ప్రేమకు సహాయం...(సీరియల్) PART-10
సాయంత్రం స్కూల్
ముగిసింది.
దర్షిణి
ఇంటికి
వెళ్ళటానికి
తయారయ్యింది.
కానీ, ఫిట్స్
వచ్చినప్పుడు
దెబ్బలు
తగిలిన
చోట
ఎర్రగా
ఎరుపు
రావటంతో, పుస్తకాల
మూటను
ఎలా
తగిలించుకోవాలో
అర్ధం
కాలేదు.
చూడటానికి
బాగా
నీరసంగా
కనబడింది.
దర్షిణి
ను ఒకత్తిగా, ఒంటరిగా
పంపటం
మంచిదిగా
అనిపించటం
లేదు.
“ఎలా దర్షిణి
నువ్వు
ఇంటికి
వెళతావు?”
“ఆటో పుచ్చుకుని
వెళ్తాను
టీచర్...”
“ప్రొద్దున నాన్నతో
వచ్చావే?”
“ప్రొద్దున మాత్రం
నాన్న
తీసుకువచ్చి
వదిలిపెడతారు”
“సరే, ఇప్పుడు
నువ్వు
ఆటోలో
వెళ్ళగలవా?”
“వెళ్ళగలను టీచర్..."
అన్న
దర్షిణిని, వెయిట్
చేసి
ఆటోలో
ఎక్కించటానికి
వెళ్ళింది.
ఆటో
స్టూడెంట్స్
తో
నిండిపోయుంది.
ఒక ఆటోలో
ఇంతమంది
స్టూడెంట్సా!
‘ఆటో డ్రైవర్
సేవ
చేస్తున్నాడా...లేక
చిత్రవధ
చేసున్నాడా’' అనే
ప్రశ్న, కోపంతో
కలిసి
వచ్చింది
నందినికి.
“ఇలాగా పిల్లలను
ఎక్కించుకుని
లోపలకు
తోస్తావా?”
“ఏం చేయను
టీచర్? పెట్రోల్
అమ్మే
ధరకి
గిట్టుబాటు
కావాల
కదా?”
“మీటర్ వేసి
నడిపితే
బాగా
గిట్టుబాటు
అవుతుంది.
ఆటో
అనేది
అప్పుడు
ప్రజలకు
సులువుగా
దొరికే
మొదటి
వాహనం
అవుతుంది.
అలా
చేయకూడదని
ప్రణాలిక
వేసుకుని
చాలా
మంది
ఆటోవాళ్ళు
తిరుగుతున్నప్పుడు, మిమ్మల్నంతా
ఎలా
బాగుపరచగలం?”
“చాలు టీచర్...ఈ
ఆటో
ఉద్యోగం
చేసి
చూడండి!
అప్పుడు
తెలుస్తుంది
మా
కష్టాలు”
“అది సరి, సరిగ్గా
న్యాయంగా
నడుచుకోమని
చెబితే, వెంటనే
చేసి
చూడండా...సరేనయ్యా, నేను
నీ
దారికే
వస్తానయ్యా.
ఇక్కడ్నుంచి
చివరి
స్టూడెంట్
ను
దింపేవరకు
నువ్వు
ఎన్ని
కిలో
మీటర్ల
దూరం
ఆటో
నడుపుతావు...?”
“ఒక పది
కిలోమీటర్లు
పెట్టుకోండి...”
“పెట్టుకోనా...సరే.
ఇందులో
పదహారు
స్టూడెంట్స్
ఉన్నారు.
వాళ్ళ
దగ్గర
ఒక్కొక్క
స్టూడెంటుకూ
ఎంత
తీసుకుంటావు?”
“నెలకు ఐదు
వందలు”
“అంటే శని, ఆదివారాలు
లీవు
పోనూ
నెలకు
ఇరవైరెండు
రోజులు...అంతే
కదా?”
“ఆ... పెట్టుకోండి”
“అంటే ఒక
రోజుకు
సరాసరి
ఇరవై
ఐదు
రూపాయలు.
అందులో
ఒక
ట్రిప్పుకు
పన్నెండున్నర.
సరేనా...?”
“ఊ.వేయండి...లెక్క
వేయండి...”
“పదహారు మందికి
తలా
ఒకరికి
పన్నెండున్నర
పెట్టుకుంటే
దగ్గర
దగ్గర
ఆరువందల
రూపాయలు...”
“సరే...పెట్టుకోండి”
“ఒక లిటర్
పెట్రోల్, తరువాత
ఆయిల్
అన్నీ
చేర్చి
డెబ్బై
ఐదు
రూపాయలా?”
“సరిగ్గా చెప్పారు!”
“ఒక లిటర్
కు
నీ
ఆటో
సుమారుగా
ఇరవై
కిలోమీటర్ల
దూరం
వెడుతుందా?”
“అంతే వెడుతుందండి”
“అంటే నీకు
పెట్రోల్
ఖర్చు
ముప్పై
ఐదు
రూపాయలే
పడుతోంది...నీకు
నూట
అరవై
ఐదు
రూపాయలు
దొరుకుతున్నాయి.
దానికొసం
నువ్వు
ఖర్చు
పెట్టే
సమయం
మహా
అయితే
ఒక
గంట...”
“ఏమిటి టీచర్
మీరు...ఇంత
చెప్పిన
మీరు
బండి
అద్దె...తరుగు, రిపేర్లు
వదిలేశేరే”
“సరే, దానికంతా
ఒక
యాభై
రూపాయలు
పెట్టుకో.
అప్పుడు
కూడా
నూట
పదిహేను
రూపాయలు
ఒక
గంటలో
నీకు
దొరుకుతోంది”
“రోజంతా అలా
దొరకదు
కదా
టీచర్...?”
“అందువల్ల దొరికిన
సమయంలో
దోపిడి
చేస్తారా?”
“మీ దగ్గర
మాట్లడలేం
టీచర్...నేను
వస్తాను”
ఆటో అతను
బండి
స్టార్ట్
చేయటానికి
ప్రయత్నించాడు.
దర్షిణికి
లోపల
కూర్చోవటానికి
చోటు
లేదు.
వేలాడుతూ
వెళ్లాల్సిందే.
ఫిట్స్
వచ్చిన
ఒక
చిన్న
పిల్లను
అలా
పంపటం
సరి
అనిపించలేదు.
“దర్షిణి! నువ్వు
దిగమ్మా...నేను
నిన్ను
తీసుకు
వెళ్ళి
దిగ
బెడతాను...” అన్నది. దర్షిణినూ
దిగిపోయింది.
మళ్ళీ ఇంకోసారి
ముకుంద
రావ్ సెల్ ఫోన్
కు ట్రై చేసింది.
ఈ
సారి
‘నాట్
రీచబుల్’
అని
వచ్చింది.
“నాన్న దొరకలేదా
టీచర్...”
“అవునమ్మా...సెల్
ఫోన్
లో
ఇదొక
చిక్కు!
ఇదే
మనకి
ఫ్రెండు
-- ఇదే మనకు
శత్రువు.
ఇప్పుడు
మనవరకు
శత్రువు.
పరవాలేదు
రా!
నిన్ను
ఇంట్లో
దింపేసి, తరువాత
నేను
వెడతాను...” అని బాధ్యతగా
దర్షిణిని
తీసుకుని
ఇంకొక
ఆటోలో
బయలుదేరింది.
ఆ ఆటో
అతను
ఒక
మూడు
కిలోమీటర్ల
దూరానికి
ఎనభై
రూపాయలు
అడిగాడు.
బేరమాడితే
ఒక
పది
రూపాయలు
తగ్గిస్తాడేమో.
దానికి
అతనితో
తీవ్రంగా
వాదించాలి.
కానీ, ఆ
అన్యాయమైన
రేటుకు
వెళ్ళటం
ఇష్టం
లేదు.
నడవటానికి
భయపడటం
వలనే
కదా
ఇలాంటి
ఒక
స్థితి?
కానీ, దర్షిణి
ఆరొగ్య
పరిస్థితి
నిర్భందించింది.
వేరే
దారి
లేక
ఆటోలో
ఎక్కి
కూర్చుంది.
డబ్బులు
ఇచ్చేటప్పుడు, ఆ
ఆటో
డ్రైవర్
చాంబల్
వాలి
నుండి
తుపాకీతో, గుర్రం
మీద
ఎక్కి
వచ్చి
దిగిన
బంధిపోటు
లాగా
కనబడ్డాడు.
‘సముద్రంలో ఉప్పు
నీటికి
మధ్య
వంతెన
కట్టటానికి
ప్రభుత్వానికి
వీలవుతుంది.
అదేలాగా
బట్ట
బయలులో
ర్యాకెట్లను
పంపి
ప్రపంచాన్ని
చుట్టి
వస్తోంది.
కానీ, ఆటో
వాళ్ళను
మీటరు
వేసి
నడిపించలేక
పోతోంది’
ఆమెకు కోపం
కోపంగా
వచ్చింది.
దర్షిణి
గమనిస్తూ
ఉన్నది.
తాళం వేసున్న
ఇంటి
బయటున్న
అరుగు
మీద
కూర్చుంది.
“తాళం చెవి
లేదా
దర్షిణి...?”
“నాన్న దగ్గరే
ఉంది.
ఆయన
వచ్చేంత
వరకు
నేను
ఇక్కడే
కూర్చుంటాను...”
“అరెరే...మీ
అమ్మగారు
ప్రాణాలతో
లేదు. తాతయ్యా-అమ్మమ్మ
అని
నిన్ను
చూసుకోవటానికి
ఇంకెవరూ
లేరా...” ఆమె ప్రశ్నకు
సమాధానం
చెప్పటానికి
పక్కింటి
ఆంటీయే
వచ్చి
నిలబడింది.
“ఇది ఎవరు
దర్షిణి?”
“మా టీచర్...”
“టీచరమ్మనా...సరీపోయింది!
నేను
నిన్ను
చూసుకోవటానికి
మీ
బంధువులేవరో
వచ్చారేమోనని
అనుకున్నా”
ఆ సమాధానం
దర్షిణి
మొహంలో
మరింత
శోఖ
రేఖలను
పెంచింది.
అది
నందిని
కూడా
గమనించింది.
“దర్షిణీ...నువ్వు
బాధ
పడకు.
నేనూ
నీ
బంధువునే” అన్నది.
“ఏమిటోనమ్మా...మీరు
చెప్పండి!
ఈ
చిన్న
వయసులో
అమ్మ
లేకుండా
వీధిలో
నిలబడి
ఈ
పిల్ల
ఇలానా
కష్టపడాలి? ఆ
పిల్ల
తండ్రి
ఇంకోక
పెళ్ళి
చేసుకుంటే
తప్పేమిటి?
మేము ఎంతో
చెప్పి
చూశాము.
‘నా
సంధ్య
చోటుకు
ఎవరూ
రాలేరు’
అని
చెబుతున్నారే
తప్ప, ఈ
చిన్న
పిల్ల
పడే
కష్టాలను
చూడటం
లేదే...”---ఆ పక్కింటి
ఆంటీ
మాట్లాడిన
దాంట్లో
న్యాయం
ఉంది.
అది
నందినిని
ఆలొచింప
చేసింది.
దాన్నీ మించి
ముకుంద
రావ్ భార్య మీద
ఉంచుకున్న
ప్రేమ
ఆమెను
స్థంభింప
చేసింది.
దాని
కొసమే
అతనికి
షేక్
హ్యాండ్
ఇచ్చి
అభినందించాలని
అనుకున్నది.
“అవునమ్మా...ఏంటమ్మా
మీరొచ్చారు? వీళ్ళ
నాన్నను
చూడాలా?”
“అవునండి... దర్షిణిని జాగ్రత్తగా
తీసుకు
వచ్చి
వదిలి
పెట్టాల్సిన
నిర్భంధం...”
“ఎందుకని...రోజూ
దర్షిణి
ఒంటరిగానే
వస్తుందే?”
“అదొచ్చీ...” -- నందినికి దర్షిణి
యొక్క
ఫిట్స్
వ్యాధి
గురించి
ఆ
ఆంటీతో
మాట్లాడటానికి
బిడియంగా
ఉన్నది.
ఇలాంటి వ్యాధుల
గురించి
నలుగురుకి
వినబడేటట్టు
మాట్లాడనే
కూడదు.
అది
వ్యాధికి
గురైన
వారిని
ఎక్కువగా
బాధిస్తుంది.
ముఖ్యంగా
పెళ్ళి
వయసులో
ఉన్న
ఆడపిల్లకు
ఇది
శత్రువు.
వాళ్ళను
తీరం
దాటించటమే
కష్టమవుతుంది.
నందిని దగ్గర
వివేకం
ఉంది...బంద్
చేసింది.
మౌనంగానే
నిలబడింది.
కానీ, దర్షిణినే
తన
నోటితో
వాగటం
మొదలు
పెట్టింది.
“ఆంటీ...ఈ
రోజు
నాకు
సడన్
గా
ఫిట్స్
వచ్చినై.నేను
కింద
పడిపోయాను.
చూడండి...ఎన్ని
గాయాలో!”
దర్షిణి గాయాలను
చూపించగా, పక్కింటి
ఆంటీకి
అంటుకుంది
నిప్పు.
“ఇదేం కష్టం
రా
బాబూ...ఒంటరిగా
ఉంటున్న
నీతో, తోడుగా
నేనున్నానని
వచ్చి
అతుక్కుందా
ఈ
ఫిట్స్? ఇది
చాలా
డేంజర్
అయిన
వ్యాధి!
రోడ్లో
నడుచుకుంటూ
వెళ్ళేటప్పుడు, ఎదురు
చూడకుండా
ఫిట్స్
వచ్చేస్తే...రోడ్లో
వెళ్తున్న
లారీ-బస్సు
కిందో
పడి
ప్రాణం
కదా
పోతుంది?"
అంటూ
ఆవిడ
చావు
వరకు
వెళ్ళిపోయింది.
నందినికి గుండె
గుభేలు
మంది.
“అమ్మా...అదంతా
ఏమీ
లేదు.
దర్షిణికి
ఫిట్స్
అంతా
ఏమీ
రాలేదు.
కళ్ళు
తిరిగి
పడిపోయింది.
మంచి
ఆహారం
లేదు...వీక్
నేస్...” అని సమాధాన
పరచాలని
అనుకున్నది.
“కళ్ళు తిరిగి
పడినందుకా
ఇన్ని
గాయాలు?"--ఆ
ఆంటీ
నమ్మినట్లు
తెలియలేదు!
“అవునమ్మా...ఫిట్స్
వ్యాధే.
వెళ్లండి.
వెళ్ళి
ఎవరి
దగ్గర
ఇది
చెప్పి
జాలిపడే
లాగా
నటించాలో
నటించండి...ముందు
ఇక్కడ్నుంచి
వెళ్లండి”-- నందిని విసుగుతో
కేకలు
వేసింది.
ఆ ఆంటీ
దగ్గర
ఒక
తడబాటు.
“ఏంటమ్మా...నటన
-- అదీ ఇదీ
అంటూ
ఏదో
మాట్లాడారు?”
“లేకపోతే...ఒక
చిన్న
పిల్లను
ఎదురుగా
పెట్టుకుని
మాట్లాడాల్సిన
మాటలా
ఇవి.
తల్లి
లేని
పిల్లే
అని
జాలి
పడే
మీరే
ఈ
పిల్ల
ఎదుట
సరాసరి
వీధి
మహిళలాగా
మాట్లాడితే
నేనేం
చేయను?”
నందిని యొక్క
న్యాయమైన
కోపం, ఆ
ఆంటీ
నోటిని
నొక్కేసింది.
మెల్లగా
వెనక్కి
జరిగి
తిరిగి
వెళ్లటం
ప్రారంభించింది.
దర్షిణికేమో
నందిని
టీచర్
తన
కోసం
ఒక
తల్లి
కోడి
లాగా
గొడవచేయడం
బాగా
నచ్చింది.
“థ్యాంక్స్ టీచర్” అన్నది.
“ఎందుకమ్మా?”
“ఆ ఆంటీ
ఎప్పుడూ
ఇలాగే
మాట్లాడుతుంది.
మీ
నాన్నకు
ఎంత
జీతం? మీ
అమ్మ
ఎలా
చనిపోయంది? ఎందుకు
నీ
తాతయ్యా-అమ్మమ్మలు
రావటం
లేదు? ఇలా
ప్రశ్నలుగా
అడుగుతారు...”
“నువ్వు వాటికంతా
ఏం
సమాధానం
చెబుతావు?”
“మా నాన్న
దగ్గరే
అడగండి
అని
చెబుతాను”
“అదే కరెక్ట్...భారత
దేశంలో
రోడ్డు
రోడ్డుకూ
ఇలాంటి
వాళ్ళు
నలుగురు
ఉంటారు.
మనమే
జాగ్రత్తగా
ఉండాలి”.
“టీచర్...టీచర్...”
“ఏంటమ్మా?”
“ఆ ఆంటీ
చెప్పినట్టు
నేను
ఒంటరిగా
రోడ్డు
మీద
వెళుతున్నప్పుడు, ఫిట్స్
వస్తుందా...? లారీ-బస్సు
కింద
పడి
దెబ్బలు
తగిలి
చచ్చిపోతానా?”
నందినిని దర్షిణి
ప్రశ్న
చివుక్కున
గిల్లింది.
“ఛఛ... అలాగంతా
అవదురా!
నీకు
ఖచ్చితంగా
ఇంకోసారి
ఫిట్స్
అనేది
రాదు.
దానికి
మాత్రలు
ఉన్నాయి.
వేసుకుంటే
సరిపోతుంది”
ఆమె నమ్మకం
తెప్పించేటట్టు
మాట్లాడుతున్నప్పుడు, బైకులో
ముకుంద
రావ్ వచ్చి చేరాడు.
నందినిని చూసి
ఆశ్చర్యపోయాడు.
బైకును
ఆపి, నిలబెట్టి, దర్షిణిని
చూసి
ఆందోళన
చెందాడు.
“దర్షిణీ! ఏమిటి...వొళ్ళంతా
గాయాలు?” అతని
స్వరంలో
ఆందోళన
తెలుస్తోంది.
“నేను దర్షిణీ
యొక్క
క్లాస్
టీచర్ను!
పేరు
నందిని.
ప్రొద్దున
కూడా
చూశారే..!”
“అవునవును... దర్షిణికి ఎందువల్ల
ఇలా
గాయాలు?”
“లోపలకు వెళ్ళి
మాట్లాడదామే...!”
నందిని, ఇంటి
తలుపు
వైపు
చూసి
మాట్లాడింది.
అతనూ
వేగంగా
నడుచుకున్నాడు.
హాలులో ఉన్న
సోఫాలో
ఆమెను
కూర్చోమని
చెప్పి, దర్షిణిని
ఒడిలో
కూర్చోబెట్టుకుని....
“చెప్పండి... దర్షిణి ఆటలాడుకునేటప్పుడు
స్లిప్
అయ్యి
పడిపోయిందా?”
“అయ్యో! నాన్నా...అదంతా
ఏమీ
లేదు.
నా
దగ్గర
అడగండి
నేనే
చెబుతాను...” దర్షిణి కొంచంగా జరిగి, అతని
గడ్డాన్ని
పుచ్చుకుని
తన
పక్కకు
తిప్పుకుని
చెప్పటం
మొదలు
పెట్టింది.
“నాన్నా! నాకు
హఠాత్తుగా
ఫిట్స్
వచ్చినై...ధబేలుమని
పడిపోయా...”
దర్షిణి ఫిట్స్
అని
చెప్పిన
క్షణం
-- ముకుంద రావ్ కు తల
వెనుక
గట్టిగా
దెబ్బ
తగిలినట్లు
అనిపించింది.
బెదిరిపోయి, కళ్ల
నిండా
నీళ్ళు
నిండి
బయటకు
వచ్చినై.
“టీచర్! ఇది
ఏం
చెబుతోంది...ఇది
చెప్పేది
నిజమా
టీచర్...?”
నందిని ఆ
ప్రశ్నకు
సమాధానంగా
జరిగినదంతా
పూర్తిగా
చెప్పింది.
ముకుంద రావ్ ఆటంబాంబు
పరిశోధించబడ్డ
ప్రదేశంలాగా
అయిపోయున్నాడు.
చాలాసేపటి
వరకు
మాట్లాడలేదు.
“వెంటనే మంచి
డాక్టర్
దగ్గర
చూపించండి.
ఒక
నెల
రోజుల
దాకా
స్కూల్లో
‘లీవు’ ఇచ్చారు.
మంచిగా
వ్యాధి
గుణమైపోతే, ఇక
ఫిట్స్
రావనే
‘సర్టి
ఫికేట్’ చాలా
ముఖ్యం...”
నందిని చెబుతూ
వెడుతుంటే...
ముకుంద రావ్ మౌనంగా
కూర్చుండిపోయాడు.
“దర్షిణికి ఇప్పుడు
కావలసింది
చదువుకంటే
చికిత్స
చేయించుకోవటం.
ఆ
తరువాత
ఎప్పుడూ
పక్కనే
ఒక
తోడు.
ఒంటరి
తనంలో
మనసులో
ఒత్తిడి
ఏర్పడి
-- అది నరాల
మండలాన్ని
తాకితే, దాని
వలన
కూడా
ఫిట్స్
వచ్చుండచ్చు” నందిని
తనకు
అనిపించిన
కారణాన్ని
కూడా
చెప్పి
ముగించింది.
మౌనంగా
విన్నాడు
ముకుంద
రావ్.
“మీ ఫోనుకు
చాలాసేపు
ప్రయత్నించాను.
పట్టుకోలేకపోయాను...”
“ఉండచ్చు. ఈ
రోజు
బ్యాంకులో
చాలా
సమస్యలు.
సెల్
ఫోన్
ని
‘డ్రా’ లో పెట్టి
తాళం
వేశాను”
“సరే, నేను
బయలుదేరతాను...”
“చాలా థ్యాంక్స్.
మీ
సహాయాన్ని
ఎప్పుడూ
మరిచిపోను”
“పరవాలేదు సార్... దర్షిణిని బాగా
చూసుకోండి”
“సరే, ఇప్పుడు
మీరు
ఎక్కడికి
వెళ్ళాలి”
“నేను హాస్టల్లో
ఉంటున్నాను--హాస్టల్
కే
వెళ్లాలి”
“ఎక్కడుంది హాస్టల్?”
“కంకిపాడు…”
“ఓ...ఒక
ఐదు
నిమిషాలు
ఉండండి.
కాళ్ళూ
చేతులూ
కడుక్కుని
వస్తాను.
మిమ్మల్ని
నేనే
హాస్టల్
దగ్గర
దిగబెడతాను”
“అయ్యో! అదేమీ
వద్దు
సార్...నేను
వెళ్తాను”
“నో...నో...!
నా
కూతురి
కోసం
పనికట్టుకుని
ఇంత
దూరం
వచ్చిన
మీకు
నేను
ఇది
కూడా
చేయకపోతే
ఎలా?”
“పరవాలేదు సార్”
“నో మిస్.
నందిని...ఇక్కడ్నుంచి
వెళ్ళటానికి
గబుక్కున
ఆటో
దొరకదు.
మైన్
రోడ్
దాకా
వెళ్లాల్సి
ఉంటుంది.
హాస్టల్
అంటే
ఎనిమిదింటికి
అంతా
వెళ్ళిపోవాలని
రూల్స్
ఉంటుందే.
ఇప్పుడు
సమయం
ఏడున్నర
అయిపోయింది.
ప్లీజ్...”
ముకుంద రావ్ ఆమెను
ఒప్పించి, తాను
దుస్తులు
మార్చుకు
రావడానికి
వేగంగా
లోపలకు
వెళ్ళాడు.
దర్షిణి నవ్వింది.
Continued...PART-11
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి