12, మే 2022, గురువారం

ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)....PART-11

 

                                                                           ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)                                                                                                                                                           PART-11

మేజర్ పుట్టిన రోజు వేడుకకు పిన్ని, కూతురూ రెడీ అవుతున్నారు.

ఇంటి ఆడవారికని కొన్న పట్టు చీరలలో ఒకటి లతకి ఇవ్వబడింది. పట్టు చీరలో తలతల మెరిసిపోతున్న కూతుర్ని ప్రేమగా చూసింది గౌరి. హైదరాబాద్ నుండి వచ్చిన లత మోహంలో ఒక విధమైన కాంతి,  శరీరంలో సౌందర్యం చేరటం ఆమెకు సంతోషంగానే ఉంది.

ఎండి పోయున్న ఆమె హృదయంలో కొత్తగా ఒక పూవు వికసించినట్లు పెద్దామెకు అర్ధం కాక కాదు. దానికి కారణం మేజర్ కుటుంబమే నన్న డౌట్ ధ్రువీకరించ బడటానికి పలు కారణ కార్యాలున్నాయి. గౌరి దగ్గర అంటీ అంటనట్టు ఒక విషయాన్ని చెప్పి  ఉంచింది మేజర్ భార్య. ఆ విషయంలో  గౌరికి పూర్తి సమ్మతం అనేదీ ఇద్దరి ఆడవాళ్ళకూ ఊరటగానూ, ఆనందంగానూ ఉన్నది.

ఆదివారం ప్రార్ధన తరువాత ఆలయ ప్రహారంలో ఉన్న తోటలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొవటం అప్పుడప్పుడు జరిగేదే.

"కిరణ్ కీ, వరుణ్ కి పది నెలలే  తేడా గౌరీ. పెద్దవాడికి వాళ్ళ అమ్మ తరపు అమ్మాయి ఉంది. వరుణ్ కెనడాలో ఇంజనీరుగా ఉంటున్నాడు. వాడికీ అమ్మాయి దొరికితే ఇద్దరికీ ఒకే సారి ఒకటిగా పెళ్ళి చేయాలనేది అందరికీ ఆశ. పెద్దాయన మన లతను చూసిన రోజే చెప్పేసారు. ఆయనకు ఒక కోడలైనా మన ఊరివైపు నుండి ఉండాలని ఆశ"--ఆతురతతో చెప్పిన అమ్మమ్మ, ఏం సమాధానం చెప్పాలో తెలియక తికమక పడుతున్న గౌరి వైపు చూసింది.

లత విషయంలో తనకు బాధ్యత ఎక్కువ అవుతోందని అమ్మమ్మ మూలం గ్రహించిన గౌరికి కొంచం ఆశ్చర్యంగా ఉన్నది. పెళ్ళి విషయం గనుక ఆలొచించకుండా ఏమీ చెప్పకూడదు అనే భావనతో "నేను దాని గురించి ఇంకా ఆలొచించలేదు ఆంటీ, దేవుని ఆశీర్వాదం ఉంటే మీ ఇష్టం నెరవేరనీ" అని మాత్రం చెప్పింది.

గౌరికి కూడా అందులో ఇష్టం ఉన్నదని గ్రహించిన అమ్మమ్మ సంతోష పడింది.

కెనడా నుంచి వరుణ్ ఈ రోజు ప్రొద్దున వస్తున్నట్టు చెప్పారు. కనుక, మొట్టమొదటిసారిగా తన కూతుర్ను చూస్తున్న అతని కళ్ళకు లత దేవతలాగా కనిపించాలని, చీరను నాగరీకంగానూ అదే సమయం గౌరవము తగ్గకుండా చీరను కట్టి, తన భర్త ఇచ్చిన నగలను వేసింది. ఆల్రెడీ స్నేహితురాలు కుమారి పుణ్యమా అని తన ధోరణిలో ఎక్కువ శ్రద్ద తీసుకుంటున్న లత, తన మనసును వసపరుచుకుంటున్న విశాల్ ముందు అందంగా కనిపించాలని మెకప్ పై శ్రద్ద వహించి అందమైన బొమ్మలా దర్శన మిచ్చింది.

మధ్యాహ్నం విందు భోజనం కాబట్టి ఇద్దరూ కొంత ముందుగానే బయలుదేరారు. ఎస్టేట్ నుంచి నేరుగా తాతయ్య ఇంటికి వస్తానని చెప్పి విశాల్ ఎస్టేటుకు వెళ్ళిపోయాడు. మేజర్ కుటుంబ శభ్యులు వాళ్ళను ఆనందంగా స్వాగతించారు. ఆడవాళ్ళు లతను చూసి ఆశ్చర్యపోవటం చూసిని గౌరికి గర్వంగా ఉన్నది. తన ఇంట్లోనే ఉంటూ వాళ్ళతో అలవాటుపడిన లతను కుటుంబం మొత్తం ఉత్సాహంగానూ, ప్రేమగానూ ఉండటం చూసిన పిన్ని, తన లత వాళ్ళతో కలిసిపోవాలనే ఆశ పెరిగింది. ఆమె కళ్ళు వరుణ్ ని వెతకటం మొదలుపెట్టినై. పిన్నిని హాలులో కూర్చోబెట్టి, ఆ ఇంటి అమ్మాయిలాగా హక్కుతో లోపలకు వెళ్ళిన లత, కొంతసేపైన తరువాత కిరణ్ తో తిరిగి వచ్చింది.

"పిన్నీ! మన చర్చ్ వరకు వెళ్ళి వస్తాం. అక్కడ వృద్దాశ్రామానికి భోజనం తీసుకు వెళ్ళాలి. ఒక గంటలో వచ్చేస్తాను" అని చెప్పి బయలుదేరింది. 

ఇద్దరూ తిరిగి వచ్చే సమయంలో విందు భోజనం మొదలయ్యింది. జతగా వచ్చిన వాళ్ళను చూసిన కళ్ళు ఆశ్చర్యంలో పెద్దవైనై.

గౌరితో నిలబడున్న విశాల్ కళ్ళకు ఆ దృశ్యం నచ్చకపోవటం వలన, కొంచం కోపంగా చూశాడు.

అతని మనోభావాలు అర్ధంకాక, "హలో! వెల్కం" అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు కిరణ్.

పిన్ని కనబడగానే ఆమె దగ్గరకు వచ్చిన లతను చూసి "నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఈ చీర నీకు కరెక్టుగా సరిపోయింది" అన్నది అక్కడున్న ఒక గెస్ట్. "ద్యాంక్స్ ఆంటీ" అంటూ నవ్వింది లత. "ఎవరి సెలెక్షన్? నేనే కదా?" అంటూ గొప్పగా చెప్పాడు కిరణ్.

"మీరు కూడా గంభీరంగానే ఉన్నారు" అదే గెస్టు కిరణ్ ను చూసి చెప్పింది. "నిజమే. ఈ లేత రంగు నీకు చాలా మ్యాచ్ అయ్యింది కిరణ్ " అన్నది అక్కడే ఉన్న పిన్ని గౌరి.

"పిన్నీ! దానికి కారణం నేనే. వాళ్ళ, అన్నయ్యలకూ, తమ్ముళ్ళకూ బట్టలు సెలెక్ట్ చేసింది నేనే" చెప్పింది లత.

"అంటే వాళ్ళ కుటుంబంలో ఐక్యమైపోయావు.అంతే కదా కిరణ్!" అంటూ ఆ గెస్టు వాదించ, "అందులో సందేహమేముంది ఆంటీ?" అన్న కిరణ్, ఎవరినో చూసి సారీ చెబుతూ అక్కడ్నుంచి కదిలాడు. వాళ్ళ ముగ్గురూ ఆ గెస్టు దగ్గర నుండి కదిలారు. 

"చాలా మంచివాడు కదా?" అన్నది కిరణ్ ను చూపి.

"అవును పిన్నీ...అందరి దగ్గరా చాలా ప్రేమగా మాట్లాడతారు. మనకి ఏం కావాలో మన ముఖం చూసి కనుక్కుంటాడు. అన్నిటి కంటే ఆడవాళ్ళంటే అమిత గౌరవం. ఎవర్నీ కించ పరిచి మాట్లాడే అలవాటు లేదు" అని చెప్పి విశాల్ ను ధైర్యంగా ఒక చూపు చూసింది.

లత తననే పొడుస్తోందని  అతనికి తెలియదా ఏమిటి? వూరుకుంటాడా? 

"అవును! అమ్మాయలకు ఎప్పుడూ ఎవరో ఒకరు తమల్ని పొగడతూ ఉండాలి. పొగడు తేనే గౌరవం అని అనుకుంటారు" అన్నాడు నిర్లక్ష్యంగా.

"ఆడవాళ్ళను గౌరవించటం తెలిసిన వాళ్ళకే, వాళ్ళను పొగడే అలవాటూ ఉంటుంది. దానికి పెద్ద మనసు కావాలి"

"అంటే నిన్ను మాటి మాటికీ పొగడను కనుక నేను పెద్ద మనసు లేని వాడిని అని అంటున్నావా?"

"నేనేమీ మిమ్మల్ని చెప్పలేదు"

"నువ్వు నన్నే అన్నావు. నిన్ను పొగడేంత గొప్ప దానివి..." అంటూ ఆమెను పై నుండి క్రింద దాకా నిర్లక్ష్యంగా చూశాడు. "నన్ను ఆకర్షించలేదే!" అన్నాడు వేలాకొలంగా.

లతకి అతని చూపులూ, మాటలూ కోపం తెప్పించింది. అతన్ని కోపంగా చూసింది. "మీలాంటి ఒకర్ని ఆకర్షించాలనే అవసరం నాకు లేదు" అని చెప్పి, ఇద్దరి మాటలనూ వేడుక చూస్తున్న పిన్ని  గౌరిని కూడా లక్ష్యం చేయకుండా  గబగబా తోటకు ఉన్న వేరే దారివైపుకు వెళ్ళింది లత.

మనోబాధను తట్టుకోలేక ఎదురుగా ఎవరు వస్తున్నారని కూడా చూసుకోకుండా వెడుతున్న ఆమెను కిరణ్ అడ్డుపడి ఆపాడు.

"ఏ! లతా ఏమైంది? చూడనట్టు వెళ్ళిపోతున్నావు?"

"ప్చ్...ఏమీలేదు..." విరక్తిగా చెప్పిన ఆమెను చూసిన అతను.

"ఎందుకు కళ్ళు తడిసున్నాయి? నీ అందంలో సగం కనిపించకుండా పోయిందే" అంటూ రెచ్చగొడుతూ  -- "ఏం? నీ బాయ్ ఫ్రెండు ఏదైనా అన్నాడా? మనం వచ్చేటప్పుడు అతని మొహం సరిలేదు" అన్నాడు గుసగుసగా.

"ఆ! ఎవరు...? మీరేం చెబుతున్నారు?" -- ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది లత.

"ఏమిటీ...అర్ధం కానట్టు అడుగుతున్నావు? ఎక్కువగా ఇష్టపడే వాళ్ళ గురించి  నోరు తెలుపకపోయినా, కళ్ళు తెలుపుతాయ్" అన్నాడు అతను.

"నిజంగానే అర్ధం కాలేదు. అర్ధం అయ్యేటట్టు చెప్పండి"

"అదిగో! ఆ ఆపిల్ చెట్టు కింద ఒక హీరో, కళ్ళల్లో ప్రేమ కెమేరా తగిలించుకుని..." అతను చెబుతున్నప్పుడే, "ఎవరు?" అని అడుగుతూ ఆమె తిరిగి చూడ,

"ఆగు...! అలా వెంటనే తిరిగి చూసేస్తావా?" అని కిరణ్ ఆమె తల మీద మొట్టికాయ వేసినట్టు కొట్టగా -- లత ఆ ఆపిల్ చెట్టు కింద నిలబడున్న  విశాల్ ని  చూసింది. ఆదుర్దాగా వెతికి కలుసుకున్న ఆమె కళ్ళను ఎదుర్కొన్న అతను ఆమె లోతైన చూపులలో పూర్తిగా మునిగిపోయాడు. తిరిగి లేవ లేనివ్వకుండా కట్టిపడేసిన చూపుల బాణాలు మళ్ళీ తాము ఎక్కడ్నుంచి వచ్చినాయో అక్కడికి తిరిగి వెళ్ళటానికి కొద్ది నిమిషాలు పట్టింది.

తనని వెతికి అలసిపోయి కనిపెట్టిన ఆమెను చూసి 'నన్నే కదా వెతికావు?' అని అడిగేటట్టు అహంకారంగా నిలబడ్డ అతని దోరణి -- లతకు చిరాకు తెప్పించింది.

"ఛఛ! ఇతన్ని పోయి చూశామే?" అని గొణుక్కుంటూ తిరిగిన ఆమెతో "అబ్బబ్బ! చూశావా నీ వాడు. ఏమిటా చూపు అది! నా వొళ్ళంతా జలదరిస్తోంది" అన్నాడు కిరణ్.

" విశాల్ నా చెప్పారు?"

"మరి వేరే ఎవర్ని?"

"హు...అతను పోయి నన్ను...? మొదట మీ కళ్ళకు కళ్ళద్దాలు వేసుకోండి. అప్పుడు అతని చూపుల్లో ఉన్నది ప్రేమా? విసుగా? అనేది మీ కళ్ళకు బాగా తెలుస్తుంది. ఇన్ని రోజులలో అతను నన్ను చూసి నవ్వింది ఒక రోజు కూడా నేను చుడలేదు. ఈ ప్రపంచంలో నీకు ఇష్టంలేని ఒకే ఒకరు ఎవరు అని అతన్ని ఎవరైనా అడిగితే అతను నన్ను చూపుతాడు. మా ఇద్దరికీ అంత అన్యోన్యత

"అప్పుడు నేను అనుకున్నది నిజమే . ఎదురెదురు దృవాలు ఆకర్షించుకుంటాయి. మీ ఇద్దరికీ అలాంటి కెమిస్ట్రీ ఉంది. నీరు-నిప్పూ లాగా...స్వీటూ-హాటూ, రాత్రి-పగలు...."

"అయ్యో! చాలు స్వామీ. నన్ను వదిలిపెట్టండి. మీ ఆటలకూ, ఊహలకూ నేను బలి అవలేను" అంటూ ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్న లత 'మంచి అతన్నే చెప్పాడు అని అనుకున్నప్పుడు విశాల్ చూపుల కిరణాలు తన హృదయాన్ని చొచ్చుకుని వెళ్ళి సుఖ ప్రకంపనలు, అలలుగా తాకటాన్ని ఆమె నిరాకరించలేక పోయింది.

అతని చూపుల్లో ఉన్నది ఏమిటి?

అతనిలోనూ ఏదో ఒక చలనం...?

చాలా సార్లు ఈ ప్రశ్నే లత మదిలో మెదలి ఆమె ప్రశాంతతను పాడుచేసేది.

                                                                                                       Continued...PART-12

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి