అంతరిక్ష చెత్త అనేది గ్రహాంతరవాసుల నాగరికతకు రుజువు (ఆసక్తి)
అంతరిక్ష చెత్త అనేది గ్రహాంతరవాసుల నాగరికతకు రుజువు: హర్వర్ద్ ప్రొఫస్సర్
ఇది తార్కికమైనది - ఎక్కడైనా చెత్తాచెదారం ఉంది అంటే, అ చెత్తాచెదారాన్ని పడేయటానికి అక్కడ ఎవరైనా ఉండి ఉండాలి.
ఈ మధ్య అన్నీ గ్రహాంతరవాసులతో ముడిపెట్టెరే? ఇది ఏమిటి? గత సంవత్సరం చివరి రోజుల్లో, ప్రపంచవ్యాప్తంగా కనిపించి-అదృశ్యమైన వింత ఏకశిల స్తంభాల కథను మనకు తెలియపరిచింది.
అంతే కాదు, గ్రహాంతరవాసులు ఉన్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ చీఫ్ వాదనను మనం విన్నాము. గ్రహాంతరవాసులు కేవలం మీడియాకు సిగ్గుపడతారు అని కూడా ఆయన అన్నారు.
మరింత ప్రత్యేకంగా, ఉటా ఎడారిలో దొరికిన మొట్టమొదటి ఏకశిలా గురించి ప్రజలు తెలుసుకున్నప్పుడు కొంతమంది ఈ విధంగా చెప్పారు: “భూమికి క్రమం తప్పకుండా భూలోకేతర సందర్శకులు వస్తే, వారు మరోప్రపంచపు శాండ్విచ్ రేపర్లు లేదా ఇంకేదైనా వదిలి వెల్తారని అందరికీ అనిపిస్తుంది"
స్పష్టంగా, మానవులు దూరదృష్టిని బహుమతిగా పొందారనే చెప్పాలి. ఎందుకంటే, వారు ఇప్పుడు అందరూ అడుగుతున్న గ్రహాంతర చెత్తను కనుగొన్నారు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఖగోళ శాస్త్ర విభాగం ఛైర్మన్ అవీ లోబ్ ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. గ్రహాంతర జీవితం ఉన్నదని చెప్పటానికి మొదటి సంకేతం వారు వాదిలి వెళ్ళిన చెత్త అవుతుందని ఆయన చెప్పారు.
అలాంటి చెత్తలోని ఒక భాగాన్ని వారు మన సౌర వ్యవస్థలోకి మళ్లించి ఉంటారని ఆయన అన్నారు. అది కేవలం రాతి ముక్క మాత్రమే కాదని, అది ఒక రకమైన గ్రహాంతర సాంకేతిక పరిజ్ఞానం అని ఆయన నమ్ముతున్నారు.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
అంతరిక్ష చెత్త అనేది గ్రహాంతరవాసుల నాగరికతకు రుజువు...(ఆసక్తి) @ కథా కాలక్షేపం
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి