ప్రేమకు సహాయం...(సీరియల్) PART-7
ఇంట్లోకి వచ్చిన
మీనాక్షి
పరమేశం
మావయ్యను
చూడంగానే
ఆశ్చర్యపడింది.
ఆయనా
ఆమెను
చూశారు.
అలాగే
అతన్ని
కూడా
చూశారు.
తరువాత
ఏమీ
మాట్లాడకుండా
చొక్కా
తొడుక్కుని, తీసుకు
వచ్చిన
బ్యాగునూ
తీసుకున్నారు.
అతనూ అర్ధం
చేసుకున్నాడు.
“ఊరికి బయలుదేరేరా
మావయ్యా...?”
“అవును...అదే
నేనొచ్చిన
పని
జరగలేదు
కదా!
తరువాత
నాకు
ఇక్కడేం
పని?"
“ఏప్పుడూ దేన్నైనా
ఎదురు
చూసి
వస్తే
ఇంతే
మావయ్యా...”
“ఏమీ ఎదురు
చూడకుండా
జీవించటానికి
నేనేమీ
స్వామీజీ
కాదు
ముకుందం...”
“సరే మావయ్యా!
మీరు
బయలుదేరండి.
ఉమకి
ఖచ్చితంగా
ఒక
మంచి
భర్త
దొరుకుతాడు...”
“అది నువ్వేమీ
చెప్పక్కర్లేదబ్బాయ్...నాకు
తెలుసు”
కోపంగా చెప్పేసి, గబగబా
బయటకు
వెళ్ళిపోయారు మీనాక్షి కి
అది
కొంచం
ఆశ్చర్యంగానూ, అయోమయంగానూ
ఉన్నది.
“అవును. ఆయన
ఎవరనేది
చెప్పలేదేం
తమ్ముడూ?” ముకుంద
రావ్ ను చూసి
అడిగింది
వంట
మనిషి
మీనాక్షి.
“నా మేనమామ”
“ఓ! మీ
కుటుంబంలో
నుండి
సమాధానపడి
రావటం
మొదలు
పెట్టారా? చాలా
సంతోషం.
అవును, ఎందుకు
ఒకలాగా
కోపంగా
మాట్లాడి
వెళుతున్నారు...అదెవరు
ఉమ?”
“ఆయన కూతురు...నేను
ఆమెను
పెళ్ళి
చేసుకోవాలని
అడగటానికి
వచ్చారు.
కుదరదు
అని
చెప్పటంతో
కోపగించుకుని
తిరిగి
వెళ్ళిపోయారు”
“అరెరే! ముందే
తెలియకుండా
పోయిందే
తమ్ముడూ!
వెతుక్కుంటూ
ఇంటికి
వచ్చిన
దేవతను
ఇలాగా
దులిపేసుకుంటారు?”
“దేవతనో లేక
మహాలక్ష్మియో...నా
మనసులో
కూర్చోనున్న
సంధ్యను
తోసేసి
ఇంకెవరికీ
ఆ
చోటు
ఇవ్వనని
చెప్పాను.
మీరూ
ఇది
తెలుసుకుంటే
మంచిది.
ఈ
విషయం
మీకు
ఇదివరకే
ఒక
సారి
చెప్పాను.
మీరు
వచ్చిన
పని
మొదలు
పెట్టండి.
నేనూ
ఆఫీసుకు
బయలుదేరాలి.
దర్షిణీ...నువ్వూ
రెడీ
అవ్వు.
డాడీ
నిన్ను
స్కూల్లో
దించేసి
నేను
ఆఫీసుకు
వెళ్తాను...” అని అర్జెంటు
పడ్డాడు.
దర్షిణి కూడా
స్నానాల
గది
వైపుకు
పరిగెత్తింది.
పరిగెత్తే
ముందు
“అత్తయ్యా!
మీరు
ఈ
రోజు
తల
దువ్వాలి.
రెండు
జడలు...” అని రెండు
వేళ్ళు
చూపించి
పరిగెత్తింది.
మీనాక్షి
జవాబుగా
అతన్నే
దీర్ఘంగా
చూసింది.
అతనో ఆమె
చూపులను
పట్టించుకోక, తన
ల్యాప్
టాప్
ను
తెరిచి, అప్పుడే
‘మైల్స్’ చూడటం
ప్రారంభించాడు.
హాస్టల్ ను
వదిలి
నందిని
బయలుదేరినప్పుడు, సమయం
కరెక్టుగా
ఎనిమిది
ముప్పై!
గేటును
దాటు
తున్నప్పుడు
సెక్యూరిటీ
“టైముకు
తిరిగి
వచ్చేయండమ్మా...” అంటూ ఆమెకు
చికాకు
ముట్టించాడు.
అతన్ని
కోపంగా
చూస్తూనే
నడిచింది.
మనసు
గాయపడినట్లు
బాధగా
ఉంది.
నందిని ఎప్పుడూ, దేనినైనా
స్వతంత్రంగా
ఆలొచిస్తుంది.
ఆ
ఆలొచనే
ఆమెను
స్వయంగా
'ఎం.ఏ.,బి.ఎడ్' చదివించింది.
స్కూల్
ఉద్యోగం
వెతుక్కోమని
చెప్పింది.
ధైర్యంగా
విజయవాడకు
వచ్చి
ఉద్యోగం
చేయటమూ
చేసింది.
సొంత
ఊరు
అవనిగడ్డ
దగ్గర
ఒక
చిన్న
గ్రామం.
హైదరాబాద్
లో
కాలేజీ
చదువుతున్నప్పుడే
సునీల్
పరిచయమయ్యాడు.
వెంటాడి, వెంటాడి
ప్రేమించి
ఒక
విధంగా
ఆమెనూ
ప్రేమించేటట్టు
చేశాడు.
ఇక
ఓక
మంచి
జీవితం
జీవించాల్సింది
మాత్రమే
మిగిలి
ఉన్నది
అని
అనుకున్నప్పుడు, హాస్టల్లో
చట్టదిట్టాలు
అనే
విషయం
ఆమెను
కట్టుబరచటమే
కాకుండా, హాస్టల్
సెక్యూరిటీ
గాయపరిచేలా
చూసింది
చివరివరకు
ఆమె
జీర్ణించుకోలేకపోయింది.
ఒక పడుచు
పిల్ల
ప్రేమిస్తున్నది
అంటేనే
‘మత్తులో
పడింది, మనసు
చెడిపోయింది!
చెడిపోబోతోంది’' అని
అనుకునే
వాళ్ళే
ఎక్కువగా
ఉన్నారు.
‘నిజమైన స్వతంత్రంతో
మనసుకు
నచ్చిన
వాడితో
జీవించటానికి
ధైర్యంగా
తయారైయ్యింది’ అని
మంచిగా
ఎవరూ
అనుకోవటం
లేదే!
బయటకు వచ్చి
బస్సుకోసం
కాచుకోనున్నప్పుడు, అమె
మనసు
ఆమెను
బాధ
పెడుతూనే
ఉన్నది.
‘ఇదే ఊర్లో, ఇదే
హాస్టల్
కు
ఎదురుగా, కాదు
కాదు
హాస్టల్
కు
పక్కనే
సునీల్
తో
ఒక
మంచి
కుటుంబ
జీవితం
జీవించి
చూపించే
ఇంకో
పని
చూడాలి’ అనే
ఆలొచనలు
అలలు
లాగా
పైకి
ఎగిసి
పడుతున్నాయి.
బస్ స్టాండు
కొంచం
రద్దీగా
ఉంది.
ఒక
వెధవ
ఆమె
పక్కనే
నిలబడి
ఆమె
అందాన్ని
ఏంజాయ్
చేస్తున్నట్టు
చూస్తున్నాడు.
చొక్కా
పై
బొత్తాన్ని
తెరిచి
ఉంచుకుని
సెల్
ఫోన్
తో
ఉన్న
అతను, సరిగ్గా
రాని
ఇంగ్లీష్
లో
ఎవరితోనో
మాట్లాడుతున్నట్టు
ఉన్నాడు.
కొద్ది
రోజులుగా
అతను
ఇదే
పనిగా
బస్
స్టాండ్
లో
ఉంటున్నాడు.
ఈ దేశంలో
అన్ని
బస్
స్టాండుల్లోనూ
ఒక
పడుచు
పిల్లను
ఒకడు
కంటి
చూపుతోనే
గాయపరచటం, దాన్నే
ప్రేమ
అని
అనుకోవడం
జరుగుతూనే
ఉన్నది.
ఆడపిల్లలు
ఇవన్నీ
దాటుకుంటూనే
జీవితంలో
స్థిరపడాల్సి
వస్తోంది.
మెడలో
తాళి
అని
ఒకటి
ఉన్నప్పుడు
ఇందులో
సగం
సమస్యలను
అది
తగ్గిస్తుంది.
అప్పుడు
కూడా
సగమే
తగ్గుతుంది.
ఇంట్లో నుండి
బయటకు
రాకుండా
గడిపితే
మాత్రమే
ఇలాంటి
కామాంధ
గ్రద్దల
దగ్గర
నుండి
తప్పించుకోవచ్చు.
ఈ నిజాలన్నీటినీ
ఆలొచిస్తున్నప్పుడే
నందినికి
చేదుగా
ఉంది.
తాను
ఎక్కాల్సిన
బస్సు
ఎందుకనొ
ఇంకా
రాలేదు.
చటుక్కున
ఒక
నిర్ణయానికి
వచ్చింది.
అతని
వైపుకు
వెళ్ళింది.
అతన్నే
లోతుగా
చూసింది.
అతని
దగ్గర
తడబాటు, ఆందొళన
మొదలయ్యింది.
“ఏంటన్నా లవ్వా?”--ఆమె
ప్రారంభమే
అదుర్స్
గా
ఉంది.
గొడవపడే
ధొరణి
కనబడింది.
అతను
అది
విని, సమాధానం
చెప్పటానికి
తడబడటం
మొదలుపెట్టాడు.
“అన్నా! నేను
ఆల్రెడీ
ఒకర్ని
ప్రేమిస్తున్నాను.
ఆయన
పేరు
సునీల్.
హైదరాబాద్
లో
ఒక
ఐ.టీ
కంపెనీలో
మంచి
ఉద్యోగంలో
ఉన్నారు.
దగ్గర
దగ్గర
మూడు
నాలుగు
సంవత్సరాల
ప్రేమ!
నా
సొంత
ఊరు ఇక్కడ
అవనిగడ్డ
పక్కనే...కాలేజీలో
చదవటానికి
ఆశపడ్డాను.
కౌన్సిలింగులో
హైదరబాద్
లోనే
సీటు
దొరికింది.
అందువల్ల
అక్కడికి
వెళ్ళి
చదివేను.
హైదరాబాద్ కు
ముందు
విజయవాడలో
బస్
స్టాపులన్నీ
పచ్చ
రంగే.
దగ్గర
దగ్గర
మూడు
సంవత్సరాలు
హైదరాబాద్
లోని
బస్
స్టాపింగులనన్నిటినీ
చూసే
ఇక్కడకు
వచ్చాను.
అక్కడే
నా
ప్రేమ
కూడా
మొదలయ్యింది.
ఇప్పుడది
పెళ్ళి
వైపుకు
వెడుతొంది.
ఇదే నా
ప్రేమ
‘బయోడాటా’. ఇంత
చెప్పిన
తరువాత
కూడా
లుక్కు
వేస్తూ, సెల్
ఫోనులో
‘గ్రామర్
మిస్టేక్’
తో
ఇంగ్లీష్
అంతా
మాట్లాడరని
నమ్ముతున్నాను....”
చెప్పాల్సింది చెప్పేసి
వచ్చింది.
రంగు
రంగుల
ప్రకటనలతో
సిటీ
బస్సు
వచ్చింది.
అతడు అంతకు
మించి
అక్కడ
నిలబడలేదు.
ఆమె బస్సు
ఎక్కింది.
స్కూల్
ముందు
దిగింది.
లోపలకు
వెళ్తునప్పుడు
ముకుంద
రావ్ తన మోటర్
బైకు
లొ
నుండి
దర్షిణిని
దింపుతూ
ఉన్నారు.
ఆమె కూడా
అతన్ని
చూసింది.
“జాగ్రత్తగా వెళ్లమ్మా...” --అతను ప్రేమతో
చెప్పేసి
బయలుదేరబోయాడు.
వీపు
మీద
పుస్తకాల
బరువు
నొక్కగా
-- హార్బర్ లో
కూలీల
లాగా
ఒక్కొక్క
స్టూడెంటూ
నడుస్తున్నారు.
దర్షిణి నందినిని
చూసేసి, “నమస్తే
టీచర్” అన్నది. దర్షిణి
‘గుడ్
మార్నింగ్’ చెప్పకుండా
తెలుగులో
‘నమస్తే’ చెప్పటంతో
నందినిని
బాగా
ఆకర్షించింది.
“ఎవరమ్మా ఆయన?"
“మా నాన్న
టీచర్”
“ఓ! ఆయనే
మీ
నాన్ననా? అవును
నీ
లంచ్
బాక్స్
కనబడటం
లేదు?”
“దాన్ని మీనాక్షమ్మ
‘లంచ్’ సమయంలో
తీసుకు
వస్తారు”
అదేవరు మీనాక్షమ్మ...?”
“మా ఇంట్లో
వంట
చేస్తుంది...చాలా
మంచావిడ”
“ఓ! నీకు
అమ్మ
లేదు
కదా...”
నందిని యధార్ధంగా
అడుగగా, అది
దర్షిణి
మొహాన్ని
వేరే
రకంగా
మార్చింది.
కలతతో
చూసింది.
నందినికి కూడా
అలా
అడగటం
తప్పు
అని
అర్ధమయ్యింది.
“సారీ దర్షిణి!
నేనలా
అడిగుండ
కూడదు.
మీ
అమ్మ
చనిపోయిందని
తెలిసి
కూడా
నేను
అలా
అడగటం
తప్పే”
“చనిపోయిందంటే ఏమిటి
టీచర్...?”
“చనిపోయారంటే, మరణించారని
అర్ధం”
“మా అమ్మ
దేవుడు
దగ్గర
ఉంటోందని
కదా
మా
నాన్న
చెప్తారు…”
“ఓ! అలాగా? అదీ
కరక్టే
దర్షిణి?”
“దేవుడు దగ్గరకు
వెడితే
చూడలేమా
టీచర్?”
“అది...అది...చూడచ్చే!
ఎవరు
చెప్పారు
చూడలేమని.
కానీ, దానికి
నువ్వు
నాలాగా
పెద్ద
దానివి
అవ్వాలి"
"అలాగా
టీచర్"
దర్షిణి దగ్గర దొరికిపోయానని అనిపించింది నందినికి.
లేత మనసు!
ఎలా
సమాధాన
పరచినా, ఆ
సమాధానమే
విపరీతానికి
దారి
తీయవచ్చు.
మాట
మార్చడానికి
నిర్ణయించు
కుంది.
మంచి
సమయంలో
స్కూల్
బెల్లు
కొట్టింది.
దర్షిణి
‘ప్రేయర్’ హాలు
వైపు
పరిగెత్తింది!
Continued....PART-8
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి