ఇంటింటి వెన్నెలలు...(సీరియల్) (PART-6)
ఒకే రోజులో గిరిజానూ,
సరోజానూ ఇంటిని
అందంగా చేసేశారు.
రాత్రి డిన్నర్
తయారైంది. ముగ్గురూ తిని, పిల్లను నిద్ర పుచ్చింది సరోజా.
"అత్తయ్యా! ఇన్ని
రోజులు మీరు కష్టపడింది చాలు. ఇక నేను చూసుకుంటాను. పిల్లను చూసుకోవటానికి
మీరొచ్చాశారు. నాకు అదే చాలు"
"లేదమ్మా...ఇప్పుడు
నేను ఉత్సాహంగానే ఉన్నాను. ఇద్దరం కలిసి చేద్దాం. రఘూ ఇదిగో...నాన్న ఇచ్చిన
డబ్బులు. ఉంచుకో"
"వద్దమ్మా!"
"లేదురా...ఫ్యామిలీ
ఖర్చుకు ఎంతొచ్చినా చాలదు. ఇది ఉంచు"
"ఏమండీ...మామూలుగా
మనిద్దరం జీతాన్ని అక్కడ అత్తయ్య దగ్గర ఇచ్చేలాగానే,
ఇక్కడ కూడా అత్తయ్య
దగ్గరే ఇద్దాం. ఆమే ఫ్యామిలీని రన్ చేయనీ. ఇల్లు మాత్రమే మారింది తప్ప...మిగత
వాటిల్లో మార్పు వద్దు"
"లేదమ్మా...ఇక
ఈ ఇంటి నిర్వహణ నువ్వు తీసుకో. ఇది నీ ఇల్లు"
"లేదు
అత్తయ్యా! ఇది మన ఇల్లు. ఈ కుటుంబానికి ఎప్పుడూ మీరే హెడ్. అందులో మార్పు
లేదు"
గిరిజా
ఆశ్చర్యపోయింది.
"ఉద్యోగంలో
లాగా ఇంట్లోనూ ఆడ వాళ్లకు 'రిటైర్మెంట్' ఇవ్వాలి సరోజా. హెడ్ స్థానాన్ని వదిలి పెట్టను అంటూ
మొండితనం చెయ్యకూడదు"
"అత్తయ్యా! మీరు
ఇంటి పనులు చేస్తున్నారు. రోజు మొత్తం పిల్లను చూసుకుంటారు. దానికి రెస్టు
ఇస్తున్నారా? ఇప్పుడంతా చిన్న వాళ్ళు తమ అవసరాలకు పెద్ద వాళ్లను
ఉపయోగించు కుంటున్నారు. అది మాత్రం న్యాయమా? మీరు కుటుంబాన్ని బాగా నడుపుతారు! మేము అందులో తృప్తిగా
జీవించిన వాళ్లం. ఓపిక లేక పోతే...బాధ్యతలను చేయి మార్చుకుందాం. సరేనా...?
మీరే నడపాలి"
"సరేనని
చెప్పమ్మా..."
"సరేనయ్యా...మీ
అభిమానాన్ని కాదనలేను"
"అత్తయ్యా!
మావయ్యకు రేపటి నుండి కరెక్టుగా వంట చేసి ఇస్తారా?"
"దానికి అవసరం లేదమ్మా...మన వీధి చివర పంతులు మెస్ ఉంది
కదా...?"
"అవును! మీ చేతి రుచి అక్కడ ఉంటుంది"
"అక్కడ నేను
మాట్లాడి ఏర్పాటు చేసాను. అక్కడ ఇంట్లో వాళ్ళు సరిగ్గా ఆయన్ని గమనించకపోతే,
మావయ్య అక్కడ
తింటారు. ఏ సమస్యా లేదు. ఆయనకు కావలసిన రుచికి తగినట్లు ఉప్పు,
కారం వేసి గ్రాండుగా
వంట చేస్తారు. క్లియర్ గా చెప్పుంచాను"
"అమ్మా...నువ్వు
చాలా గొప్ప దానివమ్మా!"
"మీ నాన్నను
నేను చిక్కిపోనివ్వను. వేరు బడటం వలన పలువురి ముఖాలు బయటకు వస్తాయి. వెయిట్ చేసి
చూడండి. రేపు మీరిద్దరూ పనికి వెళ్తున్నారా?"
"నువ్వు సెటిల్ అయ్యేంత వరకు లీవు పెట్టాలమ్మా?"
"ఎందుకబ్బాయ్! నేను 'సెటిల్ ' అయిపోయాను. లీవులను వేస్టు చేయొద్దు. రెగులర్ జీవితానికి
వచ్చేయండి"
"పిల్లను
తీసుకుంటాం"
"అది ఈ రోజు
నాతోనే నిద్రపోనీ! కొత్త ఇల్లు -- కొత్త కాపురం. అన్నీ జరగనీ...వెళ్లండి"
ఇద్దరూ సిగ్గుతో
నవ్వారు.
"కోడలు ఎప్పుడూ
మంచిగా జీవించాలని అనుకునే అత్తగారు మీరే అత్తయ్య"
"నువ్వు నాకు
కోడలు పిల్లవి కావు. స్నేహితురాలివి. మనిద్దరి మధ్యా రహస్యం లేదు సరోజా. నా
కొడుకును సంతోషంగా ఉంచుకునే శక్తి నీకు మాత్రమే ఉంది. ఇద్దరూ వెళ్లండి"
గిరిజా తన గది
లోపలకు వెళ్ళింది.
సెల్ ఫోన్ తీసుకుని
నెంబర్లు నొక్కింది.
భర్త తీశారు.
"పడుకున్నారా?"
"ఊహూ! నిద్ర రావటం లేదు గిరిజా. నువ్వు లేకుండా..."
"కొన్ని రోజులు
ఓర్పుగా ఉండండి. రంగు అంతా అతి త్వరలోనే వెలిసిపోతుంది. మీరు దేనికీ ఆందోళన పడరు.
అది నాకు తెలుసు. తినకుండా ఉండరు. అన్నీ మాట్లాడి ఉంచాము. వాళ్ళు ఏం చేస్తారనేది
చూసుకుని నిర్ణయం తీసుకోండి"
"జ్యోతీ ఏదీ
చెయ్యదు. సత్యా కథ తెలిసిందే? వదులు...నువ్వు నిద్రపో. పిల్ల జాగ్రత్త"
ఆయనా పడుకున్నారు.
ఎప్పటిలాగానే
తెల్లవారు జామున ఐదు గంటలకే లేచి, మొహం కడుక్కుని రెడీ అయిపోయారు.
అదే సమయానికి సరోజా
కాఫీ గ్లాసుతో ఎదురుగా ఉండేది.
ఆ చోటు ఇప్పుడు
ఖాలీగా ఉంది.
కొన్ని రోజులు గిరిజా
తీసుకు వచ్చేది. అది కూడా మిస్సింగ్!
ఆయన 'జాగింగ్' డ్రస్సుతో బయటకు వచ్చారు.
ఒక రౌండు
ముగించుకుని పంతులు మెస్ కు వచ్చారు. వేడి వేడి కాఫీ చేతులు మారింది.
"బ్రహ్మాండం!"
"డికాషన్
చిక్కగా, చక్కర
తక్కువగా వెయ్యండని సరోజమ్మఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. ఎనిమిదింటికి
వస్తారా...ఇడ్లీ,ఉప్మా,అట్టు రెడీగా ఉంటుంది?"
"ఏడున్నరకి ఫోను చేసిన తరువాత రెడీ చెయ్యి"
"సరేనండి!"
ఆయన ఆరున్నరకు
ఇంటికి వెళ్లగా, ఇల్లు అదే చీకటిలో ఉంది. ఎవరూ లేచినట్టు లేరు.
యోగా చేసి
ముగించారు. పది నిమిషాల గ్యాప్ తరువాత స్నానం చేశారు. దన్నం పెట్టుకున్నారు. టైము
ఏడున్నర.
చలపతి లేచి రెడీ
అయ్యాడు.
"బయలుదేరావా చలపతి?"
"అవును నాన్నా...రెండు పూట్లా భోజనం క్యాంటీన్లోనే.
వస్తాను"
"మీరు కాఫీ
తాగారా...టిఫినుకు ఏం చేస్తారు?" ఇలా ఎలాంటి ప్రశ్న అతడి నుండి రాలేదు.
ఆయన డ్రస్సు
మార్చుకున్నారు.
సత్యా లేచి
వచ్చింది.
"అమ్మా...కాఫీ
ఇవ్వు"
ఆయన మాట్లాడకుండా
నిలబడ్డారు.
"అమ్మా...నీ
చెవిలో పడలేదా?"
నిద్ర మత్తులో సత్యా.
ఆయన మాట్లాడకుండా
ఫోను తీసారు.
అమ్మ లేని విషయం సత్యాకి
అప్పుడే అర్ధమైయ్యింది.
జ్యోతీ లేచి
వచ్చింది.
"వదినా! కాఫీ
పెట్టివ్వండి. టిఫిన్ రెడీ చేయండి" – సత్యాను చూసి చెప్పింది.
"దేనికి... నువ్వేం
వెలగబెడుతున్నావు...నువ్వే చెయ్యి"
"నాన్న 'ఆఫీసు 'కు బయలుదేరుతున్నారు. ఆయన ఏమీ తినకుండా వెళుతున్నారు"
"అలాగా! ఆ
అక్కరనీకు లేదా? ఆయన కన్న కూతిరివే కదా నువ్వు! ఆయన ఏ టైముకు ఆఫీసుకు
బయలుదేరతారనేది నీకు తెలియదా? లేచి చేసివ్వు"
"మీరే కదా ఈ ఇంటి
కోడలు. మీరే చెయ్యాలి"
"నువ్వు ఏ
ఇంటికీ కోడలు కావా?"
"మా ఇంట్లో నేనే చేస్తాను"
"చించావు!
నువ్వు మీ ఇంటికి వెళితేనే చేస్తావా? ఇక్కడేమో బంక వేసుకుని అతుక్కుని కూర్చున్నావు?
తరువాత రూల్స్
మాట్లాడుతున్నావా? ఇది మా నాన్న ఇల్లు. నన్ను తరమటానికి ఎవరికీ హక్కు
లేదు"
"ఎవరు
తరిమింది...దారాళంగా ఇక్కడే ఉండు. నీకు కావలసింది వండుకు తిను. ఎవరు
అడ్డుపడుతున్నారు? నీకూ చేతులున్నాయి కదా?
నీకు వంట చేసి
పెట్టటానికి నేనేమీ వంట మనిషిని కాదు. అర్ధమయ్యిందా...?
నా భర్త క్యాంటీన్లో
తింటున్నారు. దానికే నేను బాధపడలేదు. నువ్వు ఎవరు నాకు?"
సత్యా స్టన్ అయ్యింది.
"నీ ఆటలన్నీ సరోజా
దగ్గర చూపించు. నా దగ్గర వద్దు"
తండ్రి చూస్తూ
ఉండిపోయారు.
సత్యా తండ్రి
దగ్గరకు వచ్చింది.
"చూడండి
నాన్నా...వదిన ఇలా మాట్లాడటం సరేనా?"
ఆయన సమాధానం
చెప్పలేదు.
బయటకు వచ్చారు. డయల్
చేసారు.
"టిఫిన్
చేయండమ్మా. నేను వస్తూ ఉన్నాను"
వాకిలి దిగి
నడుచుకుంటూ వెళ్ళారు.
'మెస్ ' లో పొగలు కక్కుతున్న టిఫిన్ రుచిగా-రెడీగా ఉంది.
"తిన్నారా?
ఆయనకు నచ్చిందా?
ఫోను
ఆయనకివ్వు!" మెస్ యజమానికి ఫోను వచ్చింది.
ఫోన్ చేతులు
మారింది.
"బాగుంది గిరిజా
"
"రోజూ
ప్రొద్దున్నే రకరకాలుగా మీకు నచ్చినవి చెయ్యమని మెస్ యజమానికి చెప్పాను. మధ్యాహ్నం
నేను 'క్యారేజీ'
పంపుతాను. రాత్రికి
ఇక్కడికి వచ్చి తినేసి వెళతారా?"
"అన్ని రోజులూ కుదరదు గిరిజా!"
"వారానికి మూడు
రోజులు రండి. మిగిలిన నాలుగు రోజులూ మెస్ లో చపాతీలు వేయమంటాను"
"సరే గిరిజా!"
"ఈ రోజు
డిన్నర్ కు వచ్చేయండి"
"ఖచ్చితంగా!"
-- మాట్లాడి ముగించి ఆయన బయలుదేరారు.
ఇంట్లో జ్యోతీ
స్నానం చేసి, దేవుడ్ని ప్రార్ధించుకుని,
పిల్లలకు స్నానం
చేయించి, వాళ్ళకు
ప్రొద్దున--మధ్యాహ్నం ఆహారం తయారు చేసింది.
"నా పిల్లకు?"
-- అడిగింది సత్యా.
"నువ్వూ అమ్మే కదా! చేసుకో...”
పిల్లలను పంపించి
వచ్చింది.
ఆమెకు మాత్రం
కొంచంగా ఉప్మా చేసుకుని, సాంబార్ పెట్టుకుంది. తిన్నది. మిగిలిన సాంబారును ఫ్రిడ్జ్
లో పెట్టేసింది.
"ఇదిగో చూడూ.
ఇది నా లంచ్ కు. నువ్వు సిగ్గులేకుండా అది పోసుకుని తినకు! తెలిసిందా?"
సత్యాకి కోపం
ఎక్కువైయ్యింది.
పిల్ల 'ఆకలి 'అని ఏడుస్తుంటే, ఆమె స్నానం కూడా చెయ్య లేదు.
తల్లి
ఉన్నంతవరకు--అన్నీ చేతికి వచ్చేవి. ఇప్పుడు అదంతా లేదు.
పిల్లకీ,
తనకీ ఇడ్లీలు
వేసుకుందామని అనుకుంటే పిండి లేదు. వాడికి ఉప్మా నచ్చదు. ఇంకేం చేయాలి?
ఏడుపూ,కోపం ఎక్కువ అయ్యింది.
అమ్మకు శాపం
ఇచ్చింది.
ఆవేశంగా 'ఫోన్ ' చేసింది.
గిరిజా ఎత్తింది.
"ప్రొద్దున
నుండే నేను పస్తు! జ్యోతీ వదిన తనకు మాత్రమే చేసుకుంటోంది. నాన్న తినకుండా
వెళ్ళిపోయారు. ఇంట్లో ఏది ఎక్కడుందో తెలియటం లేదు! మా ఆయన లేడు. చేతిలో డబ్బూ
లేదు. నువ్వంతా ఒక తల్లివా? ఇలా తపించి పోయేలాగా వదిలేసి వెళ్ళిపోయావే...బాగుంటావా
నువ్వు?"
"నీకెందుకే పెళ్ళి చేశాము...ఇక్కడకొచ్చి మిగిలిన వారి
ప్రాణాలు తీయడానికా? ఆ ఇంటికీ, నాకూ సంబంధం లేదు. నేను నా కొడుకు ఇంటికి వచ్చాశాను. ఇకమీదట
నీ ఫోను వస్తే ఎత్తను. పెట్టేయి"
సత్యా కృంగిపోయింది.
ఇప్పుడు కూడా తాను
తన అత్తగారి ఇంట్లో ఉండకుండా, పుట్టింట్లో ఉంటూ తప్పు చేస్తున్నది,
బద్దకం,
మిగిలిన వాళ్ల వీపు
మీద ఎక్కి కూర్చుని జీవితాంతం సవారి చేయాలని ఆశపడే స్వార్ధం,
నోటి దురుసు,
పోట్లాట పెట్టుకుని
మంచి బంధుత్వాలను సైతం గాయపరిచే జంతు గుణం, ముదిరిపోయిన తలబిరుసు తనం...వీటన్నిటినీ మానుకోవాలనే ఆలొచనే
రాలేదు. తనని ఆవగింజంత కూడా మార్చుకోవాలని అనిపించలేదు.
ఒక మనిషికి జరిగే
ప్రతిదానికీ కారణం ఆ మనిషే. అతనికి ఎవరూ శత్రువులు ఉండరు. అతనికి అతనే శత్రువు!
ఎందుకు పగ?
ఎందుకా
పోట్లాట--కోపం? అది న్యాయమా? వీటన్నిటి గురించి కూర్చుని ఆలొచించే ఓర్పో--మనసో
చాలామందికి లేదు.
పట్టుదల,
ఈగో,ముక్కోపం,చటుక్కున మాట్లాడే గుణం...వీటన్నిటినీ ఉడుము పట్టులాగా
పట్టుకుంటే ఎవరికీ నచ్చదు. వారికి జీవితంలో విరక్తి మాత్రమే మిగులుతుంది!
ఇప్పుడంతా చాలామంది
గొడవలు పడటానికి ఇష్టపడటం లేదు.
మాటకు మాట అని పోటీ
పడటం లేదు.
గొడవల్లో గెలిచే
వారు...జీవితంలో ఓడిపోతున్నారు. ఇది వాళ్ళకు అర్ధమే కావటం లేదు!
సత్యాకు కూడా ఇది
అర్ధం కాలేదు.
భర్తకు ఫోను
చేసింది.
"నేనింకా
టిఫిన్ కూడా చెయ్యలేదు. ఖాలీ కడుపు. కడుపులో మంట! నా కష్టం అర్ధమవుతోందా?
సాయంత్రం రండి...మాట్లాడాలి.
అర్జెంటుగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి"
"లేదు సత్యా !
నేను రాలేను. అమ్మకు పంటి నొప్పి. కష్టపడుతోంది. ఆ నొప్పితోనే ఇంటి పనులు కూడా
చూడటం వలన కళ్ళు తిరుగుతున్నాయట. డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి"
"నేను మీ
భార్యను"
"అయితే
మనింటికిరా. బాధ్యతలు తీసుకో...ఎందుకు అక్కడే కూర్చోనున్నావు?"
"నేను మాట్లాడితే తట్టుకోలేరు"
"ఛీఛీ...ఫోను
పెట్టేయ్!"
అతనికి కోపం ఎక్కువై
ఫోనును స్విచ్ ఆఫ్ చేసేశాడు.
ఆకలి తట్టుకోలేక సత్యా
బియ్యం కడిగి, కుక్కర్లో పెట్టింది.
కొద్ది నిమిషాలలో
అన్నం రెడీ అయ్యింది.
ఇంట్లో కందిపొడి,
ఊరగాయ,
చిప్స్, పెరుగు అన్నీ ఉన్నాయి. వేసుకుని తిన్నది.
ఆలస్యంగా స్నానం చేసింది.
పనిమనిషి రానే లేదు.
ఉతకవలసిన బట్టలు
చాలా ఉన్నాయి.
ఇల్లు ఊడ్చి,
తుడవలేదు.
కడుక్కో వలసిన
వంటగిన్నెలు అలాగే ఉన్నాయి.
పిల్ల మళ్ళీ
ఏడ్చింది.
పనిమనిషి ఫోన్
నెంబరూ తెలియదు. అమ్మకు ఫోను చేసింది.
ఆవిడ ఫోను ఎత్తలేదు.
బయటకు వెళ్ళిన జ్యోతీ--ఇంకా
రాలేదు.
పిచ్చి పట్టేటట్టు
ఉన్నది.
అమ్మ-- సరోజా
ఉన్నంత వరకు ఇల్లు శుభ్రంగా కనబడేది. ఏ పని కూడా మిగిలి ఉండదు.
ఏ సమయంలోనైనా ఆహారం
దొరుకుతుంది.
ఆకలి అనే మాటకు ఆ ఇంట్లో
ఎవరికీ అర్ధం తెలియదు.
కనుక...ఒకలాగా,
ఆవేదనగా ఉంది.
Continued...PART-7
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి