కానీ, భయపడి
పోయి
నిన్ను
వదిలిపెట్టి
పారిపోను”
“అది నాకు
తెలుసు...మీ
ప్రాణానికి
ఏదైనా
జరిగితే...?”
“దానికేం సంధ్యా
ఇప్పుడు...? నువ్వు
ఆత్మహత్య
చేసుకుని
నన్ను
వెతుక్కుంటూ
వచ్చేశాయి...”
“ముకుంద్...”--ఆమె మిక్కిలి
భావోద్వేగంతో, అలాగే
అతని
ఒడిలో
పడి
ఏడవటం
మొదలుపెట్టింది.
“ఏమిటి సంధ్యా!
నేను
అలా
చెబుతానని
నువ్వు
ఎదురు
చూడ
లేదా?”
“అవును ముకుంద్.
కానీ, ఆ
సమాధానం
నాకు
బాగా
నచ్చింది.
అది
పోనీ...అదే
విషయం
తలకిందలుగా
జరిగి
నేను
ముందు
వెళ్ళిపోతే...?”
“ఇదేం ప్రశ్న...నేను
నిన్ను
వెతుక్కుంటూ
వస్తాను”
“నిజమా?”
“ఏమిటి నిజమా...ప్రామిస్
గా
చెబుతున్నా.
దేని
మీద
వాగ్ధానం
చేసి
చెప్పాలి...ఎవరి
మీద
ప్రామిస్
చేయాలి?”
“అయితే మళ్ళీ
పెళ్ళి
అనేది
చేసుకోరు...”
“ఈ జన్మకు
ఒక
పెళ్ళే.
అది
నీతో
మాత్రమే”
“ఇదంతా సినిమాలలోనే
సాధ్యం!
నిజ
జీవితంలో
నేను
ఒకర్ని
కూడా
చూడలేదు”
“సంధ్యా! నువ్వు
చాలా
భయపడుతున్నావు.
నన్ను
ఎక్కువగా
ప్రేమిస్తున్నావు.
అన్నీ
కలిసే
నిన్ను
ఇలా
మాట్లాడిస్తోంది...”
“అవును ముకుంద్!
నా
కెందుకో
మనం
మంచిగా
కాపురం
చేయగలమనే
అనిపించటం
లేదు.
ఎందుకంటే
నా
కుటుంబం
అలాంటిది...”
“అది అనవసరమైన
భయం
సంధ్యా.
ఇదేమీ
జాతులను
పట్టుకుని
వేలాడే
కాలం
కాదు.
జాతులు
కొంచకొంచం
విరిగి
చెదిరిపోతున్న
కాలం.
మనకి
పెళ్లై
బిడ్డ
పుడితే...అన్నీ
మారిపోతాయి.
మీ
ఇల్లూ, మా
ఇల్లూ...రెండూ
కలిసిపోతాయి”
“అలా జరిగితే
సంతోషమే!
కానీ, నాకు
నమ్మకం
లేదు
ముకుంద్...”
“సరే, ఏం
చేద్దామో
నువ్వే
చెప్పు...”--ఎక్కువ కోపానికి
మారటం
మొదలు
పెట్టాడు.
“ఎందుకు ముకుంద్
అరుస్తావు?”
“మరి...మనం
ప్రేమించుకోవటానికి
వచ్చిన
చోట్లో
‘కోర్టు’ లో
లాగా
వాదం
చేస్తూ
ఉండటం
నాకు
కొంచం
కూడా
నచ్చలేదు...”
“సారీ ముకుంద్.
నేనేమీ
మాట్లాడను...మాట్లాడనంటే
మాట్లాడను”
“సంధ్యా! ఎందుకు
అటూ, ఇటూ
అల్లాడిపోతున్నావు? జీవించాలని
విధి
ఉంటే
జీవిద్దాం.
లేదు...చచ్చిపోదాం.
ఈ
విషయమే
కదా
ఎప్పుడో
నేను నీతో ‘కట్
అండ్
రైటు’ గా
చెప్పాసేనే...?”
“అవును కదా...”
“ఇక మాటల్లో
చెప్పటం
నాకు
ఇష్టం
లేదు.
అదిగో
తెలుస్తోందే
ఆకాశం, దాని
సాక్షిగానూ, అదిగో
ఉందే
ఆ
గుడి
సాక్షిగానూ...వీచే
గాలి, సూర్యుడు, తరువాత
ఈ
భూమి
మీదున్న
పంచభూతల
సాక్షిగానూ, నీ
మీద
ప్రామిస్
చేసి
చెబుతున్నా.
ఈ జన్మకు
నువ్వే
నా
భార్యవి.
నీతో
జీవించటం
కుదరకపోతే...చచ్చిపోతానేమో
గానీ, ఇంకొక
అమ్మాయి
అని, ఇంకో
జీవితమని
మాత్రం
నేను
మారను.
ఇది
సత్యం...ఇది
సత్యం...ఇది
సత్యం...ఇది
సత్యం....ఇది
సత్యం...” అంటూ ఐదుసార్లు
సత్యం
చేసి
ముగించాడు.
ఆమె అడిగింది
“అవును...ఎందుకు
ఐదు
సార్లు
సత్యం
చేశారు?”
“పంచ భూతల
సాక్షిగా
అని
చెప్పి
ఒక్కసారి
మాత్రం
ప్రామిస్
చేస్తే
ఎలా? అందుకే
ఐదు
సార్లు
చేసాను”
ఆమె మరుక్షణమే
అది
ట్యాంక్
బండ్
దగ్గరున్న
పార్క్
అని, అక్కడ
చాలా
మంది
జనం
ఉన్నారని
కూడా
చూడకుండా
అతన్ని
గట్టిగా
కౌగలించుకుంది.
Continued...PART-7
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి