జీవన పోరాటం (పూర్తి నవల)
జీవితంలో తప్పే చేయని వారు ఎవరూ ఉండుండరు. అలా తప్పు చేసిన వాళ్ళను ఒకటి చట్టం దండిస్తుంది లేకపోతే దేవుడు దండిస్తాడు. కానీ, చేసిన తప్పును అర్ధం చేసుకుని తమకు తామే దండన వేసుకుని జీవించే వారూ ఉన్నారు. కొన్ని సమయాలలో వీళ్ళు చేసే తప్పులవలన తప్పు చేసిన వాళ్ళూ, వాళ్ళకు సంబంధించిన వారూ బాధించపడినప్పుడు జీవితమే పోరాటంగా మారుతుంది.
కానీ, ఎంత పెద్ద సమస్యలు ఎదురైనా వాటిని నిదానంతోనూ, వివేకంగానూ ఎదుర్కోంటే ఆ సమస్యల నుండి బయటపడొచ్చు అనేది నా నమ్మకం.
ఈ సీరియల్ లోని పాత్రలు అలాంటి ఒక జీవిత పోరాటంలోనే చిక్కుకుంటారు. వాళ్ళ చిక్కులకు పరిష్కారం దొరికిందా?.....ఈ నవల చదివి తెలుసుకోండి.
కలకత్తా లోని హౌరా రైల్వే స్టేషన్ ఎప్పుడూ హడావిడిగానే ఉంటుంది.
లోపలకు వెళ్ళాలన్నా సరే, బయటకు వెళ్ళాలన్నా సరే...జన సముద్రాన్ని ఈత కొడుతూనే వెళ్ళాలి.
మతం, భాష, జాతి, రాష్ట్రం అని ఏన్నో విభాగాలు కలిగిన మనుష్యుల ప్రజా సమూహం అక్కడ ఉండటంతో అదొక చిన్న భారత దేశం లాగానే కనబడుతుంది.
ఈ రోజూ అదేలాగనే కనిపిస్తోంది.
సమయం ప్రొద్దున 11.30.
తిరుపతి వెళ్ళే సూపర్ ఫాస్ట్ ట్రైన్ లో ప్రయాణం చేయాలనుకున్న వారు మూడో నెంబర్ ప్లాట్ ఫారం పైన కాచుకోనున్నారు. ఖాలీ పెట్టెలతో రైలు వస్తున్నదని ప్రకటన వినిపించడంతో, ప్రయాణీకులందరూ హడావిడిగా తమతమ వస్తువులతో రైలు ఎక్కటానికి రెడీ అయ్యారు.
టికెట్టు రిసర్వ్ చేసుకున్న వారు నిదానంగా తమ రైలుపెట్టెలు ఎక్కి తమతమ సీట్లలో కూర్చున్నారు. రిసర్వేషన్ చేసుకోని వారికోసం ఉన్న జెనెరల్ పెట్టెలలో గుంపు ఒకొళ్ళనొకళ్ళు తోసుకుంటూ ఎక్కటానికి ఆందోళన పడుతున్నారు.
ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
జీవన పోరాటం…(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి