ప్రేమకు సహాయం...(సీరియల్) PART-9
స్కూల్లో ఆటల
పీరియడ్.
పిల్లలకు
ఎక్కువగా
నచ్చిన
క్లాసు.
ఆటల
గ్రౌండే
పిల్లల
అరుపులతో
గోలగోలగా
ఉంది.
దర్షిణి
కూడా
తన
సహ
విధ్యార్ధినిలతో
పరుగులెత్తి
ఆడుతోంది.
అప్పుడే ఆ
విపరీతం
జరిగింది.
ఆడుకుంటున్న దర్షిణికి
హఠాత్తుగా
ఫిట్స్
లాగా
ఒక
విపరీతం
మొదలైయ్యింది.
సడన్
గా
నేల
మీద
పడిపోయి
కాళ్ళూ-చేతులూ
రెండింటినీ
కొట్టుకోవటం
మొదలుపెట్టింది.
పిల్లలందరూ దర్షిణి
చుట్టూ
గుమికూడారు.
దాన్ని
నందిని
కూడా
గమనించి
పరిగెత్తింది.
ఇంతలో
నోటి
నుండి
నురుగు
రావటం
మొదలు
పెట్టింది.
పరిగెత్తుకుని వెళ్ళి
వెతికి
వెతికి
ఒక
ఇనుప
ముక్కను
తీసుకు
వచ్చి
దర్షిణి
చేతుల్లో
పెట్టింది.
దర్షిణి
లేచేంతవరకు
నందిని
గుండె
వేగంగా
కొట్టుకుంది.
హఠాత్తుగా కింద
పడటంతో
అక్కడక్కడ
చిన్న
చిన్న
గాయాలు
ఏర్పడ్డాయి.
“దర్షిణీ...నీకు
ఫిట్స్
వ్యాధి
ఉందా?” -- అని
ఆ
గాయాలకు
అంటుకున్న
మట్టిని
తుడుస్తూ
అడిగింది
నందిని.
“అలాగంటే ఏమిటి
టీచర్?”
“ఇప్పుడు నీకు
వచ్చిందే, దాని
పేరే
ఫిట్స్...”
“నాకు ఇలా
ఇంతకు
ముందెన్నడూ
రాలేదు
టీచర్...”
“భగవంతుడా! ఇదే
మొదటి
సారా?” -- నందిని
దగ్గర
పెద్ద
నిట్టూర్పుతో
కలిసి
పెద్దగా
జాలి
బయటపడింది.
దర్షిణిని
క్లాసులో
కూర్చోబెట్టి, ప్రిన్సిపల్
రూముకు
వెళ్ళింది.
అక్కడ దర్షిణికి
ఏర్పడిన
విపరీతం
గురించి
చెప్పింది.
“సరే, ఏం
చేద్దాం...నువ్వే
చెప్పు...” అన్నది ప్రిన్సిపల్.
“నేను చెప్పటానికి
ఏముంది
మ్యాడం? ఇదే
మొదటి
సారి.
జాగ్రత్తగా
ట్రీట్మెంట్
ఇప్పిస్తే
వ్యాధి
గుణమవుతుందనేది
నా
అభిప్రాయం”
“ట్రీట్మెంట్ చేయించటానికి
మనమెవరం...? దర్షిణి
తల్లి-తండ్రులే
ఆ
ప్రయత్నం
చేయాలి”
“సారీ మ్యాడం... దర్షిణి ఒక
ఆదరణ
కోసం
తల్లడిల్లుతున్న
పిల్ల.
ఆ
పిల్లకు
తల్లి
లేదు.
తండ్రి
మాత్రమే”
“ఓ...అలాగా? ఆమె
తండ్రి
దగ్గర
ఈ
ఫిట్స్
గురించి
చెప్పి
ట్రీట్మెంటుకు
ఏర్పాటు
చేయమని
చెప్పు.
మనం
ఇంతకంటే
ఏం
చేయగలం?...తరువాత, ఇంకోసారి
స్కూల్లో
చదువుకోవటానికి
వచ్చిన
చోట
ఆ
పిల్లకు
ఫిట్స్
వస్తే...నేను
చెబుతున్నానని
తప్పుగా
అనుకోకు...‘ట్రాన్స్
ఫర్’ సర్టిఫికేట్
ఇచ్చి
స్కూల్
నుండే
పంపించేస్తాను.
ఎందుకంటే...ఇది
ఒక
రిస్క్
అయిన
వ్యాధి.
దాని
దగ్గర
మనం
దొరికిపోకూడదు”
ప్రిన్సిపల్ మెల్లగానే
మాట్లాడింది.
కానీ, అది
నందినికి
మనసులో
నొప్పి
తెప్పించింది.
“దర్షిణి చాలా
తెలివిగల
పిల్ల
మ్యాడం...”
“దానికి మనం
ఏం
చేయగలం?”
“లేదు...ఈ
ఫిట్స్
విషయాన్ని
దయచేసి
పెద్దది
చేయకండి
మ్యాడం”
“అర్ధం చేసుకోకుండా
మాట్లాడకు!
దర్షిణిలాగా
ఫిట్స్
వచ్చే
వాళ్ళను
చాలా
జాగ్రత్తగా
చూసుకోవాలి.
ఆ
పిల్లతో
ఎప్పుడూ
ఒకరు
తోడుగా
ఉండాలి.
ఆ
పిల్లను
ఒంటరిగా
వదిలేసి
ఎక్కడికన్నా
వెళ్ళటం, వదిలిపెట్టటమో
అనుమతించ
కూడదు.....ఆ
పిల్లకు
ఇప్పుడు
కావలసింది
చదువు
కాదు.
చికిత్స.
చదువును
వచ్చే
సంవత్సరం
కూడా
చదువుకోవచ్చు”
“అలాగంటే...?”
“వాళ్ళ నాన్నను
మొదట
చికిత్సకు
ఏర్పాటు
చేయమని
చెప్పు.
ఒక
నెల
రోజులు
కూడా
‘లీవు’ పెట్టుకోనీ.
కానీ
డాక్టర్
సర్టిఫికేట్
లేకుండా
తిరిగి
స్కూల్లో
చేర్చుకోను”
ఖచ్చితంగా మాట్లాడిన ప్రిన్సిపల్ దగ్గర నుండి బయటకు వచ్చిన నందినికి 'జీవితమనేది క్షణ క్షణానికీ, విధ విధంగా మారే ఆశ్చర్యం' అనేది మెల్లగా అర్ధమవటం మొదలుపెట్టింది.
‘పూర్తిగా ఇరవైనాలుగు
గంటలు
కూడా
అవలేదు.
అందులో
సునీల్
తో
గడిపిన
ఉత్సాహం, హాస్టల్
వార్డన్
దగ్గర
అనుభవించిన
కఠినత్వం, బస్
స్టాండులో
యువకులతో
అవస్త, ఇప్పుడు
జరుగుతున్న
దర్షిణి
కి సంబంధించిన విషయం’
ఆలొచిస్తూనే క్లాస్
రూములోకి
వచ్చింది.
లంచ్
బాక్స్
వచ్చింది.
మీనాక్షమ్మ, దర్షిణి
చేతులకు
ఏర్పడిన
గాయాలను
చూసి
ఆందోళన
చెందింది.
“ఏమిట్రా నాన్నా, ఇలా
కింద
పడి
దెబ్బలు
తగిలే
లాగానా ఆడుకుంటావు...? మీ
నాన్న
చూస్తే
బెదిరిపోతాడే...!”
నందిని ఆమె
దగ్గర
విచారించటం
మొదలు
పెట్టింది.
“మీరు...?”
“మీనాక్షమ్మ. దర్షిణి
ఇంట్లో
వంట
మనిషిని”
“ఓ! అవునా, ఎన్ని
సంవత్సరాలుగా
పనిచేస్తున్నావు?”
“ఒక సంవత్సరం
నుండే
నండి.
ఎందుకు
అడుగుతున్నారు?”
“లేదూ, దర్షిణికి
ఏర్పడింది
మామూలు
గాయాలు
కాదు...”
“ఏంటమ్మా చెబుతున్నారు?”
“అవును. దర్షిణికి
హఠాత్తుగా
ఫిట్స్
వచ్చినై...”
“అలాగంటే?”
“కిందపడి కాళ్ళూ
చేతులూ
కొట్టుకోవటం”
“ఏమిటీ...మూర్చ
రోగమా?”
“అవును... దర్షిణి దగ్గర
అడిగితే
ఇలా
రావటం
ఇదే
మొదటిసారి
అంటోంది.
మీకేమైనా
దీని
గురించి
ఏదైనా
తెలుసా?”
“ఏమిటమ్మా చెబుతున్నారు... దర్షిణికి ఒక
కొత్తగా
పూసిన
పువ్వు
లాంటి
పిల్ల.
దానికి
మూర్చ
రోగమా?”
“అవును. రేపట్నుంచి
తను
స్కూలుకు
రావద్దు.
స్కూల్లో
ఒక
నెల
రోజులు
‘మెడికల్
లీవు’ ఇవ్వటానికి
ఒప్పుకున్నారు.
వాళ్ళ
నాన్న
దగ్గర
చెప్పి, మంచి
డాక్టర్
దగ్గర
చూపించమను.
అది
మాత్రమే
కాదు... దర్షిణి తో
ఎప్పుడూ
ఎవరో
ఒకరు
ఉండటం
మంచిది”
నందిని చెప్పను
చెప్పను
మీనాక్షమ్మకు
గుండె
పిండుతున్నట్టు
అనిపించింది.
“టీచరమ్మా! దర్షిణి
ఇప్పటికే
తల్లి
లేని
ఒక
పిల్ల.
దర్షిణి
వాళ్ల
నాన్న
మళ్ళీ
పెళ్ళి
చేసుకోవటం
ద్రోహం
అని
అనుకుంటున్నారు.
ఈ
పిల్ల
కూడా
ఒకత్తిగా
నానా
కష్టాలూ
పడుతోంది.
ఎలాగమ్మా
ఒకరు
ఎప్పుడూ
తోడుగా
ఉండగలరు?”
“ఏం మీరు
ఉండవచ్చుగా?”
“అది సరే.
నేను
వంట
మనిషినమ్మా.
కుటుంబం, పిల్లలూ
ఉన్నారు.
ఈ
ఇల్లు
ఒకటి
మాత్రమే
కాదు, నాలుగు
ఇళ్ళు.
అందరిళ్ళల్లోనూ
పని
చేస్తేనే
నా
కుటుంబం
బండి
వెళ్తుంది”
“సరే, దర్షిణి
తండ్రి
ఫోన్
నెంబర్
మీ
దగ్గరుందా?”
“ఉందమ్మా...ఇస్తాను”
“నేను ఆయనకు
ఫోను
చేసి
అన్ని
విషయాలూ
చెబుతాను”
“మొదట ఆ
పని
చేయండమ్మా.
దీనికంతటికీ
ఒకటే
పరిష్కారం.
ఆయన
మళ్ళీ
పెళ్ళి
చేసుకోవటమే.
నిన్న
కూడా
ఆయన
మావయ్య, తన
కూతుర్ని
పెళ్ళి
చేసుకోమని
బ్రతిమిలాడారు.
ఈయన
కుదరదంటే
కుదరదని
చెప్పి
వాళ్ళ
మావయ్యను
తిప్పి
పంపంచాశారు”
“చనిపోయిన భార్యపైన
ఆయనకు
అంత
ప్రేమా”
“ప్రేమించి పెళ్ళి
చేసుకున్న
ఆయన
కదా...ప్రేమ
మాత్రమే
కాదు, అంత
కంటే
ఎక్కువగా
ఆమె
మీద
అభిమానం
ఉంది”
“ఓ!”--అంగీకరించేటప్పుడే, నందినికి
సునీల్
జ్ఞాపకాలే
వచ్చినై.
‘తన
వరకు
సునీల్
కూడా ఇలాగే తన
మీద
ప్రేమ, అభిమానం
పెట్టుకోనుంటాడా?’
అలాగే అతని
ఆలొచనలతో
మునిగిపోవటం
మొదలు
పెట్టింది.
“ఏమ్మా, అలాగే
వేరే
ఏదో
జ్ఞాపకాలకు
వెళ్ళి
పోయినట్లు
ఉన్నారు?”
“అవును. సరే, అది
వదలండి.
దర్షిణి
కోసం
నేనేం
చేయగలనో
అని
ఆలొచిస్తాను...” ఒక
నిర్ణయంతో
మాట్లాడింది.
“ఏదైనా చేయండమ్మా.
చదువును
మాత్రం
మధ్యలోనే
ఆపేయకండి.
నాకు
తెలిసి
దర్షిణి
లాగా చదివే ఒక
అమ్మాయిని
చూడలేదు.
ఇది
వ్యాధి
అని
చెప్పి, ఆ
పిల్లను
ఇంట్లో
ఒంటరిగా
వదిలేస్తే...అది
తలుచుకునే
ఈ
పిల్ల
చచ్చిపోతుంది”
మీనాక్షమ్మ టీచర్ను
భయపెట్టి
వెనుతిరిగింది.
దర్షిణి
కూడా
మిగిలిన
సహ
విద్యార్దులతో
కలిసి
భోజనం
చేసి
వచ్చింది.
గాయం తగిలిన
చోట్ల
కందిపోయున్నాయి.
చూడటానికే
పాపంగా
ఉంది.
క్లాసులోకి వెళ్ళి
కూర్చోమని
చెప్పి, తన
సెల్
ఫోన్
తీసుకుని
ముకుంద
రావ్ నెంబరుకు ఫోన్
చేసింది.
‘స్విచ్
ఆఫ్’ అనే
సమాధానం
వచ్చింది.
‘సరే, తరువాత
చేద్దాం’ అని
అనుకున్నప్పుడు, ఆమెను
సునీల్
పిలవటం
మొదలు
పెట్టాడు.
అతని పేరు
స్క్రీన్
మీద
కనబడిన
వెంటనే
,
ఆమెలో
కొత్త
ఉత్సాహం.
“సునీల్...జాగ్రత్తగా
ఇంటికెళ్ళి
జేరేవా?”
“ఊ”
“ఇప్పుడు ఎక్కడ్నుంచి
మాట్లాడుతున్నావు...ఆఫీసు
నుంచేగా?”
“ఆ...అవును”
“ఏమిటీ టెలిగ్రాం
బాషలో
మాట్లాడుతున్నావు.
ప్రొద్దున్నే
వెళ్ళి
జేరి
మధ్యాహ్నం
ఫోన్
చేస్తున్నావు...అంత
బిజీనా
నువ్వు”
“ఆ...అవును”
“చాలు సునీల్...నాలుగు
మాటలు
మాట్లాడు”
“ఏం మాట్లాడను
నందిని...మనసే
బాగుండలేదు...!”
“ఏం...ఏమైంది?”
“అది...అది..?”
“ఓ! నిన్న
నేను
నీ
దగ్గర
స్ట్రిక్టుగా
మాట్లాడింది
నీకు
బాధగా
ఉందా...?”
“ఆ...అవును”
“సునీల్...ఇప్పుడు
కూడా
కొంచం
సేపటి
క్రింద
నిన్నే
తలుచుకున్నాను.
నా
క్లాసులో
దర్షిణి
అని
ఒక
అమ్మాయి
ఉంది.
మనలాగా
ఒక
ప్రేమ
జంటకు
పుట్టిన
బిడ్డ.
కానీ, ఇప్పుడు
ఆ
పిల్ల
తల్లి
ప్రాణాలతో
లేదు...”
“భగవంతుడా...”
“పాపంగా ఉంది
కదా...అదే
సమయం
ఈ
దర్షిణికి
‘ఫిట్స్’ వేరే
వచ్చింది.
దీన్ని
చూసుకోవటానికి
ఖచ్చితంగా
ఒకరు
ఎప్పుడూ
ఆ
పిల్లకు
తోడుగా
ఉండాలి...”
“నువ్వు చూసుకోబోతావా
నందిని...?”
“మూర్ఖుడిలా మాట్లాడకు!
నేనెలా
చూసుకోగలను...? దర్షిణికి
అమ్మ
స్థానంలో
ఒకత్తి
కావాలి.
కానీ, ఆ
పిల్ల
తండ్రి
తన
మనసు
దర్షిణి
అమ్మ
తప్ప
ఎవరినీ
ఆలొచించటానికి
రెడీగా
లేదని
చెబుతున్నాడట....”
“నిజంగానా?”
“వచ్చి చూడు...నేను
చెప్పేది
ఎంత
నిజమో
తెలుస్తుంది.
దర్షిణి
తండ్రి
స్థానంలోనే
నేను
నిన్ను
ఉంచి, ఒక్క
నిమిషం
ఊహించుకుని
చూశాను...నువ్వు
కూడా
ఆమె
తండ్రి
లాగానే
నన్ను
తప్ప ఎవర్నీ
ఆలొచించవుగా?”
నందిని ప్రశ్న
సునీల్
ను
తడబడేటట్టు
చేసింది.
“అ...అవును
నందిని...”
“అదెందుకు తడబడుతూ
చెబుతున్నావు? గట్టిగా, ఖచ్చితంగా
చెప్పు
సునీల్...”
“ష్యూర్...ష్యూర్...”
“లేదు...ష్యూర్, ష్యూర్
అంటూ
నువ్వు
చెప్పేదాంట్లో
ప్రాణమే
లేదు.
ఏమైంది
నీకు...? బై
ద
బై
సునీల్, నిన్న
‘హాస్టల్’ లోపలకు
పంపము
అని
చెప్పారు”
“తరువాత...?”
“తరువాత అంటూ
ఏమిటి
సాధారణంగా
అడుగుతున్నావు...!
వార్డన్
తో
ఒకటే
గొడవ.
మా
వార్డన్
కు
మన
ప్రేమ
గురించి
తెలిసిపోయింది...”
“ఎలా నందిని?”
“సినిమా హాలులో
మనల్ని
ఎవరైనా
చూసుంటారు.
వాళ్ళు
వెలిగించి
ఉంటారు”
“సరే, నువ్వేం
చెప్పావు?”
“నేనేం చెబుతాను? ప్రేమించటం
నా
వ్యక్తిగత
విషయమని
వాళ్ళకు
తెలియదా
ఏమిటి? కానీ, వార్డన్
చెప్పిన
ఒక
విషయం
మాత్రం
నన్ను
ఆలొచింప
చేసింది”
“అలా ఏం
చెప్పింది...?”
“రేపే నువ్వు
నీ
ప్రేమికుడి
వలన
గర్భవతి
అయ్యి...ప్రేమ
ఓటమి
ఏర్పడి, దాంతో
నీకు
జీవితం
మీద
విరక్తి
ఏర్పడి, హాస్టల్
రూములో
నువ్వు
ఆత్మహత్య
చేసుకుంటే
మా
పేరు
కదా
చెడిపోతుంది
అని
అడిగింది”
నందిని మాటలు
అవతలవైపు
వింటున్న
సునీల్
ను
నోరెళ్ళబెట్టేట్టు
చేసింది.
“ఏమిటి సునీల్...నేను
మాట్లాడేది
మీ
చెవిలో
పడుతోందా?”
“ఊ...”
“ఏమిటి....షాకయ్యావా?”
“అ...అవును
నందిని!
ఇలా
కూడానా
ఊహించుకుంటారు?”
“వెరి గుడ్!
దీన్ని
నువ్వు
ఊహించుకోవటం
అని
చెప్పినందుకు
నేను
సంతోషిస్తున్నాను.
అప్పుడు
నేను
నా
మనసులో
ఏమనుకుంటున్నానో
తెలుసా?”
“ఏమనుకున్నావు?”
“ఈవిడ ముందే
మనిద్దరం
పెళ్ళి
చేసుకుని, మంచి
దంపతులుగా
జీవించి
చూపాలి
అని
నిర్ణయించుకున్నా”
“ఓహో...”
“ఏమిటి కథ
వింటున్నావా...ఓహో
అంటున్నావు.
‘శభాష్!
బాగా
చెప్పావు’ అని
నన్ను
మెచ్చుకోకుండా, ఓహో
అంటూ
లాగుతున్నావు...?”
“లేదు నందిని...నువ్వు
కరెక్టుగానే
చెప్పావు...”
“లేదు సునీల్!
నిన్ను
నాకు
బాగా
తెలుసు.
నువ్వెలా
మాట్లాడతావు...అందులో
ఎంత
ఉత్సాహం
ఉంటుంది
అనేది
నాకు
బాగా
తెలుసు.
ఈ
రోజు
నీ
స్వరంలో
ప్రాణమే
లేదు...అడిగితే
ప్రయాణ
బడలిక
అంటున్నావు.
---రాత్రి
పన్నెండింటికి
నిద్ర
మత్తులో
కూడా
నా
గొంతు
వింటేనే
ఆనందపడతావే.
ఈ
రోజు
నువ్వు
కొంచం
కూడా
సరిగ్గా
లేవు.
‘సం
తింగ్
రాంగ్’… అవును
మీ
ఇంట్లో
ఏదైనా
సమస్యా?”
“చ చ...అదంతా
ఏమీ
లేదు...”
“నిజంగానా?”
“నిజంగానే నందిని”
“సరేరా...నేను
నిన్ను
నమ్ముతున్నాను.
లంచ్
టైము
అయిపోవచ్చింది.
నేను
తరువాత
మాట్లాడతాను”
---అంటూ
ఫోన్
కట్
చేసింది.
క్లాసు
రూముకు
వచ్చినప్పుడు
స్టూడెంట్స్
వెయిట్
చేస్తున్నారు.
దర్షిణి నీరసించి
పోయి
బెంచి
మీద
వాలి
పడుకోనుంది.
చూడటానికే
పాపం
అనిపించింది.
మీనాక్షమ్మ
ఇచ్చిన
ఫోన్
నెంబర్
కు
డయల్
చేసి
ముకుంద
రావ్ తో అప్పుడే
మాట్లాడటం
మంచిదని
అనిపించింది.
అందుకోసం ముకుంద
రావ్ ను కాంటాక్ట్
చేసింది.
కానీ, ఆయన
ఫోను
‘స్విచ్
ఆఫ్’ అనే
వస్తోంది.
ఆఫీసుల్లో
ఉండేటప్పుడు
చాలా
మంది
ఇలా
సెల్
ఫోన్
ని
ఆఫ్
చేసుండటం
జరుగుతుంది.
‘సరే, తరువాత
ప్రయత్నిద్దాం’ అనుకుని
పాఠం
చెప్పటం
మొదలు
పెట్టింది.
Continued...PART-10
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి