26, ఏప్రిల్ 2022, మంగళవారం

ప్రేమ ఎంత కఠినమో!…(సీరియల్)...PART-3

 

                                                                        ప్రేమ ఎంత కఠినమో!…(సీరియల్)                                                                                                                                                             PART-3

తోట నుండి బయటకు వచ్చినప్పుడు, ఎదురింట్లో నుండి వచ్చింది ఒక బామ్మ.

"ఎవరమ్మా అది?" అని విచారించింది.

నేనే బామా. విశ్వనాధ్ గారి కూతురు లత " అన్నది.

"అరె నువ్వా! ఎలా ఉన్నావమ్మా? చూసి మూడు, నాలుగేళ్ళు అయ్యుంటుందే! ఈ తోటలోకి ఒంటరిగా వెళ్ళిందే అని చూస్తున్నాను" అన్నది.

"నేను బాగున్నా బామ్మా...నువ్వెలాగున్నావు?"

"నాకేమమ్మా...ఏ లోటూ లేకుండా బాగానే ఉన్నాను? ఇప్పుడు ఏ ఊర్లో ఉంటున్నావు తల్లీ?"

"విజయవాడ"

"ప్చ్...ఎలా బ్రతికిన కుటుంబం అమ్మా మీది! శని దూరినట్లు దూరి మీ జీవితాన్నే పాడు చేశాడు! పాపాత్ముడు, బాగుంటాడా వాడు? పాపాలన్నీ వాడి లెక్కలో చేర్చుకుంటున్నాడు" అన్నది బామ్మ ఆవేశంగా.

లత కళ్ళల్లో నుండి కన్నీరు ధారగా కారుతూనే ఉన్నది.

"కానీ చూడు తల్లీ...వాడిని దేవుడు బాగానే ఉంచాడు. కారు...ఇళ్ళు! మీ ఇంటిని కూడా మాయ చేసి లాక్కుని మేడ మీద మేడ కట్టాడు. ఇప్పుడు మన సుశీలా లేదు...ఆమె అల్లుడితో కలిసి వ్యాపారం చేస్తానని చెప్పి, వాళ్ళ దగ్గర లక్షలు కాజేశాడట. ఎంత పొగరుతో ఉన్నారో తెలుసా? నీతి--న్యాయం అనుకుంటూ వెళ్ళే వాళ్ళకే కష్టాలకు పైన కష్టాలు! నేను వస్తాను తల్లీ" --బామ్మ వెళ్ళిన తరువాత, దగ్గరున్న గుడిలోకి వెళ్ళింది లత.   

ప్రశాంతంగా, లోతు చూపులతో చేతులెత్తి ఆశీర్వదిస్తున్నట్టు నిలబడున్న దేవుడి దగ్గర "నన్ను ఇలా అనాధగా చేశేవే దేవుడా! రాత్రి-పగలు విరామం లేకుండా నిన్నే తలచుకున్నందుకు నువ్విచ్చే బహుమతి ఇదేనా? నేను చేసిన తప్పుకు ఇంతపెద్ద శిక్ష వేసి నన్ను దండించేవే? నేను పెరిగిన ఊర్లోనే నన్ను ఒక నేరస్తురాలిగా నిలబడేటట్టు చేసేవే?" అంటూ హక్కుగా అడిగి తన మనసును తేలిక చేసుకుంది.

తండ్రి పెంపకంలో పిచ్చుకలా ఎగురుతూ తిరుగుతున్న కాలం...కాలం మారిపోయినట్టు ఆకులు రాలిపోయిన శోకం.

ఎందుకు కింత కష్టం? లేదు లేదు...విధి వంచన వలనే కదా ఆ కష్టం...వయసు పరువం వలన ఏర్పడిన కొవ్వు వలన తానే తెచ్చుకున్న కష్టం కదా అది!

స్కూల్ చదువు ముగించిన పరువ వయసులో లత, విశ్వం ఇంటి మహారాణిలాగా తిరుగుతూ ఉండేది.

బంగారు రంగుతో అందంగా నిలబడున్న కూతుర్ని చూస్తుంటే ఆయనకు చాలా ఆనందం! ఆమె నడక, దుస్తులు, ముఖ భావనలను చూస్తుంటే లత గొప్పింటి పిల్లలాగా ఉంటుంది. చూసి, చూసి పెంచాడు.

డబ్బులు పోసి పట్నంలో చదివించాడు. 'ఆడపిల్ల చదువుకు ఎందుకయ్యా ఇంత డబ్బు ఖర్చు పెడతావు అని ఎవరైనా అడిగితే "ఆడపిల్లలకు చదువే ఆధారంఅంటాడు. 'ప్లస్ టూ' లో 98 శాతం తెచ్చుకుని తండ్రిని ఉక్కిరిబిక్కిరి చేసింది లత.   

చదువుల సరస్వతి అని పేరు తెచ్చుకున్న కూతురు కల్లా కపటం లేని పువ్వు లాంటి దని అనుకుంటూ వచ్చిన ఆయన, కూతురు పక్కింటి దివాకర్ను సుమారు మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తోంది అనే వార్త విని విలవిల లాడిపోయారు. ఊరు ఊరంతా తెలిసిపోయిన ఈ విషయం ఆయన చెవికి చేరుకునేటప్పటికి బాగా ముదిరిపోయింది.

అందులోనూ పిల్ల చేష్టలు మారని మొహంతో, 'నాన్నా...నాన్నా' అంటూ తన కాళ్ళ చుట్టూ తిరిగే కూతురు, పక్క ఊరి గుడిలో పెళ్ళి బట్టలతో, పూలమాలతో నిలబడి ఉండటంతో ఆయనకు సగం ప్రాణం పోయింది.

"నువ్వా?...నువ్వా?" అని తిరిగి తిరిగి ఆయన మనసు కూతుర్ని చూసి అడిగింది.

లతను వెంటాడి వెంటాడి ప్రేమించాడు దివాకర్. ఉడుకు వయసు! అతని అందంలోనూ, మాటలలోనూ తన మనసును పారేసుకుంది లత. అతన్ని ప్రేమించటం కూడా ఒక విధంగా బెదిరంపు వలనే.  తెలిసిన వాడు అవటంతో మొదట్లో అతనితో సహజంగా స్నేహంగా ఉన్నది. స్నేహితులు వారి స్నేహాన్ని హేళన చేయటం వలన, అతనిలో ప్రేమ అనే మంట ఎగిసిపడింది. ఒక రోజు స్కూలుకు వెడుతున్న ఆమెకు అందమైన ఒక పసుపు రంగు రోజా పువ్వు ఇచ్చాడు. అమాయకంగా అది తీసుకుని, ఆనందంగా తన జడలో పెట్టుకుంది లత.      

పసుపు రోజా పువ్వును తలలో పెట్టుకున్న లతను చూసిన దివాకర్ స్నేహితులు తమ విషపూరిత నవ్వులను ఒకరికొకరు చూపించుకున్నారు. 

'రేయ్! వాడు చెప్పింది నిజమేరా' అన్నాడు సునీల్.

'ఎలారా పడగొట్టావు?' అని 'టిప్స్ అడిగాడు నవీన్.

"బస్సు వస్తోందా?" అంటూ రోడ్డుకు కుడివైపుకు చూసిన లత, తన గురించి ఒక చర్చావేదిక సమావేశం జరుగుతున్నదనే విషయం తెలియక, ఆ సమావేశ గుంపులో ఉన్న దివాకర్ని చూసి స్నేహపూర్వకంగా నవ్వింది.

ఫ్రెండ్స్ గుంపులో గుసగుసలు ఎక్కువయ్యాయి.

వాళ్ళు పెద్దగా ఒక పాట అందుకునే లోపు బస్సు వచ్చింది.

ఆ రోజు నుండి బస్సు స్టాపింగులో, వెడుతున్న బస్సులో, ఇంటి మేడ మీద, గుడి అంటూ పలు చోట్ల అనుకోకుండా పడుతున్న లత చూపులను దివాకర్ యొక్క ఆశ చూపులు ఎదుర్కొన్నాయి.

ప్రారంభ రోజుల్లో ఎటువంటి ఆలొచనా లేకుండా, చిన్న నవ్వుతో తల తిప్పుకునే  ఆమెలో కొన్ని రోజులలోనే మార్పు వచ్చింది.

వినోద భావంతో ఏర్పడిన స్వారస్యం, ఆమెకు తెలియకుండానే ఆమె కళ్ళు, అతని ఆశ చూపులను వెతకటం మొదలుపెట్టింది. కొన్ని రోజులలో ఓరకంటి చూపులు, దివాకర్ని చూడగానే సిగ్గు పడుతున్న చూపులుగా మారినై.

ఏదో సాధించినట్లు తృప్తిగా, అదోరకమైన స్టైలుతో ఒక నవ్వును విసిరేడు దివాకర్.

'ఏయ్! నీ లవ్ బాయ్ వస్తున్నాడు అని స్నేహితురాలు మధుమిత లత చెవిలో గొణిగినప్పుడు ఎంతో శ్రద్దగా చేసుకున్న అలంకారంతో ఒక దేవతలాగా నవ్వింది లత. 

ఆ సమయంలో వర్షం మొదలైయ్యింది. కాలువకు గండి పడింది. పెద్ద నష్టంతో ఊరు ముక్కలయ్యింది.

బస్సు రాకపోకలకు అంతరాయం కలిగింది.

స్కూలు, కాలేజీ విధార్ధినీ-విధ్యార్ధులు, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు అంటూ అందరూ సుమారు ఐదు కిలోమీటర్లు చుట్టూ తిరిగి నడిచి మైన్ రోడ్డుకు వెళ్ళి బస్సు ఎక్కాల్సి వచ్చింది.

పది, పదిహేను మంది కలిసి గుంపు గుంపుగా వెళ్ళటం యువకులకు మహా ఆనందంగా ఉంది.

అక్కడ వంతెన రెడీ అయ్యి, ఆ రూటులో బస్సులు వెళ్ళటం మొదలయ్యేటప్పటికి గుంపులో ఎన్నో ప్రేమ కథలు మొదలయ్యాయి.

ఎప్పటిలాగా ఆ రోజు కూడా చుట్టూ తిరిగి వెడుతున్న ఆడవాళ్ళ వెనుక -- సునీల్, దివాకర్ వచ్చారు.

అప్పుడు మధుమిత, తనకు కొంత దూరంలో వెడుతున్న సుధాను కేక వేసి పిలిచి "ఏయ్ సుధా! లత లంచ్ బాక్సును ఇంట్లోనే మరిచిపోయి వచ్చిందట. నిజాం బాయ్ కొట్లో నాలుగు ఇడ్లీలు కొనుక్కుని వెడదాం"  కావాలనే గట్టిగా అరిచింది.

ఉష్...ఎందుకే అలా అరుస్తావు?" అంటూ మధుమితను కసురుకుంది లత.

"ఉండు...ఉండు. 'రియాక్షన్ ఏమిటో చూద్దాం" అంటూ గొణిగింది మధుమిత.

నాలుగడుగులు వేసేరో లేదో "ఇదిగో" అంటూ తన లంచ్ బాక్సును చాచాడు దివాకర్.

"వద్దు" అని నిరాకరించినా పట్టించుకోకుండా లంచ్ బాక్స్ జాపి అలాగే నిలబడ్డాడు.

"ఏయ్ లతా! చూశావా. నా ప్లాన్ ఎంత బాగా 'వర్క్ అవుట్' అవుతోందో?" అంటూ మధుమిత లత నడుం మీద గిల్లగా-- లతసిగ్గు పడుతూ, ఎర్ర బడిన ముఖంతో-- దివాకర్ అందించిన లంచ్ బాక్స్ తీసుకుంది.

ప్లస్ టూ పరీక్షలో 'బార్డర్ మార్కులు తెచ్చుకుని కిందా మీదా పడుతూ పాసయ్యాడు దివాకర్.

తండ్రి దగ్గర వెయ్యి తిట్లు తిని చివరికి కాలేజీలో చేరాడు.

ఎప్పటిలాగానే అదే బస్సు. దివాకర్ - లతల ప్రేమ, రోజు రోజుకూ మూడు పువ్వులూ, ఆరు కాయలుగా అభివృద్ది చెందింది.  మనసును ప్రేమకు అంకిత మిచ్చినా, చదువును మాత్రం గట్టిగా పట్టుకుంది లత.  లత ప్లస్ టూ ముగించినప్పుడు చేతి నిండా అరియర్స్ తో కాలేజీలో మూడో సంవత్సరంలో ఉన్నాడు దివాకర్. 

ఎప్పుడూ లాగానే టెలిఫోన్ లో మాట్లాడినతను, అలాంటి బాంబు తన నెత్తిన పడేస్తాడని లత కలలో కూడా అనుకోలేదు.

"ఏమిటి దివాకర్! మీరేం మట్లాడుతున్నారో మీకు అర్ధమయ్యే మాట్లాడుతున్నారా?" అన్నది లత. వణుకుతున్న గొంతుతో.

"నేను నీ దగ్గర అడ్వైజ్ అడగటం లేదు. నీ డిషెషన్ ఏమిటి? చెప్పు" అన్నాడు.

"నా వల్ల కాదు"

"ఇప్పుడే అర్ధమయ్యింది. నేనొకడినే నిన్ను నిజంగా ప్రేమించానని" అన్నాడు.

"ఏం మాట్లాడుతున్నావ్ దివాకర్? నా ప్రేమను సందేహిస్తున్నావా?"

"నీ ప్రేమ నిజమైనదయితే, నేను చెప్పేది విను"

"ఇప్పుడెందుకంత తొందర? మనం ఊరు వదిలి పారిపోయి ఏం సాధించబోతాం?"

"అదంతా తరువాత నేను నీకు చెబుతాను. రేపు రాత్రి రెండింటికి మన ఊరి సరిహద్దులో ఉన్న బస్సు స్టాపింగులో వచ్చి నిలబడు. నేను బండితో కాచుకోనుంటాను. నేరుగా శాంతిపురం వెళదాం. ప్రొద్దున కొండమీదున్న గుడిలో మన పెళ్ళి. ఇదే ప్లాను. నువ్వు నీ బట్టలూ, నగలూ తీసుకునిరా. ఒక బ్యాగు చాలు" అన్నాడు.

ఆమె మౌనంగా వింటూ ఉన్నది.

"ఏమిటీ! వింటున్నావా ...లేదా? నీ దగ్గర నుండి సమాధానమే లేదు. నగలు ఎందుకు తెమ్మంటున్నానా అనేగా నీకు సందేహం? పెళ్ళి ముగించుకుని మా నాన్న ముందు నగలన్నీ వేసుకుని నిలబడితే మర్యాదగా ఉంటుంది కదా! అందుకునే..." అని చాకచక్యంగా మాట్లాడాడు.    

"వద్దు" అని ఎంతగానో చెప్పిన ఆమెను, చివరగా విషం బాటిల్ చూపి లొంగదీసుకున్నాడు.

బుర్రకెక్కని చదువుతో తనకు తోచినట్లు చెడు తిరుగుళ్ళు తిరుగుతున్న అతన్ని, అతని తల్లి-తండ్రులు అసహ్యమైన ప్రశ్నలతో అవమానించడంతో -- వాళ్ళ మీద పగతీర్చుకోవటానికి తన ప్రేమను వాడుకున్నాడు దివాకర్.

అతని తండ్రి కిషోర్ అత్యాశ కలిగినవాడు.

కొడుకుపై పెళ్ళి అనే వల విసిరి, డబ్బుగల తిమింగలాన్ని పట్టుకోవాలని కాచుకోనున్న అతనికి, కొడుకుకు చదువు ఎక్కక పోగా 'పిల్ల జమీందారు లాగా తిరుగుతూంటే కడుపు మండిపోయింది. ఆ రోజు దివాకర్ని ఎక్కువగా అవమానపరిచాడు.

కిషోర్ ను చూస్తేనే అతని ఎదురుగా వచ్చేవాళ్ళు తప్పించుకు పారిపోతారు. నయవంచకంగా మాట్లాడి అప్పు అనే పేరుతో డబ్బు వసూలించి, మోసం చేసే మనుషులలో దిట్ట. తన సొంత కారూ, సొంత ఇల్లు అనే కలను రాబోవు కోడలు ద్వారా నెరవేర్చుకోవాలి అనే కాంక్షతో ఉన్న అతను -- కొడుకు ప్రేమ గురించి తెలుసుకున్నప్పుడు తట్టుకోలేకపోయాడు.

ఒక సాధరణ గుమాస్తా కూతురు తనకి కోడలా? అతను తట్టుకోలేకపోయాడు, తోక తెగిన బల్లి లాగా గిలగిలా కొట్టుకున్నాడు.

అతని అన్ని కలలనూ పాడుచేసే విధంగా కొడుకు ప్లాన్ చేశాడు.

గొడవ చేయటానికి కొంచం కూడా ఇష్టం లేక, ప్రేమికుడి చేయి పట్టుకోవటానికి బయలుదేరింది లత.

అతను విషం అనే ఆయుధం చూపి బెదిరించగానే చీమలాగా అయిపోయింది.

ప్రాణంగా చూసుకునే తండ్రి కంటే, ప్రేమికుడి ప్రాణమే ముఖ్యం అనుకుని నిర్ణయించుకుంది.

విషయం విన్న వెంటనే ఆగ్రహించాడు కిషోర్.

నలుగురైదుగురితో కలిసి గుడికి వెళ్ళినప్పుడు, పూలమాల వేసుకుని, చేతిలో తాలిబొట్టుతో నిలబడున్న కొడుకును చూడగానే ఆగ్రహం తలకెక్కింది. కొడుకుకు నాలుగు తగిలించాడు. తడిసిన కోడిపిల్ల వణుకుతున్నట్టు వణుకుతూ నిలబడ్డ లతను చూసి అనరాని మాటలతో తిట్టిపోసి చెల్లె...చెల్లు మని లత చంపల మీద రెండు దెబ్బలు వేశాడు.

కిషోర్ తన కొడుకుతో వెళ్ళిపోయిన తరువాత విశ్వం అక్కడికి వచ్చాడు.

తల మీద బండరాయి వేసిన కూతురి వాలకం చూసాడు!

కన్నీళ్ళూ, వాచిన చెంపలతో, నెత్తుటి పెదవులతో  అవమాన దుప్పటి క్రింద చుట్టుకుని పడుంది లత.

లాలించి, బుజ్జగించి, ముద్దులాడి పెంచిన కూతుర్ని చూడకూడని వాలకంలో చూడగానే - ఆ తండ్రి మనసు ఎంత కొట్టుకుందో వర్ణించలేము.

ఆడపిల్లను కన్న తండ్రిగా, కిషోర్ మాట్లాడిన అవమాన పరిచే మాటలు మరిచిపోలేని పరిస్థితిలో మనసు విరిగిపోయి రాయిలాగా అయిపొయాడు విశ్వం.

పెళ్ళి అలంకరణతో తనమీద కూతురు విసిరిన బురదను మనసులోనే అనుచుకున్నా డు ఆయన.

                                                                                       Continued...PART-4

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి