ప్రతి 15 నిమిషాలకు ఆగిపోయి ప్రవహించే సెలయేరు (ఆసకి)
ప్రపంచంలోనే అతిపెద్ద లయబద్ధమైన ఈ ఊట (సెలయేరు) ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఆగిపోయి ప్రవహిస్తుందట.
అఫ్టన్ పట్టణానికి తూర్పున, వ్యోమింగ్‌లోని ఒక రాతి పర్వతం దిగువన, ప్రపంచంలోని అత్యంత మర్మమైన సహజ అద్భుతాలలో ఒకటి ఉంది - లయబద్ధమైన సెలయేరు (ఊట) ఒకటి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి పూర్తిగా ఆగిపోయి, మళ్ళీ ప్రవహించడం ప్రారంభమవుతుంది.
ప్రపంచంలోనే లయబద్ధమైన సెలయేర్లు (ఊటలు) కొన్ని మాత్రమే ఉన్నాయి. వ్యోమింగ్ యొక్క స్విఫ్ట్ క్రీక్ కాన్యన్ (వేగంగా దొర్లే లోతైన లోయ) లో ‘అడపాదడపా సెలయేరు’ వాటిలో అతి పెద్దది. దాని పేరు సూచించినట్లుగా, ఈ విచిత్రమైన సెలయేరు అడపాదడపా ప్రవహిస్తుంది. పర్వతంలోని రంధ్రం నుండి పెద్ద మొత్తంలో వచ్చే నీటిని ఉపయోగించుకుని తరువాత 15 నిమిషాల పాటు ఒక పెద్ద వాగును ఏర్పరుచుకోవడం, ఆపై చక్రం మళ్లీ ప్రారంభమయ్యే ముందు మరో 15 నిమిషాల వరకు ఎండిపోవడం చూడవచ్చు. ఈ అడపాదడపా ప్రవాహానికి కారణాలు పూర్తిగా అర్థం కాలేదు. కానీ శాస్త్రవేత్తలు చాలా చక్కని సిద్ధాంతాన్ని కలిగి ఉన్నారు.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
ప్రతి 15 నిమిషాలకు ఆగిపోయి ప్రవహించే సెలయేరు...(ఆసకి) @ కథా కాలక్షేపం
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి