ఇంటింటి వెన్నెలలు...(సీరియల్) (PART-9)
స్కూల్లో సరోజాకి
చాలా మంచి పేరు. తెలివిగల 'టీచర్'. ఎప్పుడూ ఒక స్టూడెంట్ గుంపు ఆమె చుట్టూ ఉంటుంది.
హెడ్ మాస్టర్ కు
కుడి భుజం.
ట్యూషన్ తీయటానికి
రెడీ అన్న వెంటనే, పదిహేను మంది స్టూడెంట్స్ పేర్లు ఇచ్చారు.
లెక్కల్లో వీక్ గా
ఉన్నవారు పదిమంది. మిగిలిన సబ్జెక్టులకు ఐదుగురు. వారానికి నాలుగు రోజులు క్లాసు. రోజూ
ప్రొద్దున ఒక గంట, సాయంత్రం ఒక గంట. ఒక స్టూడెంటుకు నెలకు వెయ్యి రూపాయలు.
ఇంటికి వచ్చిన సరోజా,
అత్తగారి దగ్గర
అనుమతి అడిగింది.
"దారాళంగా
చెప్పుకో! ప్రొద్దున ఆరు-ఏడు అని పెట్టు. అప్పుడే పిల్లలు ట్యూషన్ ముగించుకుని,
ఇంటికి వెళ్ళి తయారై,
స్కూలుకు రాగలరు. సాయంత్రమూ
అదే ఆరు-ఏడు"
"ప్రొద్దున పూట నేను ఇంటి పనులు చెయ్యలేనే అత్తయ్యా!"
"దేనికీ...?
ఉన్న నలుగురికి
చేయటానికి ఏం పనుంటుంది? నెలకు పదిహేను వేలు ఎక్కువగా వస్తే మంచిదే కదా?
నువ్వు
ఒప్పేసుకో"
రఘూ వచ్చిన వెంటనే
చెప్పింది.
నాకూ వచ్చే నెల జీతం
పెరుగుతుంది సరోజా! ఐదువేలు ఇంక్రీమెంట్ వేశారు.
"కొత్తింటికి
వచ్చిన వెళా విశేషం. అందులోనూ అత్తయ్య మనతో రావటం చాలా అదృష్టం"
"నేనా...నా
భాగ్యం ఏమిటో తెలుసా? మీరే! మెట్టింట్లో ఒక ఆడది జీవించేటప్పుడు,
అత్తగారి సపోర్టు
దొరికేది వందమందిలో ఐదుగురికే. ఆ ఆడవారే రాబోవు కాలంలో ధైర్యంగా తలెత్తుకోగలరు.
లేకపోతే పోరాటమే. నా బలం మీరే"
మావగారు లోపలకు
వచ్చారు.
"సరోజా! నాకు
తెలిసిన కాలేజీలో ఒక లెక్చరర్ పోస్టు ఖాలీగా ఉంది. నువ్వు అప్లై చెయ్యి. ఆన్
లైన్లో చూడు. దొరికితే బ్రహ్మాండం. మంచి జీతం"
ఖచ్చితంగా చేస్తా
మావయ్యా.
ఆయన ఆమె దగ్గర కూర్చుని,
దానికోసం ఆలొచనలు
చెబుతుంటే, గిరిజా రాత్రి డిన్నర్ తయారు చేసింది.
నలుగురూ తిన్నారు.
"ఏమండీ...రేపు
జీతం వస్తుంది! నేను చెప్పిందంతా జ్ఞాపకం ఉంచుకోండి"
"ఇప్పుడే గొడవ
మొదలయ్యింది..."
జరిందంతా చెప్పారు.
"చూశారా?
పనులకూ,
వంటకు మనుషులను వేసి
అది నిద్రపోతోంది...మీరు కష్టపడాలి? ఎలాగండీ మనకి ఇలాంటి అమ్మాయి పుట్టింది?
సిగ్గుగా ఉంది"
"వదులమ్మా..."
" గిరిజా! జ్యోతీ
కూడా ఏదో ప్లాను చేస్తోంది!"
"జ్యోతీ
డబ్బులు తగ్గించి ఇస్తానని చెప్పుంటుంది. కారణం...మనుషులు ఎక్కువ లేరని చెబుతుంది.
చలపతి మూగ వాడయ్యి ఏడు సంవత్సరాలు అవుతోంది. ఇవన్నీ గ్రహించే మీ దగ్గర నేను
చెప్పాను"
"నువ్వేంటమ్మా చెబుతున్నావు...?”
"రేపు మనింట్లో పెద్ద పంచాయతీ జరగబోతోంది రఘూ. అది అయిన
తరువాత మీ నాన్న మాట్లాడతారు. ఇప్పుడే ఏదీ చెప్పలేము"
"నీకు తెలుసు
కదమ్మా"
"కొంత తెలుసు.
కానీ జ్యోతీను, సత్యానూ ఎవరు? ఒకత్తి మూగి...రెండోది శకుని"
"రామాయణం,
మహాభారతం మనింట్లో
జరుగుతోందా అమ్మా?"
"ఇవి రెండూ లేని ఇళ్ళే లేవురా! ఆ మహా కావ్యాలలో ఉన్న కథా
పాత్రలు ప్రతి ఇంట్లోనూ జీవిస్తున్నాయి. సినిమా,
టీవీ,
పత్రిక,
రాజకీయం ఇలా ఏది
తీసుకున్నా ఇవి రెండూ ఉంటాయి. ఏమిటొక కష్టమంటే...అందులో ఉండే మంచి వారు ఇక్కడ
తక్కువ. సూర్పనఖలు మాత్రమే ఎక్కువ. ఇది విల్లీల కాలం. వాళ్ళు లేకుండా ఏదీ
లేదు"
"ఇది న్యాయమా
అత్తయ్యా?"
"లేదమ్మా! విల్లీలను పోషిస్తున్నామని అందరి మీద నేరారోపణ
ఉంది. విల్లీలను ఎవరూ పోషించక్కర్లేదు. వాళ్ళు తయారవుతున్నారు.
స్వార్ధం,
అత్యాశ,
ఈగో,
కుళ్ళు,
అహంకారం...ఇవన్నీ
అందరికీ ఉంది. వాటిని అనిచి జీవిస్తున్న వారు,
జీవితంలో
గెలుస్తున్నారు. వాటిని పెద్దవి చేసుకుని జీవిస్తున్న వారు,
చెడ్డ శక్తులుగా
మారుతున్నారు. ఆడతనం అనేది, మాతృత్వం యొక్క
రూపం.
కానీ,
పిల్లలను చంపే
తల్లులనూ చూస్తున్నాము. భర్తలను నాశనం చేయటం, తోబుట్టువులకు ద్రోహం చేయటం,
కన్నవారిని తొసి
పుచ్చటం లాంటివి చేస్తూ, ఆడవాళ్ళు తప్పు దోవలో వెడుతున్నారు. డబ్బు మీద ఆశ,
ఆస్తుల మీద ఆశ,
నగల పిచ్చి,
ఆడంబర జీవితం అని
దిక్కు తెలియక మారుతున్నారు. ఆడవాళ్ళే
భూమికి గర్వం అనుకున్న కాలం పోయి..."అయ్యయ్యో,
ఆడవాళ్ళూ?"
అని భయపడే
పరిస్థితికి వచ్చాము. సరి...వదలండి. మనకెందుకు ఈ అన్వేషణ"
"అమ్మా! మన
ఇంట్లోనూ ఇద్దరు విల్లీలు ఉన్నారే...?"
"రేపు వాళ్ళు విశ్వరూపం ఎత్తే రోజు"
"నాన్న వల్ల
మేనేజ్ చేయటం కుదురుతుందా?"
"కుదురుతుంది! నాన్నను నేను రెడీ చేశాను!"
"ఓ...యుద్దం భయమా?
అయితే నువ్వు కూడా
విల్లీనే!"
"ఏం
మాట్లాడుతున్నారు?"
"అందులో తప్పేమీ లేదమ్మా? శత్రువులపై విజయం సాధించటానికి మనం కూడా రంగంలోకి దిగే కదా కావాలి?"
Continued...PART-10
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి