ఇంటింటి వెన్నెలలు...(సీరియల్) (PART-7)
రాత్రి ఏడు గంటలకు సరోజా
వచ్చింది. పిల్ల ఆడుకుంటున్నది. ఇల్లు పరిశుభ్రంగా ఉన్నది.
"అత్తయ్యా...రేపట్నుంచి
పనికి పనిమనిషి వస్తుంది"
"ఎందుకు సరోజా?
వాషింగ్ మిషన్ ఉంది.
బట్టలు ఉతికేయచ్చు. అంట్లు తోమి,ఇల్లు ఊడ్చి, తుడుచుకోవటం ఒక కష్టమా?"
"మీరు కష్టపడుతున్నారే...?"
"ఇదంతా ఒక కష్టమా? గ్రైండర్ వేసి పిండి రుబ్బాను. పచారి సరకులు వచ్చాయి.
కూరగాయలు కొనుకొచ్చాను"
"పిల్లను
ఎత్తుకున్నారా...?"
"అందులో కష్టం ఏముంది"
రఘూ లోపలకు వచ్చాడు.
"అమ్మా! నువ్వు
ఎక్కువ శ్రమ తీసుకోకు!"
"లేదబ్బాయ్!
ఇది శ్రమే కాదు!"
"రాత్రి
డిన్నర్ కు ఏం చేద్దాం అత్తయ్యా!"
"చపాతీ చేసి
హాట్ ప్యాక్ లో పెట్టాను. పాలల్లో పంచదార వేసుకుని,
చపాతీ ముక్కలను
నానబెట్టుకుని తింటాడు రఘూ. మనకి కుర్మా రెడీ"
"నేనొచ్చి చేస్తానుగా
అత్తయ్యా?"
"స్కూల్లో పిల్లలతో అరిచి అరిచి అలసిపోయి వస్తావు. ఆ ఇంట్లో
నువ్వు పడ్డ కష్టం చాలు. ఇక్కడ నీ పని భారాన్ని నేను తగ్గిస్తాను"
'కాలింగ్ బెల్ ' మోగటంతో...తలుపు తెరవగా...తండ్రి నిలబడున్నారు.
"రండి
మావయ్యా!" అన్న సరోజా వెంటనే కాఫీ తెచ్చింది.
"అక్కడ ఏం
జరుగుతోంది?"
"నా గురించి ఎవరూ పట్టించుకోలేదు. చలపతి బయలుదేరి
వెళ్ళిపోయాడు. జ్యోతీ- సత్యా మధ్య పెద్ద గొడవ. జ్యోతీ,
తన పనులను మాత్రం
చూసుకుంది. సత్యా దాని దగ్గర నోరు పారేసుకుని మాటలు పడ్డది. అందరూ సరోజా లాగా
ఓర్చుకుంటారా?"
తల ఎత్తి చూశారు.
లేచి సరోజా దగ్గరకు
వచ్చారు.
"అమ్మా సరోజా!
మీతో పాటూ అత్తయ్య బయలుదేరి వస్తున్నప్పుడు నేను మౌనంగా ఉన్నప్పుడు -- నేను సత్యాకి
'సపోర్ట్ ' చేస్తున్నానని నువ్వు తప్పుగా అనుకోనుంటావు!"
"లేదు మావయ్యా!
మీ గురించి నాకు తెలుసు"
"అత్తయ్యను
మీతో వెళ్లమని చెప్పింది నేనే"
"ఏమిటి నాన్నా
చెబుతున్నారు?"
"అవును రఘూ! లేకపోతే మీ అమ్మ నన్ను విడిచిపెట్టి వస్తుందా?
ఇంట్లో జరుగుతున్న
విషయాలు సరి లేవు,
అని మేమే ఈ ప్లాను
వేశాము. నువ్వు ఆవేశపడి, వేరుగా రావటానికి ప్లాను వేసినప్పుడు...ఆలొచించటం మొదలు
పెట్టాము. ఎక్కువగా చర్చించుకున్నాము. ఐడియా వచ్చింది"
"నాన్నా...మీరు
మామూలు వారు కాదు. సరి...కుటుంబ హెడ్ కదా మీరు! అందరినీ పిలిచి తిన్నగా
మాట్లాడుండచ్చే"
"లేదబ్బాయ్...అది
సరిగ్గా రాదు. సత్యా, మిగిలిన వారి వెన్ను మీద సవారి చేసే స్వార్ధ పరురాలు. జ్యోతీ
ఇంకో విధం. తన భర్త--పిల్లల గురించి మాత్రమే ఆలొచిస్తుంది"
అమ్మ లోపలకు
వచ్చింది.
"అందమైన ఉమ్మడి
కుటుంబం. అందులో స్వార్ధం నిండిన బంధువులు. నేను తల్లిని...వదిలేయి! కానీ,
సరోజా ఒక్కత్తే
అక్కడ మంచిది. పోయిన సంవత్సరమే మేము ఆలొచించాము. మీ ఇద్దరినీ వేరేగా పెట్టేద్దామని...
అలా చేస్తే మీకే
తప్పుగా అనిపించవచ్చు. విడిపించుకుంటున్నారు అనుకుని కోపం తెచ్చుకోవచ్చు. అదే సమయం
మీకే విసుగు అనిపించి, ఆ నిర్ణయాన్ని మీరిద్దరూ తీసుకోవాలని మేము కాచుకోనున్నాము.
ఇది ఇప్పుడే జరిగింది”
"అమ్మ ఆ ఇంట్లో
ఉంటే...అన్నీ వేరుగా జరుగుతాయి. మీ గొప్పతనం ఎవరికీ తెలియదు. అందుకే ఈ ఆలొచన"
"నాన్నా...మీ
గురించి ఆ ఇంట్లో ఎవరూ పట్టించుకోరు. ఆ తరువాత ఆ ఇంట్లో మీరెందుకు ఉండటం?"
"చూడు రఘూ, ఇప్పుడు నేను అక్కడుంటున్నది,
అక్కడున్న
మనుషులకోసం కాదు. ఆ ఇంటి కోసం! నేను అక్కడ లేకపోతే ఆ ఇంటిని పరిశుభ్రంగా
ఉంచుకోకుండా, చెత్త కుండీలా చేస్తారు"
"ఎందుకు
మావయ్యా...ఒక ఆలయం, చెత్త కుండీ అవాలి?"
"అవకూడదు సరోజా! చెత్త కుండీగా అయితేనే కదా...దాన్ని ఆలయంగా
ఉంచుకున్నవారి గొప్పతనం తెలుస్తుంది"
"వదిన్ని అంచనా
వేయలేకపోతున్నాం నాన్నా...కానీ, సత్యా ఖచ్చితంగా మారదు"
"అది మారాలని
మేమూ ఎదురు చూడటం లేదురా. కానీ, జీవితంలో దెబ్బ తినాలి,
అవమానపడాలి. ప్రేమగా,
మంచి మాటలతో అమ్మ
దానికి ఎన్నో సలహాలు ఇచ్చింది. ఒక స్టేజుకు పైన పుట్టింట్లో సుఖం
చూసేస్తే...అత్తగారింటికి వెళ్ళి జీవించాలనే అనిపించదు. అది చాలా
అపాయం...అవమానం...అసహ్యం అని చెప్పి చూశాము. ఇంటి పనులు చేసే అలవాటు అది
వదిలేసింది. కన్నవారు ఉన్నంతవరకు కుటుంబ నిర్వాహం గురించి దానికి బాధలేదు. 'నేనే మహారాణీ'ని అని అనుకుంటోంది. మేమేమన్నా వందేళ్లా బ్రతుకుతాము?
ఆ తరువాత దాని గతి?"
గిరిజా ముఖంలో అవేదన
కనబడింది.
"కన్ను కొడుకు
మీద తండ్రికి తపన లేదు. తండ్రికీ, కొడుకుకూ బంధం లేదు. పిల్లాడితో ఉంటేనే కదా బంధం
బలపడుతుంది. పిల్లాడు తండ్రి దగ్గరకు వెళ్ళేది?
ఆయన ఇక్కడికి వచ్చి
ఉండగలడా? ఇదేమో
జీవితాన్ని కొంచం కొంచంగా పోగొట్టుకుని వెళ్తోంది. కారణం,
పిల్లాడ్ని
చూసుకోవటం కోసం అని వాడి మీద నెపం వేస్తోంది. ఇరువైపుల పెద్దవాళ్ళూ లేకుండా
ఆడవాళ్ళు వాళ్ళ పిల్లల్ను పెంచుకోవటం లేదా?"
"నాన్నా...కోపగించుకోకండి! తప్పు మన మీద కూడా ఉంది.
కరెక్టుగా చెప్పాలంటే తప్పంతా కన్నవాళ్ళ ఇద్దరిపైనా ఉంది. ఇదివరకే నేను
చెప్పాను...మీరు వినలేదు. అన్నా--తమ్ముళ్ళు ఎత్తి చూపినా...తోబుట్టువులను తరుముతున్నామని
మా మీద కోపం వస్తుంది. మా భార్యల మీద నెపం వస్తుంది. ఆడపిల్లలను నాశనం చేసేదే
వాళ్ళను కన్నవారే!"
"మేము దాన్ని
తరమగలమా?"
"అలా కాదు నాన్నా! ఉద్యోగానికి వెళ్ళని మగాడు,
పుట్టింటి సుఖాన్ని
అనుభవిస్తున్న ఆడవాళ్ళూ బాగుపడినట్ట చరిత్రే లేదు. నష్టమూ,
అనుమానమూ వచ్చి
గొంతును నొక్కుతున్నప్పుడు...కన్నవారు కూడా ఒకరోజు వదిలేస్తారు. అల్లుడు దాని మీద
నేరం మోపుతాడు. వాళ్ళ దాంపత్యం తెగుతుంది"
"నువ్వు
చెప్పేదంతా న్యాయం! కన్న కూతుర్ని తరమటం మా వల్ల అవలేదు. అందుకే...నేను నీతో
వచ్చేశాను"
"ఇలా చేయటం
వల్ల అది మారుతుందా?"
"రఘూ! దాని దగ్గర నుండి పనులు చేయించుకోలేము. ఆకలై
వేస్తోందని చెబితే భోజనం లేదని చెప్పలేను. కన్న బిడ్డను మేము పట్టించుకోకుండా
ఉండలేము. కారణం...అది మా ఇల్లు. కానీ అది ఇక్కడ అదే హక్కుతో రాలేదు. ఎందుకంటే ఇది
నీ ఇల్లు. నేను నీ దయలో ఉన్నాను"
"అమ్మా ఎందుకలా
మాట్లాడతావు?”
“ఉండరా! ఆ ఇల్లు నాన్న ఇల్లు అని అది ఉండచ్చు. కానీ,
జ్యోతీ, సత్యాకు చుక్కలు చూపిస్తుంది. ఆకలి,
దాహం,
తపన,
పిల్ల సమస్య ఏదీ జ్యోతీ
పట్టించుకోదు. అదే సత్యాకు ట్రీట్మెంట్!"
"అవునండీ...మావయ్య,
అత్తయ్యా చెప్పేది
కరెక్టే"
"లేదు సరోజా!
వీళ్ళ ప్లాన్ చాలా గొప్పది. కానీ, సత్యా మామూలు మనిషి కాదు. తన కార్యాన్ని సాధించుకోవటానికి
ఎంత దూరమైనా వెడుతుంది"
"అలా
ఆలోచించకురా!"
"అల్లుడు ఒకడే
సంపాదిస్తున్నాడు. మంచి జీతమే. అందులోనే సేవింగ్స్ చేస్తున్నారు. సత్యాని,
పిల్లను ఇక్కడ వదిలేసి...నెపాన్నిసత్యా
మీద తోసేసి తప్పించుకుంటున్నాడు. ఇందులో నిర్ణయం తీసుకోవలసింది ఆయనే! ఆయనకు
సిగ్గూ. సెరమూ లేదు. బాధ్యతలను మోయటం ఇష్టం లేదు.
ఇలాంటి వ్యక్తులు
అవతలి వారి వీపు మీద ఎక్కి సవారి చేస్తూ కాలం గడిపేస్తారు. 'నేను కావాలనుకుంటే బయలుదేరి రా'
అని ఆయన చెప్పలేరా?
మేము వేరుగా
వచ్చినట్టు వాళ్ళూ వేరుగా వెళితే జీవించ లేరా?
సంసారం చెయ్యలేరా?"
"వదిలేయమ్మా...మనం వేరుగా వచ్చేశాము. ఇక సత్యా గురించి మాటలు
ఎందుకు” అని తల్లికి
చెప్పి, తండ్రివైపు తిరిగి,"నాన్నా...మీరు కష్టపడకూడదు. పర్మనెంటుగా ఇక్కడకు వచ్చేయండి"
--అన్నాడు రఘూ
"వస్తానబ్బాయ్!
దానికీ ఇంకా 'టైము' ఉంది”
--అని చెప్పిన తండ్రి జగన్నాధం,భార్య వైపు తిరిగి, “గిరిజా... మనింటి దగ్గర వంట సామాన్ల
పరిస్థితి ఎలా ఉంది?" అని అడిగారు.
"ఇంకో రెండు రోజులకు వస్తాయి. కూరగాయలు ఒక రోజుకే వస్తాయి.
మూడు రోజుల్లో ఒకటో తారీఖు వస్తోంది కదా?"
"రెండో తారీఖు -- నెలకు కావలసిన వంట సామాన్లు కొని నేను
ఇక్కడ నింపేస్తాను. ..అక్కడ ఇక వాళ్ళు చూసుకోనీ"
"పనిమనిషి
ఆండాల్?"
"ఆమెకు రెండు నెలలు సెలవు ఇచ్చాను...జీతంతో"
"అప్పుడు అక్కడ
ఇంటి పనులు?"
"జ్యోతీనో, సత్యానో చేయనీ"
"చేస్తారా
అత్తయ్యా?"
"సత్యాకి ఏమీ తెలియదు. జ్యోతీ ఖచ్చితంగా చెయ్యదు. ఇల్లు
గబ్బు కొడుతుంది "
"అలా వదలగలమా?"
"వేరే దారి లేదు! వ్యాధి ముదిరితేనే కదా 'ఆపరేషన్' అవసరమవుతుంది సరోజా. మూడు 'బెడ్ రూము 'లు ఉన్నాయి. రోజంతా ఏసీ రన్ అవుతుంది. కరెంటు బిల్లు ఎక్కువ
అవుతుంది. నీళ్ళను పొదుపుగా వాడుకోరు. ఎప్పుడూ లైటు వెలుగుతూనే ఉంటుంది. నాన్న,
రఘూ కావాలనుకుంటేనే
ఏసీ వేసుకుంటారు. అందువలన నాన్న దగ్గర పలు ఆర్డర్లు వేశాను. ఇక ఆ ఇంటి సంగతి ఆయన
చూసుకుంటారు"
రఘూ కళ్ళు పెద్దవి
చేసాడు.
"మావయ్య ఓపన్
గా మాట్లాడతారా? కుటుంబాన్ని ఇంత వరకు నడిపింది మీరే కదా అత్తయ్యా"
"మాట్లాడ
వలసినంత వరకు ఆయన ఖచ్చితంగా మాట్లాడతారు"
"సరే!
ఆకలేస్తోంది గిరిజా...తినేసి నేను బయలుదేరతాను"
సరోజా వడ్డించింది.
జగన్నాధం వంటను
ఎంజాయ్ చేస్తూ తిన్నారు.
"మధ్యాహ్నం
నాన్నకు భోజనం పంపించాను రఘూ!"
"సరేనమ్మా!
ఎప్పుడూ అలాగే చెయ్యి"
"మిగిలిన వాళ్ళను మార్చటానికి మనం ఇలా నాటకం ఆడలా?"
"ఇదంతా కావాలి సరోజా! స్వార్ధంతో జీవించే వారు...తమని మార్చుకోనే
మార్చుకోరు. దెబ్బ తింటేనే బుద్ది వస్తుంది అంటే, ఆ దెబ్బ
ఎవరో ఒకరు ఇచ్చే కదా కావాలి?"
”అవును
సరోజా! అమ్మ యొక్క హఠాత్త్ ఆపరేషన్ కరెక్టుగానే ఉంటుంది. అడ్డుపడకు"
నాన్న బయలుదేరారు.
"మావయ్యా!
పదిమంది పిల్లలకు ట్యూషన్ తీద్దామనుకుంటున్నాను"
"టైము
ఉందనా...డబ్బులు చాలటం లేదనా?"
"లేదు మావయ్యా! ఇంకా కొంచం సంపాదిస్తే, పిల్ల యొక్క
భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది కదా?"
"ఖచ్చితంగా! ట్యూషన్స్ తీయమ్మా. నేనూ నా మనవరాలికి నాకు కుదిరినంత వరకు
సహాయం చేస్తామ్మా"
"అది నాకు
తెలుసు మావయ్యా"
ఆయన బయలుదేరారు.
సరోజా – రఘూ… ఇద్దరి మనసులలోనూ నమ్మకం అనే వెళుతురు ఎక్కువ పడింది!
Continued...PART-8
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి