ప్రేమకు సహాయం...(సీరియల్) PART-8
ప్రయాణ బడలికతో
తన
ఇంట్లోకి
వచ్చినప్పుడు, దూరపు
చుట్టం
ఒకరితో
అతని
తల్లి
మాట్లాడుతోంది.
కొంచం
దూరంగా
నేల
మీద
కూర్చుని
పూలమాల
కడుతోంది
సునీల్
అక్కయ్య అంజలి.
ఆమె పక్కనే
పడున్నాయి, ఆమెను
ఒదిగి
పట్టుకునే, నడవటానికి
ఉపయోగపడే
‘స్లీపర్’ కర్ర.
కొడుకును చూడం
గానే
తల్లి
సరోజ
దగ్గర
ఒక
సంతోషం...
“రారా...నీ
స్నేహితుడి
పెళ్ళి, అదీ
బాగా
జరిగిందా?” అని
కొడుకును
అడిగింది
తల్లి.
అతను అలాంటి
ఒక
అబద్దం
చెప్పే
నందినిని
కలుసుకోవటానికి
విజయవాడకు
రైలెక్కి
వచ్చాడు.
“ఆ...అయ్యిందమ్మా”
“ఏమిట్రా పెళ్ళికా
వెళ్ళొస్తున్నావు? చేతిలో
ఒక
తాంబూళం
సంచీ
కూడా
కనబడటం
లేదే...”--పూలమాల కడుతూనే
అడిగింది
అక్క
అంజలి.
అతనికీ తడబాటుగానే
ఉంది.
“అది...అది...”
“ఏరా...ఒక
కొబ్బరికాయ, రెండు
అరిటిపండ్లు...అంతే
కదా
నని
తీసుకోకుండానే
వచ్చాశావా?”......తల్లే
కొడుకు
తప్పించుకోవటానికి
దారి
చూపింది.
“ఆ...అవునమ్మా...?”-- అతనూ
దాన్ని
బాగా
వాడుకున్నాడు.
“ఇతనే మీ
అబ్బాయా?” అంటూ
చుట్టం
ప్రారంభించాడు.
“అవునండీ...నా
కొడుకు.
పేరు
సునీల్!
‘ఎం.ఎస్.సీ’ --చదివి
మంచి
ఉద్యోగంలో
ఉన్నాడు.
నెలకి
అరవై
వేలు
జీతం...”
బంధువు శేఖర్
కళ్ళు
పెద్దవి
చేసుకుని
చూసేసి, “సుజాతకి
తగిన
వరుడే...” అన్నారు.
సునీల్ గుండె
గుభేలు
మంది.
“ఎవరమ్మా అది
సుజాత?”--వేగంగా
అడిగాడు.
“చెప్తా నాయనా...నువ్వెళ్ళి
కాళ్ళూ, చేతులూ
కడుక్కుని
వేరే
దుస్తులు
మార్చుకురా.
అవును, ఈ
రోజు
నువ్వు
ఆఫీసుకు
వెళ్ళాలి
కదా...?”
“హాఫ్ డే
‘లీవు’ పెట్టేనమ్మా.
మధ్యాహ్నం
వెడితే
చాలు”
“చాలా మంచిదైంది...నీ
పెళ్ళి
విషయమే
మాట్లాడుతున్నాము”
“పెళ్లా...నాకా?”
“అవును...అదేంటి
అలా
అడుగుతున్నావు?”
“అమ్మా...అక్క...”
“అక్కయ్యకు కూడా
పెళ్ళే...”
“ఏమిటమ్మా చెబుతున్నావ్?”....కన్
ఫ్యూజన్
తో
అడిగాడు
సునీల్.
“నువ్వెళ్ళి మొదట
మొహం,కాళ్ళూ
చేతులూ
కడుక్కుని
రా...వివరంగా
చెబుతాను.
ఇన్ని
రోజులు
నేను
చేసిన
పూజలూ, పునస్కారాలూ
వృథా
అవలేదు”
తల్లి సరోజ
బలమైన
గాలము
వేసింది.
“అమ్మా! ఏంటమ్మా
చెబుతున్నావు...?”
“మొదట వెళ్ళి
డ్రస్
అయినా
మార్చుకురారా...” ఆమె లోపలవైపుకు
చై
చూపింది.
అతనూ ఆందోళనతో
హడావిడిగా
లోపలకు
వెళ్ళి
ఐదు
నిమిషాలాగి
వచ్చాడు.
“ఇలా కూర్చో...”
“అమ్మా! చెప్పమ్మా...”
“అరే...కూర్చోండి
తమ్ముడూ!
మొదట
నేనెవరో
చెప్తాను.
మీ
అమ్మ సరోజకి
నేను
అత్త
కొడుకు
అవుతాను.
పేరు
శేఖర్!
సరోజ
ఒకవిధంగా
నాకు
మేనమామ
కూతురు
వరసే!” బంధువు హాస్యంగా
మాట్లాడుతున్నట్టు
సుత్తి
వేశాడు.
“మీరు కొంచం
తిన్నగా
విషయానికి
వస్తారా?”
“దానికేం...వస్తే
పోతుంది.
కుటుంబ
రావ్ మావయ్య
కుటుంబం
గురించి
వినే
ఉంటావనుకుంటా?”
“దానికేమిటిప్పుడు?”
“ఏమిటి తమ్ముడూ...దానికేంటి
ఇప్పుడు
అని
సర్వసాధారణంగా
అడిగాశారు...ఎంత
పెద్ద
కోటీశ్వర
కుటుంబం
అది....?”
“శేఖరం! నువ్వుండు.
నేను
మాట్లాడు
కుంటాను.
సునీల్...
కుటుంబ రావ్ మావయ్యకు
ఇద్దరు
భార్యలూ, రెండు
కుటుంబాలూ
వేరు
వేరుగా
ఉండటం
అందరికీ
తెలుసు.
ఇందులో
కుటుంబ
రావ్ మావయ్యకు చుట్టరికంతో
పద్దతిగా
చేసుకున్న
భార్య
పార్వతి
అమ్మగారికి
ఇద్దరు
పిల్లలు.
ఒక
అమ్మాయి, ఒక
అబ్బాయి”
“అమ్మా! ఎందుకమ్మా
ఇలా
పిండి
రుబ్బినట్టు
మాట్లాడుతున్నావు? పార్వతి
అమ్మగారికి
ఇద్దరు
పిల్లలొ--ఇరవైమంది
పిల్లలో
ఉండనీ.
ఇవన్నీ
నేను
తెలుసుకుని
ఏం
చెయ్య
బోతాను?”
“పిచ్చోడా! నేనేమీ
నీ
దగ్గర
హరికథ
చెప్పటం
లేదు.
పార్వతి
అమ్మగారి
ఇద్దరి
పిల్లలూనే
నాకు
కోడలు, అల్లుడుగా
రాబోతారు.
అందుకనే
ఆ
కుటుంబం
గురించి
చెబుతున్నాను”
“అమ్మా...”
“ఏమిట్రా అమ్మా...? పార్వతి
అమ్మగారి
కొడుకు
నీలాగానే
చేతి
నిండుగా
సంపాదిస్తున్నాడు.
అది
కాకుండా
అతనికి
కోట్ల
లెక్కలో
ఆస్తి
ఉంది...నీ
అక్కయ్యను
పెళ్ళి
చేసుకోవటానికి
ఒప్పుకున్నాడు...”
“చాలా సంతోషం.
నాకు
ఎందుకిప్పుడు
పెళ్ళి?”
“అది సరే...ఇక్కడ
నీ
అక్క
‘పోలియో’ వలన
కాలు
పోగొట్టుకుని
ఉన్నట్టే...అక్కడ
పార్వతి
అమ్మగారి
కూతురుకూ
‘పోలియో’ నాయనా...”
తల్లి ఎక్కడికి
రాబోతోందనేది
సునీల్
కు
అర్ధమయ్యింది.
“భయపడొద్దు...నీ
అక్కయ్యలాగానే
కాలు
మాత్రమే
పనిచేయటం
లేదు.
అంతే
తప్ప
అన్ని
పనులూ
చూస్తుంది.
నీకు
ఈడుగా
డిగ్రీ
అదీ
పూర్తి
చేసింది.
చూడటానికి
కూడా
ఎర్రగా-అందంగా, లక్షణంగా
ఉంటుంది”
“అమ్మా...”
“ఏమిట్రా...ఎదురు-బొదురు
సంబంధాలు
అన్ని
చోట్లా
జరిగేదే.
అందులోనూ
వికలాంగులకు
ఇదేనయ్యా
ఒకటే
దారి”
“లేదమ్మా...నాకు
ఇప్పుడు
పెళ్ళి
వద్దమ్మా”
“ఎందుకురా అలా
చెబుతున్నావు...? ఒకే
సమయంలో
మీరిద్దరూ
సంసార
జీవితంలోకి
అడుగుపెట్టబోతారని
అనుకుని
నేను
ఎంత
సంతోషంగా
ఉన్నానో
తెలుసా?”
“లేదమ్మా...అక్కయ్యకు
మొదట
పెళ్ళి
జరగనీ...”
“ఈ పెళ్ళి
ఏర్పాటే
పరస్పరం
రెండు
పక్కల
సమస్య
తీరుతుందనే
కదా”
“లేదమ్మా...ఇలా
వ్యాపారంలాగా
పెళ్ళి
చేసుకోవటం
నాకు
నచ్చలేదమ్మా...”
“ఈ మాట
అనాల్సింది
పార్వతి
కొడుకురా.
నీ
కంటే
చదువులోనూ, సంపాదనలోనూ, అందంలోనూ,ఆస్తిలోనూ
వందరెట్లు
ఎక్కువ.
అతను
‘ఊ’ అంటే
అతన్ని
ఎగరేసుకుని
వెళ్లటానికి
ఊర్లోని
అస్తిపరులందరూ
ఎదురు
చూస్తున్నారు.
అయినా
వికలాంగురాలైన
చెల్లి
మీద
ప్రేమతో, చెల్లికి
ఒక
సంబంధం
వచ్చిందని, ఈ
సంబంధం
వదిలితే
వేరే
మంచి
సంబంధం
రాదని
నీ
చెల్లెల్ను
పెళ్ళి
చేసుకోవటానికి
ఒప్పుకున్నాడురా”
“లేదమ్మా...నేను
ఇప్పుడు
పెళ్ళి
చేసుకోను” సునీల్ కొంచం
కోపంతో
అన్నాడు.
పూలమాల కడుతున్న
అంజలి
గబుక్కున
అతన్ని
తలెత్తి
చూసింది.
ఆమె
చూసిన
చూపులకు
అర్ధం
అతనికి
తెలిసింది.
“రేయ్ సునీల్!
నువ్వు
నా
మాటలు
వింటావనే
నమ్మకంతో
పార్వతి
అమ్మగారు
నాతో
ఫోనులో
మాట్లాడినప్పుడు
‘ఈ
పెళ్ళి
అతి
త్వరలో
మంచిగా
జరుగుతుంది’ అని
చెప్పేశానురా.
నీ
అక్కయ్య
కోసమైనా
నువ్వు
ఇది
ఒప్పుకోరా...”
“అది కాదమ్మా...నాకు
ఇంకోలాగా
చాలా
ప్లాన్స్
ఉన్నాయమ్మా...”
“పనికిరాని ప్లాన్.
అంజలికి
ఒక
మంచి
వరుడు
స్వయంగా
వెతుక్కుంటూ
వచ్చింది.
బాధ్యత
గల
ఒక
తమ్ముడిగా
‘సరే’ అని
చెప్పకుండా...ఏమిట్రా
వేరేలాగా
ప్లాను
అని
ఏదో
చెబుతున్నావు...ఏమిట్రా
అంత
గొప్ప
ప్లాను?”
“అమ్మా! అదొచ్చి...”
“సరోజా! నాకు
అర్ధమైపోయింది.
నీ
కొడుక్కి
ఒక
వికలాంగ
అమ్మాయిని
పెళ్ళి
చేసుకోవటానికి
ఇష్టం
లేదు...అంతే
కదబ్బాయ్?”-- శేఖర్ మధ్యలో
పానకంలో
పుడకలా
ముక్కు
దూర్చాడు.
“మీరు ఎలాగైనా
తీసుకోండి...నన్ను
ఇప్పుడు
పెళ్ళి
చేసుకోమని
ఒత్తిడి
చేయకండి.
అంతే
చెప్పగలను” -- గబుక్కున మాట్లాడేసి, అంతకు
మించి
అక్కడ
నిలబడటానికి
ఇష్టం
లేని
వాడిగా
వెళ్ళిపోయాడు
సునీల్.
సరోజ మొహాన
అతను
గుచ్చేసి
వెళుతున్నట్టు
ఉన్నది.
అంజలి
కళ్ళల్లో
నీరు
పొంగుకురావటం
మొదలుపెట్టింది.
శేఖరేమో
గొణగడం
మొదలుపెట్టాడు.
“సరోజా! నీ
కొడుకు
నువ్వు
గీసిన
గీతను
దాటడు
-- అదీ ఇదీ
అని
గొప్పగా
చెప్పావు...ఇప్పుడేమిట్రా
అంటే
మాట్లాడే
అవకాశం
కూడా ఇవ్వకుండా
వెళ్ళిపోయాడు.
పార్వతి
అమ్మగారు
అడిగితే
నేనేం
చెప్పను”--- శేఖర్
అడిగాడు.
“ఈ పెళ్ళి
జరుగుతుంది.
నువ్వెళ్ళి
ముహూర్తాలకు
తారీఖులు
చూడమని
చెప్పు”
“నీ కొడుకును
ఒత్తిడి
చేసి
ఒప్పుకోనిస్తావా?”
“నాకు వేరే
దారేముంది...?”
“చూసి సరోజా...నీ
ఒత్తిడి
కోసం
తాళి
కట్టేసి, రేపే
నీ
కొడుకు
తన
ఆశకని
ఎవత్తినైనా
ఈడ్చుకొచ్చి
నిలబడబోతాడు...”
“అలాగంతా జరగదు.
అనవసరంగా
ఊహించుకోకు.
నువ్వెళ్ళు.
మాకు
సమ్మతమే
నని
చెప్పు.
నా
కొడుకును
ఎలా
ఒప్పించాలో
నాకు
బాగా
తెలుసు” -- ఖచ్చితంగా చెప్పింది
సరోజ.
అంజలి మాత్రం
ఏడుస్తూనే
ఉన్నది.
Continued...PART-9
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి